హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / క్రిమిసంహారిక మందుల అవశేషాలను తగ్గించటానికి మెళకువలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

క్రిమిసంహారిక మందుల అవశేషాలను తగ్గించటానికి మెళకువలు

మన దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పించాలంటే వివిధ పంటల ఉత్పత్తులను గణనీయంగా పెంచడమే కాకుండా ఆహారోత్పత్తులను ఆశించేటటువంటి చీడపీడల నుంచి రక్షించాలి.

మన దేశ జనాభాకు ఆహార భద్రతను కల్పించాలంటే వివిధ పంటల ఉత్పత్తులను గణనీయంగా పెంచడమే కాకుండా ఆహారోత్పత్తులను ఆశించేటటువంటి చీడపీడల నుంచి రక్షించాలి. చీడపీడల వలన సుమారు 30శాతం పంట నష్టం అవుతుంది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి సస్యరక్షణ మందుల పైనే ఎక్కవగా ఆధారపడుతున్నారు. మన దేశంలో సస్యరక్షణ మందుల వాడకం గామించినట్లయితే, సుమారు 65 శాతం పురుగు మందుల వాడకంగా నమోదు చేయబడినది.

ప్రస్తుతం మన దేశంలో సుమారు 275 సస్యరక్షణ మందులు, వ్యవసాయ మంత్రిత్వశాఖకు చెందిన సెంట్రల్ ఇంసేక్టిసైడ్ బోర్డు మరియు రిజిస్ట్రేషన్ కమిటి ద్వారా వివిధ పంటలపై నిర్ధారించిన మోతాదులో వాడటానికి నమోదు చేయబడినది. ఈ సస్యరక్షణ మందులను సిఫార్సు చేసిన పంటలకు, సిఫార్సు చేసిన మోతాదులో వడినట్లైతే ఎటువంటి హని కలుగదు. నీటిని విచక్షణా రహితంగా వాడినప్పుడు, దుష్ఫలితeలకు దారి తీస్తుంది.

పంట పై పిచికారి చేసిన మందు కేవలం 5-10 శాతం మాత్రమే ఆశించిన పురుగులను / తెగుళ్ళను నివారించడానికి ఉపయోగపడుతుంది. మిగిలిన మందు ద్రావణం కొంత అవిరిగాను కొంత భూమి పైపడి మట్టి రేణువులలో బంధింపబడి, కొంత భూగర్బజలాలలోనికి ఇంకిపోయి కలుషితం చేస్తాయి. వీటి అవశేషాలు కొన్ని సంవత్సరాల వరకు విచ్చిన్నం కాకుండా ఉంటాయి. మనం రోజు తినే ఆహారంలో వీటి అవశేషాలు ఉండటం వల్ల ప్రతి రోజు కొంత మొత్తంలో మన శరీరంలో ప్రవేశిస్తాయి. అంతేకాకుండా పర్యావరణంలో అన్ని రకాల ప్రాణులలో కూడా రుగ్మతలను కలుగ చేస్తాయి. ముఖ్యంగా మనుషులలో ఆరోగ్య సమస్యలు, క్రిమికిటకాలలో రోగనిరోధక శక్తి పెంపొందడం వల్ల ప్రాముఖ్యత లేని పురుగుల మరియు తెగుళ్ళ ఉధృతి పెరిగే అవకాశం కూడా ఉంది. దీనివలన సస్యరక్షణ మందుల వాడకం మరింత పెరిగి, తద్వారా ఖర్చులు పెరిగి, నికరాదాయం తగ్గి “వ్యవసాయం” కాస్తా “వ్యయసాయం” అయ్యే ప్రమాదం ఉంది.

వివిధ పంటలపై అవశేషాలు గరిష్ట పరిమితులను ప్రపంచ ఆరోగ్య సంస్ధ మరియు వ్యవసాయ మరియు ఆహార సంస్ధలచే సంయుక్తంగా నిర్వహించబడుతున్న కోడెక్స్ ఎలిమెంటేరియన్ కమిషన్ వారు నిర్దారిస్తూన్నారు. అదే విధంగా మన దేశంలో కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సంబంధించిన వారు వివిధ వ్యవసాయ ఉత్పత్తులు మరియు వ్యవసాయ ఆహార పదార్దాలపై గరిష్ట పరిమితులను నిర్దారిస్తారు. మానవ ఆరోగ్యం పై మరియు పర్యావరణం పై తక్కువ ప్రభావం చూపే కీటక మరియు శిలీంద్రనాశినులు మార్కెట్లో అందుబాటులో ఉన్నవి. కాని వీటిని కూడా రైతులు సిఫార్సు చేసిన పంటలపై, నిర్దేశించిన మోతాదులో వాడకపోగా ఇతర పంటలపై రెట్టించిన మోతాదులో విచక్షణా రహితంగా వాడటం గమనించడం జరిగినది.

ఆహార ఉత్పత్తి ఎగమతుల విషయానికొస్తే దిగుమతి చేసుకొనే దేశంవారు నిర్ధారించిన నాణ్యత ప్రమాణాలతో పాటు ముఖ్యంగా సస్యరక్షణ మందుల అవశేషాలు కూడా పరిమితికి మించి ఉండరాదు. మన దేశం నుండి జరుగుతున్న పంట ఉత్పత్తుల ఎగుమతుల్లో సస్యరక్షణ మందుల అవశేషాలు పరిమితికి మించి ఉండటం వలన ప్రపంచ మార్కెట్లలో తిరస్కరించబడినది. ఈ కారణం చేతనే గత ఐదారు సంవత్సరాలుగా మన దేశం నుండి ఎగుమతి అయిన మిర్చి, తేనె, ద్రాక్ష, వరి మరియు కరివేపాకు వివిధ దేశాల వారు ముఖ్యంగా ఐరోపా, సౌదీ అరేబియా, దుబాయి లాంటి దేశాల్లో ఎగుమతులను తిరస్కరించడం జరిగింది.

సస్యరక్షణ మందుల అవశేషాలు వివిధ పంట ఉత్పత్తులలో ఎక్కవగా గమనించడానికి గల కారణాలేమిటంటే

 • అవసరానికి మించి కొద్ది రోజుల వ్యవధిలోనే, రకరకాల మందులను కలిపి కొట్టడం.
 • పిచికారి చేసిన తరువాత పంటను కోయటానికి కొంతకాలం వేచి వుండే సమయాన్ని (వేయిటింగ్ పీరియడ్) సరిగ్గా పాటించకపోవడం.
 • తక్కువ నాణ్యత కల సస్యరక్షణ మందులను వాడటం.
 • పంటను ఆశించింది పురుగా ? తెగులా ? అని నిర్దారించక, తోచిన సస్యరక్షణ మందులను పిచికారి చేయడం.
 • సస్యరక్షణ మందులు తయారు చేసే పరిశ్రమల నుండి విడుదలయ్యే కాలుష్యాలను జలశాయాలలో వదలడం.
 • నిషిద్ధమైన డి.డి.టి వంటి మందులను జలాశయాలలో వాడటం.
 • పిచికారి చేసిన తరువాత, సస్యరక్షణ మందుల డబ్బాలను సిఫార్సు చేసిన విధంగా నాశనం చేయకపోవడం.
 • కాయకోత అనంతరం మార్కెట్ కి తీసుకోని వెళ్ళే ముందు నాణ్యత కోసం రసాయనాలను పిచికారి చేయడం లేదా రసాయనాల ద్రావణంలో ముంచడం.

పంట ఉత్పత్తులలో రసాయన అవశేషాలు తగ్గించడానికి పాటించవలసిన జాగ్రత్తలు

 • సమగ్ర సస్యరక్షణ పద్ధతులను, జీవరసాయనలను ఎక్కువగా వాడి చీడపీడల ఉధృతిని తొలిదశలోనే అదుపు చేసుకోవాలి.
 • రసాయన క్రిమిసంహారకాలను ఆఖరి అస్త్రంగా మాత్రమే వాడాలి.
 • ఉత్తమ పంట యాజమాన్య పద్ధతులను పాటించాలి. సమగ్ర ఎర్రువుల యాజమాన్యం ద్వారా పంటకు సమతుల పోషకాలను అందించి వాటి రోగనిరోధక శక్తిని పెంపొందించాలి. పంట బెట్టకు గురికాకుండా అవసరాన్ని బట్టి నీటితడులు అందించాలి.
 • సస్యరక్షణ మందుల వాడకం పై రైతులకు, పొలంలో పనిచేసేవారికి అవగాహన పెంచాలి.
 • పిచికరికి, కోతకు మధ్య వేచి వుండే సమయాన్ని (వెయిటింగ్ పీరియడ్) అన్ని పంటలకు మరియు ఆయా పంటలకు చేయబడిన సస్యరక్షణ మందులకు నిర్దారించాలి.
 • పంట ఉత్పత్తుల పైన లోపల గల రసాయన అవశేషాలను తీసివేసే కొన్ని పద్ధతులను (డికంటామినేషన్ పద్ధతులను) పాటించాలి.
 • వివిధ పంట మరియు మాంసాహార ఉత్పత్తులలో ఆవశేషాల పరిమితిపై నిఘావేసి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
 • సరైన అవగాహన లేకుండా అనేక మందులను ఒకేసారి లేదా పురుగు / తెగుళ్ళ మందులను కలిపి కొట్టడం వల్ల మరిన్ని సమస్యల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్లో రకరకాల సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి కొనుగోలు చేయాలి.

ఈ జాగ్రత్తలన్నీ పాటించినప్పటికి కొన్ని సార్లు రైతులు కోతకు ముందు పిచికారి చేసి మార్కెట్ కు మరుసటి రోజే పంపే అవకాశం ఉంది. అలాంటప్పుడు కొన్ని సులువైన పద్ధతులతో అవశేషాలను కొంతవరకు తొలగించవచ్చు. పారే నీటిలో కూరగాయలను / పండ్లను కడగటం, 2% (శాతం) ఉప్పు ద్రావణంలో పది నిమిషాలు ఉంచి మంచి నీటిలో కడగడం, 2% చింతపండు రసంతో కడగటం, వంటి పద్ధతులతో సుమారు 30% వరకు అవశేషాలను తగ్గించవచ్చు. అంతేగాక మొండి అవశేషాలను తీయడానికి పై తొక్కని చెక్కి వేయాలి. కూరగాయలను ఉప్పు నీటి ద్రావణంలో కడిగి ప్రెషర్ కుక్కర్ లో ఉడికించినట్లయితే సుమారు 75% వరకు అవశేషాలను తొలగించవచ్చును.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.99624765478
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు