ఈమధ్య కాలంలో సేంద్రీయ వ్వవసాయం మీద పెరుగుతున్న ఆసక్తి వలన అభ్యూదయ రైతులు సస్యరక్షణలో రసాయనిక పురుగు మందులకు ప్రత్యూమ్నాయంగా జీవనియంత్రణ సాధనాల మరియు జీవరసాయనాల వాడకం వైపు మొగ్గు చూపుతున్నారు. సిఫారసు చేయబడుతున్న జీవనియంత్రణ సాఓధనాలు మరియు జీవరసాయనాలలో కొన్నింటిని పైతులు మార్కెట్ మీద ఆధారపడకుండా తమ స్థాయిలోనే తయారు చేసుకొనే ఆస్కారం ఉంది. కొద్దిపాటి సామాన్య సామగ్రితో గ్రామ స్థాయిలోనే రైతు పోదరులు ట్రైకోగ్రామా గ్రుడ్డు పరాన్నజీవి, ఎస్.పి.వి వైరస్ ద్రావకము, వేప గింజల కఫాయం మరియు పొగాకు కషాయములను తమంత తాము తయారు చేసుకొనె తమ పోలంలో వాడుకోవడమే కాకుండా తోటి రైతులను కూడా అందించి వీటి లభ్యత మరియు నాణ్యత పరమైన సమస్యలను కూడా అధిగమించవచ్చు.
ప్రతి పురుగు జీవన చరిత్ర గ్రుడ్డు దశ, గొంగళి పురుగు దశ, కోశస్థ దశ (నిద్రావస్థ దశ) మరియు రెక్కల పురుగు దశ అనబడే నాలుగు దశలలో పూర్తి అవుతుంది. సహజ సిద్దంగా ప్రతి దశ, శత్రు పురుగులకు లోనవుతూ ఉంటుంది. చీడపురుగు యొక్క గ్రుడ్లు మీద పరాన్నజీవుల దాడి వలన గొంగళి దశ రాకుండా నాశనమై, అందులో నుండి పరాన్నజీవులు ఉత్పత్తి అవుతాయి. వీటిని గ్రుడ్డు పరాన్నజీవిలుగా వ్యవహరిస్తారు. గ్రుడ్డు దశను నశింపజేసే పరాన్నజీవుల్లో ముఖ్యమైనవి ట్రైకోగామా గ్రుడ్డు పరాన్నజీవి. ఇది వివిధ రకాల పంటలలో పలు రకాల పురుగలపై గ్రుడ్డు దశలో ఆశించి వాటిని నాశనం చేస్తుంది. ట్రైకోకార్డులుగా వ్యవహరించబడే పరాన్నజీవులు ఆశించిన గ్రుడ్ల కార్డులను రైతు సోదరులు పంట పోలాల్లో ఎకరాకు నాలుగు చొప్పున ఆకు అడుగు భాగంలో అమర్చుకొన్నట్లయితే, ఆశించిన ఫలితాలను పొందవచ్చును. పరాన్నజీవులను రైతులు తమంత తాము కూడా ఊ క్రింది విధానం ద్వారా పెంపొందించుకోవచ్చు. బాగా ఎండిన జొన్నలు గాని, మొక్కజొన్నలు గానీ మర పట్టించి పిండిని ఆరబెట్టాలి. ప్రత్యేకంగా తయారు చేయబడిన చెక్కడబ్బాలు లేక గాజు జార్లలో ఆరబెట్టిన పిండిని వేయాలి. బియ్యపు పురుగు గుడ్లను పిండి మీద జల్లి మూతబెట్టాలి. గాలి సోకడానికి వీలుగా రంధ్రాలుండే మూతలను డబ్బాలను మూయడానికి వాడాలి. గాడు జార్లు అయితే పల్చటి గుడ్డను మూతగా ఉపయోగించాలి. సుమారు 40 రోజుల తరువాత నీటు నుండి పెక్కల పురుగులు బయటకు రావడం మొదలవుతుంది. ప్రతీ రోజు ఈ పురుగులను సేకరించి గ్రుడ్లను పెట్టడానికి జల్లెడ అమర్చిన గరాటునందు వేయాలి. తల్లి పురుగులు పెట్టిన గ్రుడ్లను తీసుకొని శుభ్రం చేసి, సన్నటి జల్లెడ ద్వారా జల్లించి వాలుగా ఉన్న పేపరు పైన క్రిందకు జారవిడిచి ఆ విధంగా వచ్చే మంచి గ్రుడ్లను వేరు చేయాలి. ఈ గ్రుడ్లలో కొన్నింటిని, పరాన్నజీవులను పెంచటానికి, మరికొన్నింటిని పండి పురుగులను పెంచటానికి ఉపయోగించుకోవాలి. ఈ గ్రుజ్లను జిగురు రాసిన కార్డు (15 x 15 సెం.మీ) ల పైన చల్లి అతికించి, ఆరిన తరువాత గాజు గొట్టాల్లో ఉంచాలి. ట్రైకోగ్రామా పరాన్నిజీవులను ఈ కార్డు ఉన్న గాజు గొట్టాల్లో వదిలి దూది బిరదాతో మూయాలి. పరాన్నజీవులకు తోనెను గాజు కాగితం పైన బెట్లు బెట్లుగా ఉంచి గాజు గొట్టాల్లో ఉంచాలి. ఒక రోజు తరువాత గ్రుడ్లున్న కార్డును తీసి వేరొక గాజు గొట్టంలో ఉంచి దూది బిరడాతో మూయాలి. నాలుగవ రొజునకు పరాన్నజీవి గల గ్రుడ్లు నలుపు రంగుకు మారుతాయి. వీటిని ట్రైకోకార్డ్ అంటారు. 8 నుండి 9 రోజుల్లో ఈ ట్రైకోకార్డ్ ల నుండి ట్రైకోగ్రామా పురుగులు బయటకు వస్తాయి. ఈ పరాన్నజీవిని పంట పోలాలలో వాడుకోవాలి అనుకున్నపుడు రెండు రోజుల ముందు అనగా 7వ రోజున ట్రైకోకార్డును చిన్న చిన్న ముక్కలుగా చేసి పంట పోలాల్లో 5 మీటర్లకు ఒకటి చొప్పున ఆకు అడుగు బాగాన పిన్ చేయాలి. ట్రైకోగ్రామా పరాన్నజీవులు మరుసటి రోజున బయటకు వచ్చి హానికారక పురుగుల గ్రుడ్లను వెతికి ఆశించి నాశనం చేస్తాయి. ప్రత్తి, కూరగాయలు మొదలైన పంటల మీద వచ్చే శనగపచ్చ పురుగు, ఆముదం పై వచ్చే నామాల పురుగు, వరిలో వచ్చే కాండం తొలుచు పురుగు, ఆకుముడత పురుగు, చెఱకు పై వచ్చే కాండం తొలుచు పురుగుల యొక్క గ్రుడ్ల మీద ఈ ట్రైకోగ్రామా గ్రుడ్లు పరాన్నజీవులను వాడుకుంటూ వాటి ఉధృతిని నివారించుకోవచ్చు.
శనగపచ్చ పురుగు, ఆముదం మీద వచ్చే నామాల పురుగు, లద్దె పురుగలను నివారించడానికి న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ ద్రావణాన్ని ఉపయోగిస్తన్నారు.
దీనిని పెండు విధాలుగా తయారు చేసుకోవచ్చు.
ఎన్.పి.వి ద్రావణం తయారు చేయటానికి 7-8 రోజుల వయస్సు గల పొగాకు లద్దె పురగు లేక 5-7 రోజుల వయస్సు గన శనగపచ్చ పురుగు లార్వాలను ఎన్నుకొని వాటిని 8 గంటల పాటు ఆహారం లేకుండా పుండాలి. పొగాకు లద్దె పురుగు లార్వాలకు వైరస్ వ్యాధి సోకించుటకు ఆముదం ఆకులను ఎన్.పి.వి ద్రావణంలో 15-20 ని. ముంచి ఆకులు ఆరాక వాటిని ఒక పాత్రలో వుంచి 50 నుండి 70 లార్వాలను ఆకులపై వదలాలి. శనగపచ్చ పురుగు లార్వాలకు వ్యాధి సోకించేందుకు మూడవ దశకు చేరిన లార్వాలను విడివిడిగా చిన్న ఖాళీ సీసాల్లో వుంచాలి. వాటికి నీటిలో నానిన శనగ గింజలను వైరస్ ద్రావణంలో ముంచి రోజుకు ఒకటి లేదా రెండు గింజలను ఆహారంగా ఇవ్వాలి. పైరస్ కలిగిన ఆహారాన్ని లార్వాలకు రెండు రోజులు పెట్టి ఆ తరువాత వైరస్ లేని ఆహారాన్ని ఇవ్వాలి. వైరస్ కలిగిన ఆహారం తిన్న 4 లేక 5 రోజులకు లార్వాలకు వైరస్ వ్యాధి సోకి 7 లేక 8 రోజులకు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా వ్యాధి సోకి చనిపోయిన 200 లార్వాలను మంచి నీరు గల పాత్రలో వేసి వారం రోజుల పాటు ఉంచాలి. ఈ విధంగా చేయటం వలన వైరస్ సోకిన లార్వాలు కుళ్ళి పాత్ర అడుగు భాగానికి చేరతాయి. వైరస్ కణాలు ఉన్న ద్రావణాన్ని మిక్సీలో వేసి పెండు మూడు నిమిషాలు త్రిప్పి వడపోయాలి. ఈ విధంగా వడగట్టిన ద్రావణాన్ని మంచి నీరు కలిపి 7 రోజులు చల్లని ప్రదేశంలో నిల్వ చేయాలి. ఆ తర్వాత పైన తోలిన తట్టును తీసివేసి అడుగు భాగంలో ఉన్న చిక్కటి పదార్ధాన్ని మరు కొంచెం మంచి నీటిని కలిపి 500 ఆర్.పి.ఎమ్ వద్ద 5 నిమిషాల పాటు సెంట్రీఫ్యూజ్ చేయాలి. పైన తేలిన తేటను వేరే గాజు గొట్టంలోకి మార్చి దానిని సెట్రీఫ్యూజ్ లో వుంచి 2500 ఆర్.పి.ఎమ్ వద్ద 15-20 ని. పాటు పెంట్రూఫ్యూజ్ చేసి గొట్టం అడుగు భాగాన చేరిన వైరస్ ను తీసుకొని గాజు సీసాల్లో నింపి ఫ్రిజ్ లో శుభ్రపరుచుకొని పైరు పై పురుగు కనిపించినప్పుడు ఈ ద్రావణాన్ని తగిన మొతాదులో నీరు కలుపుకుంటూ ఉపయోగించాలి.
రైతులు పొలంలో వైరస్ వ్యాధి సోకి తల క్రిందులుగా వేలాడుతున్న లార్వాలను సేకరించుకోవాలి. ఈ లార్వాలను ఒక పాత్రలోకి తీసుకొని మంచి నీళ్ళు కలిపి మెత్తగా నూరి ద్రావణం తయారు చేసి పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి. 200 వ్యాధి సోకిన పురుగుల నుండి వచ్చిన ద్రావణానికి 200 లీ. నీటిని, 1 కిలో బెల్లం మరియు 100 మి.లీ. టీపాల్ లేదా రాబిన్ బ్ల్యా చేర్చి ఎకరం పొలంలో పిచికారి చేయాలి. టీపాల్ లేక రబిన్ బ్ల్యూ అందుబాటులో లేని పరిస్థితులలో తేలికపాటి సబ్బు ద్రావణాన్ని కూడా ప్రత్యూమ్నాయంగా వాడుకోవచ్చు.
పైరులో అమర్చిన లింగాకర్షక బుట్టలోని 8-10 రెక్కల పురుగులు ఆకర్షించబడిన పెండు వారములలో గాని లేక పైరుపై పురుగు గుడ్లను గమనించడం జరిగిన వారం రోజుల్లో వైరస్ ద్రావణాన్ని పైరుపై పిచికారి చేయాలి.
ఎన్.పి.వి వ్యాధి సోకిన పురుగులు మెత్తబడి నల్లగా మారుతాయి. పురుగు అడుగు భాగము గులాబి రంగులోకి మారుతుంది. ఇవి మొక్కల పైభాగానికి ప్రాకి పై నుండి క్రిందకు వేలాడుతూ చనిపోతాయి లేదా ఆకుల మద నల్లగా కరుచుకు పోయినట్లుంటాయి. వ్యాధి సోకిన పురుగు చర్మాన్ని తాకినట్లయితే వదులుగా వుండి చర్మం పగిలి శరీరం నుండి తెల్లని ద్రవం బయటకొస్తుంది.
ఎన్.పి.వి ద్రావణాన్ని మొక్క అంతటా సమంగా తడిచేటట్లు పిచికారి చేయాలి. పిచాకరి చేసేటప్పుడు మధ్య మధ్యలో ద్రావణాన్ని కర్రతో బాగా కలపాలి. సాయంత్రం దశలో వాతావరణం నల్లగా ఉన్నప్పుడు మాత్రమే పిచికారి చేయాలి. సూర్యరశ్మి గల సమయంలో పిచికారి చేసినట్లయితే సూర్యరశ్మిలో ఉన్న అతినీలలోహిత కిరణాలు వైరస్ సామర్థ్యాన్ని తగ్గిస్తాయి. ఎన్.పి.వి ద్రావణం పిచికారి చేసే ముందు మాత్రమే నీటితో కలిపి తయారు చేసుకోవాలి. నిల్వ వుంచిన ద్రావణాన్ని పిచాకరి చేస్తే వైరస్ సామర్థ్యం తగ్గుతుంది. అవసరాన్ని బట్టి 10 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారి చేయాలి.
పొగాకు కషాయం తయారు చేయుటకు గాను 500 గ్రా. పొగాకును 4-5 లీ. నీటిలో 24 గంటలు నానబెట్టాలి. 320 గ్రా. బార్ సబ్బు పొడిని వేరే పాత్రలో కలియబెట్టి తయారు చేసుకున్న పొగాకు కషాయాన్ని కలపాలి. ఈ గ్రావణాన్ని 6-7 రేట్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు.
వేపగింజలను తీసుకొని, పొడిగా చేసి, కిలో పొడిని పలుచని గుడ్డ సంచిలో పోసి, మూతని కట్టి 20 లీ. నీటిలో రాత్రంతా నానబెట్టాలి. ఇలా నానబెట్టిన సంచిని వీలైనన్ని సార్లు గట్టిగా పిండాలి. ఇలా చేయటం వలన పొడిలో ఉన్న అజాడిరాక్టిన్ మూల పదార్ధం కషాయంలోకి బాగా వస్తుంది. పూర్తిగా పిండిన తరువాత పిప్పి కలిగిన సంచిని పారవేయాలి. ఈ విధంగా 5% వేప కషాయం తయారవుతుంది. ఈ ద్రావణాన్ని 20 గ్రా. సబ్బు పొడి కలిపి బాగా కరిగంచాలి. ఈ కలిపిన కషాయాన్ని పలుచని గుడ్డ ద్వారా వడపోయాలి., లేనట్లయితే కషాయంలో పుండిపోయిన పదార్ధాలు స్ప్రేయర్ నాజిల్ లో చిక్కుకొని పిచికారికి అంతరాయం కలుగుతుంది. ఈ విధంగా అవసరమైన ద్రావణాన్ని తయారు చేసుకొని పిచికారి చేయవచ్చు.
జీవనియంత్రణ సాధనాల తయారీ, వాడకంపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ:ప్రధాన శాస్త్రవేత్త & హెడ్, అఖిల భారత జీవనియంత్రణ పరియోజన, ఏ.ఆర్.ఐ, రాజేంద్రనగర్, హైద్రాబాద్, ఫోన్ నెం. 040-24010031, 24015011, ఎక్స్టెంషన్: 428
చివరిసారిగా మార్పు చేయబడిన : 1/22/2020