హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / నారు నాటే యంత్రం (శాప్లింగ్ ట్రాన్స్ ప్లాంటర్)
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నారు నాటే యంత్రం (శాప్లింగ్ ట్రాన్స్ ప్లాంటర్)

నారు నాటే యంత్రం వాడే విధానం, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

తరతరాలుగా మన దేశంలో వ్యవసాయం ప్రాథమిక జీవనాధారం. వ్యవసాయంలో ఆడవాళ్ల పాత్ర ఎంతో ఉంది. వీరు ముఖ్యంగా దున్నేముందు భూమిని శుభ్రం చేయడం, కలుపు తీయడం , నారు నాటడం వంటివి చేస్తారు. ఇలాంటి పనులను గంటల కొద్ది వంగి చేయడం వల్ల నడుము నొప్పి, భుజాల నొప్పి, కాళ్ళ నొప్పులతో బాధపడుతుంటారు. ముఖ్యంగా నాట్లు చేయాలంటే ప్రతిసారి వంగి నారుని భూమిలోకి నాటాలి.

ఈ పని ఎంతో శ్రమతో కూడినది కాబ్బట్టి మహిళల శ్రమను తగ్గించడానికి ఈ నారు నాటే యంత్రాన్ని తయారు చేశారు. దీనిని సాపింగ్ ట్రాన్స్ ప్లాంటర్ అని కూడా అంటారు.

ఈ యంత్రం గొట్టంవలె ఉండి తక్కువ బరువు కలిగి ఉండటంవల్ల మహిళలు సులభంగా ఈ యంత్రాన్ని నారు నాటడానికి కాని విత్తనం నాటడానికి కాని దీనిని ఉపయోగించవచ్చును.

ఈ యంత్రానికి మూడు భాగాలు ఉన్నాయి. మొదటి భాగం వచ్చేసి ఈ యంత్రాన్ని స్టీల్ పైపుతో తయారు చెయ్యబడినది. రెండో భాగం వచ్చేసి పటుకోడానికి హేండిల్ కూడా ఉంది. మూడవ భాగం వచ్చేసి ఈ నారు నాటే యంత్రానికి కింది భాగంలో మూతలాంటి ఉంటుంది. దానిని లివర్ తో మూయవచ్చును తెరువవచ్చును. హాండిల్, మూతకు సింగ్ వాడుతారు.

నారు నాటే యంత్రం కొలతలు

 1. పొడువు - 90 సెంటీ మీటర్లు
 2. స్ప్రింగ్ రాడ్ పొడువు - 29.5 సెంటీ మీటర్లు
 3. స్ప్రింగ్ పొడుపు - 7.5 సెంటీ మీటర్లు
 4. పట్టుకోడానికి పైన ఉన్న హాండెల్ - 19 సెంటి మీటర్లు
 5. పట్టుకోడానికి కింద ఉన్న హాండెల్ – 18 సెంటి మీటర్లు
 6. మూత పొడవు – 7.5 సెంటీ మీటర్లు
 7. నారు నాటే యంత్రం వ్యాసార్ధం – 2.5 సెంటీ మీటర్లు

నారు నాతే యంత్రాన్ని పొలంలో ఉపయోగించే ముందు మొదటిగా తీసివేయాలి. మట్టి తడిగా ఉండకుండా చూసుకోవాలి. ఆ తరవాత పొలంలో నారు వేసేందుకు గాట్లు కట్టుకోవాలి. కావాలంటే మల్చింగ్ షీట్ ని  కూడా ఉపయోగించవచ్చు ఈ మల్చింగ్ షీట్ ని ఉపయోగించడం ద్వారా కలుపు నివారణ జరుగుతుంది.

ఇప్పుడు నారు మొక్కలని కాస్టింగ్ క్యారియర్ బ్యాగ్ లో పెట్టుకొని దానిని భుజాల మీద వేసుకొని నడుముకు కట్టుకోవాలి. దీనివల్ల నారును తీసుకొని చేయడం సులభంగా ఉంటుంది. పొలంలో డిప్ పైపుని కూడా అమర్చుకోవచ్చు. దానివల్ల నీళ్ళు ఎక్కువగా పృధాకాకుండా కాపాడుకోవచ్చు.

నారు నాటే యంత్రం ఉపయోగించే విధానం

 • ముందుగా ఈ యంత్రాన్ని పట్టుకొని మట్టిలోకి గుచ్చాలి.
 • ఈ నారు నాటే యంత్రానికి పైన ఉన్న రంద్రంలో నుంచి నారుమొక్కలను చెయ్యాలి.
 • నారు మొక్కలను వేసిన తరువాత గ్రిప్పర్ హ్యాండిల్ వత్తి పట్టుకోవాలి.
 • అలా పత్తి పట్టుకోవడం వల్ల నారు విరగకుండా సులభంగా భూమిలోకి గుచ్చుకుంటుంది.
 • ఆ గ్రిప్పర్ హ్యాండిల్ ను అలాగే వత్తి పట్టుకొని పైకి లాగాలి.

ఈ విధంగా చేయ్యడంవల్ల రైతు మహిళలకు నారు నాటడం సులభతరం అవుతుంది. సమయం ఆదా అవుతుంది. గంటల కొద్ది వంగి నారును నాటే పద్ధతి కూడా మారుతుంది.

రైతు మహిళలకు ఈ నారునాటే మంత్రాన్ని ఉపయోగించడం ద్వారా కలిగే ప్రయోజనాలు

 • మొదటిగా రైతు మహిళలు వంగి గంటలకొద్ది పని చేయవలసిన అవసరం లేదు.
 • రెండోది నారు భూమిలోకి గుచ్చడం ద్వారా నారు మొక్కలను విరగకుండా ఉంటాయి. పైగా విత్తనం కాని, నారుకాని నాటిన తర్వాత దాని మీద మట్టి పరికరం ద్వారా కప్ప బడుతుంది కాబట్టి, వీరు ప్రత్యేకంగా మట్టి కప్పవలసిన అవసరం లేదు.
 • ఈ యంత్రాన్ని ఉపయోగించి ఒక గంటలో వెయ్యి మొక్కలను పొలంలో నాటవచ్చును

ప్రత్యేక లక్షణాలు

 • ఈ యంత్రం రైతు మహిళలకు నారు నాటడానికి సౌకర్యంగా ఉంటుంది.
 • ఈ యంత్రం తక్కువ బరువు కలిగి ఉండటం వల్ల దీనిని ఎక్కడికైన తీసుకొనివెళ్ళవచ్చును.
 • ఈ నారు నాటే యంత్రంతో మహిళలు సులువుగా నారును వెయ్యవచ్చును.

సాంకేతిక పరమైన ప్రయోజనాలు

 • ఈ నారు నాటే పరికరం ఉపయోగించడం ద్వారా శారీరక బరువు, గుండెవేగం 30 శాతం తగ్గుతుంది.
 • భంగిమ మెరుగుదల కూడా నడుము భాగంలో కాని, భుజముల భాగంలో కాని మెరుగు పడుతుంది.
 • ఈ నారు నాటే పరికరం ద్వారా, నారు నాటే విధానంలో పునరావ్రుత్తి జాతి ఏమాత్రం తగ్గలేదు.
 • నారు మొక్కలను పెట్టుకోడానికి తయారు చేసిన శాప్లింగ్ క్యారియర్ బ్యాగు నారు నాటేందుకు చాలా ఉపయోగపడుతుంది.
 • మహిళల శారీరక శ్రమ చాలా మట్టుకు తగ్గిపోతుంది.
 • ఈ పరికరాన్ని ఉపయోగించి ఎంత పెద్ద మోతాదులోనైన పొలంలో మహిళలు ఎటువంటి శ్రమ లేకుండ నారును నాటగలరు.
 • ఈ పరికరం ఉపయోగించి నారు కాని విత్తనం కాని నేసే మహిళకూలీల సంఖ్య తగ్గుతుంది, దానివలన రైతుకు డబ్బు ఆదా అవుతుంది.

తీసుకోవలిసిన జాగ్రత్తలు

 • ఈ పరికరం తడిమట్టిలో వాడకూడదు.

ఈ యంత్రాన్ని ఉపయోగించిన మహిళలు ఈ నారు నాటే పరికరం చాలా ఉపయోగకరంగా ఉంది అని తమ తమ అనుభవాలను సంతోషంతో చెప్పారు.

2.99647887324
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు