పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

అటవీ వ్యవసాయం

ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం.

మంచి సమతుల్య వాతావరణం అంటే భూమి మీద అటవీ విస్తీర్ణం 33 శాతం ఉండాలి. కాని దురదృష్టవశాత్తు ప్రస్తుతం మన దేశంలో సుమారు 21 శాతం మాత్రమే ఉంది. దీని వలన అనేక అనార్ధాలను చూస్తున్నాము. దీని ప్రభావము వర్షాల మీద పడుతుంది. అటవీ శాతము తగ్గడానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా పెరుగుతున్న జనాభా వలన గ్రామాలు, పట్టణాలు, మహానగరాలు విస్తరించడంతో చెట్లను నరుకుతున్నారు. దీని వలన అటవి విస్తిరణం తగ్గడం ఒక ప్రధాన కారణం.

మారుతున్న వాతావరణ ప్రభావము అన్ని సిజనులలో కనబడుతుంది. ఇలాంటి పరిస్ధితులలో వీటిని అధిగమించాలంటే ఆగ్రోఫారెస్ట్రి అంటే చెట్ల మధ్య వ్యవసాయం చేయడము చాలా శ్రేయస్కరం. ఈ పద్ధతిలో తప్పనిసరిగా చెట్లను పెంచడముతో పాటు వీటి మధ్య ఖాళీ స్ధలములో పైర్లు వేసుకొని, వాటితో పాటు పశువులను పెంచుకోవచ్చు అంటే మూడింటిని అనుసంధానము (చెట్లు+పైర్లు+పశుసంపద) చేయడము వలన వాటి నుండి సుస్ధిర ఆదాయము పొందవచ్చు. చెట్లు గడ్డు పరిస్ధితులను, బెట్టను బాగా తట్టుకోగలవు. ఎట్టి పరిస్ధితులలో, బెట్టను బాగా తట్టుకోగలవు. ఎట్టి పరిస్ధితులలో అవి చనిపోవు. చెట్ల నుండి కలప, కలప గుజ్జు, టింబర్, వంటి చెఱకు, పండ్లు, పశుగ్రాసం లభిస్తుంది. ప్రస్తుతం టింబర్ కు చలా డిమాండ్ ఉంది. చెట్ల పెంపకం వలన ఆయా ప్రాంతాలలో వాతావరణం మెరుగవుతుంది. జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవచ్చు.

ఆగ్రోఫారెస్ట్రి విధానంలో మనకున్న వనరులను బట్టి మూడు సిజనల్లో పంటలను వేసుకోవచ్చు. లేత వయస్సులో 3-4 సంవత్సరాల వరకు కొద్ది నీటి వసతి ఉంటె రబీ మరియు వేసవి కాలంలో కూడా తక్కువ కాల పరిమితి గల పంటలను సాగుచేసి ఆదాయం పొందవచ్చు. ఆగ్రోఫారెస్ట్రి సాగు చేసే చెట్ల ఎంపికలో కలప గుజ్జు, టింబర్, జీవన ఇంధనం, పండ్లు, వంటచెఱకు మరియు పశుగ్రాసమునకు సంబంధించినవి ముఖ్యమైనవి. చెట్ల మధ్య పైర్లలో ఆహార ధాన్యాలు, నునేగింజలు, చిరు ధాన్యాలు, పశుగ్రసాలు, కూరగాయలు, పూలమొక్కలు మొదలగు వాటిని సాగుచేసి ఆదాయము పొందవచ్చును. ఎలాంటి జాతి చెట్లనైన పైరు పంటలనైన ఎంపిక చేసుకొనే దానికి వెసులు బాటు ఉంటుంది. ఆగ్రోఫారెస్ట్రి వలన వివిధ రకాల లాభాలుంటాయి.

  • ముఖ్యంగా మారుతున్న వాతావరణ పరిస్దితులకు అనుకూలం. ఎలాంటి గడ్డు, బెట్ట పరిస్ధితులలోనైన ఆగ్రోఫారెస్ట్రి విధానము పాటించవచ్చు. ఒకవేళ పైరు పంటల వలన దిగుబడులు తగ్గి నష్టం వాటిల్లినా ఆ నష్టాన్ని ముందు సంవత్సరాలలో చెట్ల నుండి కలప, టింబర్, వంట చెఱకు, పండ్లు, పశుగ్రసాల ద్వారా నష్టాన్ని పురించుకోవచ్చు. వివిధ రకాల అటవీ చెట్ల జాతులు వివిధ పరిస్ధితులను తట్టుకుంటాయి. కాబట్టి చాలా రకాల భూముల్లో చెట్లను పెంచవచ్చును.
  • ఉదా: చౌడు నెలల్లో, రాతి, ఎటావాలుగా, లోతు తక్కువ కలిగినవి ఎగుడు దిగుడు భూముల్లో, మురుగు నెలల్లో వివిధ జాతుల చెట్లను ఎంపిక చేసుకోవచ్చు. ఎంత లేదన్న ఎంతో కొంత రాబడి వస్తుంది. పెట్టబడులు తక్కువ అలాగే సమస్యలు కూడా తక్కువ అదే ఒకే రకమైన పైర్లలో పెట్టుబడులతో పాటు సమస్యలు కూడా ఎక్కువ. దాని వలన రైతులు నష్టలకులోనై ఆర్ధికంగా క్రుంగిపోతున్నారు.

  • ముఖ్యంగా సన్న, చిన్న కారు, బడుగు రైతులకు ఉపయోగం. వర్షాధార రైతులకు చాలా మంచిది. నీటి వనరులు లేకున్నా, తక్కువగా ఉన్నా చెట్లను పెంచవచ్చును. ఈ విధానంలో చెట్లను వర్షాకాలంలో నాటుకోవాలి. వర్షాకాలపు నీటితో మొక్కలు బ్రతికి ఏపుగా పెరుగుతాయి. ఎ మధ్య కాలంలో పెద్ద రైతులు, ఆర్ధికంగా బలంగా ఉన్న రైతులు వందల ఎకరాలలో “బ్లాక్” ప్లాంటేషన్ (సోలో చెట్లు) అంటే యుకలిప్టస్ (జామాయిల్), సుబాబుల్, సరుగుడు, టేకు, మలబారు వేప అనే జాతి చెట్లను పెంచుతున్నారు. వీటి నుండి వచ్చే కలప గుజ్జు “ప్లైఉడ్” మరియు టింబర్ పరిశ్రమలకు ముడి పదార్ధలుగా ఉపయోగ పడుతున్నాయి.
  • నేల భూసారము మరియు ఉత్పాదక శక్తిని ఎక్కువ చేయవచ్చు. చెట్ల నుండి రాలిన ఆకులు నేలలో కలవడం వలన సేంద్రియ పదార్దం ఎక్కువ అవ్వడము, నేలకోత తగ్గడము, గుల్ల బారడము, నీటిని పిల్చుకొనే శక్తి ఎక్కువ అవ్వడము జరుగుతుంది. వానాకాలంలో పడిన నీరు వృధా కాకుండా భూమిలోనే ఇంకుతుంది.
  • వాతావరణ కాలుష్యము తగ్గి, పర్యావరణము మెరుగవుతుంది.
  • చెట్లు పెంచడం వలన కర్బన స్దిరీకరణ పెరుగుతుంది. తద్వారా ప్రమాదకరమైన గ్రీన్ హౌస్ వాయువుల పరిమాణాన్ని తగ్గించవచ్చు.
  • నేరుగా చిన్న పెద్ద పరిశ్రమలను ప్రోత్సహించవచ్చు. తద్వారా గ్రామిణ, ఉద్యోగ మరియు ఉపాధిని పెంచవచ్చు. పట్టణాల వలసలను తగ్గించవచ్చును.
  • జీవ వైవిధ్యాన్ని పరిరక్షించవచ్చు. ఈ విధానంలో వనరుల పరిస్దితులను బట్టి ఎలాంటి రకాల చెట్లనైన పైర్లనైనా సాగు చేయవచ్చు కనుక అరుదైన అంతరించి పోతున్న చెట్లను, పాతరకాల విత్తనాలను సంరక్షించవచ్చు. తద్వారా ప్రకృతిలో పశు పక్షి జాతులను కాపాడవచ్చు. ఇన్ని లాభాలు సాధారణ వ్యవసాయంలో సాధ్యపడవు. కాని చెట్ల మధ్య వ్యవసాయం (ఆగ్రోఫారెస్ట్రి) ద్వారా విలు అవుతుంది.

ఆగ్రోఫారెస్ట్రి వివిధ పద్ధతులు

అగ్రి - సిల్వి కల్చర్ పధ్ధతి (న్యూట్రిషనల్ ఆగ్రోఫారెస్ట్రి)

కలప (టింబర్), కలప గుజ్జు (పేపర్ పల్ప్) అటవీ చెట్ల మధ్య ఆహార పంటలు, కూరగాయలు, చిరుధాన్యాలు పండించవచ్చు. ఉదా : యుకలిప్టన్ / సుబాబుల్ / సరుగుడు / టేకు+జొన్న / రాగి / కూరగాయలు అపరాలు.

బయోడిజిల్ (జీవన ఇంధన) అగ్రోఫారెస్ట్రి

ఈ పద్ధతిలో కానుగ, వేప, సిమరుబా వంటి గింజలు / విత్తనాల నుండి నూనె తీయవచ్చును. నూనె శాతము సుమారు 30-50 వరకు ఉటుంది. ఈ నునేను జీవ ఇంధనముగా (బయోదిజిలి) ఉపయోగించవచ్చు. ప్రొఫేసోర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి ఆగ్రోఫారెస్ట్రి విభాగాలు జరిపిన పరిశోధనల్లో కానుగ చెట్ల మధ్య వర్షాధార జొన్న/సజ్జ/రాగి/ఆముదం ఖరిఫ్ కాలంలో సాగుచేయడం వలన వితనం, చొప్ప దిగుబడులు బాగా వచ్చినట్లు తేలింది. అంతే కాకుండా నేలలో సేంద్రియ కర్బనం నత్రజని ఎక్కవుగా లభ్యమవడం వలన నేల భూసారము బాగుంటుందని బుజువయ్యింది. చిరుధాన్యాలు ఎంపిక చేయడం వలన విత్తనంతో పాటు అదనముగా పశువులకు చొప్ప కూడా లభ్యమవుతుంది. వీటి వలన సరిమైన నీటి వినియోగ ఎరువుల వాడకము మరియు సస్యరక్షణ సమస్యలు తక్కువ.

అగ్రి హార్టికల్చర్ పద్ధతి

ఉదా : చింత/మామిడి/జామ/సీతాఫలం+అపరాలు/జొన్న/జనుము/కూరగాయలు/గోరు చిక్కుడు. సాలీనా వర్షపాతం తక్కువ లేదా అతి తక్కువ ప్రాంతమైన (500-750 మి.మీ.) దక్షిణ తెలంగాణ చింత చెట్ల సాగుకు అనుకూలం. చింత అట్లు త్వరగా పెరిగి దిగుబడులు ఎక్కవుగా ఉంటాయి. చింత చెట్ల ఎడమ 30 x 30 అడుగులు ఉండాలి. మొదటి 5-6 సంవత్సరాల వరకు వర్శధరమైన కంది, జొన్న, అలసంద, గోరుచిక్కుడు, ఉలవ పైర్లు వేసుకోవచ్చు. తర్వాత చెట్లు పెరిగే కొద్ది నీడా రావడం వలన ఉన్న స్ధలములో ఈ పద్ధతిలో నే కొద్దిగా మార్పు చేసుకొని చింత మధ్య గోరింటాకు మొక్కలు ఒక వరుస లేదా రెండు వరుసలు నాటుకొని వాటి నుండి కూడా ఆదాయం పొందవచ్చునని ఆగ్రోఫారెస్ట్రి విభాగ పరిశోధనల్లో తేలింది.

హార్టి ఫాస్చరాల్ పద్ధతి

ఉదా : జామ/ మామిడి / సీతాఫలం / చింత+జొన్న /స్టైలో హేమాట /ఉలవలు /అలసంద/ గినీ గడ్డి/ మొక్కజొన్న /సజ్జ లాంటి పశుగ్రసాలు.

సిల్వి పాస్చరల్ పధ్ధతి

ఉదా : మిలియా దూబియా (మలబారు వేప) / టేకు / యుకలిప్టన్ / నల్లతుమ్మ + కానుగ + జొన్న / మొక్కజొన్న/ నేపియర్ బాజ్రా / ఏక వార్షిక లేదా బహు వార్షక పశుగ్రసాలు.

సిల్వి మొడిసినల్ పధ్ధతి (మెడిసినల్ ఆగ్రోఫారెస్ట్రి)

ఈ పద్ధతిలో ఔషధ సంబంధమైన చెట్లను సాగుచేసి వాటి మధ్యలో స్వల్ప కాలిక ఔషధ / హెర్బల్ మొక్కలను పెంచవచ్చు. ఉదా : కరక్కాయ / తానికాయ /మారేడు / ఉసరి / నేరేడు + నేలవము / అస్వగంధ / తులసి / గోరింటాకు / అలోవేరా మొదలగునవి.

వెదురు చెట్ల మధ్య వ్యవసాయం (బాంబూ ఆధారమైన అగ్రోఫారేస్ట్రి)

ఈ పద్ధతిలో వివిధ రకాలైన వెదురు మొక్కల మధ్య చిరుధాన్యాలు / ఆముదం / అపరాలు / ఏకవార్షిక / వర్షాధారిత పశుగ్రసాలైన జొన్న / మొక్కజొన్న / సజ్జ. అటవీ చెట్ల జాతుల్లో వెదురుకు చాలా ప్రాంధాన్యం ఉంది. వీటికి త్వరగా పెరిగే గుణం ఉంది. వీటిలో కూడా అధిక దిగుబడి నిచ్చే క్లోనల్ రకాలు (భీమా రకము) మార్కెట్లో లభిస్తున్నాయి.

“బ్లాక్” ప్లాంటేషన్స్ (ఇండస్ట్రి అగ్రోఫారెస్ట్రి)

ఈ పద్ధతిలో ఒక రకమైన, ఒకే జాతీయైన అటవీ చెట్లను (టేకు/మద్ది/మలబారు వేప/యూకలిప్టస్/సుబాబుల్/సరుగుడు/శ్రీ గంధం/ఎర్రచందనం) ఎక్కవ విస్తీర్ణంలో సాగు చేయడం. వీటి నుండి వచ్చే కలప, టింబర్, కలప గుజ్జు, ప్లై ఉడ్, ఉడ్ మరియు కాగితపు పరిశ్రమలకు ముడి పదార్ధాలుగా వినియోగించవచ్చు.

చేను చుట్టూ వివిధ జాతుల అటవీ చెట్లను పెంచడం (బార్డర్ / బౌండరి ఆగ్రోఫారెస్ట్రి)

చేను గట్ల మీద, పొలం గట్ల మీద చుట్టూ టేకు / కానుగ / వేప / యుకలిప్టస్ / మలబారు వేప / సరుగుడు / చింత / కొబ్బరి నటుకొంటే దీర్ఘకాలంలో వాటి నుండి ఆదాయం పొందవచ్చు.

అందుచేత మారుతున్న వాతావరణ పరిస్ధితులకు వ్యవసాయం ఒక్కటే చేయడం, దాని మీదే ఆధారమపడటం ఈ రోజుల్లో అంత శ్రేయస్కరం కాదు. దీనిని అధిగమించడానికి చెట్ల మధ్య వ్యవసాయంతో పాటు పశువులను కూడా పెంచి అన్నింటిని అనుసంధానము చేసి అగ్రోఫారేస్ట్రి పద్ధతుల ద్వారా రైతు సోదరులు స్ధిరమైన ఆదాయం పొందవచ్చు.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.00352526439
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు