వ్యవసాయంలో వివిధ పంటలను సాగుచేసినప్పుడు వివిధ రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగుల నివారణకి వివిధ రకాల సస్యరక్షణ పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో తక్కువ ఖర్చుతో కూడిన, చాలా సరళమైన పద్ధతి సేద్యం పద్ధతుల ద్వారా సస్యరక్షణ. ఈ సేద్య పద్ధతులలో వేసవి లోతు దుక్కులు వివిధ రకాల పంటలలో కొన్ని ముఖ్యమైన పురుగుల నష్టాన్ని తగ్గించడంలో ప్రముఖపాత్ర వహిస్తోంది. వాటి గురించి తెలుసుకుందాం.
వరిని మన దేశంలో చాలా ముఖ్యమైన ఆహారధాన్య పంటగా సాగుచేస్తున్నారు. వరిని ఆశించి త్రీవ్రనష్టాన్ని కలిగించే పురుగులలో కాండం తొలిచే పురుగు చాలా ముఖ్యమైనది. ఈ కాండం తొలిచే పురుగు పంట పూర్తయిన తరువాత మిగిలిపొయిన మొక్కల మొదళ్ళలో తన కోశాస్త దశను పూర్తి చేసుకుంటుంది. అందువలన పంట కోతలు అయిన తర్వాత వేసవిలోతు దుక్కులు చేసుకోన్నట్లుయితే మొక్కల మొదళ్ళలో ఉన్నటువంటి కోశస్ద దశ బయటపడి సూర్యరశ్మి తాకిడికి, పక్షుల బారిన పడి చనిపోతాయి.
వేరుశానగలో ముఖ్యమైన పురుగు అయినటువంటి వేరుపురుగు, చెరకు పంటను చాలా ప్రాంతాలలో ఆశించి నష్టాన్ని కలిగిస్తుంది. వేరుపురుగుకి చెందినటువంటి గుడ్డు, లార్వా, కోశస్తదశ, పెంకు (పెద్ద పురుగు) పురుగు దశలు భూమిలో గడుపుతాయి. లరవాదశ చెరుకు మొక్కలు వేర్లను కత్తిరించి, తిని నష్టాన్ని కలిగిస్తుంది. పెంకు పురుగు కొంత కాలం భూమిలో పల ఉండి, కొంత కాలం బయట ఉండి పొలం చుట్టూ ఉన్నటువంటి వేప, సుబాబుల్ లాంటి చెట్ల ఆకులను తింటుంది. అందుచేత వేసవిలోతు దుక్కులు లేదా పంట అయిన తర్వాత లోతు దుక్కులు చేసినట్లయితే వేరు పురుగు వివిధ దశలు ఎందతాకిడికి, పక్షుల వలన నాశనం అవుతాయి.
పత్తి మన ఉభయ తెలుగు రాష్టాలలో చాలా ముఖ్యమైన వాణిజ్య పంటగా రైతులు సాగుచేస్తున్నారు. చాలా వరకు బి.టి పత్తిని సాగుచేస్తున్నారు. సుమారుగా 100 రోజుల పంటకాలం పూర్తయిన తర్వాత వివిధ రకాల కయతోలిచే పురుగులు పంటను ఆశించి నష్టం చేసే అవకాశం ఉంది. వాటిల్లో శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, మచ్చల కాయల తొలిచే పురుగులు తమ కోశస్త దశని భూమిలో జరుపుకొంటాయి. కావున పత్తి పంట పూర్తయిన తర్వాత వేసవిలో లోతు దుక్కులు చేసినట్లయితే పైన తెలిపిన మూడు రకాల కాయ తొలిచే పురుగుల కోశస్ధ దశలు పురుగులను తినే పక్షులు బారిన పడి, ఎందతాకిడికి నాశనం చేయబడును. తద్వారా కాయతొలిచే పరుగుల జీవిత చక్రం అక్కడితో ఆగిపోయి తర్వాత పురుగుల సంతతి తగ్గి, తర్వాత పంటలో వాటి ఉధృతి తగ్గిపోతుంది.
వేరుశనగ మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో చాలా ముఖ్యమైన నూనె గింజల పంట. ఈ పంటని, వేరుపురుగు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఎర్ర గొంగళి పురుగు వంటి పురుగులు ఆశించి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. వేరుపురుగు వివిధ దశలు, పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు ఎర్ర గొంగళి పురుగు వంటి పురుగులు ఆశించి చాలా నష్టాన్ని కలిగిస్తాయి. వేరుపురుగు వివిధ దశలు, పొగాకు లద్దె పురుగు ప్యూపా దశలని భూమిలో గడుపుతుంది. కావున పంట పూర్తయిన తర్వాత లోతు దుక్కులు చేసినట్లయితే పైన తెలిపిన పురుగుల కోశస్త దశని నాశనం చేసి తర్వత సాగుచేసే పంటలలో వాటి నష్టాన్ని చాలా వరకు అరికట్టవచ్చు.
కొన్ని ప్రాంతాలలో ఎర్ర గొంగళి పురుగు జొన్న, మొక్కజోన్నను ఆశించి తీవ్ర నష్టం చేస్తుంది. దీని ప్యుపాదశ భూమిలోపల ఉంటుంది. అందువలన పంటల కోతలు అయిన తర్వాత వేసవి దుక్కులు చేసుకొన్నట్లయితే ఈ ఎర్ర గొంగళి పురుగు ప్యూపాదశి బయటపడి ఎండ తాకిడి పక్షుల బారిన పడి చనిపోతుంది .
ఈ కూరగాయ పంటని తీవ్రంగా నష్టం చేసే పొగాకు లద్దె పురుగు, శనగపచ్చ పురుగు, అకుతహోలిచే పురుగు కోశస్ధ దశ భూమిలో జరుపుకోనును. కావున పంట అయిపొయిన తర్వాత వేసవేలో లోతు దుక్కులు చేసుకోన్నట్లయితే వీటి ప్యూపాదశలు నాశనం అయ్యి, తర్వాత సాగు చేసే పంటల్లో వీటి నష్టం తగ్గిపోతుంది. ఈ విధంగా ముఖ్యమైన పంటలలో ముఖ్యమైన పురుగులు లోతు దుక్కుల ద్వారా నాశనం కాబడి, తర్వాత సాగుచేసే పంటలలో పురుగుల ఉధృతి, నష్టం తగ్గి సగుఖర్చు తగ్గుతుంది. ముఖ్యంగా ఈ లోతు దుక్కులు చేసుకొన్నట్లయితే నేల గుల్లబాఠడం పంట విత్తుకోవడానికి అనుకూలంగా మారడమే కాకుండా సస్యరక్షణలో కూడా దోహదం చేస్తుంది. ఈ పద్ధతిలో ఏ విధమైన రసాయన మందులు వాడటం ఉండదు కాబట్టి పర్యవారణానికి ఏ విధమైన నష్టం వాటిల్లదు. అంతేకాకుండా ఈ పధ్ధతి చాలా సరళమైనది. తక్కువ ఖర్చుతో కూడుకున్నది.
ఆధారం: పాడిపంటలు మాస పత్రిక