పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర వ్యవసాయం

తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల ఎకరాల భూమిని వివిధ పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. మొత్తం 54.55 లక్షల కుటుంబ కమతాలుంటే అందులో 85 శాతం రైతులు చిన్న సన్నకారు రైతులే. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడి పశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళు పెంపకం చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా భూసారాన్ని కూడా కాపాడారు. క్రమంగా వివిధ కారణాల దృష్ట్యా పశుసంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. కొంత మంది రైతులు ఒకే వాణిజ్య పంట సాగుచేసూ నష్టపోతున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావాల్సినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్నచిన్నవిగా అయిపోయి రైతుకు ఆశించిన స్థాయిలో ఆహార భద్రత, ఆదాయం లభించడం లేదు. కాబట్టి వ్యవసాయాన్ని శాస్త్రీయబద్ధంగా చేపడుతూ, క్షేత్ర వరున లను సమర్ధవంతంగా వినియోగించుకోవడం అత్యవసరం.

వివిధ వాతావరణ పరిస్థితులకు, సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనువుగా ఉండే విధంగా వివిధ వ్యవసాయ అనుబంధ రంగాల కలగలుపుగా వ్యవసాయం ఉండాలి. ఉద్యాన పంటలు, పశుపోషణ, జీవాల పెంపకం, అటవీ వ్యవసాయం మొదలైన వాటితో పాటు వ్యవసాయ వ్యర్థాలను లేదా ఉప ఉత్పతులను ఉపయోగించుకుంటూ కుటీర పరిశ్రమలైన పుట్టగొడుగుల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, తేనేటీగల పెంపకం, వర్మీ కంపోస్టు, బయోగ్యాస్ యూనిట్ల వంటి వాటిని కూడా ఆలోచించవచ్చు. ఏది ఏమైనా కానీ వ్యవసాయాన్ని ఒక పరిశ్రమలా చూడాలి. ఈ విధంగా వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి చేసుకోవడాన్ని మిశ్రమ వ్యవసాయం అంటాం. ఇందులో ఒక వ్యవస్థ నుండి లభించే ఉత్పత్తులు / వ్యర్థాలు మరో వ్యవస్థకు వనరులు గా లేదా పెట్టుబడులుగా ఉపయోగపడతాయి. ఈ మిశ్రమ వ్యవసాయంలో పంటలు, పశువులు, చెట్లు ముఖ్యమైనవి. రాష్ట్రంలో వివిధ సాగు పరిస్థితుల్లో వ్యవసాయం చేపడుతున్నాం. ఆయా పరిస్థితులు, వనరుల లభ్యతను బట్టి శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర వ్యవసాయం చేపట్టవచ్చు. సాధారణంగా 70-80 శాతం భూమిలో ఆహార పంటలు వేసుకొని, మిగిలిన దానిలో అనుబంధ రంగాలను ఎంచుకోవాలి.

వర్షాధార తేలిక భూములు

కేవలం నైరుతి రుతుపవనాలే ఈ పరిస్థితుల్లో చేసే వ్యవసాయానికి ఆధారం. రైతు కేవలం ఖరీఫ్ సీజన్ లో జొన్న, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, పొద్దుతిరుగుడు, పత్తి, కంది, పెసర, సజ్ఞ పంటలను సాగు చేస్తున్నారు. సగటు భూమి 2-3 ఎకరాలు. అందులో ఇంటికవసరమైన చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలను సాగుచేసుకోవచ్చు. ఇక్కడ సమగ్ర వ్యవసాయానికి గల సన్నకారు రైతు, ఎకరా పొలంలో జొన్న + కందులు ఒక ఎకరాలో వేరుశనగ, అర ఎకరాలో రాగులు, అర ఎకరాలో ఆముదం సాగుచేసుకున్నట్లయితే సగటున 10 టన్నుల జొన్న చొప్ప, 1 టన్ను కంది పొట్టు, 4 టన్నుల వేరుశనగ మొదళ్ళు, 4 టన్నులు రాగి మొదళ్ళు, 3 టన్నుల జొన్న చొప్ప, 1 టన్ను కందిపాటు, 4 టన్నుల వేరుశనగ, 3 టన్నుల ఆముదం అవశేషాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని వినియోగించుకొని పాడి పశువుల పోషణ చేపట్టవచ్చు. అదనంగా పొలం గట్లపైన సుబాబుల్, తుమ్మ, సెస్టినియూ, గైరినీడియం లాంటి బహువార్షికాలను కూడా పెంచుకొని పచ్చిమేతను పొందవచ్చు. అదే విధంగా మెట్ట ప్రాంతంలో ఫలాలనిచ్చే రేగు, సీతాఫలం, నేరేడు మొక్కలు కూడా గట్లపై వేసుకోవచ్చు. పశువులకు మేతగా ఉపయోగపడని పంటల వ్యర్థాలను కాల్చివేయకుండా కంపోస్టుగా లేదా వర్మీ కంపోస్టుగా తయారు చేసుకొని వంటలకు వేనకున్నట్లయితే భూసారాన్ని కాపాడుకోవడమే కాకుండా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం చేపట్టి రైతుకు మూడు ఎకరాల సాగుభూమికి సంవత్సరానికి పంటల నుండి (జొన్న + కందులు ఒక ఎకరా, వేరుశనగ ఒక ఎకరా, రాగులు అర ఎకరా, ఆముదం అర ఎకరా) రూ.30,000/- నికర ఆదాయం లభిస్తుంది. పాడి పశువుల నుండి (అధిక పాల ఉత్పత్తి గల దేశవాళి రకాలు) రూ.10,000/- నికర ఆదాయం, మేకల పెంపకం (5 ఆడ +1 మగ) నుండి రూ. 16,000/- నికర ఆదాయం, పెరటి కోళ్ళు (వనరాజ / గిరిరాజ / గ్రామ ప్రియ) నుండి రూ.9,000/- నికర ఆదాయం పొందవచ్చు. ఆముదం పంటసాగు చేసుకొనే రైతులు ఇరీ పట్టు పురుగుల సాగును కూడా అనుబంధ రంగంగా ఎంచుకొని ఎకరాకు 2000 నుండి 3000 రూపాయల వరకు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ పద్ధతుల వల్ల సుమారుగా రూ. 70,000/- నికర ఆదాయం పొందవచ్చు.

ఈ ఆదాయాన్ని అదనంగా పశువుల పేడ, ఆముదం పంట అవశేషాలు, ఇతర వ్యర్థాల నుండి 13-14 టన్నుల సేంద్రియ ఎరువులను పొందవచ్చు. ఇది 3 ఎకరాలకు సరిపోతుంది. ఈ రకంగా భూసారాన్ని కాపాడుకుంటూ, కుటుంబ ఆహార, పోషక భద్రతను సాధించి ఆదాయాన్ని క్రమబద్ధంగా సంవత్సరం పొడవునా పొందడమే కాకుండా అనుకూల వాతావరణ పరిస్థితుల్లో కూడా అనుకున్న ఆదాయం పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేపట్టవచ్చు .

వర్షాధార నల్లరేగడి నేలలు

ఈ పరిస్థితుల్లో రైతులు పత్తి, మొక్కజొన్న కంది, కూరగాయలు, పశుగ్రాస జొన్న శనగ, వంటి పంటలు విత్తుకుంటారు. ఈ విధంగా మూడు ఎకరాలున్న రైతు వివిధ రకాలు పంటలను సాగుచేసినట్లయితే ఒక ఎకరా మొక్కజొన్న+ కంది నుండి రూ.15,000/-, ఒక ఎకరా పత్తి నుండి రూ.20,000/- ఒక ఎకరా పశుగ్రాస జొన్-శనగ పిండి నుండి రూ.20,000/- నికరాదాయం మొత్తం మూడు ఎకరాల పంటసాగు నుండి రూ. 55,000/- నికరాదాయం పొంవదచ్చు. అలాగే పాడి పశువుల (గ్రేడెడ్ ముర్రా –2) నుండి రూ.16,000/- పెరటి కోళ్ళ (వనరాజ /గిరిరాజ / గ్రామప్రియ) - 30 ద్వారా రూ. 8,000/- నికరాదాయం, వర్మికంపోస్టు ద్వారా కూడా అదనపు ఆధాయం పొందవచ్చు. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ద్వారా సుమారు లక్ష రూపాయల వరకు నికరాదాయం పొందవచ్చు. అదనంగా మేకలు, పశువుల పచ్చిమేత కోసం గట్లపైన సుబాబుల్, తుమ్మ, గైరిసీడియం, సెస్టేనియా లాంటి బహువార్షికాలు కూడా గట్లపైన వేసుకోవాలి. మొక్కజొన్న జొన్న చొప్పను, కంది పొట్టును, శనగ పొట్టును జాగ్రత్తగా నిల్వ చేసుకొని 3 పశువులను నమర్థవంతంగా వేువ వచచ్చు. గట్లపైన బహువారికాలు మేకలకు సరిపోతాయి. ఈ విధానంలో కూడా రైతు 3 ఎకరాలకు కావాల్సిన 15 టన్నుల సేంద్రియ ఎరువును పొలంలో ప్రతి సంవత్సరం వేయడం ద్వారా ఎల్లప్పుడు నేల సారాన్ని కాపాడుకోవచ్చు. పైన చూపించిన విధంగా ఖచ్చితమైన ఆదాయంతో ఒడి దుడుకులు లేని జీవితాన్ని గడపవచ్చు.

బోరుబావుల కింద సాగు

నీటి వసతి ఉన్నప్పుడు, తేలిక నేలల్లోను, నల్లరేగడి నేలల్లోను ప్రణాళిక బద్ధంగా ఖరీఫ్ - రబీలో పంటలు, ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితమైన ఆదాయాన్ని పొందవచ్చు. మేకల కోసం పొలం గట్లపైన సుబాబుల్, సెస్బేరియా, గైరిసీడియా, తుమ్మ మొక్కలను నాటుకోవాలి. అలాగే గట్ల పొడవున కూడా మొక్కలు నాటుకున్నట్లయితే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ తరహా వ్యవసాయంలో పరిస్థితులు రైతులకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరం పొడవునా పని పొందడమే కాకుండా అదనంగా 400 పనిదినాలను ఇతరులకు కల్పించవచ్చు. ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు, పశువులకు, మేకలకు, కుందేళ్ళకు, కోళ్ళకు మేత సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి సంవత్సరం 15 టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. కనుక దీర్ఘకాలికంగా నేల సారవంతంగా ఉంటుంది. పశువుల మేతలో, పశువుల పేడలో గోబర్ గ్యాస్ ప్లాంట్ నెలకొల్చి గృహ అవసరాలకు కావాల్సిన ఇంధనాన్ని విద్యుత్తును తయారు చేసుకోవచ్చు. ఇందుకు గాను ఎన్.ఇ.డి.సి.ఎ.పి. (నెడ్కాప్) ద్వారా సబ్సిడీ కూడా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ పంపు సెట్లను కూడా సబ్సిడీ ద్వారా ఏర్పటు చేసుకొని విద్యుత్ సమస్యను అధిగమించి ఖచ్చితమైన దిగుబడులు పొందవచ్చు. రైతులు వర్మీకంపోస్టు, వర్మీ వాష్ పంచామృతం వంటివి సొంతంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అన్ని అనుబంధ రంగాలను చేసి సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే ఉదాహరణకు రెండున్నర ఎకరాలలో పంటల సాగు (పెసర + కంది - అర ఎకరా, రాగి+వేరుశనగ - అర ఎకరా, వరి - మొక్కజొన్నఅర ఎకరా, పశుగ్రాసాలు- ఎ.పి.బి.ఎస్-1, లూసర్న్ గడ్డి అర ఎకరా, కూరగాయలు అర ఎకరా) నుండి రూ.50,000/- నికర ఆదాయం, అర ఎకరా జామతోట నుండి రూ. 10,000/- నికర ఆదాయం, పాడి పశువులు (మేలు జాతి ముర్రా-3) నుండి రూ.50,000/- నికర ఆదాయం, మేకలు (లోకల్ 4 ఆడ + 1 మగ) పెంపకం ద్వారా రూ.16,000/- నికర ఆదాయం, పెరటి కోళ్ళ నుండి (30 వనరాజ / గిరిరాజ / గ్రామప్రియ) రూ. 8,000/- నికర ఆదాయం, వీటితో పాటు కౌజు పిట్టలు లేదా కుందేళ్ళు వంటి వాటి పెంపకం చేపట్టినట్లయితే రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు నికర ఆదాయం లభినుంది. వెుత్తం మీద నువూరుగా రూ.150,000/- నుండి రూ.1,60,000/- వరకు నికర ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా స్థిరమైన రాబడిని పొందుతూ పది మందికి పనిని కల్పిస్తూ పర్యావరణాన్ని తద్వారా మానవాళి మనుగడను కాపాడుతూ రైతు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు.

ఆయకట్టు ప్రాంతం

ప్రాజెక్టులు, చెరువుల కింద రైతులంతా ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. అక్కడక్కడా లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీటి సౌకర్యం లేక వరి దిగుబడులు గణనీయంగా తగుతున్నాయి. వరితో పాటు బహువార్షిక పశుగ్రాసాలు సాగుచేసుకునే అవకాశమున్నందున పాడి పరిశ్రమ చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదే విధంగా నీటి ముంపు ప్రాంతాల్లో చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు ఈ విధంగా పంట సాగు (ఒక ఎకరా వరి - వరి నుండి రూ. 35,000/- ఒక ఎకరా వచి - మొక్కజొన్న నుండి రూ.40,000/- ముప్పాపు ఎకరా పచ్చిగడ్డి లేదా ప్యారా గడ్డి, లూసర్స్ గడ్డి) నుండి రూ.20,000/- పావు ఎకరా కూరగాయల ద్వారా రూ.10,000/- పాడి పశువుల నుండి (మేలు జాతి ముర్రా - 3) రూ.50,000/- పెరటి కోళ్ళ ద్వారా 50 (వనరాజ /గిరిరాజ / గ్రామప్రియ) రూ. 11,000/- కుందేళ్ళ పెంపకం లేదా పుట్ట గొడుగుల సాగు ద్వారా రూ.15,000/- నుండి రూ.20,000/- వరకు నికర ఆదాయం, ఎకరా వరి పొలం చుటూ 3 మీ. వెడల్పు, 1.5 మీ. లోతు కందకాలు చేసి చేపలు పెంచినట్లయితే రూ. 10,000/- నుండి రూ. 15,000/- నికరాదాయం పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో సాలీనా రూ.18,000/- నుండి రూ. 19,000/- వరకు నికరాదాయం లభిస్తుంది.

ఈ విధమైన సమగ్ర వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్థలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్గాల సమర్థ వినియోగం జరిగి సాగు ఖర్చు తగ్గుతుంది. వంట చెరకు, పశుగ్రాసాల కొరత ఉండదు. పశుపోషణ ఆరోగ్యవంతంగా ఉంటుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి, స్థిరమైన ఆదాయం లభిస్తుంది. భూసార, పర్యావరణ పరిరక్షణతో పాటు పెరుగుతున్న జనాభాకు ఆహార భద్రత లభిస్తుంది.

ఆధారం: పాడిపంటలు మాస పత్రిక

3.04854368932
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు