অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

కలుపు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • ప్రస్తుతం మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏపైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి. సిఫారసు చేయని, పూర్తి వివరాలు తెలియని కలుపు మందులు ఎట్టి పరిస్దితులలో వాడకూడదు. అలా వాడితే కలుపు నిర్ములకన సరిగా జరగక పోగా, కొన్ని సందర్భాలలో పంటలకు కూడా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.
 • ఉదా : మాగాణి వారిలో, వరి నాటిన 3-5 రోజుల్లో కలుపు నిర్మూలనకు 35 గ్రా. ఆక్సాడయార్జిల్ పోడిమందును వాడుకోవాలి. అలాకాక ఎక్కువ మోతాదులో వాడితే పైరు దెబ్బతింటుంది. తక్కువ మోతాదులో వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు. అదే విధంగా వరి నాటిన 3-5 రోజుల కన్నా ఆలస్యంగా వాడితే కలుపు నిర్మూలన సరిగా జరగదు.

 • ఏ పంటకు సిఫారసు చేసిన మందును ఆ పంటకు మాత్రమే వాడాలి.
 • ఉదా : మాగాణి వరిలో వేడల్పాకు మొక్కల నిర్మూలనకు వరి నాటిన 25-30 రోజులకు పొలంలో నీటిని తీసివేసి 2,4-డి సోడియం సాల్ట్ పొడి మందును ఎకరాకు 400-500 గ్రా. చొప్పున 200 లీ. నీటిలో కలిపి సాధ్యమైనంత వరకు కలుపు మీద మందు పడేటట్లు పిచికారి చేయాలి. మందు మోతాదు మించితే పైరు దెబ్బతినే ప్రమాదమున్నది. ఈ మందును ఎట్టి పరిస్దితుల్లోను వేడల్పాకు పంటలైన మినుము, పెసర, ప్రత్తి, పొగాకు, మిరప మొదలగు పంటలపై వాడరాదు.

 • కొన్ని రకాల కలుపు మందులు పంట విత్తిన రెండు రోజుల లోపు అంటే పంట మొలకెత్తక ముందే పిచికారి చేయాలి (ప్రీ ఎమర్జెన్స్).
 • ఉదా : పెండిమిధాలిన్, అలాక్లోర్ మొదలుగునవి ఈ రకపు మందులు పిచికారి చేయునపుడు నేలలో తగినంత తేమ ఉంటె బాగా పని చేస్తాయి.

 • కొన్ని రకాలకలుపు మందులు పైరు, కలుపు మొలకెత్తిన తర్వాతనే పిచికారి చేయాలి (పోస్ట్ ఎమర్జెన్స్).
 • ఉదా : క్విజలోఫాప్ ఇధైల్, ఫినాక్సాప్రాప్-పి-ఇధైల్ వంటి మందులను మినుము, పెసర పైర్లు విత్తిన 15-20 రోజుల తర్వాత పిచికారి చేయాలి. అప్పటికి కలుపు కూడా మొలచి ఉంటుంది. ఈ మందులు పైరు విత్తిన వెంటనే పిచికారి చేస్తే ఉపయోగం ఉండదు.

 • కొన్ని రకాల కలుపు మందులకు పంట, కలుపు అనే విచక్షణా శక్తి ఉండదు అనగా అన్ని మొక్కలను నిర్మూలించగలవు. కనుక వాటిని పైర్లలో వాడరాదు.
 • ఉదా : పారాక్వాట్, గ్లైఫోసెట్ మొదలను మందులను ప్రత్తి, చెఱకు పంటలలో వరుసల మధ్య దూరం ఎక్కువగా ఉండుట వలన, నాజిల్ కు రాక్షనకవచం పెట్టి పంట మొక్కల పై పడకుండా పైన మాత్రమే పడేటట్లు పిచికారి చేయాలి. అయితే ఏ కొద్దిపాటి మందు పైరు మీద పడిన పంటకు నష్టం కల్గుతుంది.

 • కలుపు మందు పిచికారి చేయునపుడు ప్రక్కన ఉండే పొలంలోని పైర్లకు మనం పిచికారి చేసే మందుల వలన ఏదైనా నష్టం వుంటుందో లేదో ముందుగా తెలుసుకోవాలి. ఇది ప్రత్యేకించి వరిలో 2,4-డి సంబంధిత మందులు వాడేటప్పుడు చాలా అవసరం. పక్క పొలంలో వేడల్పాకు పంటలపై ప్రత్తి, సంబంధిత మందులు వాడినప్పుడు ప్రక్క పోలాల్లోని సున్నితపు పంటలపై 2,4-డి కలుపు మందును పడకుండునట్లుగా జాగ్రత్త తీసుకోవాలి.
 • పైర్లలో కలుపు మందులు వాడీనప్పుడు ఆ మందు అవశేషాలు ఆ పంట తర్వాత వేసే పంటపై ఏదైనా దుష్ప్రభావం చూపెడతాయో లేదో ముందుగా తెలుసుకొని వాడితే మంచిది.
 • ఉదా : మొక్కజోన్నలో అట్రజిన్ మందు సురక్షితం. కాని ఈ మందు అవశేషాలు భూమిలో ఎక్కవ కాలం ఉంటాయి. కావున ఆచరించవలసిన పంటల సరళి విషయంలో నిపుణుల సలహాలు తీసుకోని కలుపు మందులు వాడుకుంటే మంచిది.

 • మొండిజాతి మొక్కలైన తుంగ, గరిక, దర్భ మొదలగు కలుపు నిర్మూలనకు గ్లైఫోసేట్ వంటి మందులు 4-6 ఆకుల దశలో పూత రాక ముందే పిచికారి చేసి రెండు వారాల తర్వాత 6-8 గంటల వ్యవధిలో వర్షం కురిస్తే మందు ప్రభావం తగ్గుతుంది.
 • నీటిలో కరిగే పొడి రూపంలో నున్న మందులను ఇసుకలో కలిపి వెదజల్లరాదు.
 • నిర్దిష్టమైన/స్పష్టమైన సూచనలు లేనిచో కలుపు మందులను, పురుగు, తెగుళ్ళు మందులతో కలుప రాదు. కాలపరిమితి దాటిన మందులను వాడరాదు.
 • ధ్యమైనంత వరకు కలుపు మందులను హాండ్ స్ప్రేయర్ తోనే పిచికారి చేయాలి (ప్రత్యేకించి పైరు పై పిచికారి చేయునప్పుడు). పవర్ స్ప్రేయర్ ను వడదలచినప్పుడు నిపుణుల సలహా తీసుకోవాలి.
 • కపు మందులు పిచికారి చేయుటకు ఉపయోగించే స్ప్రేయర్లు సాధ్యమైనంత వరకు విడిగా ఉంచుకోవాలి. అలా వీలుకాని పక్షంలో ఈ మందులు చల్లని వెంటనే ఏ మాత్రం అవశేషాలు లేకుండా మంచి నీటితో పలుమార్లు శుభ్రం చేయాలి. కలుపు మందులను వాడే ముందుతో పాటు కంపెని వారిచ్చిన సమాచారాన్ని / సూచనలను క్షుణ్ణంగా చదవాలి. పిచికారి చేయుటకు సరైన నాజిల్ ను (ప్లాట్ ఫాన్/ఫ్లడ్ జెట్) వాడాలి.
 • స్ప్రేయర్ల నుండి మందు సమంగా వచ్చేటట్లు పిచికారి చేయాలి. ఒకసారి పిచికారి చేసిన తర్వాత ఎట్టి పరిస్దితుల్లోను మరలా పిచికారి చేయరాదు. అందువల్ల మందు మోతాదు ఎక్కువైతే పైరుకు నష్టం కల్గుతుంది.
 • ఒక ఎకరా విస్తర్ణంలో కలుపు మందు పిచికారి చేయడానికి 200లీ. మందు నీరు అవసరమవుతుంది. మాగాణి వారిలో అయితే ఎకరానికి కావాల్సిన కలుపు మందును 20 కిలోల ఇసుకలో కలిపి పలుచగా నీరు పెట్టి పొలంలో వెదజల్లాలీ. పొలంలో నీటిని బయటకు తీసి వేయకూడదు మరియు 24-48 గంటల లోపల నీరు పెట్టాలి.
 • ఎండ మరీ ఎక్కువగా ఉన్నపుడు, అలాగే గాలి ఎక్కువగా వీస్తున్నపుడు కలుపు మందులు పిచికారి చేయరాదు. కనుక ఉదయం లేదా సాయంత్రం వేళల్లో గాలి తక్కువగా ఉన్నపుడు పిచికారి చేయడం మంచిది. అంతేగాక గాలికి ఎదురుగా పిచికారి చేయరాదు.
 • కలుపు మందులు వెనుకకు నడుస్తూ పిచికారి చేయాలి.
 • కలుపు మందులు కూడ పురుగు మందుల వలె విషపురితాలు, కనుక వీటిని ఆహార పదార్ధాలు, పిల్లలకు దూరంగా ఉంచాలి. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే డాక్టరును సంప్రదించాలి.
 • ఆహార పంటల పైన పశువుల మేతకు వాడే పైర్ల మీద కలుపు మందులు వాడినపుడు సూచించిన కాలపరిమితి తర్వాతనే పైర్లు కోయాలి. పంటను బట్టి, పంట దశను బట్టి, పంటలో ఉండే కలుపును బట్టి కలుపు మందు వాడే రకం, వాడే సమయం, మోతాదు కూడ మారుతుంది. కాబట్టి కలుపు మందులు వాడదల్చుకున్నప్పుడు నిపుణుల సలహాగాని, సమీపంలోని వ్యవసాయాధికారిని గాని సంప్రదించిన మీదటే వాడటం మంచిది.
 • సాధ్యమైనంత వరకు కలుపు నిర్మూలనకు పరిమితంగా రసాయనాలు వాడుతూ, అంతరాక్రిషి, చేయుట మొదలుగు సేద్య పద్ధతులను కూడ పాటిస్తూ సమగ్ర కలుపు యాజమాన్య పద్ధతులను అవలంభిస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక దిగుబడులు సాధించవచ్చును.

కలుపు మందుల వాడకంలో ముఖ్యమైన సూచనలు

 • పంటకు సిఫారసు చేసిన కలుపు మందులు, సరైన మోతాదులో సరైన సమయంలో వాడాలి.
 • కలుపు మందులు వాడినప్పటికీ పంట వేసిన 25-30 రోజుల తర్వాత పనిముట్ల ద్వారా అంతరకృషి చేయుట మంచిది.
 • మెట్టసాగు లేదా ఆరుతడి పైర్లలో కలుపు మందులు పిచికారి చేసుకోవాలి. వరి పొలంలో కలుపు మందులు ఇసుకతో కలిపి చల్లుకోవచ్చు. (కొన్ని సందర్భాల్లో మాత్రమే)
 • పొలంలో బాగా పదునుగా ఉన్నపుడు కలుపు మందులు పిచికారి చేయడం లాభదాయకంగా ఉంటుంది.
 • ఎక్కువ ఉష్ణోగ్రత వున్నపుడు గాని, గాలి వేగం ఎక్కువగా (20 కి.మీ కన్నా ఎక్కువగా) ఉన్నప్పుడు గాని కలుపు మందులు చల్లరాదు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పిచికారి చేసుకోవాలి.
 • కలువు మందులు వాడిన తర్వాత స్ప్రేయర్ ను శుభ్రంగా 3-4 సార్లు కడగాలి.
 • హ్యాండ్ స్ప్రేయర్ తో మాత్రమే కలుపు మందులు పిచికారి చేయాలి. ఫ్లాట్ ఫ్యాన్ (ప్రీ ఎమర్జెన్స్), సాలిడ్ కోన్ (పోస్ట్ ఎమర్జెన్స్) నాజిల్ ని విధిగా వాడాలి.
 • కలుపు మందులు ఇతర సస్యరక్షణ మందులతో కలిపి వాడరాదు.
 • కలుపు మందులు పిచికారి చేసినపుడు విష ప్రభావానికి లోనైతే వెంటనే డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళాలి. ఉపయోగించిన మందు డబ్బాను తిసుకెళితే డాక్టర్ దానికి సులభంగా విరుగుడు మందును ఇవ్వగలరు. గ్లైపోసేట్, పారాక్వాట్ వంటి మందులు పిచికారి చేయునపుడు హుడ్ ను ఉపయోగించి ఫ్లడ్ బెట్ నాజిల్ తో పిచికారి చేసుకోవాలి.
 • ప్రతి 10 లీ. ట్యాంక్ కు కలుపు మందుతో పాటు అమ్మోనియం సల్ఫేట్ లేదా 200గ్రా. యూరియాను కలపి పిచికారి చేసినట్లయితే ఫలితం తొందరగా కనిపిస్తుంది.
 • కలుపు నివారణ మందుల్లో ఎల్లప్పుడూ ఒకే మందును వాడరాదు. అలా చేస్తే కలుపు మొక్కలు ఆ మందును తట్టుకునే శక్తిని పెంపొందించుకుంటాయి.
 • ఖాళీ మందు డబ్బాలు, సీసాలు, కవర్లను వెంటనే నాశనం చేయాలి.
 • ఆహార పంటలపైన, పశువుల మేతకు వాడే పైర్ల మీద కలుపు మందులు వాడినప్పుడు సూచించిన కాల పరిమితి తర్వాతనే పైర్లు కోయాలి.
 • పురుగు మందులను మరియు కలుపు మందులను వేరు వేరుగా నిలువ చేసుకోవాలి.
 • కలుపు మందులు వాడేటప్పుడు (పిచికారి చేయునప్పుడు) ఇతర రైతులు పంట మొక్కల పై పడకుండా ఉండేటట్లు జాగ్రత్త తీసుకొవలయును.

పొలంలో పెరిగే చాలా రకం కలుపు మొక్కలు ఎన్నో ప్రయోజనాలు కల్గి ఉంటాయి. వాటి గురించి అవగాహన పెంచుకున్నట్లయితే కలుపు మొక్కలు ఆకుకూరగా, ఔషధాలుగా, పశుగ్రాసంగా, సేంద్రియ ఎరువుగా, కీటక నాశినులుగా ఉపయోగపడతాయి. అప్పుడు కలుపు ఒక సమస్యగా కాక ఒక వనరుగా పరిగణించబడుతుంది.

ప్రస్తుతం మన రాష్ట్రంలో మార్కెట్ లో దొరుకుతున్న వివిధ రకాల కలుపు మందుల వివరాలు వ్యాపార నామాలతో సహా విలైనంతవరకు ఈ క్రింది పట్టికలో పొందుపర్చడమైనది.

క్ర. సం.

సాధారణ నామం

వ్యాపార నామం

మూల పదార్ధ శాతం

1.

2,4-డి సోడియం లవణం

ఫెర్నోక్సోన్, విడ్మార్ 80, కేమ్-డి, కేడి, హీరా సూపర్ హిట్, 2,4-డి, ఆగాన్, కట్ అవుట్ గ్రీనోక్సీన్, సాలిక్స్

80% నీటిలో కరిగే పొడి

2.

అట్రజిన్

ఆట్రాటాప్, సోలారో, సూర్య, మిలిజిన్, ధనుజిన్, అట్రహిట్, క్రోజోన్, స్ట్రైక్, అట్రస్టార్, అట్రసెల్, అట్రవిప్, అట్రపిల్

50% నీటిలో కరిగే పొడి

3.

అనిలోఫాస్

సుమో, అనిలోగార్డ్, ఎరోజిన్, అనిలోధన్, అనిలోస్టార్, సూర్య, రిసిల్, శ్రీరామ్ అనిలో, అనిలోహిట్, అనిలోవిప్

30% ద్రావకం

4.

బ్యుటాక్లోర్

మాచిట్, తీర్, ట్రాప్, మిల్ క్లోర్, అరిస్టో, దనుక్లోర్, డెల్క్ క్లోర్, చెక్అవుట్, వీడ్కిల్, వీపర్, స్టోర్ క్లోర్, వీడ్అవుట్, బ్యుటావిప్

50% ద్రావకం

5.

బ్యుటక్లోర్+2,4-డి

అనుక్లోర్ + 2,4 – డి

5+4 గుళికలు

6.

అలాక్లోర్

లాసో, అల్లాటాప్, అటాక్

50% ద్రావకం

7.

పెండిమిధాలిన్

పెందిగార్డ్, స్టాంపు, పెండిస్టార్ గధర్, ధనుటప్, పెండిమిల్. పెండిగోల్డ్, స్టాప్, టాటాపనిడా, బంకర్, నాగాస్త్ర, ఈజికిల్,

30% ద్రావకం

8.

సైహల్ఫాప్ బ్యుటైల్

క్లించర్, సూపర్, ఫ్యూమా పవర్, పినిక్స్, రైడర్, ఫికోల్, రైస్ స్టార్

9.3% ద్రావకం

9.

ఫెనాక్సాప్రాప్ – పి – ఇధైల్

విప్ సూపర్, ఫ్యూమా పవర్, పినిక్స్, రైడర్, ఫికోల్, రైస్ స్టార్

6.9% ద్రావకం

10.

క్విజలాపాప్ ఇధైల్

టర్గా సూపర్

5% ద్రావకం

11.

క్విజలాపాప్ ఇధైల్

సకురా

10% ద్రావకం

12.

ఇమాజిత్ పైర్

పర్ సూట్, లగాన్, దీనామజ్, ఇన్రో, చేతౌ, టాటా వార్, షికార్

10% ద్రావకం

13.

ఇమజిత్ పైర్ + ఇమజామాక్స్

బింగో, పైరమాక్స్, ఒడిస్సి

70% ద్రావకం

14.

ఇమాజిత్ పైర్ + పెండిమిధాలిన్

వేలర్

32% ఇ.సి.

15.

ప్రేటిలాక్లోర్

ఎరేజ్, రిఫిట్, డిలిట్, ఇరేజ్, రిమూవ్, బ్లేడ్, ప్రేటిల్, పైలెట్, రేజర్, ప్రిన్స్, లోరెట్, ప్రేటిగాన్

50% ద్రావకం

16.

ఆక్సిఫ్లోరోఫెన్

గోల్, ఆక్సిగోల్డ్, గాలిగాన్, ఆక్సికిల్, క్రాల్, ఆల్టో, వాదా, హంకో

23.5% ద్రావణం

17.

పైరజోసల్ఫ్యూరాన్ ఇధైల్

సాధి

10% నీటిలో కరిగే పొడి

18.

ఆక్సాడయార్జిల్

టాప్ స్టార్

80% డబ్ల్యు.పి.

19.

ఆక్సాడయార్జిల్

రాఫ్ట్

6% ఇ.సి.

20.

మెట్రిబ్యుజిన్

సెంకర్, టాటామెట్రి, బారియర్, ఛేజ్, లస్కర్, మెటాక్స్, అమాక్స్, మెట్రిగాన్, గ్రోమెట్రి, ఎన్కోర్

70% డబ్ల్యు.పి

21.

మెట్ సల్యూరాన్ మిధైల్ + క్లోరియ్యూరాన్ ఇధైల్

ఆల్ మిక్స్, కార్ మిక్స్

20% డబ్ల్యు.ప్

22.

పారాక్వాట్

గ్రాముక్సోన్, మునిక్వాట్, ధనుక్సోన్, వీడెక్స్, స్పాట్, పారాలాన్

24% ద్రావకం

23.

గ్లైఫోసేట్

గ్లైసిల్, రౌండప్, రూల్అవుట్, క్లిన్ అప్, వీడాల్, బ్రేక్, వీడాప్, గ్లైటాఫ్, విన్నర్, గ్రౌండ్అప్, క్లిన్ లిప్, గ్లైఫోగన్, గ్లైకోవిప్, టచ్ డౌన్, హైజాక్, గ్లైసైడ్, గ్లోబస్, గ్లైకోర్

41% ద్రావకం

24.

గ్లైఫోసేట్

ఎక్స్ ల్ మేరా, అర్జెంట్,ఆంధీ, కిల్ షాట్, వీటోప్లస్, స్టార్ 71

71% నీటిలో కరిగే గుళికలు

25.

క్లోడినోఫాప్ ప్రొపార్జిల్

టాపిక్, జట్కా, డినోఫాప్, అవార్డ్, మూలా, క్లౌడ్, స్కిప్పర్, సర్ టాజ్, టాపుల్, వీడ్అవుట్

15% డబ్ల్యు.పి

26.

ఇధాక్సీ సల్ఫ్యూరాన్

సన్ రైస్

15% డబ్ల్యు.పి

27.

ఇసొ ప్రోటురాన్

అరిలాన్, రక్షన్, ధనులాన్, గ్రమినాన్

50% 75% డబ్ల్యు.పి.

28.

పైరిధాయోబాక్ సోడియం

హిట్ వీడ్, ధీమ్, రైప్

10% ద్రావకం

29.

బిస్ పైరిబాక్ సోడియం

నామినీగోల్డ్, అడోరా, తారక్, టికెఎస్, ప్యారి

10% ద్రావకం

30.

ప్రటిలాక్లోర్ + సేఫ్ నర్

సొఫిట్, రాంగ్లర్, ఇరేజ్ – యన్

30% ఇ.సి

31.

ప్రెటిలాక్లోర్ + పైరజోసల్ఫ్యూరాన్ ఇధైల్

ఈరోస్

6.15% గుళికలు

32.

ఆర్ధోసల్ఫామ్యురాన్

కెలియాన్

50% నీటిలో కరిగే గుళికలు

33.

పెండిమిధాలిన్ సి.ఎస్

స్టాంప్, ఎక్స్ ట్రా

38.7% ద్రావకం

34.

ప్రోఫాక్విజాఫాప్

ఎజిల్

10% ద్రావకం

35.

అజిమ్ సల్ఫ్యూరాన్

సెగ్మెంట్

50% డబ్ల్యు.ఎఫ్

36.

పెనాక్సులమ్

గ్రానైట్

21.7% ద్రావకం

37.

టే౦బోట్రయోన్

లాడిస్

34.4% ద్రావకం

38

హలోసల్ఫ్యురాన్ – మిధైల్

సెమ్ ప్రా

75% డబ్ల్యు.డి.జి

39.

తోప్రో మెజోన్

టింజర్

33.6% ఎస్.సి

40.

ఆనీలోఫాస్+2,4-డి

ఎరోజిన్, టాప్షాట్

56% ఇ.సి

41.

బెన్ సల్ఫ్యూరాన్ మిధైల్ + పెటిలాక్లోర్

లోండాక్స్ పవర్, రిజాల్

6.6% గుళికలు

42.

సోడియం ఎసిఫ్లోర్ ఫెన్ + క్లోడినాఫాప్ ప్రొపార్జిల్

ఐరిస్

24.5% ఇ.సి.

43.

గ్లూఫోసినేట్ అమ్మోనియం

బస్తా, లిబర్టీ

13.5% ఎస్.ఎల్.

44.

మెటిలాక్లోర్

డ్యూయల్

50% ఇ.సి

45.

2,4 – డి అమైన్ సాల్ట్

ఛాంపియన్స్, కేమ్ అమైన్, హీరా, ట్విస్టర్, 2,4 – డి అమైన్, వీడ్సెల్, సూపర్, వీడ్అవుట్

58% ద్రావకం

46.

2,4 – డి అమైన్ ఎస్టర్

స్లోష్, విడ్మార్, అగ్ని, స్మోష్, హీరా – 44, హిట్, ఎలిమినేటర్, టస్కార్

38% ఇ.సి

47.

క్లోమజోన్

కమాండ్

50% ఇ.సి

48.

డయురాన్

క్లాస్, డైయూరెక్స్, ట్రూ

80% డబ్ల్యు.పి

49.

ఫ్ల్యుసేటో సల్ఫ్యూరాన్

ఫ్లక్సో

10% నీటిలో కరిగే గుళికలు

50.

ప్రొపాక్విజాఫాప్ + ఇమాజితా పైర్

షాకెడ్

6.25% ఎం.సి

51.

కార్ఫే౦ట్రజోన్

ఆఫినిటి

40% డి.ఎఫ్

52.

క్లోరియురాన్ ఇధైల్

క్లోబెన్, రైజ్, క్యురిన్, బ్లూమెన్, ఫాలోన్, ఫ్లాట్

20% డి.డబ్ల్యు

మొండి జాతి కలుపు నివారణ

తుంగు

భూమిని దున్నక ముందు కాని లేదా మొదటి పంట తర్వాత రెండవ పంట వేయక ముందు చేపట్టవలసిన పద్ధతి.

 • తుంగ మరియు ఇతర కలుపును 15-20 రోజుల వరకు పెరగనీయాలి.
 • అవసరమైతే నీటిని పెట్టి త్వరగా పెరిగేటట్లు చేయాలి.
 • కలుపు బాగా పెరిగిన తర్వాత గ్లైఫోసేట్ 41% ఎస్.ఎల్. అనే మందును ఎకరాకు 2-2.5 లీ. అనగా లీటరు నీటికి 10 మి.లీ. చొప్పున కలిపి కలుపు బాగా తడిసేటట్లు పిచికారి చేయాలి. ప్రతి మందు ట్యాంక్ కు (15 లీ.) పిచికారి చేసే ముందు 300 గ్రా. యూరియా కలిపి పిచికారి చేసినట్లయితే ఎక్కువ మోతాదులో కలుపు మందును మొక్క పీల్చుకుంటుంది. కాబట్టి తొందరగా తుంగ చనిపోతుంది.
 • 10-15 రోజులు ఆగి కలుపు చనిపోయిన తర్వాత దున్నినచో తుంగను కొంత వరకు నివారించవచ్చును. ఈ విధంగా 2-3 సార్లు చేసిన తుంగ మొదలగు మొండి కలుపు తగ్గు ముఖం పడుతుంది.

వయ్యారి భామ (బంజరు భూములు, పంటలు లేని ప్రాంతాలు)

 • ఈ కలుపు నివారణ చర్యలు సామూహికంగా చేపట్టాలి. ఎందుకంటే ఒక మొక్క నుండి సుమారు 15,000 – 30,000 విత్తనాలు వృద్ధి చెందుతాయి. కాబట్టి నివారణ చర్యలు చేపట్టని ప్రాంతం నుండి విత్తనాలు వ్యాప్తి సమస్య తిరగబడుతుంది.
 • వయ్యారి భామ పుతకు రాకముందే భూమిలో కలియదున్నాలి. వయ్యారి భామ కలుపు పంట పోలాల్లో ఎక్కువగా ఉన్నట్లయితే బంతి పంటతో పంట మార్పిడి చేసినట్లయితే దీని ఉధృతిని కొంత వరకు తగ్గించవచ్చు.
 • కలుపు మందులు దొరకని పక్షంలో వయ్యారీభామ శాఖీయ దశలో లీటరు నీటికి 50 గ్రా. ఉప్పు కలిపిన ద్రావణాన్ని లేదా పూతకు వచ్చే ముందు అయితే లీటరుకు 100 గ్రా. ఉప్పు కలిపిన ద్రావణఁను పిచికారి చేయాలి.
 • మొలచిన వయ్యారి భామను అట్రజిన్ 50% డబ్ల్యు.పి. 4-6 గ్రా. లేదా 2,4 – డి సోడియం సాల్ట్ 80% డబ్ల్యు.పి 5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
 • గ్లైఫోసేట్ 41% ఎస్.ఎల్ (10 మి. లీ. ఒక లీటరు నీటికి) లేదా పారాక్వాట్ 24% ఎస్.ఎల్ (5-6 మి. లీ. ఒక లీటరు నీటికి) మందులను వయ్యారిభామా 2-3 ఆకుల దశలో ఉన్నపుడు పిచికారి చేయాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం© 2006–2019 C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate