অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

శీతాకాలపు కత్తిరింపుల తర్వాత పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

శీతాకాలపు కత్తిరింపుల తర్వాత పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

భారత దేశంలో ద్రాక్షను 114.4 వేల హెక్టార్లలో సాగుచేస్తూ 1,234.9 వేల టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. ద్రాక్ష ఉత్పాదకతో భారతదేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంది. తెలంగాణ ప్రాంతంలో రంగారెడ్డి, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ జిల్లాలోను ఎక్కువగా పండిస్తున్నారు. ద్రాక్ష సాగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ (తెలంగాణ) 27.6 వేల టన్నుల ఉత్పత్తిలో దేశంలో 4వ స్థానంలో ఉంది.

ద్రాక్ష ఎగుమతిలో చిలీ మొదటి స్థానంలో ఉండగా మన దేశం 10వ స్థానంలో ఉంది. మన దేశంలో ఎగుమతిలో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. థాంప్సన్ సీడ్ లెస్, తాస్-ఎ-గణేష్ రకాలకు యూరోపియన్ మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. సొనాక, శరత్, సీడ్లెస్ రకాలను గల్ఫ్ దేశాలు, బంగ్లాదేశ్ ఎక్కువగా ఎగుమతి చేసుకుంటున్నాయి. ద్రాక్షలో నాణ్యమైన దిగుబడికి, ఎగుమతికి శీతాకాలపు కత్తిరింపుల తర్వాత పాటించవలసిన యాజమాన్య పద్ధతులు.

కత్తిరింపులు : ద్రాక్ష ఎగుమతి కొరకు అక్టోబరు 20 - నవంబర్ 10 మధ్యలో శీతాకాలపు కత్తిరింపులు చేపట్టాలి. సాధారణ (అంటుకట్టుని) మొక్కలలో 5 సంవత్సరాల తర్వాత తెగులు, లవణ సాంద్రత కారణంగా ఆకులు సెప్టెంబర్లోనే రాలుతాయి. అందుచే శీతాకాలపు కత్తిరింపులను సెప్టెంబరు చివరిలోగానీ అక్టోబరు మొదటి వారంలో కానీ చేపట్టాల్సి వస్తుంది. ఈ సమస్య నివారణకు జూలై - నుండి ఆగస్టు మాసాల నుండి తగిన సస్యరక్షణను చేపట్టాలి. కం వేసవి కత్తిరింపుల తరువాత 120-150 రోజులకు 13-0-46 ఎరువును డ్రిప్ ద్వారా ఇవ్వటమే కాకుండా 105 రోజున 10 పి.పి. ఎం., 6.బి.ఎ.ను పిచికారీ చేయాలి. దీని కొరకు ఎకరాకు 600 లీటర్ల నీటి ద్రావణాన్ని ఉపయోగించాలి.

 • మొగ్గ పరీక్షా ఫలితాలను బట్టి కొమ్మలను కత్తిరించుకోవాలి. బలహీనంగా (6 మి.లీ. కన్నా తక్కువ మందం) ఉన్న కొమ్మలను పూర్తిగా కత్తిరించివేయాలి.
 • కొమ్మలు కత్తిరించిన మరుసటి రోజున కణుపులకు హైడ్రోజన్ సైనమైడ్ పూసినట్లయితే కణుపులు (బడ్స్) ఎక్కువగాను, తొందరగాను, పగులుతాయి.
 • కత్తిరించే ముందు ఎకరాకు, 20 టన్నుల పశువుల ఎరువు, 1 టన్ను ఆముదం లేదా వేప చెక్క 300 కిలోల సూపర్ ఫాస్ఫేట్ వేసుకోవాలి.
 • కత్తిరించిన 4-20 రోజుల వరకు ప్లీ బీటిల్స్ నుండి తోటలను కాపాడాలి.
 • pp15.pngకత్తిరింపు తర్వాత 10-35 రోజుల వరకు తోటలను పక్షికన్ను తెగులు (ఆంత్రాక్నోస్) నుండి కాపాడాలి.
 • కొమ్మ మందాన్ని బట్టి, తగినన్ని కాపుకి వచ్చే కొమ్మలని ఉంచి అవసరమైన కొమ్మలన్నింటిని 4వ ఆకుదశలో కత్తిరించి వేయాలి.
 • 8-10 మి.మీ. మందం గల కేన్లలో 1 కాపుకి వచ్చే కొమ్మతో పాటు 1 కాపుకి రాని కొమ్మను ఉంచాలి.
 • pp16.pngకత్తిరించిన 15-20 రోజులకు ఎకరాకు 50 కిలోల యూరియా వేయాలి..
 • పూగుత్తి పొడవు పెరగడానికి, చిలక పచ్చ రంగు దశలో జి.ఎ. 10 పి.పి.ఎం పిచికారీ చేయాలి.. (సుమారుగా కత్తిరింపుల తర్వాత 22-25 రోజులకు) 5-6 రోజుల తర్వాత మరోసారి పూగుత్తులను 15 పి.పి.ఎం జి.ఎ. ద్రావణంలో ముంచినట్లయితే పూగుత్తులు పొడవుగా పెరుగుతాయి..
 • కత్తిరించిన 30-35 రోజులకు ఎకరాకు 20 కిలోల నత్రజని 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను వేసుకోవాలి.
 • కత్తిరించిన 40-45 రోజులకు ఎకరాకు 100 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి.
 • కత్తిరించిన 20-60 రోజుల మధ్య డౌనిమిల్యు బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు రాకుండా చూసుకోవాలి.
 • పూ మొగ్గలు విచ్చుకునే దశలో పూగుత్తులను 40 పి.పి. ఎం జి.ఎ. ద్రావణంలో ముంచాలి.
 • పండ్లు 3-4 మి.మీ. పరిమాణంలో ఉన్నప్పుడు 30 ఏ.పి. ఎం జి.ఎ., 1-2 పి.పి.ఎం. సిపిపియుల మిశ్రమ ద్రావణంలో గెలలను ముంచాలి.
 • అవసరమైతే పండ్లు 4-5 మి.లీ. పరిమాణంలో ఉన్నప్పుడు 'గర్జిలింగ్' చేయాలి.
 • పండ్లు 5-6 మి.మీ. పరిమాణంలో ఉన్నప్పుడు చేతితో మధ్య మధ్యలో పండ్లను తీసి గెలను పలుచన చేయాలి.
 • పండ్లు 7-8 మి.మీ. పరిమాణంలో ఉన్నప్పుడు మరొకసారి జి.ఎ. 40 పి.పి.ఎం., పిపిఎం సిపిపియుల మిశ్రమ ద్రావణంలో గెలలను ముంచాలి.
 • ఆకులు సరిపడినంత నీడనివ్వనట్లయితే, వరుసల మధ్యలో 75 శాతం నీడనిచ్చే నల్లని పాలిథీన్ నెట్ వేసి ఎండ నుండి పండ్లను కాపాడాలి.
 • కత్తిరింపుల తర్వాత 35-50 రోజుల వరకు పంటను త్రిప్స్ (తామర పురుగు) నుండి కాపాడుకోవాలి. ఈ కత్తిరింపుల తర్వాత 35-105 రోజుల వరకు బూడిద తెగులు (పౌడరీ మిల్యు) నుండి తోటను కాపాడుకోవాలి.
 • కత్తిరించిన 70-75 రోజులకు, ఎకరాకు 200 కిలోల స్టెరామీల్, 100 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ వేయాలి.
 • pp17.pngకత్తిరించిన 40వ రోజు నుండి 120వ రోజు వరకు పిండి నల్లి (మీలింగ్) నుండి ద్రాక్షన కాపాడుకోవాలి..
 • కత్తిరించిన 100-150 రోజులకు (పండ్లు మెత్తబడే దశలో) ఎకరాకు 50 కిలోల సల్ఫేట్ ఆఫ్ పొటాష్ ను వేసుకోవాలి.
 • కత్తిరించిన 60 నుండి 120 రోజుల వరకు ఈ ఆల్టర్నేరియా, ఇతర తెగుళ్ళ నుండి పంటను రక్షించుకోవాలి.
 • 15-17వ ఆకు దశలో కొమ్మల చివరలు తుంచాలి.
 • ఎండ నేరుగా గెలల మీద పండకుండా కొమ్మలను సరిచేయాలి.
 • పండ్లు మొత్తపడే దశలో బి.ఎ.10 పి.పి.ఎంను పిచికారీ చేసినట్లయితే పండ్లు ఆకుపచ్చ రంగులోనే ఉంటాయి. .
 • గెలలు కోసిన తరువాత పండ్లు రాలడం ఎర్ తగ్గించడానికి, కోతకు వారం ముందు పి.పి. ఎం లకై ఎన్.ఎ.ఎ. పిచికారీ చేయాలి.

కోత దశలో

 • కోతకు ఒకరోజు ముందు ఆకారం సరిగా లేని ముడతలు పడిన, రంగు మారిన, చిన్న సైజు - పండ్లను పొడవాటి కత్తెర సహాయంతో కత్తిరించి తీసివేయాలి.
 • ఉదయం పూట మాత్రమే ద్రాక్షను కోయాలి. మధ్యాహ్నం 12 గంటల తరువాత కోత ఆపివేయాలి.
 • కోసేటప్పుడు గెలలను చేతులతో తాకరాదు. పలుచని, మెత్తని రబ్బరు తొడుగులు ధరించి గెలలు కోయాలి.
 • గెలలను చేతులతో తాకరాదు. పలుచని, మెత్తని ఏ రబ్బరు తొడుగులు ధరించి గెలలు కోయాలి.
 • గుత్తులను గిరాటు వేయడం గానీ, ప్లాస్టిక్ క్రేట్లలోకి - విసిరివేయడం కానీ చేయకూడదు. కోసిన గుత్తులను నెమ్మదిగా క్రేట్లలలో పేర్చాలి.
 • వీలైనంత తక్కువ సమయంలోనే కోసిన గెలలను నీడగల ప్రాంతానికి లేదా ప్యాక్ హౌస్క్ తరలించాలి.
 • గెలలు కోసిన 2 గంటలలోపే శీతల గిడ్డంగి ప్యాక్ హౌస్కి తరలించాలి.

ఎగుమతి చేయడానికి ఉండవలసిన ద్రాక్ష గుత్తి లక్షణాలు

 • గుత్తిలో పండ్లు వదులుగా ఉండాలి. మరీ వత్తుగా లేక మరీ వదులుగా ఉండరాదు.
 • గుత్తి బరువు కనీసం 400-600 గ్రా. ఉండాలి.
 • గుత్తిలో పండ్లన్ని ఒకే రకమైన పరిమాణం, ఆకారం, రంగు కలిగి ఉండాలి.
 • చిన్న సైజు, వడిలిన పండ్లు 7 శాతం కన్న ఎక్కువ ఉండరాదు.
 • pp18.pngనలిగిన, మాగిన పండ్లు 2 శాతం కన్నా ఎక్కువ ఉండరాదు.
 • గుత్తి విదిలించినప్పుడు 5 శాతం కన్నా ఎక్కువ పండ్లు రాలిపోకూడదు.
 • గుత్తి కాడ ఆకుపచ్చగా, తాజాగా ఉండాలి.
 • గింజలేని పండ్లను ప్రాధాన్యత ఎక్కువ.
 • పండ్లు ఆకుపచ్చ లేదా లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. పసుపు లేదా గోధుమ రంగులో ఉండకూడదు. ఈ రంగు కలిగిన ద్రాక్ష రకాల పండ్లన్నీ ఆ రకం రంగే కలిగి ఉండాలి..
 • పండ్లు 18 మి.మీ. కన్నా ఎక్కువ వ్యాసం కలిగి ఉండాలి. కానీ 16 మి.మీ.లకు తగ్గకూడదు.
 • ఎండకు వడిలిని, రంగుమారీన పండ్లు ద్రాక్ష గుత్తిలో ఉండకూడదు.
 • పండ్ల తొడిమలు తాజాగా, ఆకుపచ్చగా ఉండాలి.
 • ముడతలు గల పండ్లు ఉండకూడదు.
 • పండ్లలో చక్కెర కనీసం 18 డిగ్రీల బ్రిక్స్ కలిగి ఉండాలి.
 • ఆమ్లశాతం 0.8 (డబ్ల్యూ. /వి) కి మించకూడదు.
 • కోసిన పండ్లలో రసాయన అవశేషాలు ఉండకూడదు. కోత సమయంలో నివారణ పిచికారీలను మానుకోవాలి. కోత దశలో మీలిబర్ ఎక్కువగా కనబడుతుంది. దీని నియంత్రణ కోసం 5 రోజుల భద్రతా వ్యవధితో ఉన్న రసాయనాలను ఉపయోగించాలి.
 • లేత ఎరుపు రంగు బెర్రీలు నివారించడానికి 0.2 శాతం అస్కోరిబిక్ ఆమ్లం, 0.25 శాతం సోడియం డైటికోకార్బనేట్, శీతాకాలపు కత్తిరించిన 100వ రోజు నుండి 15 రోజుల వ్యవధితో పిచికారీ చేసుకోవాలి.
 • పురుగు మందులు, ఎరువులు విచక్షణా రహితంగా ఉపయోగించకూడదు.

చివరిసారిగా మార్పు చేయబడిన : 6/4/2020© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate