హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / జీవనియంత్రణ పద్ధతులు, మరియు జీవ రసాయనాలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

జీవనియంత్రణ పద్ధతులు, మరియు జీవ రసాయనాలు

ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బాక్టీరియా, ఫంగల్ వ్యాధులు పంటల పై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి.

ప్రకృతిలోని పరాన్నజీవులు, బదనికలు మరియు కొన్ని రకాల వైరల్, బాక్టీరియా, ఫంగల్ వ్యాధులు పంటల పై వచ్చే చీడపురుగులను ఆశించి వాటిని అదుపులో ఉంచటంలో తమ వంతు పాత్రను నిర్వర్తిస్తూ ఉంటాయి. ఇటువంటి సహజ శత్రవులను సస్యరక్షణలో ఒక అంశంగా వినియోగించుకొంటూ చీడపీడల ఉధృతిని తగ్గించు కోవటాన్ని జీవ నియంత్రమ పద్ధతులు ద్వారా సస్యరక్షణ చేసుకోవడం అని చెప్పవచ్చు.

గరిష్ట విషప్రభావం గల పురుగు మందులను విచక్షణారహితంగా పిచికారి చేయడం వలన పరాన్న జీవులు, బదనికలు పూర్తిగా నాశనమవుతున్నాయి. పై పెచ్చు, చీడపురుగులు ఈ మందులకు తట్టుకొనే శక్తిని సంతరించుకొని వీటిని అదుపుచేసే శత్రు పురుగులు పంట పోలాల్లో నాశనమవటం వలన తిరిగి విజ్రుంభిస్తూన్నాయి. కాబట్టి చీడపరుగులను అదుపులో ఉంచేందుకు తక్కవ విషప్రభావం గల మందులను అవసరాన్ని బట్టి మాత్రమే వినియోగిస్తే కొంత వరకు ఈ పరాన్నజీవులను మరియు బదనికలను కాపాడుకొంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని కూడా పొందవచ్చు. ఈ విధంగా జివనియంత్రణను సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా వాడుకోవచ్చు. పురుగు మందుల అవశేషాలు లేకుండా సేంద్రియ పద్ధతుల ద్వారా పండించిన ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ఇటివల కాలంలో జీవనియంత్రణ పద్ధతుల ప్రాముఖ్యత మరింత పెరిగిందనే చెప్పవచ్చు. జీవ నియంత్రణ పద్ధతులను రసాయనిక పురుగు మందులకు ప్రత్యమ్నాయంగా వాడటం వలన పర్యావరణ సమతుల్యత కూడా పాటించబడుతూ రైతు సోదరులు పురుగు మందుల అవశేషాలు లేని నాణ్యత గల ఉత్పత్తులన సాధించవచ్చు.

పరాన్నజీవులు

మన పంటలకు హాని చేసే పురుగుల మీద ఆశించే సహజ శత్రువులను మనము పరాన్నజీవులుగా పరిగనిస్తాము. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఎక్కువ సంతానోత్పత్తి కలిగి ఉండటం వల్ల ఇటీవలి కాలంలో వీటిని సమగ్ర సస్యరక్షణలో ఒక ముఖ్య సాధనంగా వాడుతున్నారు. ట్రైకోగ్రామా వంటి పరాన్నజీవులు (శనగ పచ్చ పురుగు, వరి కాండం తొలుచు పురుగు , ఆముదం నామాల పురుగు మరియు క్యాబేజీ డైమండ్ పురుగు కొరకు), బ్రాకాన్ గొంగళి నశించు పురుగుల) మరియు బ్రకి మెరియ అనబడే కోశస్ద దశ పరాన్నజీవి (కొబ్బరి, వక్క మరియు తాటి పంటల నాశించు పురుగులు) మన రాష్ట్రంలో ఎక్కువగా వాడకంలో ఉన్న పరాన్నజీవులుగా చెప్పవచ్చు.

బదనికలు

వివిధ పంటపోలాల్లోబదనికలు విరివిగా ఉన్నట్లు క్షేత్రస్దాయిలో చూడటం జరిగినది. హానికారక పురుగులను భుజిస్తూ తమ సంతతిని పెంపొందించుకుంటూ మన పంట పోలాలలో హానికారక పురుగులు నష్టపరిమాణం స్ధాయి చేరకుండా ఉండటంలో బదనికల పాత్ర చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. అల్లిక రెక్కల పురుగు (పేనుబంక, తెల్లదోమ మరియు దీపపు పురుగులు) జివనియంత్రణలో ప్రముఖపాత్ర పోషించే బడనికలుగా చెప్పుకోవచ్చు.

జీవ రసాయనాలు

ఈ జీవ రసాయనాలు పురుగుకు రోగం కలుగచేసే క్షమత కలిగిన సుక్ష్మజివులను ఆధారంగా చేసుకొని తయారు చేయబడతాయి. పురుగులలో రోగాలను కలుగచేసే సుక్ష్మజీవులు స్దూలంగా నాలుగు రకాలుగా వర్గికరించుకోవచ్చు. అవి

 • వైరస్ లు
 • బాక్టీరియాలు
 • కీటక నాశక శిలీంధ్రాలు మరియు
 • కీటక నాశక నులి పురుగులు.

ఇవే కాకుండా పంటలనాశించే వివిధ తెగుళ్ళను నివారించటానికి మరియు పంట పోలాలలో విపరీత నష్టం కలుగచేసే నులి పుగుల ఉధృతిని తగ్గించటానికి నిర్దేశించబడిన జీవరసాయనాలు వాడకంలో ఉన్నాయి.

వైరస్ ఆధారిత జీవరసాయనాలు

మానవాళికి ఏ రకంగా వైరస్ సుక్ష్మజివుల వలన రోగాలు సంభవిస్తాయో, అదే శైలిలో పురుగులకు కూడా వివిధ రకాల వైరస్ లు సోకి రోగ కారకాలవుతాయి. వాటిలో ప్రధానంగా చెప్పుకోదగినవి.

 • యన్.పి.వి (న్యూక్లియో పాలిహైడ్రాసిస్ వైరస్)
 • సైటోప్లాస్మిక్ వైరస్ (సి.వి)
 • గ్రన్యులోసిస్ వైరస్ (జి.వి)

యన్.పి.వి వైరస్ ద్రావకము

యన్.పి.వి ద్రావకం పిచికారి చేసుకోవటం ద్వారా వివిధ పంటలనాశించే పురుగుల ఉధృతిని తగ్గించుకోవచ్చును. ప్రత్తి నాశించే శనగపచ్చ పురుగు ఉధృతిని తగ్గించటానికి హెచ్.ఎన్,పి.వి ను మరియు పొగాకు లద్దె పురుగు ఉధృతిని తాగించటానికి యన్.పి.వి.వి ను ఎకరాకు 200 ఎల్.ఇ (లార్వల్ ఇక్వలెంట్స్) వాడుకుంటూ సమర్ధవంతంగా తగ్గించుకోవచ్చును. అదే విధంగా ప్రొద్దుతిరుగుడు, టమోట మరియు ఇతర పంటలలో శనగపచ్చ పురుగు నివారణకు ఈ యన్.పి.వి ద్రావకం ఎకరాకు 100 ఎల్.ఇ. కనుక పిచికారి చేసుకొన్నట్లయితే వీటి ఉధృతిని గణనీయంగా తగ్గించవచ్చు. ఆముదం పంట నాశించే నామాలు పురుగు, వేరుశనగ నాశించే ఎర్రగొంగాలి పురుగులకు కూడా ఇదే మోతాదులో వాటికని ఉద్దేశించబడిన యన్.పి.వి ద్రావకాలను వాడి ఉధృతిని నియంత్రించుకోవచ్చును.

బాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు

జీవరసాయనలలో ఒక సింహభాగం బాక్టీరియా ఆధారిత జీవరసాయనలుగా చెప్పుకోవచ్చు. పొడి మరియు ద్రవ రూపంలో లభ్యమయ్యే ఈ జీవరసాయనాలను బి.టి ఫార్ములేషన్స్ లేదా బాటి మందులు అని వాడుక భాషలో పిలుస్తుంటారు. రెక్కల జాతి పురుగులయిన శనగపచ్చ పురుగు, పొగాకు లద్దె పురుగు, నామాల పురుగు వంటి పురుగుల లార్వాలను ఇది ఆశించి వాటిని రోగగ్రస్తం చేయటం ద్వారా ఉధృతిని తగ్గిస్తుంది. మార్కెట్లో వివిధ కంపెనీల ద్వారా ఈ బిటి ఫార్ములేషన్స్ రైతాంగానికి అందుబాటులో ఉన్నాయి. తయారు దారుని బట్టి పొడి లేక ద్రవ రూపంలో డైపేల్, డెల్ఫిన్, బయోబిట్, బయోఆస్ప్, అగ్రిహాల్ట్ వంటి పేర్లతో ఇవి మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పోంటలలో దీనిని వాడుకోవాలను కొన్నప్పుడు 1గ్రా. ప్రతి లీటరు నీటికి లేక ఒక మి.లీ ప్రతి లీటరు నీటికి కలిపి చేను పూర్తిగా నీటిని బట్టి దాదాపు 1 కిలో లేదా 1 లీ. ప్రతి హెక్టారుకు వాడుకోవలసి వస్తుంది.

కీటకనాశన శిలీంధ్రాలు (ఎంటమోఫాధోజెనిక్ ఫంగస్)

పుగుగులనాశించే వివిధ రకాల శిలీంద్రాలను పొడి రూపంలో తయారు చేసి, వాడి పురుగుల ఉధృతిని తగ్గించుకోవడం ఈ మధ్య ప్రాచుర్యంలోకి వచ్చినది. ముఖ్యంగా మూడు రకాల శిలీంధ్ర జాతులు, బవేరియా బసియానా, మోటారైజియం ఎనైసోప్లి మరియు వర్టిసిల్లియం లేకాని మార్కెట్లో వెటబుల్ పౌడర్ (డబ్ల్యు.పి) రూపంలో లభ్యమవుతున్నాయి. ఇవి పంటలలో పిచికారి చేసుకొన్నపుడు హానికారక పురుగులను ఆశించి బుజులాగా ఏర్పడి పురుగును నిర్విర్యం చేస్తాయి. పంట పొలంలో పురుగుల ఉధృతి పెరుగుతుండటం గమనించినపుడు ఈ పొడి మందును 5 గ్రా. ప్రతి లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకొంటే సత్ఫలితాలు సాధించావచ్చు. వీటిలో బవేరియా బసియానా ఆకులను కొరికి తినే గొంగళి పురుగులకు మెటారాయిజియం ఎనైసోప్లి మట్టిలో, మొక్క మొదలులో ఉండే వేరు పురుగు వంటి చిదాలను సమర్ధవంతంగా అరికట్టుతుంది. వర్టిసిల్లియం లేకని వివిధ పంటలలో రసం పేల్చే పురుగుల ఉధృతిని గణనీయంగా తగ్గిస్తుంది. బవేరియా బసియానాను ఉపయోగించి వారిలో సూది దోమ మరియు ఆకు ముడత పురుగులను అదే విధంగా మిర్చి వంటి పంటలో శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగుల ఉధృతిని తగ్గించవచ్చు. వర్టిసిల్లీయం లేకని జివరసాయనం ఇటివల కాలంలో ద్రాక్ష మరియు మామిడిలో పిండి పురుగు నివారణకు విరివిగా వాడటం జరుగుతున్నది. మార్కెట్లో ఈ కిటక నాశక శిలీంధ్రాలు భీమ, బిబిసి, విశ్వ అభయ్, వర్టికేర్, స్పైడర్, రేసర్ వంటి పేర్లతో దొరుకుతున్నాయి.

కీటక నాశక నులి పురుగులు (ఎంటమోపాధోజెనిక్ నిమటోడ్స్)

కీటకాలను ఆశించే నులిపురుగులను కూడా జీవరసాయనాలుగా వాడుకొనే దశలో పురోగతి సాధించటం జరిగినది. హేటిరోరాజ్టైటిస్ మరియు స్టినర్ నిమా ప్రజాతులకు చెందిన నులిపురుగులు హానికారక పురుగుల ఉధృతిని తగ్గించటంలో క్షమత కలిగి ఉండటం ప్రయోగాత్మకంగా రూపంలో రూపొందించి రైతాంగానికి అందుబాటులో పెట్టడానికి విస్తృత పరిశోధనలు జరుగుతున్న రూపేణా ఇవి మార్కెట్లో లభ్యమవటానికి మరికొంత సమయం పట్టవచ్చు.

ఇవే కాకుండా వివిధ పంటల నాశించే తెగుళ్ళ నివారణలో కూడా జీవరసాయనాలు కీలక పాత్ర పోషిస్తున్నయి. కంది, ప్రత్తి, వేరుశనగ మరియు శనగ పంటలకు సోకే ఎండుతెగుళ్ళకు వివిధ పంటలను ఆశించే వేరుకుళ్ళ తెగుళ్ళకు, కురగాయాలలో సాధారణంగా వచ్చే నరుకుళ్ళు తెగుళ్ళుకు, ట్రైకోడెర్మా విరిడి అనబడే ఫంగస్ ఆధారిత జివరసాయనం ఒక సమర్ధవంతమైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సుమారు 4 నుండి 5 కిలోల ట్రైకోడెర్మాను 100 కిలోల పశువుల ఎరువులో కలుపుకొని నాగటి సాలు ద్వారా దుక్కిదున్నేటప్పుడు వేసుకొన్నట్లైతే భూమిలో ఉన్న హానికారక శిలింధ్రాలు నియంత్రించబడి పంట వేసినప్పుడు తెగుళ్ళు గణనీయంగా తగ్గుతాయి. ప్రతి కిలో విత్తనాన్ని 8 నుండి 10 గ్రా ట్రైకోడేర్మాతో విత్తన శుద్ధి చేసి విత్తుకోన్నట్లయితే పలు రకాలు తెగుళ్ళ నుండి పంటని రక్షించుకోవచ్చు. అదే విధంగా వారిలో వచ్చే అగ్గి తెగులు మరియు కాండము కుళ్ళు తెగుళ్ళ నివారణకు సుడోమానాస్ ఫ్లోరెసెన్స్ అనబడే బాక్టీరియా ఆధారిత జీవరసాయనాన్ని 5గ్రా. ప్రతి లీటరుకు కలుపుకొని పిచికారి చేసుకొంటే మంచి ఫలితాలు సాధించవచ్చు.

జీవనియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాలపై వ్యవసాయ దారులకు మంచి నమ్మకం ఉన్నప్పటికీ వాటి లభ్యత మరియు నాణ్యతా పరమయినా సమస్యలు రైతులకు వాటిని దూరంగా ఉంచుతున్నాయి.

రసాయనిక పురుగు మందులకు ధీటైన ప్రత్యామాయంగా జివనియంత్రణ పద్ధతులను మరియు జీవరసాయనాలను వాడాలనుకొంటున్నప్పటికీ మార్కెట్లో రసాయనిక పురుగు మందులు దొరికినంత సులభంగా జీవరసాయనాలు లభ్యం కావటం లేదన్నది ఒక ముఖ్య సమస్య.

మరోవైపు రైతాంగానికి జీవనియంత్రణ పద్ధతులు మరియు జీవరసాయనాల మీద పెరుగుతున్న ఆసక్తిని ఆసరాగా చేసుకొని “బయోఉత్పత్తులు” అనబడే బూటకపు పేర్లతో నాణ్యత లేని/నిషేదించబడ్డ పదార్దాలను మోసపురింతంగా రైతులకు అంట కట్టడం రెండవ అతి పెద్ద సమస్య.

జీవానియంత్రణ పద్ధతులు మరియు జివరసయనాల వాడకంలో ఎదురయ్యే లభ్యతాపరామయిన సమస్యలు –వాటి సమాధానాలు

ట్రైకోగ్రామ గుడ్డు పరాన్నజీవిని ట్రైకోకార్డుల రూపంలో రైతులు వాడుకోదలచినా కూడా మార్కెట్లో వాటి సమయానుసార లభ్యత ఒక ప్రధాన సమస్యగా చెప్పుకోవచ్చు.

తక్కువ నిల్వ శక్తి (9 నుండి 12 రోజులు) ఉన్న ట్రైకోకార్డులను మార్కెట్ వారు అందుబాటులోనికి తేవడానికి వెనుకంజ వేస్తున్నారు. ఈ సమస్యకు సమాధానంగా తెలంగాణ వ్యవసాయ శాఖ వారి అధ్వర్యంలో జీవనియంత్రణ ఉత్పత్తి కేంద్రాలు పని చేస్తూన్నాయి. ఈ కేంద్రాలు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అఖిల భారత జీవనియంత్రణ పరియోజన యొక్క సాంకేతిక, సహకారంతో ట్రైకోకార్డులను వీటిని అందుబాటులో ఉంచుతాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని ఈ కేంద్రం ఉత్పత్త్తి కేంద్రాలకు నోడల్ సెంటరుగా ఉంటుంది. మదర్ కల్చర్ ను అందుబాటులో ఉంచుతుంది.

ట్రైకోడార్మా విరిడి రూ. 100/- ప్రతి కిలో మరియు సూడోమోనాస్ ఫ్లోరోసెన్స్ రూ. 150/- ప్రతి కిలో చొప్పున ఈ కేంద్రాలలో లభిస్తాయి.

మార్కెట్ నుండి రైతు సోదరులు జీవరసాయనాలు కొనుగోలు చేసే సమయంలో పాటించవలసిన మెళకువలు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలు

రెక్కల జాతి పురుగులను నియంత్రించే బవేరియ బసియానా, వేరు నాశించే పురుగులను నిరోధించే మెటారైజియం ఎనైసోప్లి ఏ, రసం పిల్చే పురుగుల సముదాయాన్ని అరికట్టే వర్టిసిలియం లెకాని, వివిధ తెగుళ్ళను నివారించే అజాడిరక్టిన్ (వేప నూనె) వంటి జీవ రసాయనాలు ఈ మధ్య కాలంలో రసాయనిక పురుగు మందులతో సమానంగా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఈ తరహా జీవ రసాయనాలన్నీ కూడా భారత పురుగు మందుల చట్టంలోకి వస్తాయన్న వాస్తవాన్ని రైతాంగం గమనిచాలి. దిగువ జీవ రసాయనాల కొనగోలు సమయంలో గమనించవలసిన విషయాలు పాటించినట్లయితే భావిష్యత్తులో నాణ్యతకు సంబంధించిన సమస్యలు తలెత్తినప్పుడు అమ్మిన వారిపై చట్టపరమైన చర్యలకు ఆస్కారం ఉంటుంది.

రైతాంగం జీవరసాయనాల కొనుగోలు సమయంలో గమనించవలసిన విషయాలు

 • కొనుగోలు చేసే జీవ రసాయనం ప్యాకట్/బాటిల్ పైన ప్రభుత్వంచే జారి చేయబడిన పంజికరణ సంఖ్య మరియు తయారీ లైసెన్స్ ముద్రించబడి ఉన్న విషయాన్ని ధృవీకరించుకోవాలి.
 • జీవ రసాయనాన్ని తయారు చేసిన తేదీ మరియు క్షమతలో తేడా రాకుండా ఎప్పటి వరకు వాడుకోవచ్చు అని తెలిపే తేదీలను తప్పనిసరిగా పరీక్షించుకొని కొనుకోలు చేయాలి.
 • కొనుగోలు సమయంలో సరైన రశీదును పొంది దాని పై అమ్మిన వారి సంతకం ఉన్నదని నిశ్చితపరుచుకోవాలి.
 • ఎటువంటి పరిస్దితులలోను సరైన వివరాలు లేని, రశీదు ఇవ్వని నకిలీ జీవరసాయనాలకు కొనగూడదు మరియు వాడకూడదు.

జీవరసాయనాలను భద్రపరచుకొనుట మరియు వాడకం విషయంలో పాటించవలిసిన మెళకువలు

 • జీవ రసాయనాలను నేరుగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో గాని, తేమ లేక నీరు ఉన్న ప్రేదేశాలలో గాని ఉంచరాదు.
 • వీలయినంత వరకు ప్యాకింగ్ ను వాడుకొనే సమయంలోనే తీయాలి.
 • యన్.పి.వి వైరస్ ద్రావణాన్ని వీలయినంత వరకు సాయంత్రపు వేళల్లో పిచికారి చేయాలి.
 • ట్రైకోడేర్మా లేక సూడోమోనాస్ తో విత్తనశుద్ధి గింజ విత్తుకొనే ముందు మాత్రమే చేయాలి.
 • సిఫారసు చేసిన దాని కంటే ఎక్కువ లేదా తక్కువ మోతాదులో వాడరాదు.

జీవరసాయనలకు సంబంధించి చట్టపరమైన అంశాలు

 • జీవ రసాయనాల నాణ్యత మీద రైతాంగానికి అనుమానాలుంటే రైతులు గాని, వారి ప్రతినిధులు గానీ ఆ నమూనాలను ప్రభుత్వ బయోపెస్టిసైడ్ క్వాలిటి టెస్టింగ్ ల్యాబ్ (జీవ రసాయనాల, గుణ నియంత్రణ ప్రయోగశాల) మలక్ పేట్, హైదరాబాద్ కు ఇచ్చి అధికారికంగా నాణ్యత పరీక్షలు చేయి౦చుకోవచ్చును.
 • జీవ రసాయనాల పేరు మీద ఏ వ్యక్తి అయిన ఏ సంస్ధ అయినా ఉద్దేశపూర్వక మోసానికి పాల్పడినట్లయితే సంబంధిత మండల వ్యవసాయ అధికారికి గాని లేక వ్యవసాయ కమిషనర్ గారి కార్యాలయంలో డిప్యూటీ డైరెక్టర్ (సస్యరక్షణ) గారికి గాని లిఖిత ఫిర్యాదు ఇవ్వవచ్చు.
 • ఈ మధ్యకాలంలో “బయోప్రొడక్ట్స్” (జీవ ఉత్పత్తులు) పేరు మీద పెద్ద ఎత్తున కొన్ని కంపెనీలు వీటిని రైతులకు అంటగట్టడం పరిపాటి అయింది. చట్టపరంగా ఈ బయోప్రోడక్ట్స్ కు ఎటువంటి ప్రభుత్వం అనుమతులు లేకపోయినప్పటికీ, పురుగు మందుల చట్టం మరియు ఎరువుల నియంత్రణ ఆదేశం (ఎఫ్.సి.ఓ) లో పొందు పరచబడక పోవడం వల్ల ఇవి పెద్ద ఎత్తున చలామణి అవుతూన్నాయి. వాటిలో మొక్కల పెరుగుదలను పెంచే కొన్ని రకాల రాసాయనాలను చట్ట విరుద్ధంగా కలపటం వలన మొక్క ఏపుగా పెరిగినట్లు కనపడిన ఆశించిన ఫలితాలు మాత్రం శూన్యం. కొన్ని సందర్బాలలో ఈ బయోపోడక్ట్స్ ఆకర్షణియమైన పేర్లతో అన్ని రకాల రోగాలను, చీడపిడలను నివారిస్తాయనే అబద్దపు ప్రచారాలతో అమాయక రైతులకు అంటగట్టడం జరుగుతున్నది. ఎట్టువంటి అబద్దపు ప్రచారాలను రైతు సోదరులు ఎటువంటి పరిస్దితులలోను నమ్మి మోసపోకుండా చట్టబద్ధమైన జీవరసాయనాలను మాత్రమే వాడుకుంటూ ఆశించిన లాభాలను పొందవచ్చు.
జిల్లాకేంద్రం చిరునామాసహాయ వ్యవసాయ సంచాలకులు ఫోన్ నెం.వ్యవసాయ అధికారి ఫోన్ నెం.
ఆదిలాబాద్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, కృషి కాంప్లెక్స్, సంజయ్ గాంధీ పోలిటెక్నిక్ కాలేజ్, దస్నాపూర్, ఆదిలాబాద్. 8886614525 9963084251
నిజామాబాద్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, అగ్రి మార్కెట్ కమిటి, భవన సముదాయం, శ్రద్ధానంద్ గంజ్, నిజామాబాద్ 8886612710 8886612729
కరీంనగర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, కలెక్టరేట్ భవన సముదాయం, కరీంనగర్ 8886612779 9395109807
మహబుబ్నగర్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, మహబాబ్ నగర్ 8886614763 9441603912
రంగారెడ్డి బయోలాజికల్ కంట్రోల్ లాబ్, డిప్యూటి డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, రైతు శిక్షణా కేంద్రం , రంజేంద్రనగర్, హైదరాబాద్ 8886613913 9581199075
మెదక్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, ఎం.ఆర్.ఓ ఆఫీస్ దగ్గర, స్టేట్ సీడ్ ఫారం, సాదాశివపేట్, మెదక్ 8886614292 8331861189
వరంగల్ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, ములుగు రోడ్డు, వరంగల్ 8886614641 8886614645
నల్గొండ బయోలాజికల్ కంట్రోల్ లాబ్, జాయింట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్, మాన్యం చెలక, నల్గొండ టౌన్, నల్గొండ 8886614435 8297088444
ఖమ్మం బయోలాజికల్ కంట్రోల్ లాబ్, డోర్ నెం. 7/2/120/1 ద్వారకానగర్, గట్టయ్యసెంటర్, ఖమ్మం. 8886614270 8886612847

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.01353965184
రేటింగ్ చేయుటకు చుపించిన నక్షత్రము పైన క్లిక్ చేయండి
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు