పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ఉద్యాన పంటలలో కలుపు నివారణ

కలుపు నివారణ చర్యలు

సొర, బీర, కాకర, గుమ్మడి, దోస

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు):

 • పెండిమిధాలిన్ 30% ఇసి లేదా అలాక్లోర్ 50% ఇసి అనే మందును 1 – 1.25 లీ. విత్తిన రెండు రోజులలోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసుకోవాలి.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి 400 మి.లీ. (లేదా) క్విజాలోపాఫ్ 10% ఇసి 150-175 మి.లీ. (లేదా) ప్రోపిక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు)

క్యారెట్

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు):

 • పెండిమిధాలిన్ 30% ఇసి లేదా అలాక్లోర్ 50% ఇసి ఎకరాకు లీటరు మందును విత్తిన 24-48 గం. లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్యన ఒకసారి అంతరకృషి చేసుకోవాలి.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • మెట్రిబ్యూజిన్ 70% జబ్ల్యూపి అనే మందును 300 గ్రా. ఎకరాకు విత్తిన 15-20 రోజులకు పిచికారి వేసుకోవాలి.

ముల్లంగి

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • అలాక్లోర్ 50% ఇ.సి. 1 – 1.25 లీ. విత్తిన రెండు రోజులలపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవలెను.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి 150-175 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు)

ఉల్లి / వెల్లుల్లి

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • ఆక్సిఫ్లోప్ఫెన్ 23.5% ఇసి, 250-300 మి.లీ. ఎకరాకు (లేదా) పెండిమిధాలిన్ 30% ఇసి (లేదా) అలాక్లోర్ 50% ఇసి 1 – 1.25 లీ. ఎకరాకు నాటిన పెండు రొజుల లోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాస్ ఇధైల్ 50% ఇసి 400 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి 250 మి.లీ. 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15-20 రోజులలోపు పిచికారి చేయడం వల్ల గడ్డిజాతి, వెడల్పాకు కలుపును నివారించవచ్చు.

టమాట

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు):

 • పెండిమిథాలిన్ 30% ఇ.సి. (లేదా) అలాక్లోర్ 50% ఇ.సి. ఎకరాకు ఒక లీ. మందును విత్తిన / నాటిన రెండు రోజులలోపు తేమ గల నేలపై పిచికారి చేసుకోవాలి. 20-25 రోజుల మధ్య ఒకసారి అంతరకృషి చేసుకోవాలి.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • మెట్రిబ్యూజిన్ 70% జబ్ల్యూ.పి అనే మందును 300 గ్రా./ఎకరానికి (లేదా) క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇ.సి. 400 మి.లీ. లేదా ప్రోపాక్విజాఫాప్ 10% ఇ.సి. 250 మి.లీ. 200 లీ. నీటిలో కలిపి ఎకరానికి నాటిన 15-20 రోజులలో పిచికారి చేయడం వల్ల గడ్డి జాతి కలుపును నివారించవచ్చు.
 • పొగాకు మల్లెను నియంత్రించడానికి 80 కిలోల వేపపిండిని దుక్కిలో వేసుకొని టమాట నారు నాటుకున్న 3 రోజుల తరువాత పెండిమిధాలిన్ 30% ఇసి, ఒక లీటరు (లేదా) మెట్రిబ్యూజిన్ 70% డబ్ల్యూ.పి 300 గ్రా. ఒక ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పిచికారి చేసినట్లయితే మల్లె తీవ్రత చాలా వరకు తగ్గిపోతుంది.

బెండ

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • పెండిమిధాలిన్ 30% ఇసి, విత్తిన రెండు రోజులలోపు ఎకరాకు 1.25 లీ. తేమ గల నేలపై పిచికారి చేయవలెను.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి, 150-170 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డి జాతి కలుపు నివారణకు).

క్యాబేజి

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • పెండిమిధాలిన్ 30% ఇసి, ఎకరాకు 1 – 1.25 లీ. (లేదా) ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5 ఇసి, ఎకరాకు 200 మి.లీ. నాటే రెండు రోజుల ముందు పిచికారి చేయవలెను.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాస్ ఇధైల్ 5% సి, 400 మి.లీ. (లేదా) క్వినాలోఫాప్ 10% ఇసి 150 – 175 మి.లీ. (లేదా) ప్రోపాక్విజాఫాప్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు).

కాలీఫ్లవర్

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5% ఇసి, అనే కలుపు మందును నాటుటకు 1-2 రోజుల మందు ఎకరాకు 200 మి.లీ. కలిపి పిచికారి చేయవలెను, (లేదా) పెండిమిథాలిన్ 30% ఇసి, ఎకరాకు 1.2 లీ. పిచికారి చేయాలి.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోపాఫ్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోపాళఫ్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రోరాక్సిజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు).

బీట్రూట్

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • అలాత్లోర్ 50% ఇసి, ఒక ఎకరాకు 800 మి.లీ. చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పంట విత్తిన రెండు రోజుల లోపు పిచికారి చేసి 20 రోజుల తత్వాత అంతరకృషి తేసినట్లయితే సరిపోతుంది.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాప్ 10% ఇసి 150 – 175 మి.లీ. (లేదా) ప్రొరాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు).

ఆలుగడ్డ

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • మెట్రిబ్యూజిన్ 70% డబ్య్లూ.పి 400 గ్రా. నాటిన 1-6 రోజుల మధ్య పిచికారి చేయవలెను.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాప్ ఇధైల్ 5% సి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాస్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రొపాక్విజాఫాస్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు).

ధనియాలు, మెంతులు

ప్రీ ఎమర్జెన్స్ (విత్తిన వెంటనే వాడదగిన కలుపు మందులు) :

 • పెండిమిథాలీన్ 30% ఇ.సి. అనే కలుపు మందును ఎకరాకు 1 లీ. విత్తిన వెంటనే (24 గం. ) లోపల పిచికారి చేయవలెను.

పోస్ట్ ఎమర్జెన్స్ (పైరు మరియు కలుపు మొలక్కెత్తిన తరువాత):

 • క్విజాలోఫాస్ ఇధైల్ 5% ఇసి, 400 మి.లీ. (లేదా) క్విజాలోఫాప్ 10% ఇసి, 150 – 175 మి.లీ. (లేదా) ప్రోపాక్విజాపాఫ్ 10% ఇసి, 250 మి.లీ. ఎకరానికి 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. (గడ్డిజాతి కలుపు నివారణకు).

వాము

 • పెండిమిథాలిన్ 30% ఇసి, ఒకలీటరు లేదా ఆక్సీఫ్లోర్ఫెన్ 23.5% ఇసి. 200 మి.లీ. పంట విత్తిన రెండు రోజులలోపు ఎకరా పొలంలో సమానంగా పిచికారి చేయాలి. తర్వాత 20 రోజుల సమయంలో గడ్డిజాతి కలుపు ఉన్నట్లయితే కూలీలతో ఏరి వేయించాలి. (లేదా) క్విజాలోఫాప్ ఇధైల్ 5% ఇ.సి. 400 మి.లీ. ఒక ఎకరాకు పిచికారి చేయాలి.

ఆస్టర్ పూల పంట

 • పెండిమిథాలిన్ 30% ఇసి, ఒక లీటరు (లేదా) అలాక్లోర్ 50% ఇసి, 600 మి.లీ. ఎకరాకు 200 లీ. నీటిలో కలిపి పంట విత్తిన రెండు రోజుల లోపు పిచికారి చేసుకోవాలి. తర్వాత 20 రోజులకు అంతరకృషి (లేదా) చేతితో కలుపు తీసివేయాలి.

పండ్లతోటలు (మామిడి, జామ, దానిమ్మ, నిమ్మ, సపోటా, రేగు)

 • అట్రజిన్ 50% డబ్ల్యూ.పి. అనే పొడి మందును 4 – 6 గ్రా. లీటరు నీటికి కలిపి (లేదా) గ్లైఫోసేట్ 71% ఎస్.జి. 5 – 6 గ్రా. లీటరు నీటికి (లేదా) పారాక్వాట్ 24% ఎస్.ఎల్. లీటరు నీటికి 5 – 6 మి.లీ. చొప్పున కలిపి పండ్ల మొక్కలపై పడకుండా చెట్ల వరుసల మధ్య లేత దశలో ఉన్న కలుపు మొక్కలపై పిచికారి చేయాలి.

ఉద్యాన పంటలలో కలుపు నివారణపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ: ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి) & హెడ్, కలుపు మొక్కల నిర్మూలన పరిశోధన పధకం డైమండ్ జూబ్లీ బ్లాక్, రాజేంద్రనగర్, హైద్రాబాద్, ఫోన్ నెం. 040-24017205, 24015011, ఎక్స్టెంషన్: 367

3.0070754717
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు