పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

చలి కాలానికి సమగ్ర వ్యవసాయంలో మెళకువలు

సమగ్ర వ్యవసాయం చేసే రైతులు వంటలతో పాటు గేదెలు, ఆవులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ మరియు కుందేళ్ళను పెంచుతుంటారు. వాటి మేతకోసం పశుగ్రాసాలు సాగు చేస్తూ అదనంగా కుటుంబ అవసరాలైన తిండి గింజలు, పప్చ రాన్యాలు. నూనెలు కూరగాయల కోసం సంబంధిత వంటల సాగు చేస్తుంటారు. మిగిలిన పాలంలో వాణిజ్య పంటల సాగు చేపడుతూ వుయవసాయం చేస్తారు.

చలికాలం నవంబరు మొదటి వక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు ఉంటుంది. ఈ సమయంలో చలివ్రభావం వల్ల పంట మరియు వశువుల ఆరోగ్యం దెబ్బతింటుంది. ఆరోగ్య నంరక్షణకు సరైన యాజమాన్య చర్యలు చేవడుతూ నష్టాన్ని తగ్గించుకుంటూ నుస్థిర వ్యవసాయం ద్వారా రైతు ప్రతి కూల వరిస్థితులను ఎదుర్కొంటూ మంచి ఆదాయం పొందడానికి అవకాశాలను ఈ వ్యాసంలో పొందుపరచబడినది.

పంటలసాగులో మెళకువలు

 • పశుగ్రాసాల సాగు : బహువార్షికాలు సాగు చేసే రైతులు ఎ.పి.బి.ఎన్-1, సి.ఓ-4 సి.ఓ-5 మరియు వూలే జయంత్ రకాలను సాగుచేసేటప్పుడు చలికాలంనకు ముందే నాటుకోవాలి. చలికాలంలో నాటుకున్నప్పడు ఎదుగుదల సమస్యను అధిగమించడానికి నీటి ఎద్దడికి గురికాకుండా చూసుకోవాలి మరియు అదనపు నత్రజనిని వాడాలి.
 • ఖరీఫ్ కాలంలో ఉత్పత్తి అయిన అదనపు పశుగ్రాసాన్ని సైలేజ్ రూపంలో నిల్వ చేసుకొని చలికాలం ఉండే 3 నెలల్లో నిల్వ గడ్డిని వాడుకొని వచ్చిమేత కొరతను అధిగమించాలి.
 • చలి ప్రభావం తక్కువగా ఉండే గడ్డి జొన్న (సి.ఎస్.హెచ్ ఎమ్.ఎఫ్. గడ్డి మొక్కజొన్న (ఆఫ్రికన్ టాల్) వంటి రకాలను ఎంచుకొని సాగు చేసుకోవాలి.
 • లెగ్యూమ్ జాతి వశుగ్రాసాలైన లూనర్స్ బర్సీం. హెడ్జ్ లూసర్న్ అధిక మాంసకృత్తులు మరియు పీచు వదార్ధాన్ని కల్లి పశువులలో పాల ఉత్పత్తిని మరియు బరువును పెంచుతాయి. కమక ప్రతి పాడి పశువకు 30 కిలోల గడ్డి జాతి పశుగ్రానంతో పాటు 6 కిలోల పప్పు జాతి వశుగ్రాసాన్ని సిఫారసు చేయడమైనది. పప్పుజాతి పశుగ్రాసాన్ని వాడి చెక్కలను, దాణాల మోతాదు తగ్గించి ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవాలి.
 • అటువంది మంచి పప్పుజాతి పశుగ్రాసాల సాగుకు అక్టోబరు 15 డిసెంబరు 15 వరకు అనుకూలమైన సమయం కాబట్టి రైతులు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని లూసర్న్ (ఆర్.ఎల్-88, 6-3, సిఒ. –1), హెర్ట్ లూసర్న్ (వేలి మాసాల్) బర్సీం (మెస్యవి. వర్గాన్) లను సాగు చేసుకోవాలి.

పంటల సాగు

 • రబీలో నూనె అవసరాలు, పప్చ అవనరాల కోసం అవనరమైన వేరుశనగ, పెనర, మినుము లాంటి వంటను మరియు మొక్కజొన్న వంటి వంటలను విత్తడానికి అక్టోబరు 15 నుండి నవంబరు 15 వరకు అనుకూల నమయం కాబట్టి ఈ నమయం లోపే విత్తుకోవాలి. వీటి నమస్యను అధిగమించడానికి బోదెలపై విత్తుకోవడం చాలా శ్రేయన్మరం.
 • చలికాలానికి అనువైన కూరగాయల సాగును చేపట్టాలి. మరీ ముఖ్యంగా టమాటా వంటి వంటలను వేసవిలో వచ్చే కొరతను దృష్టిలో పెట్టుకొని సాగు చేపట్టాలి.
 • చలికాలంలో వంగ, టమాటా, క్యాబేజి, కాలిప్లవర్, కూరమిరప, పెంచి చిక్యుడు. క్యారెట్, పాలకూర వంటి వంటల సాగుకు అనుకూలం.
 • చలికాలంలో కూరగాయల్లో బూడిద తెగులు మరియు బూజు తెగులు ఆశించే అవకాశాలు ఎక్కువ కాబట్టి వీటి నివారణకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. బూడిద తెగులు నివారణకు నీటిలో కరిగే గంధకపు పొడి 3 గ్రా.లీటరు నీటికి లేదా 2 మి.లీ హెక్సాకొవజోల్ వీచికారి చేయవలెను. బూజు తెగులు నివారణకు మాంకోజెబ్ 2.5 గ్రా. లీటరు వీటికి వీచికారి చేయవలెను.
 • కూరగాయల్లో ఎల్లో మొజాయిక్ వైరన్ను వ్యాప్తి చేసే తెల్ల దోమ నివారణకు 1.5 గ్రా. ఎసిపేట్ లేదా డైమిధోయేట్ 2 మి.లీ. లేదా టైజోఫాన్ 1.5 మి.లీ. పిలికారి చేయవలెను.
 • చలికాలంలో నూక్ష్మ ధాతులోపాల సవరణ చేపట్టినటైతే మంచి దిగుబడితో పాటు వంట నాణ్యత కూడా బాగుంటుంది.

పాడ్ పశువల పెంపకంలో మెళకువలు

 • చలి తీవ్రత మరియు ఈదురు గాలుల నుంచి రక్షణ కొరకు రాత్రి పూట పెడ్ చుట్టూ గోనె సంచులతో గాలి చొరబడకుండా ఏర్పాటు చేయాలి. వగటి పూట తెరచి ఉంచాలి. చలికాలంలో పశువులకు నిల్వ ఉన్న చల్లని వీళ్ళను త్రాగించవదు. వెచ్చది తాజా బోరు నీళ్ళను త్రాగించాలి.
 • దోమల నుంచి రక్షణ కొరకు దోమ తెరలు వాడాలి. పశువల కొట్టంలో మూత్రం వల్ల చిత్తడి అయిన నేల మీద వరిగడ్డి బెడ్డింగ్ ఏర్పాటు చేస్తే వశువులకు వడుకోవడానికి సౌకర్యవంతంగా మరియు ఆరోగ్యంగా ఉంటుంది.
 • కొవ్వ పదార్థాలు ఎక్కువగా ఉండే వత్తి చెక్క వేరు శనగ చెక్కలాంటివి ప్రతి పశువకు 2 కిలోల చొప్శన ఇవ్వాలి.
 • దూడలకు చలి, ఈదురు గాలులు సోకినట్లయితే న్యుమోనియా వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చలి చొరబడకుండా ఏర్పాటు చేయాలి.
 • చలికాలంలో బాగా పెరిగే అజోల్లాను దాణాతో పాటు ఇవ్వడం వల్ల ఆరోగ్యంతో పాటు పాల దిగుబడి వెన్న శాతం పెరుగుతుంది.
 • చలికాలంలో పశువులకు సోకే వ్యాధులపై అవగాహన పెంచుకొని తగిన చికిత్సను అందించాలి. దగ్గు, దమ్మ శ్యాన కోశ వ్యాధులు. గాలి కుంటు వ్యాధులు వచ్చే అవకాశమున్నందున. వెచ్చని షెడ్ యాజమాన్యంతో పాటు వకాలంలో టీకాలు వేయించాలి.

గొర్రెల పెంపకంలో మెళకువలు

 • గొర్రెలకు చలికాలంలో బొచ్చు కత్తిరించవద్దు.
 • గొర్రెల పెడ్ పై కప్ప రేకులుంటే వరిగడ్డి కప్పి వెచ్చదనం కల్గించాలి.
 • ఈనిన తల్లి గొర్రె మరియు పిల్ల గొర్రెలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
 • గొర్రెల షేడ్ లో మూత్రం వల్ల తడి చేరకుండా తడిని వీల్చుకోవడానికి నేలమీద మొరంను గుట్టలుగా పోసివ్వతే మూత్రం పీల్చుకొని పెడ్పాడిగా ఉంటుంది.
 • షెడ్లోనే గొర్రెలకు (ష్టాల్ ఫీడింగ్) రోజు 100 గ్రా. ల తవుడును అవిశే, అలసంద, లూసర్న్, హెడ్జ్ లూనర్స్ వంటి వశుగ్రాసాలతో పాటు అందించాలి.
 • దాణాలో లవణ మిశ్రమం వంటి వాడిని కలిపి ఇవ్వడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఆరోగ్యవంతంగా ఉంటుంది.
 • చలికాలంలో పోకే వీలి నాలుక, నోటి వుండ్లుకు నకాలంలో వికిత్స అందించాలి. అదే విధంగా గలికుంటూ మరియు బొబ్బర వ్యాధి సోకకుండా వకాలంలో టీకాలు వేయించాలి.
 • చలికాలంలో బాహ్యపరాన్నజీవుల నిర్మూలన మరియు పి.పి.ఆర్. వ్యాధి దీకాలను అందించాలి.
 • వేపాకు పొగపెట్టడం ద్వారా దోమలను అదువు చేయవచ్చు. తద్వారా నీలి వాలుక వ్యాధిని అరికట్టవచ్చు.

కోళ్ళ పెంపకంలో మెళకువలు

 • రాత్రివూట షెడ్ వెచ్చగా ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి . పగటి గాలి ప్రసరణ తో పాటు శుభ్రతను పాటించాలి. తద్వారా కోళ్ళ విసర్జితాల నుంచి వెలువడే అమోనియా వాయువ బయటకు పంపబడుతుంది.
 • కోడి పిల్లలకు మొదటి 30 రోజుల పెంపకం చాలా కీలకమైనది కాబట్టి గది ఉష్ణోగ్రత 25°సెల్సియన్ తగ్గకుండా వెచ్చదనాన్ని కల్లించే విధంగా బ్రూడర్ ను కల్చించాలి. 24 గంటల విద్యుత్ సరఫరా ద్వారా గాని బొగ్గు కొలిమి ద్వారా గాని సౌకర్యం ఏర్పాటు చేయాలి.
 • సాధారణ లేదా గోరువెచ్చని నీళ్ళను మాత్రమే త్రాగించాలి.
 • మానూరి, కొక్కెర వ్యాధి రాకుండా ముందుగానే టికాలు వేయించాలి.
 • కోళ్ళ పెడ్ చుట్టుముట ఫంగన్, బాక్టీరియా మరియు క్రిములు దరి చేరకుండా నున్నం వేసుకోవాలి మరియు షెడ్ మొత్తం కార్యండాజిమ్ 1 గ్రా. + కోరోపైరిఫాన్ 1.6 మి.లీ లీటరు వీటిలో కలిపి పిలికారి చేయాలి.

కుందేళ్ళ పెంపకం

 • రక్త విరేచనాలు వస్తే సకాలంలో చికిత్స చేయించాలి.
 • పిల్లలను తల్లి దగ్గరకు చేర్చి నన్యమిచ్చి పాలను పట్టించాలి.
 • కుందేళ్ళు ఎక్కువ శాతం చలికాలంలో పిల్లలను కంటాయి.
 • మొదటి 15 రోజులు వాటి దేహం మీద ఊలు ఉండదు. కాబట్టి చలి నుంచి రక్షణకు గోనె సంచులను రక్షణగా ఏర్పాటు చేస్తూ తరచు మారుతూ ఉండాలి.

ఇతర వివరములకు సంప్రదించవలసిన ఫోన్ నెం. 9440467091

2.99493670886
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు