పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

తెలంగాణకు యాసంగి పంటలు – యాజమాన్యం

తెలంగాణకు యాసంగి పంటలు – యాజమాన్యం గురించి తెలుసుకుందాం.

 • రాష్ట్రంలో ఈ సీజన్లో వరాలు దాదాపుగా అన్ని చోట్ల సమృద్ధిగా కురిసాయి. ఇంకా మంచి వరాలు కురిసే అవకాశం కూడా ఉంది. రానున్న రబీ కాలంలో ఈ పరిస్థితిని సద్వినియోగ పరుచుకొని పంటల ఎంపిక చేసుకొని, సరియైన యాజమాన్య చర్యలు చేపట్టి అత్యధిక దిగుబడులు సాదించటానికి ప్రసుత వాతావరణ పరిస్థితులు దోహదపడే అవకాశం ఉంది.
 • మన రాష్ట్రంలో 25 శాతం సాగు భూమిలో నల్లరేగడి భూములున్నాయి. వరాధారంగా ఈ భూముల్లో సాగు చేపట్టి రైతులందరూ రెండు పంటల సరళినిగాని లేదా రబీ ఏక పంట విధానాన్ని గాని అవలంభిస్తారు.
 • రైతులు వరాధార సాగు క్రింద నల్లరేగడి భూముల్లో కంది+విునువు/కంది+జొన్న/కంది+పెన ర/ కంది+కొర్రలు ఖరీఫ్లో సాగు చేయడం జరిగింది. ఈ రైతులందరూ కూడా అంతర పంటను కోసుకొని కంది వరుసల మధ్య అంతర కృషి స్వల్పకాలిక పంటలైన ఉలవ, సజ్ఞ మరియు ఇతర పశుగ్రాసాలను సాగు చేయవచ్చు.
 • ఉలవలను ముందస్తు రబీగా మరియు రబీకాలంలో సాగు చేసుకోవచ్చు. ఆగష్టు 15 నుంచి అక్టోబరు 15 వరకు వితుకోవచ్చు. నేల తేమను నిలుపుకునే స్వభావాన్ని మరియు ఆయా ప్రాంతాల్లో మొదటి పంటను దృష్టిలో ఉంచుకొని సకాలంలో విత్తిన మిగులు తేమను లేదా ఆలస్యంగా కురిసే వరాన్ని ఆధారంగా చేసుకొని మంచి పంట పండించవచ్చు. పిహెచ్జి-62, పి2యం-1 పిహెచ్జి-9 మరియు సిఆర్ హెచ్జి-19 వంటి 90-100 రోజుల్లో కోతకు వచ్చే రకాలను ఎకరాకు 8-10 కిలోలు వరుసల్లో విత్తిగాని లేదా 12-15 కిలోలు వెదజల్లే పద్ధతిలో విత్తి సాగు చేసుకోవాలి.
 • సజ పంటను సెపెంబరు నుంచి అకోబరు వరకు విత్తుకోవచ్చు. 65-70 రోజుల్లో కోతకువచ్చే హెచ్ హెచ్ బి-67, 80-85 రోజుల్లో కోతకువచ్చే పిహెచ్ బి-3, ఐసియం హెచ్--856 వంటి హైబ్రిడ్లను ఎంచుకొని సజ్జ పంటలో అధిక దిగుబడి సాధించవచ్చు. ఎకరాకు 1.5-2.0 కిలోల విత్తనాన్ని వరుసలలో విత్తటం చేయాలి. 6గ్రా. అప్రాన్ 35 ఎస్.డి/కిలో విత్తనానికి శుద్ధి చేసినటైతే పచ్చ కంకి వెర్రి తెగులును నివారించవచ్చు.
 • పశుగ్రాసాలైన గడ్డి జొన్న మొక్కజొన్న లను అక్టోబరునవంబరు వరకు విత్తుకోవచ్చు. అదే విధంగా మేతకు పనికి వచ్చే అలసందలను సెప్టెంబరు-జనవరి వరకు విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది. పప్పజాతి అయిన లూసర్స్ను అక్టోబరు-నవంబరు వరకు విత్తుకోవటానికి అనుకూలం.
 • కొన్ని ప్రాంతాల్లో నల్లరేగడి భూముల్లో ఖరీఫ్ సమయంలో బీడుగా ఉంచి రబీలో జొన్నగాని, శనగగాని, ధనియాలు, కుసుమలు మరియు వాము లాంటి పంటలను సాగు చేస్తున్నారు.
 • జొన్న పంట అనేది ఎక్కడైతే మెట్ట ప్రాంతాల్లో లేదా తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రదేశాల్లో వాతావరణం లోని మార్పులను తట్టుకొని కనీస దిగుబడినిచ్చే పంట. రబీలో అక్టోబరు చివరి లోపు విత్తుకుంటే పంట చివరి దశలో బెట్టకు గురికాకుండా కాపాడుకోవచ్చు. రబీలో సిఎస్వి-216ఆర్, సిఎస్వి14ఆర్, యం35-1, కిన్నెర వంటి రకాలను సిఎస్ హెచ్ 15ఆర్, సిఎస్ హెచ్ 16 వంటి హైబ్రిడ్లను ఎంచుకోవాలి. బరువు నేలల్లో హైబ్రిడ్లను ఎంచుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.
 • శనగ పంట పండించటానికి తేమను బాగా నిలుపుకునే మధ్యస్థ మరియు బరువైన నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. అక్టోబరు నుంచి నవంబరు 15 వరకు విత్తుకోవడానికి అనువైన సమయం. శనగ పంటలో దేశవాళీ రకాలైన జెజి-11. జెఎకెఐ-9218. క్రాంతి, జేజి-130, నంద్యాల శనగ-1 నంద్యాల శనగ-47 వంటి రకాలను ఎంచుకోవడం గాని లేదా కాబూలీ రకాలైన కెఎకె–2, పూలే. జి 95311, మరియు శ్వేత వంటి రకాలను ఎంచుకొని అధిక దిగుబడి సాదించవచ్చు. నంద్యాల–1 రకాన్ని యంత్రాల ద్వారా కోత చేపట్టవచ్చు.
 • ధనియాలు ఉత్తర తెలంగాణకు అనుకూలమైన పంట. ఈ పంటకు చల్లని వాతావరణంతో పాటు తక్కువ ఉష్ణోగ్రత, తగినంత మంచు కురవటం అనుకూలంగా ఉంటుంది. ఇది 90-110 రోజుల వ్యవధి గల పంట. అక్టోబరు 15 నుండి నవంబరు నెలాఖరు వరకు సాగుకు అనుకూలం. కొత్తిమీర కొరకు అయితే సంవత్సరం పొడవునా సాగు చేసుకోవచ్చు. సింధు, సాధన, స్వాతి, సుధ, ఎపిహెచ్య ధనియా - 1 రకాలు అనుకూలం. ఎకరాకు 6 కిలోల కంటే ఎక్కువ విత్తనం వాడరాదు. 30x10 సెం.మీ ఎడంతో విత్తుకోవాలి.
 • వరాలు అనుకూలంగా లేక ఖరీఫ్ పంటలు నష్ట పోయినప్పడు కుసుమ సాగు రైతుకు మంచి ప్రత్యామ్నాయం. అడవి పందుల సమస్య ఉన్న ప్రాంతాల్లో కుసుమ సాగుకు మొగ్గు చూపడం అనేది వ్యహాత్మక నిర్ణయం. కుసుమను అక్టోబరు 15 నుంచి నవంబరు 15 వరకు విత్తుకోవచ్చు. కొద్దిగా చౌడు ఉన్న భూముల్లో కుసుమును విజయవంతంగా పండించుకోవచ్చు. కుసుమను శనగ లేదా దనియాలతో 1:2 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేస్తే అధిక నికర ఆదాయం గడించవచ్చు.
 • వాము పంటలో కూడా ధనియూల లాగే చల్లని వాతావరణం మరియు వుంచు అనేది వంట పెరుగుదలకు దోహదపడుతుంది. ఇది 5 నెలల పంట. సెప్టెంబరు-అక్టోబరు వరకు విత్తుకోవచ్చు. లాం సెలక్షన్ -1 వంటి రకాన్ని ఎంచుకొని ఎకరాకు 1 కిలో విత్తనాన్ని 1 గ్రా. కార్చండిజమ్తో విత్తనశుద్ధి చేసుకొని 1:5 నిష్పత్తిలో ఇసుకతో కలిపి 60 సెం.మీ ఎడంలో 3-4 సెం.మీ లోతులో ఎద పెట్టుకోవాలి.

నీటి వసతి ఉన్నచోట తేలికపాటి నేలల్లో ఆరుతడి పంటలసాగు

 • తేలికపాటి నేలల్లో 2-3 తడుల అవకాశం ఉన్నప్పడు పెసర జొన్న, ఉలవలు మరియు బొబ్బెర్లను సాగు చేసుకోవచ్చు.
 • పెసరను అక్టోబరు చివరి వరకు విత్తుకోవచ్చు. పెసరలో ఎమ్జిజి-295, ఎమ్జిజి-347 (మధిర పెసర), ఎమ్జిజి-348 (భద్రాద్రి) ఎమ్జిజి-851 (శ్రీరామ), డబ్ల్యుజిజి-87 (ఏకశిల), డబ్ల్యుజిజి–42 (యాదాద్రి) టిఎమ్-96-2 వంటి రకాలు అనుకూలం. పల్లాకు తెగులును తట్టుకొనే రకాలను సాగు చేయాలి. పల్లాకు తెగులుకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి.
 • బొబ్బెర్న మరియు ఉలవలను అక్టోబరు వరకు విత్తుకోవచ్చు.
 • తేలికపాటి నేలల్లో 3-4 తడులతో రబీ కంది మరియు ఆముదం పంటలను ఎంపిక చేసుకోవచ్చు.
 • రబీ కంది ని అక్టోబరు 15 వరకు వితుకోవచ్చు. రబీలో డబ్యుఆర్జి-27, డబ్యుఆర్జి -65,58, టిడిఆర్జి -4, ఆర్జిటి -1. ఐసిపి పెూచ్-2740, ఎల్ఆర్జి -41 ఐసిపిఎల్-85063, పిఆర్జి-158, ఎమ్ఆర్జి-1004 వంటి రకాలను దగ్గర దగ్గరగా సాలుకు సాలుకు మధ్య 45-60 సెం.మీ, మొక్కకు మొక్కకు 10 సెం.మీ ఎడంతో ఎకరానికి 6-8 కిలోల విత్తనం విత్తుకోవాలి.
 • ఆముదం పంటను అక్టోబరు 2යිර పక్షంలోపు విత్తుకున్నటైతే అధిక దిగుబడులు సాధించవచ్చు. ప్రగతి, హరిత, డిసిఎస్-107, జ్వాల వంటి సూటి రకాలను మరియు పిసి హెచ్-111, డిసి హెచ్-177 వంటి హైబ్రిడ్లను ఎంచుకోవచ్చు.
 • తేలికపాటి నేలల్లో 6-8 తడులతో వేరుశనగ మరియు మొక్కజొన్నలను రబీలో సాగు చేసుకోవచ్చు. వేరుశనగను ఉత్తర తెలంగాణలో అక్టోబరు చివరి వరకు, దక్షిణ తెలంగాణలో నవంబరు చివరి వారం వరకు విత్తుకోవచ్చు. మొక్కజొన్నను అక్టోబరు నుండి నవంబరు వరకు విత్తుకోవచ్చు.

జలాశయాలు మరియు బోర్ల క్రింద వరి-వరికి బదులుగా ఆరుతడి పంటల సాగు

ఆయకట్టు ప్రాజెక్టుల క్రింద వరి-వరి సాగు చేయడం ఆనవాయితీ. ఆయకట్టు క్రింద నీటి ముంపు గురికాని ఎతైన ప్రాంతాల్లో ఖరీఫ్ వరి కోత తర్వాత రబీలో ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల రైతుకు లాభదాయకంగా ఉండటమే గాక నేల భౌతిక లక్షణాలు మెరుగవుతాయి. అదే విధంగా తెలంగాణలో 75% సాగు భూగర్భ జలాలపైన అనగా బోర్లు, బోరు బావులు ద్వారా జరుగుతుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే బోర్ల క్రింద కూడా వరి-వరి సాగు చేపట్టడం వల్ల నీటి వినియోగంతో పాటు విద్యుత్ వినియోగం పెరిగి రబీలో పంట చివరి దశలో ఎండి పోవటం గత కొన్ని సంవత్సరాలుగా పరిపాటిగా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రబీలో వరికి బదులుగా ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల అధిక విస్తీర్ణంలో పంటలను పండించుకోవటమే గాక ఎక్కువ లాభాన్ని ఆర్జించవచ్చు.

 • ఒక ఎకరం వరి పండించే నీటితో (600 మి.మీ) దాదాపు 2-3 ఎకరాల మొక్కజొన్న వేరుశనగ, ఆవాలు మరియు కూరగాయ పంటలైన వంగ, బెండ, ఉల్లి, టమాటో పండించవచ్చు. అదే విధంగా 1 ఎకరం వరికి బదులుగా అదే నీటితో 2-3 ఎకరాల రబీ ఆముదం, రబీ కంది మరియు 4-5 ఎకరాల ఆలసందలను, పప్పధాన్యాలైన పెసర, మినుము మరియు శనగలను పండించవచ్చు.

వరి కోత తర్వాత ఆరుతడి పైర్ల సాగు

 • పప్పధాన్యాలైన పెసర, మినుములను వరి కోతకు ముందు తగిన తేమలో వెదజల్లి సాగు చేయడం పరి పాటి.
 • అదే విధంగా వరి కోత తర్వాత దుక్కి దున్నకుండా (జీరోటిల్లేజి) తగిన పదునులో మొక్కజొన్న ఆముదం, శనగ పంటలను కూడా విత్తి సాగు చేయవచ్చు.
 • దుక్కి దున్న కుండా సాగు చేసినప్పడు వరి కొయ్యకాలు మీద చిగురించే పిలకలను, అప్పటికే ఉన్న కలుపు మొక్కలను మరియు మొలకెత్త బోయె కలుపును నివారించుటకు పారాక్వాట్ 5.మి.లీలీటరు నీటితో పాటు అట్రజిన్ 4-5 గ్రా|/లీటరు నీటికి (మొక్కజొన్న)/ పెండిమిథాలిన్ 5-6 మి.లీలీటరు నీటికి (ఆముదం, శనగ) కలిపి విత్తిన 48 గంటల లోపు పిచికారి చేయాలి.
 • వేరుశనగ, ఆవాలు, నువ్వుల పంటసాగుకు దుక్కి తయారు చేసుకోవాలి. దుక్కి తయారీపై ప్రత్యేక శ్రద్ద పెట్టడం వలన మొలక శాతం బాగా ఉండి మొక్కల సాంద్రత సరిగా ఉండి మంచి దిగుబడి సాధించవచ్చు.

వేరుశనగ

 • కదిరి -6, కదిరి -9, అనంత, హరితాంద్ర, ఐసిజిఎస్-911:14, ధరణి, టిఎజి-24 వంటి గుత్తి రకాలను కదిరి-7, కదిరి-8 వంటి వర్జీనియా రకాలను ఎంపిక చేసుకోవాలి.
 • ఎక్కువ బంకమన్ను నల్లరేగడి నేలలు సాగుకు పనికి రావు.
 • పురుగులు మరియు తెగుళ్ళ నివారణకు విధిగా కీటక మరియు శిలీంధ్ర నాశినితో విత్తనశుద్ధి చేయాలి.
 • వరి మాగాణుల్లో లేదా క్రొత్తగా సాగు చేపట్టే ప్రాంతాల్లో 200 గ్రా. రైజోబియం కల్చరుతో విత్తనశుద్ధి చేయాలి.
 • వేరుకుళ్ళు, మొదలుకుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళ నివారణకు కిలో విత్తనానికి 10 గ్రా, టైకోడెర్మా విరిడిని పట్టించినటైతే మంచి ఫలితం ఉంటుంది.
 • రబీలో నీటి పారుదల క్రింద 22.5 సెం.మీX 10 సెం.మీ దూరంలో 80 కిలోల విత్తనాలను విత్తుకోవాలి. మొక్కల సాంద్రత 1 చదరపు మీటరకు 44 మొక్కలు ఉండేటట్లు చూసుకోవాలి. సీడ్డ్రిల్ సహాయంతో విత్తుకుంటే సాగు ఖర్చు తగ్గించవచ్చు.
 • భాస్వరం ఎరువును ఎస్ఎస్పి రూపంలో ఎకరాకు 100 కిలోలు విత్తే సమయంలో వేయాలి. 200 కిలోల జిప్పమ్ను ఎకరాకు ఊడలు దిగే సమయంలో మొదళ్ళ దగ్గర వేసి మట్టిని ఎగదోయాలి.
 • విత్తిన 45 రోజుల తర్వాత ఎటువంటి అంతర సేద్యం చేయరాదు.
 • పంట విత్తిన 20 రోజుల తర్వాత వెడల్పాకు మరియు గడ్డిజాతి కలుపు నివారణకు ఇమాజితాపైర్ 10% ఎకరాకు 300 మి.లీ లేదా ఇమాజమాక్స్ 35%+ఇమాజితాపైర్ 35% డబ్ల్యుజి కలుపు మందును 40 గ్రా. ఎకరాకు 200 లీ|| నీటిలో కలిపి పిచికారి చేయవలెను.
 • పైరులో ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ నీటి ఎద్దడికి సున్నిత దశలు కాబట్టి ఈ దశలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. నీటిని తుంపర్ల ద్వారా ఇచ్చినటైతే దాదాపు 25% నీరు ఆదాఅయి అధిక దిగుబడి మరియు నాణ్యమైన కాయలు తీసుకోవచ్చు.
 • వేరుశనగ మొక్కల్లోని 75% కాయలు పూర్తిగా పక్వానికి వచ్చినప్పడే కోయాలి.

నువ్వులు

 • వరికోసిన తర్వాత జనవరి 15 నుండి ఫిబ్రవరి 15 లోపు వితుకోవచ్చు. శ్వేత, హిను, రాజేశ్వరి, చందన, ఎలమంచిలి వంటి రకాలు సాగుకు అనుకూలం.
 • ఎకరాకు 2.5 కిలోల విత్తనానికి మూడింతల ఇసుక కలిపి గొర్రుతో 30 సెం.మీ X 15 సెం.మీ ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి.
 • విత్తిన వెంటనే పలుచని తడి ఇవ్వాలి. పూత, కాయ అభివృద్ధి మరియు గింజ కట్టు దశల్లో తడులు ఇవ్వాలి.
 • కోడు ఈగ నివారణకు మొగ్గ దశలో మోనోక్రోటోఫాస్ 1.6 మి.లీ లేదా ఎసిఫేట్ 75 ఎస్పి 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • పూత సమయంలో ఆశించే వెర్రి తెగులు సోకినప్పడు తెగులు సోకిన మొక్కలను పీకి తగుల బెట్టాలి. పైరుపై మిధైల్ డెమటాన్ 2 మి.లీ. లేదా డైమిధోయేట్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రబీ కంది

 • విత్తనాలకు ధైరమ్ లేదా కాప్లాన్ 1 కిలో విత్తనానికి 3 గ్రా, చొప్పన పట్టించాలి. తర్వాత విత్తుకొనే ముందు 200-400 గ్రా.ల రైజోబియంను ఎకరా విత్తనానికి కలిపి విత్తుకోవాలి.లభ్యం కాని భాస్వరంను మొక్కకు అందుబాటులోకి తెచ్చేందుకు ఎకరాకు 2 కిలోల ఫాస్పో బ్యాక్టీరియాను 200 కిలోల సేంద్రియ ఎరువుతో కలిపి దుక్కిలో గాని, విత్తన సాళ్ళలో పడేటట్లు చల్లుకోవాలి.
 • ఎండు తెగులు సంక్రమించే ప్రాంతాల్లో విధిగా టైకోడెర్మా విరిడి ప్రతి కిలో విత్తనానికి 8 గ్రాIలు పట్టించి విత్తాలి.
 • ఎత్తైన బోదె కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. మొగ్గ దశకు ముందు, కాయలు ఏర్పడే దశలో తప్పక నీరు ఇవ్వాలి.
 • బెట్ట పరిస్థితుల్లో 20 గ్రా. యూరియా లేదా 10 గ్రా, మల్టి-కె లీటరు నీటికి కలిపి పిచికారి చేసినటైతే పూతకోత రాలకుండా కాపాడవచ్చు. ಬಿಟ್ಟು నుండి కొంత ఉపశమనం పొందవచ్చు.
 • కీలక దశల్లో డ్రిప్ లేదా బోదెల ద్వారా నీరు అందించినచో అధిక దిగుబడులు తీసుకోవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు.
 • విత్తడం నుంచి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగును.

పెసర, మినుము

 • విత్తనాన్ని కీటక మరియు శిలీంధ్ర నాశినలతో విత్తనశు ద్ధి చేయడం వల్ల రసం పీల్చు పురుగుల బారి నుండి తెగుళ్ళ నుండి రక్షణ పొందవచ్చు. తదుపరి రైజోబియం కల్చరుతో విత్తన శుద్ధి చేసుకోవాలి.
 • ఖరీఫ్ వరి కోసిన తర్వాత ఎకరాకు 12-14 కిలోల విత్తనం వాడాలి.
 • పూత మరియు కాయ తయారయ్యే దశలో పంట బెట్టకు గురి కాకుండా చూసుకోవాలి. బెట్ట పరిస్థితుల్లో 2 శాతం యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2-3 సార్లు పిచికారి చేయాలి.
 • రసం పీల్చే పురుగులైన తామర పురుగు, తెల్ల దోమ మరియు పేనుబంకలను సకాలంలో ఆదుపు చేయాలి.
 • సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టి శనగ పచ్చ పురుగును మరియు మారుకా మచ్చల పరుగును నివారించవలెను.

ఆవాలు

 • ఉత్తర తెలంగాణలో రైతులు ఆసక్తి చూపుతున్న పంట. తక్కువ నీటి వనరులు, సులభ యూజమాన్యం మరియు నిలకడైన ధర వలన రబీలో ఈ పంట లాభదాయకమైనదిగా చెప్పవచ్చు.
 • అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు వితు కోవచ్చును.
 • బరువైన నేలలో వండిస్తే వుంచి దిగుబడులు సాధించవచ్చు. ఎకరానికి 2.0-2.5 కిలోల విత్తనానికి 5 కిలోల ఇసుక కలిపి గొర్రు సహాయంతో 45X15-20 సెం.మీ ఎడం ఉండేటట్లు విత్తుకోవాలి.
 • పూసా అగ్రాని, వరుణ, పూస మహాక్, నరేంద్ర అగేతి వంటి రకాలను ఎంపిక చేసుకోవాలి.
 • 3-4 తడులతో మంచి దిగుబడులు తీసుకోవచ్చు. కొమ్మ ఏర్పడేదశ, పూత దశ, కాయ ఏర్పడే దశలు కీలకం
 • శనగ : ఆవాలు 5:1 లేదా 3:1 నిష్పత్తిలో అంతర పంటగా సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుంది.
3.00262812089
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు