హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / జీవన ఎరువులు వాడండి - నాణ్యమైన దిగుబడి పొందండి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

జీవన ఎరువులు వాడండి - నాణ్యమైన దిగుబడి పొందండి

జీవన ఎరువులు వాడడం మంచిది. జీవన ఎరువులను ఉపయోగించి అధిక లాభాలను పొందిన వారి వివరాలు చూద్దాం.

అధిక దిగుబడులనాశించి రైతులు విచక్షణా రహితంగా , రసాయన ఎరువులు, పురుగు, తెగుళ్ళ మందులు వాడడం వలన పొలాలు నిర్జీవంగా మారుతున్నాయి. బహుళ ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించడం వలన, వాటి ద్వారా లభించాల్సిన సేంద్రియ పదార్థాలు, సూక్ష్మపోషక పదార్థాలు పూర్తిగా అదృశ్యమై అనేక రకాలైన పురుగులు, తెగుళ్ళు పంటలను ఆశించడం, పంట పెరుగుదలలో లోపం ఏర్పడడం, మొక్కలలో రోగ నిరోధక శక్తి నశించడం, పంట దిగుబడి క్రమేణా తగ్గడం వంటివి జరుగుతున్నాయి.

కృత్రిమ వ్యవసాయ విధానాల కన్నా సహజ సేంద్రియ వ్యవసాయం అన్ని విధాల మేలని శాస్త్రవేత్తల పరిశోధనల సారాంశం. అందువలన జీవన ఎరువులు వాడడం మంచిది.

జీవన ఎరువులలో సూక్ష్మజీవుల జీవకణాలు ఉంటాయి. వీటిలో నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలకు సంబంధించినవి ముఖ్యమైనవి. జీవన ఎరువులలోని సూక్ష్మజీవులు గాలిలోని నత్రజనిని నేలలో స్థిరీకరించడమే కాకుండా, వెక్క ఎదుగుదలకు సహాయపడే కొన్ని రకాల విటమిన్లు, హార్మోన్లు, శిలీంధ్ర నాశక పదార్థాలను కూడా ఉత్పత్తి చేస్తాయి. సూక్ష్మజీవులు కొన్ని రకాల సేంద్రియ ఆమ్లాలను నేలలోకి విడుదల చేయడం ద్వారా నేలలో కరగని భాస్వరం పదార్థాలను కరిగేటట్లు చేసి, మొక్కలకు అందుబాటులోకి తెస్తాయి.

కాబట్టి ప్రస్తుత తరుణంలో తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన పోషకాలను అందించే జీవన ఎరువులను వాడడం మేలని శాస్త్రజ్ఞులు, వ్యవసాయశాఖ సిఫారుసు చేస్తున్నాయి.

ఈ జీవన ఎరువులను తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయశాఖ ద్వారా జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్లో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ ప్రయోగశాలలో నత్రజని స్థిరీకణ చేసే జీవన ఎరువులు అంటే రైజోబియం, అజోస్పైరిల్లం, అజటోబ్యాక్టర్, భాస్వరం కరిగించే బ్యాక్టీరియా (పి.ఎస్.బి), పొటాష్ కరిగించే బ్యాక్టీరియా (కె.ఎస్.బి) ఉత్పత్తి చేసి రైతులకు, వ్యవసాయశాఖ వారు పెట్టిన స్కీమ్ లు అంటే ఎన్.ఎఫ్.ఎస్.ఎం, ఆర్గానిక్ ఫార్మింగ్, ఎన్. ఎం.ఒ.ఒ.పి., పి.కె. విలకు పంపుతున్నారు. ప్రతి సంవత్సరం ఈ ప్రయోగశాలలో 110-150 టన్నుల జీవన ఎరువులను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు చెందిన రైతులు నేరుగా వచ్చి ఈ జీవన ఎరువులను రాజేంద్రనగర్ లోని జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాలలో కొనుగోలు చేసి వాటిని తమ పంట పొలాలకు ఉపయోగిస్తున్నారు.

ఈ ఏడాది కూడా 185 మంది రైతులు సుమారు ఏ 4885 కిలోల జీవన ఎరువులను వివిధ పంటలకు నత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను అందించే జీవన ఎరువులను రాజేంద్రనగర్ లో గల జీవన ఎరువుల ఉత్పత్తి ప్రయోగశాల నుండి కొనుగోలు చేశారు.

ప్రతి ఏటా ఈ జీవన ఎరువులను క్రమం తప్పకుండా ఉపయోగించి అధిక లాభాలను పొందిన వారి వివరాలు

ఆలపాటి సురేష్ - ఆర్ గార్లపాడ్ (గ్రా), ఇటిక్యాల (మం), జోగులాంబ (జిల్లా) సెల్: 9052722625

ఈ రైతు ఖరీఫ్ 2017 మినుము పంటకు గాను . రైజోబియం, పి.ఎస్.బి. జీవన ఎరువులను వాడి ఎకరానికి 10-12 క్వింటాళ్ళ దిగుబడి సాధించినట్లు తెలియజేశారు. ఈ రైతు గత ఏడాది శనగ పంటకు గాను రైజోబియం, పి. ఎస్.బీ. వాడి 5 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి సాధించారు. తమ పొరుగు వారు ఈ జీవన ఎరువులను వాడలేదు. వారికి 2-3 క్వింటాళ్ళ దిగుబడి వచ్చినట్లు ఆలపాటి సురేష్ పేర్కొన్నారు.

వి. బసవయ్య – 9246045705

ఈ రైతు గత ఏడాది కమ్మేటా (గ్రా.), చేవెళ్ళ (మం) రంగారెడ్డి జిల్లాలో అన్ని కాల కూరగాయలను సాగుచేశారు. వీటికి గాను అజోస్పైరిల్లం, పి.ఎస్.బి., జీవన ఎరువులను వాడి అధిక లాభాలను పొందినట్లు పేర్కొన్నారు.

ఈ ఏడాది కూడా ఈరైతు నారసింహాపురం (గ్రా) ఓరుకుంట పాడు (మం), నెల్లూరుజిల్లాలో మినుము పంటకు గాను రైజోబియం , పి. ఎస్.బి., కె. ఎస్.బి. జీవన ఎరువులను కొనుగోలు చేసి వాడడం జరిగింది.

బసవయ్య గారు తాను వాడడమే కాకుండా ఇద్దరు ముగ్గురు రైతులను కూడా రాజేంద్రనగర్ లోని జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాలకు తోడుకొని వచ్చి వాటి లాభాలను చెప్పి వారు కూడా ఈ జీవన ఎరువులను కొనుగోలు చేసి వాడేలా చేశారు.

వీర అశోక్ కుమార్ గౌడ్ - 8309543888

ఈ రైతు ప్రతి సంవత్సరం శనగ పంటకు గాను రైజోబియం , పి.ఎస్.బి., కె.ఎస్.బి జీవన ఎరువులను నందికంది (గ్రా), సదాశివ్ పేట్ (మం), సంగారెడ్డి జిల్లాలో సాగుచేస్తున్నారు.

వీరు ఈ జీవన ఎరువులను వాడి అధిక దిగుబడి సాధించడమే కాకుండా భూసారం బాగా పెంపొందినట్లు పేర్కొన్నారు. ఈ రైతుకు 9-10 క్వింటాళ్ళు ఎకరానికి దిగుబడి వచ్చినట్లు తెలిపారు.

మరుగుంట్ల గాయత్రి దేవి, భర్త : పుల్లారెడ్డి - 9440407284, తరిగోపుల గ్రా. ధారూర్ మం., వికారాబాద్ జిల్లా.

వీరు వరిలో ఆర్. ఎన్. ఆర్ 15048, బాస్మతి రకం పంటకు గాను అజోస్పైరిల్లం, పి.ఎస్.బి., కె.ఎస్.బి., జీవన ఎరువులను భూమిలో ఆఖరి దుక్కిలో వేశారు. వీరు పూర్తిగా కేవలం సేంద్రియ పద్ధతిలోనే సాగు చేసారు. రసాయన ఎరువులు, పురుగు మందులు వాడకుండా నాణ్యమైన పంట, అధిక లాభాలను సాధించినట్లు పేర్కొన్నారు.

ఎం.సి. మహాశెట్టి - 9448145647

ఈయన బాల్కి బీదర్ నుండి ప్రతి సంవత్సరం రాజేంద్రనగర్లో గల జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాలకు వచ్చి కూరగాయ, శనగ పంటకు గాను జీవన ఎరువులను అనగా అజోస్పైరిల్లం, రైజోబియం , పి.ఎస్.బి., కె.ఎస్.బి, వాడి అధిక దిగుబడులను, సారవంతమైన భూమిని పొందినట్లు తెలిపారు.

పుల్లారెడ్డి - 9491489881, మనోపాడ్ (గ్రా), మహబూబ్ నగర్ జిల్లా.

వీరు ఈ ఏడాది ఖరీఫ్కు గాను మినుము పంట వేశారు. ఈ పంటకు గాను రైజోబియం, పి. ఎస్. బి.కె. ఎస్. బి. వాడి 7-8 క్వింటాళ్ళ దిగుబడి సాధించినట్లు తెలిపారు.

ధర్మారెడ్డి - రిటైర్డ్ ఎంటమాలజీ అడ్వైజర్ అగ్రికల్చర్ ఆఫీసర్) రాజేంద్రనగర్, 9110347848

కోత్తాపూర్ (గ్రా), సంగారెడ్డి జిల్లా వీరు ఖరీఫ్ 2017న ఆర్.ఎన్. ఆర్15048 వరి రకం పూర్తిగా సేంద్రియ పద్ధతిలో సాగు చేశారు. వీరు రాజేంద్రనగర్ లోని ప్ర యోగ శాల నుండి అజోస్పైరిల్లం, పి. ఎస్.బి., కె. ఎస్.బి., జీవన ఎరువులను వరి పంటకు కొనుగోలు చేసి వాడారు. వీరికి 30-35 బ్యాగులు ఎకరానికి దిగుబడి వచ్చినట్లు పేర్కొన్నారు. వీరు వాడటమే కాకుండా జీవన ఎరువుల ప్రాధాన్యతను అందరికీ ప్రచారం చేస్తున్నారు.

పోకిరి సాయిక్రిష్ణ - 9642636770

వీరు మెదక్ జిల్లా కొహిర్ మండలం చింతల్  ఘాట్ గ్రామం వద్ద పొలం కొని ఆరు ఎకరాలలో శనగ సాగు చేశారు. వీరు పూర్తి స్థాయిలో సేంద్రియ వ్యవసాయం చేసి తొలి పంటలోనే అధిక దిగుబడులను సాధించనట్లు పేర్కొన్నారు. వీరు గత ఏడాది అక్టోబరు రబీ 2016న శనగ పంటకు గాను రైజోబియం, పి. ఎస్. బి., జీవన ఎరువులను వాడి అత్యధికంగా మొక్కకు 303 కాయలు, ఎకరానికి 9 క్వింటాళ్ళ దిగుబడిని సాధించారు. సేంద్రియ సేద్యం ప్రారంభించిన తొలి పంటలోనే సాధారణం కన్నా ఏ రెట్టింపు దిగుబడి పొందడం విశేషమని పేర్కొన్నారు.

కోడూరు సుజిత్ రెడ్డి - 9848248432, గూడూరు (గ్రా), పాలకుర్తి (మం), జనగాం జిల్లా.

వీరు గత రబీ 2016-17లో వరిలో ఆర్. ఎన్. ఆర్15048 రకం సాగుచేసారు. వీరు జీవన ఎరువులను అంటే అజోస్పైరిల్లం, పి. ఎస్.బి.లను ఆఖరి దుక్కిలో పంటకు వేశారు. వీరికి ఎకరానికి 40 బ్యాగులు దిగుబడి వచ్చినట్లు తెలియజేశారు.

ఈ ఏడాది కూడా 13 ఎకరాలకు గాను వరి ఆర్. ఎన్. ఆర్. 15048 పంటకి అజోస్పైరిల్లం, పి.ఎస్.బి., కె. ఎస్.బి., రాజేంద్రనగర్లోని జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల నుండి కొనుగోలు చేశారు.

జీవన ఎరువల వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ప్రతీ రైతు వీటిని కొనుగోలు చేసి తమ పంట పొలాలకు వాడి అధిక దిగుబడులను పొందడమే కాకుండా, తమ భూములను సారవంతంగా తయారు చేసుకోవచ్చు.

గమనిక: వ్యవసాయశాఖ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో జీవన ఎరువులు అనగా రైజోబియం, అజటోబ్యాక్టర్, అజోస్పైరిల్లం, భాస్వరం కరగదీసే బ్యాక్టీరియా (పి.ఎస్. బి), పొటాష్ కరగదీసే బ్యాక్టీరియా (కె.ఎస్.బి) కిలోకు రూ. 40/- జీవన ఎరువుల ఉత్పాదక ప్రయోగశాల, ప్రాంతీయ భూసార పరీక్షా ప్రయోగశాల, రాజేంద్రనగర్, హైదరాబాద్ - 500030 నందు లభ్యమవుతున్నాయి. ఫోన్: 040-24014896.

3.01479289941
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు