విజయనగరం జిల్లాలో వారి ఒక ప్రధానమైన పంట. సార్వాలో సుమారు 1.20 లక్షల హెక్టారులతో వారి సాగు అవుతున్నది. సాధారణముగా రైతులు వారి సాగు చేయునపుడు సుసర్ల పరీక్షా పరితలను అనుసరించి సాగు చేపట్టారు. వారు అనుకొన్న విధముగా, ప్రక్క రైతులను చూచి, ప్రక్క పొలాలను చూచి, ఆ పొలాల కంటే ఎక్కువ పచ్చగా తన పొలం ఉండాలనే ఉదేశముతో అధికముగా ఎరువులను, విచక్షణ రహితముగా వాడుచున్నారు.
గత అనుభవాన్నిబట్టి ఏటికేడు కాం ప్లెక్సు ఎరువుల రేటులు పెరగటం, కాం పేలిక్సులతో పోల్చినపుడు యూరియా బసారేటు తక్కువగా ఉండటం, జెత్తము పూర్తిగా వాడకపోవడం, పచ్చిరొట్ట పేర్లు పెంచి, చేలలో పదతోక్కకపోవడం, విచక్షణ రహితంగా కాం ప్లెక్సులు మరియు యూరియా వాడడం, ఫలితంగా చీడపీడలు అధికమై సస్యరక్షణకు అధికముగా ఖర్చు చేయవలసి వస్తుంది. మొత్తముగా సాగు ఖర్చులు పెరుగుతున్నవి.
పై పరిస్థితులను గమనించిన వ్యవసాయశాఖ కమిషనర్ శ్రీ కె. మధుసూధనరావు గారు జిల్లా భూసార పరీక్షా ఫలితాలను ఆధారంగా వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలతో కలిసి ఆత్మ పధకంలో ప్రదర్శన క్షేత్రాలను ఏర్పాటుచేసి, వాటి ఫలితాలను పరిశీలించవలసినదిగా ప్రాజెక్ట్ డైరెక్టరు "ఆత్మ" (వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ) విజయనగరము వారిని ఆదేశించడమైనది. వారి ఆదేశానుసారముగా ఆత్మ విజయనగరం వారి ఆధ్వర్యములో బి.టి.టి. కన్వీనర్లు మరియు సహాయ వ్యవసాయ సంచాలకులు వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, బి.టి.యం.లు, ఎస్.యం.ఎస్.లు, భూసార పరీక్షా ఫలితాలను అనుసరించి ఎరువుల వాడకం పై రైతులకు ముందుగా శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటుచేసి ప్రదర్శన క్షేతలను వసాది,జామి, చింతాడ, రామలింగాపురం ,దత్తి, పిడిసిల, చెరుకుపల్లి, కొత్తపెంట, గదబవలస గ్రామాలలో ఎంపికచేసిన రైతుల కామతాలతో భూసార పరీక్షా సిపార్సు మేరకు ఎరువులు యాజమాన్యం పాటించి మంచి ఫలితాలను సాధించడమైనది.
క్రమ సంఖ్య |
రైతు పేరు, గ్రామము |
మండలము |
రకము |
భూసార పరీక్షను అనుసరించి ఎరువుల సిపార్సు కిలో/ఎకరాకు |
దిగుబడి కిలోలలో ఎకరాకు |
|||
యూరియా |
డి.ఎ.పి. |
పోటాష్ |
ప్రదర్శన మడి |
కంట్రోల్ మడి |
||||
1. |
లుకలవు ఆదినారాయణ, వసాది. |
గంట్యాడ |
BPT2231 |
66 |
53 |
24 |
2460 |
1950 |
c100 |
50 |
50 |
||||||
2. |
సిరికి ఎర్న గోవింద జామి. |
జామి |
BPT5204 |
50 |
53 |
24 |
2625 |
2250 |
c100 |
50 |
50 |
||||||
3. |
ఈదుబిల్లి వెంకటరమణ చింతాడ. |
జామి |
MTU7029 |
35 |
35 |
24 |
2325 |
2025 |
c100 |
50 |
50 |
||||||
4. |
ఇప్పిలి రాము రామలింగాపురం |
చీపురుపల్లి |
BPT3291 |
57 |
53 |
24 |
2250 |
1875 |
c100 |
50 |
50 |
||||||
5. |
తలారి శ్రీనివాసనాయుడు దత్తి |
దత్తిరాజేరు |
MTU1001 |
32 |
29 |
19 |
1600 |
1520 |
c100 |
50 |
50 |
||||||
6. |
యెడ్ల బంగారునాయుడు పిడిసిల. |
గణపతినగరం |
MTU7029 |
66 |
53 |
25 |
2000 |
1840 |
c100 |
50 |
50 |
||||||
7. |
పైల అప్పలనాయుడు చెరుకుపల్లి |
పాచిపెంట |
RGL2537 |
57 |
75 |
35 |
2560 |
2080 |
c100 |
85 |
50 |
||||||
8. |
బొడ్ల రామారావు గదబవలస |
జియ్యమ్మవలస |
MTU1001 |
50 |
50 |
25 |
1860 |
1420 |
c100 |
85 |
50 |
||||||
9. |
బేతనపల్లి ఈశ్వరరావు కొత్తపెంట. |
బొబ్బిలి |
రూపాలి |
35 |
35 |
24 |
2250 |
1950 |
c100 |
50 |
50 |
C : అనునది కంట్రోల్ మడిలోవేసిన ఎరువు మోతాదు
పై తొమ్మిది ప్రదర్శన క్షేత్రములలోను రైతులు భూసార పరిక్షననుసరించి సిపార్సు మేరకు మాత్రమే ఎరువుల వేడుకను చేయుట జరిగినది. ఇందులకుగాను ఎంపిక చేసిన రైతుల కమఠముల నుండి వేసవి కాలములో మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షా కేంద్రమునందు విశ్లేషణ జరిపించుట జరిగినవి. దీని మూలముగా ఎరువుల యొక్క విచక్షణ రహిత వాడకం తగ్గడమేకాక సస్యరక్షణ పై ఖర్చులు తగ్గినందున పెట్టుబడి ఖర్చులు కూడా తగ్గినవి. అదే విధంగా దిగుబడి విషయములో కూడా అధిక దిగుబడి సాధించుటకు సమతుల ఎరువుల యాజమాన్యం తోడ్పడింది.
ఆధారము : వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ