హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / నువ్వు కోత విత్తన నిల్వ సస్యరక్షణలో తీసుకోవలసిన మెళకువలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

నువ్వు కోత విత్తన నిల్వ సస్యరక్షణలో తీసుకోవలసిన మెళకువలు

నువ్వు కోత విత్తన గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం నువ్వు పంట పూత, కాయ అభివృద్ధి ని చెందే దశలో ఉంది. ఈ సమయంలో పంట బెట్ట - పరిస్థితులకు లోను కాకుండా చూసుకోవాలి. లేని ఎడల దిగుబడి తగ్గిపోయే అవకాశం ఉంటుంది.

నువ్వులలో నాణ్యమైన విత్తనం పండించాలంటే బెరకులు ఏరివేత ముఖ్యమైనది.

కేళీల (బెరకులు) ఏరివేత : ఇతర రకాల నుండి విత్తన పంట రకాన్ని అన్ని వైపులా 200 మీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. కల్తీ మొక్కలను పంట పెరిగే దశ (ఆకు ఆకారం, మొక్క ఎత్తు, ఆకురంగు), పూత దశ (పూత రంగు), కాయ దశలలో (కాయ ఆకారం, కాయ : అమరిక, కాయ పరిమాణం, కాయ మీద నూగు) : గుర్తించి ఏరివేయాలి.

కోత, నూర్పిడి తర్వాత వ్యాధి సోకిన గింజలు, బెరకు గింజలు వేరుచేయాలి. గింజ ఆకారం, పరిమాణం, రంగు లక్షణాలతో బెరకులను తీసివేయాలి.

పంట కోత, నూర్పిడి : నువ్వులలో నాణ్యమైన, అధిక మొలకశాతం కలిగిన విత్తనాన్ని పొందాలంటే పంటను సకాలంలో కోయాలి. విత్తన పంటను సరైన పక్వదశలో కోసినట్లయితే నాణ్యమైన విత్తనాన్ని పొందవచ్చు. త్వరగా లేదా ఆలస్యంగా కోయటం, కోసిన తర్వాత ఎక్కువ రోజులు ఎండనివ్వడం చేయకూడదు. పంటలో 75-80 శాతం కాయలు లేత పసుపు రంగుకి మారి కింద 1-2 కాయలు కొంచెం పగిలి ఉండాలి. కాయల్లో తేమ 50-60 శాతం విత్తనాలలో తేమ 25-30 శాతం ఉండాలి. కోత ఆలస్యం చేసిన కాయలు పగిలి విత్తనాలు రాలిపోయి దిగుబడి తగ్గుతుంది. మొక్కలను కోసి పైకి కాయలు వచ్చేలాగా తిప్పి నిలబెట్టాలి. ఇలా చేయటం వలన పూర్తిగా పక్వం కాని కాయలు కూడా పక్వానికి వస్తాయి. ఆ విధంగా 5-7 రోజులు ఉంచితే తేమశాతం 15-18 శాతంకు తగ్గుతుంది. పంటను నూర్చే సమయంలో విత్తన కవచం దెబ్బతినకూడదు. తద్వారా విత్తన మొలకశాతం అతి త్వరగా కోల్పోయే అవకాశముంది. నూర్చేటప్పుడు కల్లం దగ్గర వేరే రకం విత్తనాలతో కలవకుండా జాగ్రత్తపడాలి.

నివారణ : 2.5 మి.లీ. క్లోరోఫైరిఫాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.

కోడు ఈగ : మొగ్గ ఏర్పడే దశలో, కోడు ఈగ పిల్ల - దశలు మొగ్గ, పూత తినివేయడం వలన మొగ్గలు పువ్వుగా, కాయగా ఏర్పడక గొడ్డు పూలుగా మారి, వాడి రాలిపోతాయి. కాయలు గింజ కట్టక తాలు కాయలుగా మారతాయి.

నివారణ : ఈగ ఆశించిన మొగ్గల్ని ఏరి నాశనం చేయాలి. మొగ్గ దశలో క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ. లేదా ప్రొఫెనోఫాస్ 2 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లేదా డైమిథోయేట్ 2 మి.లీ. ఒక లీటరు నీటికి

విత్తన నిల్వలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • విత్తనం నిల్వ చేసే గోదాములు భూమి నుండి కనీసం ఒక మీటరు ఎత్తులో ఉండి కేవలం ఒకే ఒక ద్వారంను కలిగి ఉండాలి.
 • గోదాములలో కొత్త విత్తనాలను నిల్వ చేసే ముందు అందులోనున్న పాత విత్తన సంచులను, పురుగు ఆశించిన విత్తనాలను తీసివేసి గోదాములను శుభ్రపరచాలి.
 • గోదాము గోడలు, గచ్చుపై ఎలాంటి పగుళ్ళు : ఉండ రాదు. ఇవి కి వికీటకాలకు ఆవాసయోగ్యమైన, విత్తన నాణ్యత తగ్గడానికి కారణమవుతాయి. అందువలన విత్తన నిల్వ చేసేముందు ఎలుక కన్నాలను, పగుళ్ళను సిమెంట్ తో మూసివేసి గోదాము గోడలకు సున్నం వేయాలి. అలాగే వర్షం, అధిక తేమకు అభేద్యంగా ఉండాలి.
 • నూర్పిడి తరువాత సాధ్యమైనంత వరకు బెరకు, వ్యాధి సోకిన, రంగు మారిన గింజలు, ఇతర పదార్థాలు ఏరివేయాలి.
 • గోదాములోని ఉష్ణోగ్రతను నియంత్రించడం కోసం, వేడిగాలి బయటకు వెళ్ళడానికి గాలి పంకాలను (ఎగ్జాస్ట్ పంకాలు) బిగించి, పక్షులు లోనికి రాకుండా వాటిని జాలీలతో కప్పి ఉంచాలి.
 • నిల్వలో పురుగు రాకుండా 3 మి.లీ. మలాథియాన్ ఒక లీటరు నీటికి కలిపి గోదాము గోడలు, గచ్చు బాగా తడిచేటట్లు రెండు వారాలకు ఒకసారి పిచికారీ చేయాలి.
 • విత్తనాలను సాధ్యమైనంత వరకు కొత్త గోనె సంచులలోనే నిల్వ చేయాలి.
 • విత్తనాలను గోదాము లోపల నేలపై కాకుండా చెక్క బల్లపై 5-7 వరుసలకు మించకుండా కొత్త సంచులలోనే నిల్వ ఉంచాలి.
 • విత్తనం ఎండబెట్టే సమయంలో నేరుగా సూర్యరశ్మి తగలకుండా జాగ్రత్తపడాలి. లేని ఎడల ఆ వేడికి విత్తనపొర దెబ్బతింటుంది.
 • విత్తన నిల్వ కాలంలో తరచుగా విత్తన పరీక్ష చేసుకుంటూ విత్తన నాణ్యత సరిచూసుకోవాలి.

సస్యరక్షణ

ఆకుముడత, కాయ తొలిచే పురుగు : పైరు లేత దశలో, చిన్న గొంగళి పురుగులు 2-3 ఆకులను దగ్గరగా చేర్చి గూడు కట్టుకొని పచ్చని పదార్థం గోకి తినడం వలన ఆకులు ఎండిపోయి, కాలినట్లు కనిపిస్తాయి. ఈ పురుగు మొగ్గ ఏర్పడే దశలో పూ మొగ్గలను, పూతను, కాయల్లోని గింజలను తింటూ పంటకు నష్టం కలుగచేస్తాయి.

నివారణ : 2.5 మి.లీ. క్లోరిఫైరిఫాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా, ఎసిఫేట్ ఒక లీటరు నీటికి కలుపుకొని పిచికారీ చేయాలి.

అల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు : పైరు విత్తిన 30 రోజుల నుండి ఆఖరి దశ వరకు ఆశిస్తుంది. ముదురు ఈ గోధుమ రంగులో వలయాకారపు మచ్చలు మొక్కకింద ఆకుల మీద ఏర్పడి తర్వాత మచ్చలు ఒకదానితో ఒకటి. కలిసి పొయి ఆకులు అంతటా వ్యాపించడం వలన ఆకులు ఎండిపోతాయి. మచ్చలు కాండం, కాయల మీద కూడా వ్యాపించడం వలన గింజ నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ తెగులు కలుగచేసే శిలీంధ్రం పంట అవశేషాల ద్వారా, విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది.

సర్కోస్పోరా ఆకుమచ్చ తెగులు : ఆకులపై చిన్న చిన్న బూడిద రంగు మచ్చలు ఏర్పడి తర్వాత గోధుమ రంగుకు మారి ఆకుల అంతటా వ్యాపించి ఆకులు రాలిపోతాయి. ఈ మచ్చలు కాండం, కాయలు మీద కూడా ఏర్పడి పంటను నష్టపరుస్తాయి.

నివారణ : అల్టర్నేరియా, సర్కోస్పోరా అకుమచ్చ తెగులు - నివారణకు విధిగా విత్తనశుద్ది పాటించాలి. ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మాంకోజెబ్ లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. తెగుళ్ళను తొలి దశలోనే గుర్తించి ఒక లీటరు నీటికి 2.5 గ్రా. కార్బండిజమ్ + మాంకోజెబ్ కలిపి ఉన్న మందును లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ ఏదైనా ఒక మందును కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు మందు మార్చి పిచికారీ చేయాలి.

బూడిద తెగులు : ఈ తెగులు ముఖ్యంగా శాఖీయ దశ - నుండి కాయలు గింజ కట్టే దశ వరకు తీవ్రంగా ఆశిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలో తగ్గుదల, గాలిలో అధిక ఈ తేమ శాతం, మంచు కురవటం లాంటి పరిస్థితుల్లో ఈ - తెగులు ఉధృతి నువ్వు పంటలో ఎక్కువగా ఉంటుంది. - తొలి దశలో ముదురు ఆకుల మీద బూడిద రంగు లాంటి పదార్థం ఏర్పడి తర్వాత లేత ఆకులకు వ్యాపిస్తుంది. ఆకులలో కిరణజన్య సంయోగ క్రియకు - ఆటంకం ఏర్పడి, ఆకులు పండుబారి రాలిపోతాయి.

నివారణ : తొలి పూత దశలో ఒక లీటరు నీటికి కరిగే - గంధకం 3 గ్రా. లేదా మైకోబ్యుటానిల్ 1 గ్రా. ఏదైనా ఒక మందును పిచికారీ చేయాలి.

3.00293255132
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు