పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

ఉల్లిలో సస్యరక్షణ

ఉల్లిలో సస్యరక్షణ.

ముఖ్యమైన వాణిజ్య పంటల్లో ఉల్లి కూడా ఒకటి. ఉల్లి ఉత్పత్తిలో చైనా తరువాత భారతదేశం రెండో స్ధానంలో ఉంది. మన తెలంగాణ రాష్ట్రంలో ఉల్లిని సుమారు 15,250 హెక్టార్లలో పండిస్తున్నారు. అన్ని రకాల భూముల్లో ఉల్లిగడ్డను సాగుచేయవచ్చు. ఉల్లిగడ్డ పెరుగుడులకు 15-25 సెం. ఉష్ణోగ్రత గల వాతావరణం అనుకూలం. ఈ పంటను వివిధ రకాల పురుగులు ఆశించి నష్టాన్ని కలిగిస్తున్నాయి. తగిన సస్యరక్షణ చర్యలు సకాలంలో చేపట్టడం వలన అధిక దిగుబడులు పొందవచ్చును.

తామర పురుగులు

తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వాళ్ళ తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో పాటుగా ఆకుల పై, కాడల పై ఊదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి.

నివారణ : పురుగును తఱుకునే రకాలు అయిన స్పానిష్ వైట్ ను సాగు చేయాలి. తామర పురుగులకు ఆశ్రయనిచ్చే వెల్లాలి, క్యాబేజి, ప్రత్తి, టమాటా, దోస మొదలగు పంటలను సాగు చేయరాదు. పంట చుట్టూ రెండు వరుసల మొక్కజొన్న లేదా లోపలి వరస గోధుమ మరియు బయటి వరుస మెక్కజొన్నలను రక్షక పంటలుగా వేసుకోవాలి. డైమిదోయేట్ లేదా పిప్రానిల్ 2  మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఉల్లి ఈగ

ఉల్లి ఈగ ఉల్లి మొలకల మీద గ్రుడ్లు పెట్టడం వలన అవి పొదిగి మొలకలను తింటాయి. తరువాత దశలో లార్వాలు గడ్డ భాగాన్ని ఆశించి నాశనం చేస్తాయి. గడ్డ పెరుగుదల దశలో లార్వాలు ఉల్లిగడ్డలో సొరంగాలు చేసి పంటలు నాశనం చేసి నష్ట పరుస్తాయి. దీని నివారణకు మొక్కలను దగ్గర దగ్గరగా నాటకూడదు. పంట మార్పడి పద్దతిని తప్పనిసరిగా అనుసరించాలి. పురుగు ఆశించిన మొక్క భాగాలను నాశనం చేయాలి.

ఎర్రనల్లి

నల్లులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పిల్చుతాయి. ఆకుల పైభాగాన చిన్న చిన్న రంద్రాలు గమనించవచ్చు. నల్లి వల్ల ఆకుల పైన ఏర్పడే తెల్లని గూళ్ళ లాంటివి గమనించవచ్చు. తరువాత దశలో ఆకుల రంగు మరి ఎండిపోయి రాలిపోతాయి. వీటి నివారణకు ఉల్లి పంట మీద స్వచ్ఛమైన నీటిని పిచికారి చేయడం వల్ల మొక్కల పై ఉన్న ఎర్రనల్లి తొలగిపోతుంది. ప్రోపర్ గైట్ 1 మీ.లి. లేదా స్పైరోమేసి పెన్ 0.75 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

బల్బ్ మైట్ (నల్లి)

నల్లి ఆశించిన ఉల్లిగడ్డ పెరుగుదల ఆగిపోయి కుళ్ళిపోతాయి. పురుగు సోకిన గడ్డల నుండి ప్రక్కనున్న ఆరోగ్యవంతమైన మొక్కలకు వ్యాపిస్తుంది. దీని నివారణకు క్యాబేజి, కాలిప్లవర్ పంటలు సాగు చేసిన పొలంలో వెంటనే ఉల్లిని సాగు చేయరాదు. ఉల్లి మరియు వెల్లుల్లి పంటలను వెంట వెంటనే పొలంలో సాగుచేయరాదు. ప్రొపరుగైట్ 1 మీ.లి. లేదా స్పైరోమేసి పెన్ 0.75 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

మంగునల్లి - ఇరొపిడ్ మైట్  (నల్లి)

పిల్ల మరియు పెద్ద పురుగులు రెండు లేత ఆకులను మరియు గడ్డ లోపల ఉల్లి పొరలను ఆశిస్తాయి. దీనివల్ల గడ్డ పెరుగుదల ఆగిపోయి ఆకులూ ముడుచుకొని ఎండిపోతాయి. దీని నివారణకు ఉల్లి, వెల్లుల్లి పంటలను వెంట వెంటనే ఒకే పొలంలో సాగు చేయరాదు. ప్రోపట్ గైట్ 1 మీ.లి. లేదా స్పైరోమేసి పెన్ 0.75 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

రబ్బరు పురుగు

పిల్ల పురుగులు సాయంత్రం వేళల్లో మొక్కల అడుగు భాగాన్ని కత్తిరించి నష్టాన్ని కలుగచేస్తాయి. ఈ పురుగులు లేత మొక్కలను ఆశించడం వల్ల గడ్డ పెరుగుదలనుతగ్గించి నష్టాన్ని కలిగిస్తుంది. దీని నివారణకు

  • అంతర పంటలుగా అలసంద, ధనియాలు, మినుము పంటలను సాగు చేయాలి.
  • రక్షక పంటగా నాలుగు వరుసల మొక్కజొన్నను ఉల్లిపంట చుట్టూ సాగు చేయాలి.
  • ఉల్లి పంటను ధాన్యం పంటలైన వరి, గోధుమ పంటలతో పంట మార్పిడి చేయాలి.
  • ఎకరానికి 4-5 లింగాకర్షక బుట్టలను ఏర్పరచాలి.
  • దీపపు ఎర ఎకరానికి ఒకటి చొప్పున ఏర్పాటు చేయాలి.
  • విషపు ఎరను (10 కిలోల తవుడు + 1 కిలో బెల్లం + 1 లీటరు మలాథియాన్) తాయారు చేసి సాయంత్రం వేళలో వెదజల్లాలి.

ఆధారం : ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.03370786517
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు