ఆత్మా (ATMA ) గుంటూరు జిల్లా
కృష్ణ మండలంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలలో పాటించవలసిన యాజమాన్య పద్ధతులు
నవంబరు మొదటి వారంలో నీలం తుఫాన్ వాళ్ళ గుంటూరు, కృష్ణ మరియు ప్రకాశం జిల్లాల్లో ఆర్థిక వర్షాలు కురిసాయి. ఈ ఆర్థిక వర్షాలు వలన వివిధ పంటలు వరద ముంపుకులోనై దెబ్బతినడం జరిగింది. ఈ పరిస్థితులలో ఈ క్రింది సమాచారం ప్రకారం వివిధ పంటల సాగులో పంట నష్టం నివారించేందుకు అవసరమైన యాజమాన్య పద్ధతులు చేపట్టడం మరియు పంట పూర్తిగా నష్టము అయినా పరిస్థిలలో ప్రత్యామ్నాయ సాగుచేయవచు.
ప్రతి
- తేలిక నెలలో ఎకరాకు 30 కి. యూరియా , 15 కి,మ్యురేట్ ఆఫ్ పోటాష్ ఎరువులను వేయాలి.
- 2 % యూరియా లేదా 2 % పొటాషియం నైట్రేట్ తో పటు 1 % మేగ్నెసియం సల్ఫేట్ ద్రావణంతో 7 నుండి 15 రోజుల వ్యవధితో 2 లేక 3 సార్లు పిచికారీ చేయాలి.
- 3 గ్రా కాపర్ ఆక్సీక్లోరైడ్ 100 మీ .గ్రా .స్ట్రెప్టోసైక్లినిక్ లీటరు నీటికి కలిపి మొక్కలపై పిచికారీ చేయాలి.
- ఆకుమచ్చ తెగుళ్ళు నివారణకు పేథోపికోనజోల్ 1 మీ.లి./ కార్బండజిమ్ 1 గ్రా ./ మాంకోజెబ్ 3 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
- ఈ వాతావరణంలో రసం పీల్చు పురుగులు ముఖ్యనగ పచ్చదోమ మరియు తెల్లదోమ ఆశించే అవకాశం వున్నది. పచ్చదోమ నివారణకు మెనోక్రోటోఫేస్ 1 .6 మీ.లి . లేదా ఎసిఫేట్ 1 .5 గ్రా . లేదా ఇమిడాక్లోప్రిడ్ 0 .4 గ్రా లేదా ఎసిటమిప్రిడ్ 0 .2 గ్రా లీటరు నీటికి కలిపి పిచికాకేరి చేయాలి.
- తెల్లదోమ నివారణకు త్రజోఫాస్ 2 మీ .లి . లేదా ప్రొఫెనోఫాస్ 2 మీ .లి .ను 5 % వేపనూనెతో లేదా వేపగింజల కషాయంతో కలిపి పిచికారీ చేసుకోవాలి .
వరి
- జిల్లాల్లో ప్రస్తుతం వరి పిలకదశ నుండి పాలగింజ దశలలో ఉంది.
- వీలైనంత త్వరగా పొలం నుండి ఆర్థిక నీరు బయటికి పంపాలి.
- పిలకదశలో ఉన్న పొలానికి ఎకరానికి 20 కి . యూరియా మరియు 10 కి మ్యురేట్ ఆఫ్ పోటాష్ సాధారణ మోతాదు కంటే అధికంగా వేయాలి.
- పాముపొద తెగులు నివారణకు లీటరు నీటికి 2 మీ. ఈ . హెక్సకోనజోల్ లేక 1 మీ .లి ప్రొపికోనజోల్ లేక 2 మీ .లి . వాళ్లిదమైసిన్ కలిపి పిచికారీ చేయాలి.
- అగ్గి తెగులు నివారణకు లీటరు 0 .6 గ్రా. ట్రీసైక్లోజాల మరియు 1 .25 గ్రా ,మాంకోజెట్ కలిపి పిచికారీ చేయాలి.
- రెల్లరాల్చు పురుగు నివారణకు లీటరు నీటికి 2 .5 క్లోరోఫైరుఫాస్ ,1 మీ.లి .డైక్లోరోవాస్ కలిపి సాయంత్రం సమయంలో పిచికారీ చేయాలి.
అపరాలు :
- ఇనుప ధాతు లోపే నివారణకు అన్నభేది 50 గ్రా +5 గ్రా .నిమ్మఉప్పు + 150 గ్రా. యూరియాను 10 లీటర్లు కలిపి 4 -5 రోజుల వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.
- పూత దశలో ఉన్న పైరు పై 2 % యూరియాను పిచికారీ చేయాలి.
- ఆకుమచ్చ తెగుళ్ల నివారణకు మాంకోజెట్ 3 గ్రా. లేక కార్బండిజమ్ 1 గ్రా . లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వ్యవసాయ పరిశోధన స్తానం, లాం మరియు
జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు, గుంటూరు వారి సాహారముతో....
అధిక వర్షపాతం ఉన్నప్రాంతంలో ఉద్యాన పంటలకు తీసుకోవలసిన జాగ్రత్తలు
వర్షాలు ఆర్థికంగా కురవడం వలన లోతుల్లో ప్రాంతాలు నీరు నిలబడి మిరప, పసుపు,కూరగాయల వంటి ఉద్యాన పంటలు ముంపునకు గురయి నష్టం వాటిల్లుతుఉంది. ఈ పరిస్థితులలో అధిక తేమ వలన వేర్లుద్వారా మొక్క అవసరమైన పోషకాలను తీసుకోలేదు. మొక్కలు ఉరకెత్తి తలలు వాల్చుతాయి. పంటలను తెగుళ్లు ఆశించడమే కాకుండా, సూక్ష్మ ధాతు లోపాలు కొద ఎక్కువగా కనబడే అవకాశముంది . ఈ పరిస్థితులలో పంట దశ మరియు ముంపు ఉధృతిని బట్టి తగిన జాగ్రత్తలు పాటించినట్లయితే పంటను రక్షించుకొని నష్టాన్ని కొంతవరకు తగ్గించుకొనే అవకాశం ఉంది. ఇందులో భాగంగా, ప్రధానంగా పొలం నుండి అధికమైన నీటిని వెంటనే బయటకు పంపించే ఏర్పాటు చేయాలి.
మిరప
- ఉరకెత్తిన పొలాల్లో మొక్కలు వెంటనే తేరుకోవడానికి లీటరు 10 గ్రా యూరియా మరియు 10 గ్రా . పంచదార కలిపినా ద్రవానికి వరం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.
- మొక్కలు వాడబడి, తలలు వాల్చినట్లయితే లీటరు నీటికి 5 గ్రా . మేగ్నెసియం సల్ఫేట్ కలిపినా ద్రావణం పిచికారీ చేయాలి.
- ఇనుప ధాతులోపంతో మొక్కలు పాలిపోయింతలు కనబడితే 10 లీటర్ల నీటికి 50 గ్రా . అన్నభేదితో పటు ఒక నిమ్మాచెక్కరసం కలిపి పిచికారీ చేయాలి.
- కాపుతో ఉండి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మోడళ్ల చుట్టూ మట్టిని ఎగదోయాలి.
- నెల అదునుకు వచ్చిన వెంటనే గోరువేసి అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది.
- పై పాటుగా ఎకరానికి అదనంగా 30 కిలోల యూరియా, 15 కిలోలల్ పోటాష్, 200 కిలోల వేపపిండి వేయాలి.
- మొక్కలు తేరుకున్న తర్వాత స్థూల పోషకాల విశ్రమాన్ని (5 గ్రా ,/లీటరు నీటికి ) మరియు సూక్ష్మపోషకాల విశ్రమాన్ని (2 .5 గ్రా /లీటరు నీటికి ) ఒకదాని తరువాత ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి.
- పంటలను బాక్టీరియా ఆకుమచే, కంపోఫ వంటి తెగుళ్లు ఆశించే అవకాశం వుంది కాబట్టి, ముందు జాగ్రత్త చర్యగా 10 లీటర్ల నీటికి 30 గ్రా . కాపర్ ఆక్సీక్లోరైడ్ మరియు 1 గ్రా స్ట్రెప్టోసైక్లిన్ మందులను కలిపినా ద్రావణం పిచికారీ చేసి వీటిని వ్యాప్తిని అరికట్టాలి.
- వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా , లేదా కార్బండిజమ్ 10 గ్రా . చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపినా ద్రావణాన్ని మొక్కల మోడళ్లలో పోయాలి.
- కాయకుల్లు, కొమ్మ ఎండు తెగులు వ్యాప్తి చెందకుండా 1 మీ .లి . ప్రొపికోనజోల్ లేదా 0 .5 మీ.లి . దైఫాంకోనజోల్ లేదా 2 .5 గ్రా కాపర్ హైడ్రాక్సిడ్ లేదా 2 .5 గ్రా సాఫ్ మందులను లీటరు నీటికి కలిపి మందులను ఒకటి మర్చి ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి.
- పంట నశించే వివిధ గొంగళి పురుగుల నివారణకు క్లోరిఫైరిపాస్ 2 .5 మీ.లి . లేదా ఎసిఫేట్ 1 .5 గ్రా . లేదా నోవాల్యురం 0 .75 మీ.లి. వంటి కీలక నాశిని మందులను పిచికారీ చేయాలి.
పసుపు
- వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రా పొటాషియం నైట్రేట్ కలిపినా ద్రవాన్ని వరం రోజుల వ్యవధితో 2 -3 సార్లు పిచికారీ చేయాలి.
- పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడినం లేత ఆకులు వాలిపోయినట్లయితే కనబడితే, 10 లీటర్ల నీటిలో 50 గ్రా. అన్నభేతి ఒక నిమ్మరసం, జిగురు మందులతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి.
- నెల ఆదుముకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతోంది. పై పాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పోటాష్ తో పటు 200 కిలోల వేపపిండి వేయాలి.
- ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రొపికోనజోల్ 1 మీ.లి. కలిపినా ద్రవానికి పిచికారీ చేయాలి.
- దుంపకులు ఆశినట్లైతే పొదుల్లో మొక్కల చుట్టూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటికి కలిపినా ద్రావణంతో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2 .5 గ్రా రిడోమిల్ మందును కలిపినా ద్రావణంతో తడపాలి.
కూరగాయ పంటలు
- ముంపుకు గురయి, వాలిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మోడళ్ల చుట్టూ మట్టిని ఎదగొయాలి.
- ఉరకెత్తిన పొలాల్లో మొక్కలో వెంటనే తెరువడానికి లీటరు నీటికి 10 గ్రా యూరియా కలిపినా ద్రవానిని వరం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. పెద్ద మొక్కలపై 2 శాతం యూరియా (20 గ్రా / లీటరు నీటికి ) పిచికారీ చేయవచ్చును.
- పంట బాగా ముంపుకు గురై ఆధికాక్ శాతం మొక్కలు చనిపోయినట్లైతే, పంటను పూర్తిగా తొలగించి నెల అదునుకు వచ్చిన తరువాత బెండ, ధనియలు వంటి నేరుగా విత్తుకునే పంటలను వేసుకోవాలి.
- నరు అందుబాటులో ఉన్నట్లయితే లేత తోటల్లో చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త మొక్కలు నాటుకలోవాలి.
- మొక్కలు తేరుకున్న తరువాత స్థూల పోషకాల మిశ్రమాన్ని ( 5 గేయ /లీటరు నీటికి ) మరియు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని (2 .5 గ్రా /లీటరు నీటికి ) ఒకదాని తరువాత ఒకటి వరం రోజుల వ్యవధిలో 2 -3 సార్లు పిచికారీ చేయాలి.
- పంటకు ఆకుమచ్చ, కాయకుల్లు బూజు తెగుళ్లు ఉద్రహుతి ఆర్థికంగా ఉంటుంది కాబట్టి ముందు జాగ్రత్తగా చర్యగా లీటరు నీటికి 2 .5 గ్రా . సాఫ్ మందును కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి.
- వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీక్లోరైడ్ 30 గ్రా. లేదా కర్బనామ్ 10 గ్రా. చొప్పున 10 లీటర్ల ఆసిఫ్ట్ 1 .5 గ్రా లేదా నోవాల్యురం 0 .75 మీ.లి. వంటి కీటకనాశిని మందులను పిచికారీ చేయాలి.
ఆధారము :
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ