విజయనగరం జిల్లాలో వారి ఒక ప్రధానమైన పంట. సార్వాలో సుమారు 1.20 లక్షల హెక్టారులతో వారి సాగు అవుతున్నది. సాధారణముగా రైతులు వరిసాగు చేపట్టినప్పుడు ఎరువులు అధికముగా వాడుచున్నారు. ముఖ్యముగా యూరి యను ఎక్కువగా వాడుచున్నారు . యూరియా తక్కువ ధరకు లభించుటచేతను, వేసిన వెంటనే చేను తొందరగా పచ్చబడి, ఏపుగా రావడం, పక్క రైతు పొలముచూచి, తనపొలము ఇంకా ఎక్కువ పచ్చగా ఉండాలన్న ఉదేశ్యముతో విచక్షణ రహితముగా యూరియాను అధికముగా వాడుచున్నారు. ఫలితంగా చీడపీడలు అధికము కావటం, సస్యరక్షణకు అధిక మొత్తము వెచ్చించాల్సి వస్తున్నది.
పై పరిస్థితులని గమనించిన వ్యవసాయశాఖ కమిషనర్ శ్రీ కె.మధుసూధనరావు గారు జిల్లాలో వారి లో విచక్షణ రహితముగా వాడుచున్న యూరియాను తగ్గించుటకు వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి, కొన్ని ప్రదర్శన క్షేత్రములు ఏర్పాటు చేసి, వాటిని పరిశీలించవలసినదిగా ప్రాజెక్ట్ డైరెక్టర్, ఆత్మ విజయనగరం వారిని ఆదేశించడమేనది. వారి ఆదేశముల ప్రకారము ఆత్మ (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) విజయనగరం ఆధ్వర్యంలో బి.టి.టి. కన్వీనర్, మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు , వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణాధికారులు, బి.టి.యం. లు, ఎస్.యం.ఎస్.లు సహకారముతో కోర్లం, కొట్టాము, మరివాలన, ఆరికతోట, సతివాద, దుర్బలి గ్రామాలలో విచక్షణ రహితముగా వాడు యూరియాను తాగించుటకు ప్రదర్శన క్షేతములను ఏర్పాటుచేయుట జరిగినది.
ఒక్కొక్క ప్రదర్శన క్షేత్రము ఒక్కొక్క ఏకారముతో ఏర్పాటు చేయడం జరిగినది.
క్రమ సంఖ్య |
రైతు పేరు, గ్రామము |
మండలము |
రకము |
భూసార పరీక్షను అనుసరించి ఎరువుల సిపార్సు కిలో/ఎకరాకు |
దిగుబడి కిలోలలో ఎకరాకు |
|||
యూరియా |
డి.ఎ.పి. |
పోటాష్ |
ప్రదర్శన మడి |
కంట్రోల్ మడి |
||||
1. |
కారక శ్రీనివాసు కోర్లం |
గంట్యాడ |
BPT2231 |
66 |
35 |
24 |
2475 |
1950 |
C100 |
50 |
50 |
||||||
2. |
బదబల్ల కృష్ణ కొట్టాం |
ఎస్.కోట |
MTU1001 |
66 |
50 |
24 |
2475 |
2250 |
C150 |
50 |
50 |
||||||
3. |
లంక సూర్యనారాయణ మరివలస |
దత్తిరాజేరు |
MTU7029 |
20 |
50 |
25 |
1520 |
1360 |
C100 |
50 |
50 |
||||||
4. |
యం. వెంకట్రావు ఆరికతోట |
రామభద్రపురం |
MTU1001 |
57 |
75 |
35 |
2240 |
1920 |
C100 |
80 |
50 |
||||||
5. |
మరిచర్ల శ్యామ్ సుందర్ సతివాడు |
తెర్లం |
MTU1001 |
70 |
50 |
24 |
1520 |
1360 |
C100 |
50 |
50 |
||||||
6. |
పువ్వుల పట్టి దురిలి |
గుమ్మలక్ష్మాపురం |
MTU1001 |
25 |
40 |
25 |
1920 |
1600 |
C100 |
50 |
50 |
D : అనునది డెమో మడిలో వేసిన ఎరువు మోతాదు
C : అనునది కంట్రోల్ మడిలో వేసిన ఎరువు మోతాదు
పై ఆరు(6) ప్రదర్శన క్షేత్రములోను రైతులు భూసార పరిక్షననుసరించి సిపార్సు మేరకు మాత్రమే ఎరువుల వాడుట జరిగినది. ఇందులకుగాను ఎంపిక చేసిన రైతులు కమఠముల నుండి వేసవి కాలములో మట్టినమూనాలను సేకరించి భూసార పరీక్షా కేంద్రమునందు విశ్లేక్షణ జరిపించుట జరిగినది. దీని మూలముగా యూరియా యొక్క విచక్షణ రహిత వాడకం తగ్గడమేకాక సస్యరక్షణ ఖర్చులు తగ్గినందున పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గినవి.
అదే విధముగా దిగుబడి విషయములోకూడా అధిక దిగుబడులు సాధించుటకు సమతుల యూరియా యాజమాన్యం తోడ్పడింది.