పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

“శ్రీ” వరి సాగు మెళకువలు

“శ్రీ” వరి సాగు మెళకువలు గురించి తెలుసుకుందాం.

మన రాష్ట్రంలో వరి ప్రధాన పంట. వరి పంటను ఆధారం చేసుకొని చాలా రైతు కుటుంబాలు నివసిస్తున్నాయి. కాని వరి పంట నుండి ఆశించన మేర దిగుబడులు మాత్రం రావడం లేదు దానికి గల ప్రధాన కారణం ఒకటి, వరి బాగా పెరిగి అధిక దిగుబడిని ఇవ్వాలి అంటే ఎల్లప్పుడూ నీరు ఉండాలి పొలంలో అని రైతులు భావిస్తారు. వరి నీటిలో బతుకుంతుంది అంతే కాని ఎల్లప్పుడు నీరు ఉంటేనే బతుకుతుంది అని అర్ధం కాదు. రైతులు అధిక నీరు ఉంచాలి అనే ధోరణిని మార్చుకొని ఒక్క అడుగు ముందుకు వేసి ఆలోచించవలిసిన పరిస్థితులు ఏర్పడ్డాయి, ఎందుకంటే ప్రస్తుతం భూగర్భ నీటి నిలువలు తగ్గిపోవడం ఒక కారణం కాగా అసమతుల్య వర్షపాతం నమోదు కావడం మరొక కారణంగా చెప్పుకోవచ్చు. పరిస్థితులు మారుతున్నందున రైతులు కూడా వాటికి తగిన విధంగా సమాలోచన చేసి ప్రత్యామ్నాయ పరిస్థితులను ఎదుర్కునే విధంగా నైపుణ్యం పొందాలి. క్రమం తప్పకుండా భూసార పరీక్షలు, శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరపడం ద్వారా కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి. ప్రత్యామ్నాయ పరిస్థితులను ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలో నేర్చుకోవాలి.

శాస్త్రవేత్తలు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా రకరకాల టెక్నాలజీని తయారుచేస్తున్నారు కాని రైతులు ప్రస్తుత పరిస్థితులలో వాటిని అంది పుచ్చుకోవడంలో వెనకే ఉన్నారు అని చెప్పొచ్చు, ఈ ధోరణి మారాలి ఒక్క సారి ఆలోచించండి రైతు మిత్రులారా ఇలా ఎల్లప్పుడు నీటిని నిలువ ఉంచడం వల్ల మొక్కల దిగుబడి తగ్గిపోతుంది. నీరు నిలువ ఉండటం వల్ల మొక్కల వేరుకు శ్వాస ఆడదు కనుక అవి గాలి సంచులను తయారు చేసుకుంటాయి. ఈ క్రమంలో మొక్కలు తాము గ్రహించిన శక్తిలోని అధిక మొత్తాన్ని గాలి సంచులు తయారు చేసుకోవడానికే వినియోగిస్తాయి. కనుక దీనికి ప్రత్యామ్నాయంగా శాస్త్రవేత్తలు "శ్రీ వరి సాగు పద్ధతిని కనిపెట్టారు. ఈ సాగు పద్ధతి, 1980 దశకంలో మడగాస్కర్ దేశంలో రూపొందించబడినది. సాధారణంగా వరి సాగు చేయడానికి 20 కేజీల విత్తనం అవసరం ఉంటుంది లన కాని శ్రీ వరి సాగులో కేవలం 2 కేజీలు/ఒక ఎకరాకు అని సరిపోతుంది. శ్రీ వరి సాగులో రసాయన ఎరువుల వాడకం చాలా తక్కువ కనుక తక్కువ ఖర్చుతో తే అడికదిగుబడులను పొందవచ్చు.శ్రీపద్దతిలో వరి సహజంగా పెరుగుతుంది కాబట్టి వరి చాలా ఆరోగ్యంగా ఉంటుంది. నీరు తక్కువ అందించడం వలన సహజంగా వేరు పెరుగుదల దళసరిగా, లోతుగా ఉంటుంది. ఈ విధంగా పెరిగిన వేర్లు భూమి లోతు పొరలలో దాగి ఉన్న పోషక పదార్థాలను అందిపుచ్చుకొని మొక్కల సహజ పెరుగుదలకు సహాయపడుతుంది.

"శ్రీ"పద్దతి నారుమడి యాజమాన్యం: శ్రీ పద్దతిలో వరినారుని పెంచడానికి ఒక సెంటు భూమి సరిపోతుంది. ఇలా ఒక సెంటు భూమిలో పెంచిన వరి నారు సరిగ్గా ఒక ఎకరాకు సరిపోతుంది. వరిని పెంచడానికి ఉపయోగించే భూమిని మెత్తగా దున్ని దమ్ము చేసి ఎత్తుగా తయారు చేయాలి, చుట్టూ కాలువ తీసుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న భూమికి బాగా చివికిన మెత్తటి పశువుల ఎరువుని ఒక పొరలాగా ఆ చల్లుకోవాలి. దానిమీద మండె కట్టిన, మొలకెత్తిన విత్తనాలను పలుచగా చల్లాలి. విత్తనాలపై మరల మరో -పొర పశువుల ఎరువు చల్లిగడ్డితో కప్పాలి. మొలక - వచ్చిన వెంటనే గడ్డిని మొలకలు దెబ్బతినకుండా తీసివేయాలి. ఈ పద్ధతిలో వరి నారుని 8 నుండి 12 రోజుల దశలో నాటుకోవడం మంచిది. అందుకు తగిన ఆ విధంగా రోజు నారుమడికి నీరు చల్లడం వల్ల సుమారు 8 రోజులలో 2 నుండి3 ఆకులతో వరి నారు ధృడంగా పెరుగుతుంది. ముందుగా మార్కర్ పరికరం సహాయంతో ప్రధాన పొలంలో25X25 సెంటీమీటరు గురులు వేసుకోవాలి. ఆ తరువాత పెరిగిన వరి నారుని జాగ్రత్తగా మట్టితో సహా ముందుగా 25X25 సెంటీ మీటర్లు గురుతు వేసుకున్న గీతలలో నాటుకోవాలి.

ప్రధాన పొలం తయారీ : సాధారణ పద్దతిలో భూమిని తయారుచేసినట్లే శ్రీ వరి సాగు పద్దతిలో కూడా భూమిని తయారుచేసుకోవాల్సి ఉంటుంది. ఈ పద్ధతిలో కూడా పొలంను బాగా దమ్ము చేసి చదును చేయాలి. అ తరువాత చేతితో లాగే రోలర్ మార్క్ సహాయంతో 25X25 సెంటీమీటర్స్ దూరంలో నిలువుగా, అడ్డంగా గీతలు గీసుకోవాలి. నాలుగు గీతాలు కలిసినచోట వరి నారుని పైన పైన గుచ్చాలి. ఈ పద్దతిలో పొలం తడిగా మాత్రమే ఉండాలి కాని, నీరు నిలువ ఉంచకూడదు. ఒకవేళ నీరు నిలువ ఉన్నట్లయితే వెంటనే నీరు బయటకు వెళ్ళేందుకు గాను పొలంలో ప్రతి 2 మీటర్స్ దూరంలో ఒక చిన్న కాలువను ఏర్పాటుచేసుకోవాలి.

శ్రీ వరి సాగు పద్దతిలో పాటించవలసిన 6 ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు

  • లేత వేరు నాటడం: సాధారణంగా 8 నుంచి 12 రోజుల వయస్సు గల రెండు ఆకుల నారుని మాత్రమే నాటాలి. ఇలా చేసినట్లయితే మొక్కలు అధిక పిలకలతో, దళసరి వేర్లతో ఆరోగ్యంగా పెరుగుతాయి.
  • బజాగ్రత్తగా నాటడం: నారుమడి నుండి మొక్కను జాగ్రత్తగా వేరుచేసి, వేర్లు, బురద, గింజలు దెబ్బతినకుండా చూసుకోవాలి. ఇలా నారుమడి నుండి పీకిన మొక్కపిలకలను పైపైన నాటాలి తద్వారా మొక్క అధిక ఒత్తిడికి గురికాకుండా అధిక పిలకలతో త్వరగా పెరుగుతుంది.
  • దూరంగా నాటడం: మొక్కకి మొక్కకి, చాలుకి చాలుడి మధ్య 25 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు నాటాలి. భూసారం ఎక్కువగా ఉన్న పొలంలో ఇంకా ఎక్కువ ఎడంగా కూడా నాటుకోవచ్చు.
  • కలుపు నివారణ: శ్రీ వరి పద్దతిలో పొలంలో ఎక్కువ నీరు నిలవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటారు. అందువల్ల, నేల పొడిగా ఉంటుంది. నేల పొడిగా ఉండటం వల్ల కలుపు ఎక్కువగా పెరుగుతుంది, కలుపు నివారణకు కోనోవీడర్ సహాయంతో నాటిన 10 రోజులకు ఒకసారి, ఆ తరువాత 10 రోజుల వ్యవధిలో మరో అని మూడుసార్లు నేలను కదిలిస్తే కలుపు మొక్కలు నేలలో కలిసిపోతాయి. ఈ విధంగా కలియబెట్టడం వలన ప్రతిసారి సుమారు 1 టన్ను పచ్చిరొట్ట భూమికి చేరుతుంది. కోనో, రోటోవీడర్ వాడకం వలన వేరుకు బాగా ఆక్సిజన్ అందుతుంది. తద్వారా సూక్ష్మజీవులు సం అభివృద్ధి చెంది నత్రజనిని స్థిరీకరిస్తాయి.
  • నీటి యాజమాన్యం: నీటి యాజమాన్యం చాలా జాగ్రత్తగా చేపట్టాలి. పొలం తడిగా ఉండేటట్లు చూసుకోవాలి. కాని ఎక్కువ నీరు నిలువ ఉండే విధంగా చేయకూడదు. నీరు నిలువ ఉన్నట్లయితే నీటిని బయటకు వెళ్ళే విధంగా ప్రతి 2 మీటర్లకు ఒక కాలువ చేసుకోవాలి, మద్య మద్యలో పొలం ఆరిపోతే నీరు పెడుతూ ఉండాలి.
  • సేంద్రియ ఎరువుల వాడకం: సేంద్రియ ఎరువుల వాడకం పెంచి రసాయనిక ఎరువుల వాడకం తగించాలి. రసాయనిక ఎరువులు కూడా పైరుకి తొలిదశలో వాడుకోవచ్చు, కాని రసాయన ఎరువుల వాడకం తగ్గించడం మంచిది.

వరి సాగుపై మరిన్ని వివరాలకు మీ దగ్గరలోని వరి పరిశోధనా కేంద్రాలయిన మారుటేరు, రాగోల, నెల్లూరు, నంద్యాల, జగిత్యాల, రుద్రూరు, వరంగల్, బాపట్ల, రాజేంద్రనగర్లలో సంప్రదించగలరు.

2.99444444444
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు