పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

గులాబీలో సస్యరక్షణ

గులాబీలో సస్యరక్షణ.

పూలల్లో రారాణి ఆయన గులాబీ ప్రపంచ పులా మార్కెట్ లో మొదటి స్ధానంలో ఉంది. గులాబీ సాగు మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి మరియు మెదక్ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తున్నారు. సరైన యాజమాన్య పద్ధతులు, మేలైన రకాల సాగు ఉన్నప్పటికీ మారుతున్న వాతావరణ పరిస్ధితులలో గులాబీ సాగులో వివిధ పురుగులు ఆశించి దిగుబడిని, నాణ్యతను తగ్గిస్తున్నాయి. గిరాకీ ఎక్కువగా ఉన్న సమయంలో అధిక మార్కెట్ ధర రావాలంటే గులాబీను ఆశించే పురుగులు వాటి యాజమాన్యం పై అవగాహనా అవసరం.

పేను బంక

పిల్ల, తల్లి, పురుగులు లేత కొమ్మలు, వువ్వులు మరియు మొగ్గలా మీద చేరి రసం పీలుస్తాయి. మొగ్గలు అభివృద్ధి చెందక లేత మెఫ్ఫాలుగా ఉన్నప్పుడే రాలిపోతాయి. లేత కొమ్మలు వాడిపోయి ఎండిపోతాయి. వీటి నివారణకు డై మిడోయేట్ 2  మీ.లి. లేదా ఎసి.పెట్1.5 మీ .లి లేదా వేపనూనె 5 మీ.లి. లేదా మలాథియాన్ 2 మీ.లి లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

తమర పురుగులు

పిల్ల, తల్లి, పురుగులు కొత్తగా చిగురిస్తున్నా ఆకులూ, పూమొగ్గలు మీద ఆశించి రసాన్ని పీల్చటం వలన పుమేఘాలు సరిగా విచ్చుకోవు. ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చడం వలన ఆకుల వాడాలి రాలిపోతాయి. వీటి నివారణకు పిప్రానిల్ 2 మీ.లి. లేదా స్పైనోషద్ 0.3 మీ.లి. లేదా దైపెందయురాన్ 1 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పొలుసు పురుగు

తల్లి, పిల్ల, పురుగులు కందం పై రసం పీల్చటం వలన మొక్కలు ఎండి చినిపోతాయి. వీటి నివారణకు కిరోసిన్ లేదా డీజిల్ లో ముంచిన దూదితో రుద్దడం వలన ఈ పొలుసు పురుగులను నివారించవచ్చు లేదా మలాథియాన్ 2 మీ.లి. లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయాలి.

మొగ్గ తొలుచు పురుగులు

లద్దె పురుగులు పూమొగ్గలను , ఆకులను పూర్తిగా తిని ఈనేలను మాత్రమే మిగులుస్తాయి. ఈ పురుగులు ఆశించిన పుమేఘాలు విచ్చుకోవు. వీటి నివారణకు సైప్నోషాద్ 0.3 మీ .లి . లేదా ఇండక్షకార్బా 1 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చెయాలి.

పెంకు పురుగులు

రాత్రి పూత ఆకులను, పూవులను తిని నష్ట పరుస్తాయి. వీటి నివారణకు డైమిదోయేట్ 2 మీ.లి. లేదా ఎసి.పెట్ 1.5 గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఎర్రనల్లి

ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి గూడుకట్టి రసాన్ని పీల్చివేస్తాయి. వీటి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకులూ అడుగు భాగాన గోకినట్లు ఉంది పైభాగాన కంచు రంగు మచ్చలు ఏర్పడతాయి. చివరకు ఆకులూ కూడా ముడుచుకుపోతాయి. వీటి నివారణకు డైకోపాల్ 3 మీ.లి. లేదా గంధకం 5 గ్రా. లేదా ఎనమేక్తిన్ 0.4 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

ఆధారం: ప్రొపెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.98936170213
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు