অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థాయిలో పంటల పై జరిగిన సమీక్షా సమావేశంలో రైతుల సందేహాలకు సూచనలు

వ్యవసాయ మార్కెట్ కమిటీ స్థాయిలో పంటల పై జరిగిన సమీక్షా సమావేశంలో రైతుల సందేహాలకు సూచనలు

వరి

1. పొడివిత్తనాలు యెద పద్దతిలో విత్తిన వరిలో కలుపు నివారణ గురించి తెలపండి ?

స|| విత్తిన రెండు రోజులలోపు ఎకరాకు ఒక లీటరు పెండిమిధలైన్ కలుపు మందును 200 లి|| నీటిలో కలిపి నెల తడిచేలా పిచికారీ చెయ్యాలి. పైరు వయస్సు 20 రోజులకు కలుపు ఎక్కువగా ఉంటే ఎకరాకు 80 మీ||లి|| బిస్ పైరీబాక్ సోడియం లేదా 37.5 మి||లీ|| పేనాకులమ్ మందును 200 లీ|| నీటిలో కలిపి కలుపు తడిచేలా పిచికారీ చేయాలి.

2. పోటాష్ ఎరువును వారి పైరుకు ఎంత మోతాదు వాడాలి?

స|| ఎకరాకు 34 కిలోలల మ్యురేట్ అఫ్ పోటాష్ ఎరువు వాడాలి. అందులో సగభాగాన్ని చివరి దమ్ములోను మరియు మిగిలిన సగభాగాన్ని చిరుపొట్టదశలో వెయ్యాలి.

3. వరిపైరుకు జింకఎరువు ఎంత మోతాదు వెయ్యాలి ?

స|| మూడు పంటలకొకసారి ఎకరాకు 20 కిలోల జింకు సల్పెటు చివరి దుక్కిలో వెయ్యాలి. (ఇలా వేసేటప్పుడు భాస్వరం ఎరువుతో కలపకుండా జాగ్రత్తపడాలి.) పైరు పై జింకులోప లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 250 గ్రా|| చిలేటెడ్ జింకును 200 లీటరు నీటిలో కలిపి పైరుబాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి.

4. వరిసాగులో నారుపెంచి,నాట్లు వెయ్యటానికి కూలీలు దొరకటం లేదు? కూలీలా సమస్య తగ్గించే వరి సాగు పద్ధతి ఏమైనా తెలపండి ?

స|| పొడి వరి విత్తనాలను ఎకరాకు 15 నుండి 20 కిలోల చొప్పున దుక్కిచేసిన పొలంలో నేరుగా వేద జల్లవచ్చు లేదా సిడిడ్రిల్ తో వరుసలలో విత్తవచ్చు. కలుపు నివారణ కోసం విత్తన మరుసటిదినం ఎకరాకు 1 లీటరు పెండిమిధలైన్ కలుపుమందును 200 లీటర్లు నీటిలో కలిపి నెల ఫ్రైపిచికారీ చేయాలి. దమ్ముచేసి చదును చేసిన పొలంలో 12 కేజీల మొలకెత్తిన వరి విత్తనాలు డ్రమ్ముసిడర్ తో వరుసలలో విత్తలి. విత్తిన 5 రోజులకు అక్సాదయార్జిలో 35 గ్రా|| లేదా పైరజోసలురాన్ ఇడైల్ 80 గ్రా|| అరలీటరు నీటిలో కరిగించి ఆ ద్రావణాన్ని 20 కిలోల పొడి ఇసుకకు పట్టించి ఎకరా పొలంలో నీరు పల్చగా ఉన్నప్పుడు సమానంగా వేద జల్లాలి. ప్రత్యేకమైన ట్రైలలో వరినారు 15 రోజులు పెంచి, యంత్రంతో వరి నాట్లు వేసే పద్దతి కూడా అందుబాటులో ఉంది.

5. వారిపైరులో అగ్గితెగులు నివారణ తెలపండి

స|| వారిపైరిలో అగ్గితగులు నివారణకు, ఆకుల పై నూలుకండి ఆకారం మచ్చలు కనిపించిన వెంటనే ట్రైసైక్లాజోల్ పొడిమందు ఎకరాకు 120 గ్రా|| 200 లీ|| నీటిలో కలిపి పిచికారీచేయ్యాలి.

6. వరి పైరుకు సూడోమోనాస్ ఎలావడాలి, దాని ఉపయోగాలేమిటి ?

స|| విత్తముందు విత్తనాలను సూడోమోనాస్ తో కేజీ విత్తనాలకు 8 గ్రా|| చొప్పున కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలు మొలకెత్యేటప్పుడు ఆశించే వివిధ తగుళ్ళను మరియు పైరుకుసోకే పొడతెగులు, అగ్గితెగులును నియంత్రించవచ్చు. అగ్గి తెగులు కనిపించిన వెంటనే సూడోమోనాస్ ద్రావణం పిచికారీ చేసి నివారించవచ్చు.

7. ఆలస్యంగా వేసుకోవడానికి అనువైన వరివంగడాలు సూచించండి ?

స|| కాటన్ దొరసాన్నాలు, నెల్లూరిమగారి, పోమశిల రకాలు ఆలస్యంగా వేసుకోవడానికి అనువైనవి.

8. బెట్టకు గురైన పరినారుమళ్ళను ఎలా సంరక్షించాలి ?

స|| వరినారు బెట్టకు గురైతే 1 % యూరియా ద్రావణాన్ని (లీటరు నీటికి 10 గ్రా|| యూరియా చొప్పున) పిచికారీ చేస్తే కొన్నిరోజులు సంరక్షించవచ్చు. అవకాశం ఉంటే ఒక జీవ తడి ఇవ్వాలి.

9. వరి ముదురునారు నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలపండి ?

స|| వరి నరు 45 రోజులు వయసు దాటితే, దగ్గర దగ్గరగా చదరపు మీటరుకు ౪౪ కుదుళ్ళు ఉండేటట్లు నాటాలి నాత్రజని  ఎరువు సిపార్సు చేసిన మోతాదు కంటే 25 % అధికంగా వాడాలి.

10. యమ్.టి.యు 1010 వరి రకం కొత్తసమయంలో గింజలు ఎక్కువగా రాలిపోతున్నాయే నివారణ ఏమిటి ?

స|| చేసుకోత కర్రపచ్చిమిద కొయ్యాలి కోతకు వరం ముందు పొలం నుంచి నీరు తీసివేయాలి. చేను పైపడ్డా మంచు బాగా ఆరిసా తరువాత కొత్త చేపట్టాలి.

11. తీవ్ర వర్షాభావం వాళ్ళ పరిసాగు కష్టమనిపిస్తుంది ప్రత్యమానయా పంటలను సూచించండి ?

స|| వారి సాగు చెయ్యలేని భూములలో ప్రతేకించి తేలికబూములలో రాగి (చోడి) మొక్కజొన్న, మినుము, పెసరాలను వారికీ ప్రత్యమ్నాయ్యంగా పండించవచ్చు. ఆయపంటలను సెప్టెంబర్ నెలతరువాత విత్తుకోవాలి.

ప్రత్తి

1. ప్రత్తి పైరులో రసం పీల్చుపురుగుల నివారణ గూర్చి తెలపండి ?

స|| ప్రత్తి విత్తిన 20 , 40 , మరియు 60 రోజులకు మోనోక్రోతపస్ మరియు నీరు 1:4 నిష్బత్తి తో కలిపినా ద్రావణాన్ని మొక్కలకండం పై బ్రష్ తో పూయాలి. అవసరాన్ని బట్టి లీటరు నీటికి 0.2 గ్రా|| ఎసిటామిప్రిడ్ లేదా 1.5 గ్రా|| ఎసి పెట్ లేదా 2 మి|| లీ|| పిప్రానిస్ కలిపినా ద్రావణాన్ని పిచికారీచేయాలి.

2. వర్షధార ప్రత్తి పైరు 45 రోజుల వయస్సులో బెట్టకు గురైంది ఏమిచేయాలి ?

స|| రెండు శాతం (లీటరు నీటికి 20 గ్రా||) 19 -19 -19  ఎరువు ద్రావణం లేదా రెండు శాతం యూరియా ద్రావణాన్ని మొక్కలు బాగా తడిచేలా పిచికారీ చెయ్యాలి.

3. వర్షాధార పత్తి పైరుకు ఎరువులు మోతాదు సూచించడం ?

స|| పత్తి అన్ని సంకరాలకు 48 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వాడాలి. మొత్తం భాస్వరం ఎరువును ఒకే సారి ఆఖరిదుక్కిలో వెయ్యాలి. నత్రజని పోటాష్ ఎరువులను మూడు సమ భాగాలుగా చేసి విత్తిన 30 , 60 , 90 రోజులకు మొక్కకు 7 -10 సెం|| మి|| దూరంలో పదులు తినివేయ్యాలి.

మొక్కజొన్న

1. 40 రోజుల వయస్సులో వర్షాధార మొక్కజొన్న పైరు బెట్టకు గురైతే నివారణ మార్గం సూచించండి?

స|| అవకాశం ఉంటే ఒక జీవ తడి ఇవ్వాలి ప్రత్యమాన్యంగా రెండు శాతం(లీటరు నీటికి 20గ్రా||) యూరియా ద్రపనం లేదా 19 -19 -19 ద్రావణం పిచికారీ చెయ్యాలి.

2. మొక్కజొన్న 20 రోజుల వయస్సులో మొవ్వులు కుళ్లిపోతున్నాయే నివారణ ఏమిటి ?

స|| మొక్కకొనాలో కాండం తొలుచు పరుగు ఆశించడం వాళ్ళ మొవ్వులు కుళ్లిపోతాయే దీని నివారణకు ఎకరాకు 3 కిలోల కార్బోవ్యూరాన్ 3 జి గుళికలు మొక్కల సూదులలో వెయ్యాలి.

3. ఖరీఫ్ మొక్కజొన్నకు ఎరువులు వాడకం గూర్చి తెలపండి ?

స|| ఎకరాకు 4 టన్నుల సేంద్రియాయెరువులను దుక్కిలో కలపాలి మరియు ఎకరాకు 80 కిలోల నత్రజని, 24 కిలోల భాస్వరం మరియు 20 కిలోల పోటాష్ పోషకాలను అందిచే రసాయన ఎరువులను వాడాలి. ఈ రసాయన ఎరువులతో 1/3 వంతు నత్రజని మొత్తం భాస్వరం మరియు సగం పోటాష్ ఎరువును పైరు వితే సమయంలోను, 1/3 వంతు నత్రజనిని 35 రోజులకు మరియు మిగిలిన 1/3 వంతు నత్రజని, సగం పోటాష్ ఎరువులను పంట ౫౫ రోజుల వయసులో వెయ్యాలి.

చెరకు

1. చెరుకు పైరులో కోరదాతెగులు నివారణ తెలపండి ?

స|| చెరుకు నాటేముందు ముచ్చెలు ప్రొపికొనజాల్ ధ్రపణంలో (లీటరు నీటికి 0.5 మి|| లీ||) 15 నిముషాలు మంచాటుకోవాలి పైరు 30 రోజుల వయస్సులో ప్రొపికోనజోల్ మందు (1.0 మి||లీ || 1 లీ|| నీటికి చొప్పున)  ద్రావణాన్ని పిచికారీ చెయ్యాలి. పైరు పై తెగులు కనిపిస్తే తెగులు సోకినా దుబ్బులను తీసి తగులబెట్టాలి తరువాత పై మందు ద్రావణం పిచికటి చెయ్యాలి.

2. చెరకు పంటకు ఎరువులు ఎంత మోతాదులో వాడాలి ?

స|| ఎకరాకు 45 కిలోల నత్రజని, 40 కిలోల భాస్వరం మరియు 48 కిలోల పోటాష్ నిచ్చే ఎరువులను వాడాలి. నత్రజని ఎరువును నాటిన 45 మరియు 90 రోజులకు రెండు సమపాళ్ళలో వెయ్యాలి. మొత్తం భాస్వరం ఎరువును ఆఖరిదుక్కిలో కలపాలి. పోటాష్ ఎరువును మొచ్చెలునాటినప్పుడు సగభాగం మరియు సెప్టెంబర్ / అక్టోబర్ మాసాలలో మిగిలిన సగం వెయ్యాలి.

3. చెరుకు రకం 87 ఎ- 298 సాగు చేస్తున్నాము, కొరడా తెగులు ఎక్కువగా సోకింది కొత్తరకాలను తెలపండి ?

స|| కనకమహాలక్ష్మి (2001.ఎ.63) : స్వల్పకాలిక రకం, ఎకరాకు 45 టన్నుల దిగుబడి ఎర్రకూళ్ళ, కాటుక తెగుళ్లను తట్టుకుంటుంది.

83-వి-288 : స్వల్పకాలిక రకం, ఎకరాకు 48 టన్నులదిగుబడి, బెట్టను, నీటి ముంపును మరియు ఎర్రకూళ్ళ, కాటుక తెగుళ్ళను తట్టుకుంటుంది.

ఉత్తర (98 -ఎ -163) : మధ్యకాలిక రకం, ఎకరాకు ౫౦ తన్నులు దిగుబడి, ఎర్రకూలీలతెగులు తట్టు కుంటుంది.

విశాఖ (97-ఎ-85) : స్వల్పకాలికారకం, ఎకరాకు 45 తన్నులు దిగుబడి, ఎర్రకుళ్ళు తెగులును తట్టు కుంటుంది.

ఆధారము: డా|| పి. గరుమూర్తి, డా|| జి.యస్.రాయ్ మరియు డా|| వై. రాజశేఖర్© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate