పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీలకర్ర సాగుకు సమయమిదే

జీలకర్ర సాగుకు సమయమిదే.

జీలకర్రను మసాలా పొడిగా పంటలలో వినియెగిస్తారు. అదే విధంగా డయేరియా, విరోచనాలా నీత్రోదకారిగా ఆయుర్వేద, పశువైద్యంలో హోషధంగా కూడా ఉపయేగిస్తున్నారు. ఇంకా సాయందర్య సాధనల్లోనూ జీలకర్రను వినియెగించడం వాళ్ళ ఈ పంటకు దేశ విదేశాల్లో మంచి మార్కెట్ ఉంది.

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా జీలకర్రను పండించి, ఎగుమతి చేస్తున్న దేశం ఇరాన్. భారతదేశంలో రాజస్ధాన్, గుజరాత్, తమిళనాడులలో అధికంగా సాగుచేస్తున్నారు. ఇంకా ఉత్తరప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్ లలో జీలకర్ర తక్కువ విస్తీర్ణంలో సాగవుతున్నది. స్వల్పకాలంలో అధిక ఆదాయాన్నిచ్చే ఇలాంటి పంటల సాగు పై తెలంగాణ రాష్ట్ర ఉద్యానశాఖ ఈ రబి నుంచి ప్రత్యేక దృష్టి సారించి ప్రత్సాహకాలను అందిస్తున్నది. ఈ తరుణంలో జీలకర్ర సమగ్ర సాగు నివారలు.

వాతావరణం : జీలకర్ర ఉష్టమండలపు పంట. పూత ఏర్పడి, గింజ తయారయ్యే ఫిబ్రవరి-మర్చి మాసాల్లో గాలిలో తేమ తక్కువగా ఉండే ప్రాంతాలు సాగుకు అనుకూలం. ముఖ్యంగా తెలంగాణలో రబి పంటగా సాగు చేసుకోవచ్చు. సముద్ర మట్టం నుండి 1800-3000 మీ. ఎత్తు వరకు ఉన్న ప్రదేశాలు జీలకర్ర సాగుకు అనుకూలం. గాలిలో తేమ అధికంగా ఉంటే ఎక్కువ చీడపీడలు ఆశించే అవకాశం కలదు.

నేలలు : నీరు నిలబడని, తేమ నిలుపుకునే సారవంతమైన భూముల్లో మంచి దిగుబడి వస్తుంది. తేలికపాటి భూములలో ఎండు తెగులు ఆశించే అవకాశం అధికం. కొద్దగా శరత్వం అధికంగా మాటే ఉదజని సూచిక 8-9 వరకు ఉన్న భూములలో కూడా ఈ పంటను సాగు చేసుకోవచ్చు.

రకాలు

ఆర్.ఎస్- 1

రాజస్ధాన్ లో ఎంపిక చేసిన త్వరగా కోతకు వచ్చే రకం. సాధారణ రకాల కన్నా 10-12% అధిక దిగుబడినిస్తుంది. హెక్టారుకు 763 కిలోల దిగుబడినిస్తుంది.

ఎం.సి. 43

110-115 రోజుల పంట. హెక్టారుకు 580 కిలోల దిగుబడినిస్తుంది. చీడపీడలను తట్టుకొంటుంది.

గుజరాత్ క్యుమిన్ - 1

ఈ రకం ఎం.సి.-43 కన్నా 23% అధిక దిగుబడినిస్తుంది. 105-110 రోజుల పంట. హెక్టారుకు 735 కిలోల దిగుబడినిస్తుంది. మూడు, ఎండు తెగుళ్ళను తట్టుకొంటుంది.

గుజరాత్ క్యుమిన్

2, 3 కూడా సాగులో ఉన్న అధిక దిగుబడినిచ్చే రకాలు.

యు.బి.- 19

ఈ రకం జీలకర్ర ఆకర్షణీయమైన రంగును కలిగి ఉంటుంది.

యు.సి. 220, యు.సి. 217, జె.సి. 147

ఈ రకాలు జీలకర్ర లో సుగంధ తైలం ఎక్కువగా ఉంటుంది. నూనెను తీసుకోవాలనుకునే వాళ్ళు ఈ రకాలను సాగు చేసుకోవచ్చు.

రాజస్ధాన్ జీర - 19

రాజస్ధాన్ లోని ఎస్.ఎన్.జె. వ్యవసాయ కళాశాల రూపొందించిన రకం. హెక్టారుకు 570 కిలోల దిగుబడినిస్తుంది. కాలపరిమితి 120-130 రోజులు. ఎండు తెగులును తట్టుకొంటుంది.

పొలం తయారీ

జీలకర్ర మొక్క వేర్లు 6 అంగుళాలు మించి లోతుకు వెళ్ళవు. తేలికపాటి దుక్కి సరిపోతుంది. బాగా చదును చేసిన తరువాత 2*2.5 మీ. మడులు చేసుకొని విత్తనాలు విత్తుకోవాలి.

విత్తే సమయం

నవంబరు నుండి డిసెంబరు 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తకుంటే చీడపీడల బెడద ఎక్కువగా ఉండటం వల్ల దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి నవంబరు మొదటి పాశంలో విత్తుకొంటే అధిక దిగుబడులు సాధించవచ్చు.

విత్తన మేతదు

జీలకర్రను వెదజల్లవచ్చు లేదా సాళ్ళలో విత్తుకోవచ్చు. వెదజల్లితే హెక్టారుకు 20 కిలోల విత్తనం, సాళ్ళలో విత్తుకొంటే హెక్టారుకు 12 కిలోల విత్తనం అవసరం అవుతుంది.

విత్తనశుద్ధి

విత్తన నిద్రవస్ధను తొలగించుటకు, మెలిక శాంతను పెంచుటకు 100  పి.పి.యం. పొటాషియం నైట్రేట్ ద్రావణంలో 24 గంటల నానబెట్టుకోవాలి, కిలో విత్తనానికి అగ్రోసం 3 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. సేంద్రియ వ్యవసాయదారులైతే ట్రైకోడెర్మా విరిడితో విత్తనశుద్ధి చేసుకోవాలి.

విత్తే విధానం

సాళ్ళలో విత్తుకొనే వాళ్ళు సాళ్ళ మధ్య 22.5 సెం.మీ. మొక్కల మధ్య 15 సెం.మీ దూరం ఉండేటట్లుగా, 1-2 సెం.మీ. లోతులో విత్తనం పడేటట్లుగా నాటుకోవాలి. విత్తనం సరిగా నాటితే 5-7 రోజులలో మెలిక వస్తుంది. మొక్కలు 5 సెం.మీ. ఎత్తులో ఉన్నప్పుడు వత్తుగా ఉన్న మొక్కలు తీసి ఖాలీలల్లో వేసుకోవాలి.

ఎరువుల యాజమాన్యం

ఆఖరి దుక్కిలో 15 టన్నుల బాగా చివికిన పశువుల ఎరువును హెక్టారు పొలంలో వేసుకోవాలి. విత్తిన 30 రోజుల తరువాత 35 కిలోల యూరియా, 10 కిలోల మ్యురేట్ అఫ్ పోటాష్ లను పైపాటుగా వేసుకోవడం స్వర అధిక దిగుబడులు పొందవచ్చు.

నీటి యాజమాన్యం

నెలలో తేమ తక్కువగా ఉంటే విత్తుకోవడానికి ముందే తేలికపాటి తరినిఇవ్వాలి. విత్తిన వెంటనే తేలికపాటి తడి ఇవ్వాలి. 7-8 రోజులకి మరల తడి ఇవ్వాలి. నెల స్వభావం, వాతావరణాన్ని బట్టి 12-15 రోజులకొక తడి ఇస్తూ, ఉండాలి. పంట కాలంలో 5-6 తడులు సరిపోతాయి. పూత, గింజ ఏర్పడే సమయాల్లో నీటి తడులు తప్పనిసరిగా ఇవ్వాలి. పంట కోతకు వస్తున్న దశలో నీటి తడులు అపి వేయాలి లేనటయితే విత్తన నాణ్యత దెబ్బతింటుంది.

అంతరకృషి

విత్తిన 30-40 రోజుల్లో తొలిసారి కలుపు తీయాలి. తర్వాత 1-2 సార్లు కలుపు తిస్తె పంట పెరుగుదల బాగుంటుంది.

సస్యరక్షణ

పేనుబంక

పెద్ద, చిన్న పురుగులు లేత చిగుళ్ళు, ఆకుల నుండి రసం పీల్చి నష్టం కలిగిస్తాయి. పేనుబంక, ఇతర రసం పీల్చే పురుగుల నివారణ కొరకు డైమిదోయేట్ లేదా పిప్రానిల్ 2 మీ,లి, లీటరు నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు

గాలిలో అధిక తేమ, మంచి ఉదృతి అధికంగా ఉన్న సమయంలో ఈ తెగులు ఆశిస్తుంది. ఆకుల పై తెల్లని పొడి వంటి పదార్ధం ఏర్పడి, తెగులు ఉదృతి అధికమైతే, పసుపు రంగులు మరి రాలిపోతాయి. దిగుబడి తగ్గుతుంది. దీని నివారణకు లీటరు నీటికి హెక్సాకోనజోల్ 2 మీ.లి. లేదా అజాక్షిప్ట్రాబిన్ 1 మీ.లి. కలిపి పిచికారీ చేసుకోవాలి. వారం రోజుల వ్యవధితో మరోసారి పిచికారీ చేసుకోవాలి.

కోత

విత్తిన 80-120 రోజులలో పంట సాధారణంగా కోతకు సిద్ధమవుతోంది. అప్పటికే మొక్క పసుపు టంగులోకి మారుతుంది. గింజలు రాలటం మెదలవ్వకముందే మొక్కను ఉదయం మేళాలో వేర్లతో సహా పైకి కుప్పవేసి 2-3 రోజులు ఎండబెట్టాలి. ఎండిన మొక్కలను కర్రలతో కొట్టి లేదా చేతులకు గ్లుజలు ధరించి రుద్ది జీలకర్రను నూర్చాలి. శుభ్రపరచి జీలకర్రను పాలిథిన్ లైనింగ్ గల గొనె సంచులలో నింపి నిల్వచేసుకోవాలి.

దిగుబడి

సరియైన సమయంలో విత్తుకోని, నీటి వసతి ఉండి, చీడ పీడల బారిన పడకుంగా పంటను సాగు చేసినట్లయితే హెక్టారుకు 7-8 క్వింటాళ్ళ దిగుబడి సాధించవచ్చు.

ఆదాయం

కిలో రూ. 200/- చొప్పున హెక్టారుకి రూ. 1,40,000/- రూ. 1,60,000 వరకు ఆదాయం పొందవచ్చు. ఖర్చులు రూ. 50 వేలు పోను హెక్టారుకి 90 వేళా నుండి లక్ష పదివేల వరకు నిఖారాదాయం స్వల్పకాలంలో పొందవచ్చు.

ప్రోత్సాహకాలు

జీలకర్ర పంటను సాగుచేసే వారికీ ఎకరానికి పెట్టుబడి వ్యయంలో 75% కింద రూ. 9 వేళా రాయితీని ఇస్తారు. అదే విధంగా జీలకర్రను సాగు చేసే రైతులకు అదేకారానికి సరిపడా విత్తనాలను ఉచితంగా అందిస్తారు.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

2.5
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు