অসমীয়া   বাংলা   बोड़ो   डोगरी   ગુજરાતી   ಕನ್ನಡ   كأشُر   कोंकणी   संथाली   মনিপুরি   नेपाली   ଓରିୟା   ਪੰਜਾਬੀ   संस्कृत   தமிழ்  తెలుగు   ردو

నూతన సస్యరక్షణ మందులు, మిశ్రమాలు వాడకంలో మెళకువలు

వ్యవసాయ రంగంలో చీడ పీడల ఉధృతి తగ్గించటానికి సస్యరక్షణ మందుల వాడకం ఎప్పటికి ఒక ముఖ్య అంశంగా పరిగణించబడుతున్నది. పర్యావరణ పరమైన సమస్యలు ఉన్నప్పటికీ, త్వరితగతిన ఉద్ధేశించబడిన పురుగులను మరియు తెగుళ్ళను నివారించే గుణం, లభ్యత పరంగా ఎటువంటి సమస్యలు లేకపోవటం మరియు అందుబాటు ధరలలో లభించడం వలన సస్యరక్షణ మందులు ఈ రోజుకు కూడా సస్యరక్షణ అనటంలో అతిశయోక్తి లేదు. మారుతున్న వ్యవసాయ పరిస్ధితుల దృష్టి అనాదిగా వాడుతున్న సస్యరక్షణ మందులకు ప్రత్యమాయంగా వివిధ పద్ధతులు మరియు జీవరసాయనాలు వాడకంలోకి వచ్చినప్పటికీ, ఈ మధ్య కాలంలో కొన్ని నూతన తరం సస్యరక్షణ మందులు మార్కెట్లో లభ్యమవుతూ రైతాంగం చేత వాడబడుతున్నాయి. అదే విధంగా సస్యరక్షణ మందుల మిశ్రమాలు కూడా ఈ మధ్య కాలంలో విరివిగా వాడకంలోకి వచ్చాయి. మార్కట్లో చాలా వరకు కొత్తగా లభ్యమవుతున్న సస్యరక్షణ మందుల గురించి చెప్పకున్నట్లయితే కింద పేర్కొన్న సస్యరక్షణ మందులు ఎక్కువగా వాడకంలో ఉన్నట్లు గమనించటం జరిగింది.

ప్రస్తుత కాలములో మార్కెట్లో అందుబాటులో ఉన్న నూతన సస్యరక్షణ మందులు మరియు వాటి వివరాలు

రసాయనిక నామము వాణిజ్య నామము ఉద్దేశింపబడిన మోతాదు/ఎకరం (200 లీ.నీరు)
ఫ్ల్యుబెండమైడ్ ఫేమ్, లైకో, ఫ్ల్యూయిడ్ ప్రత్తిలో కాయ తొలుచు పురుగులు, వారిలో కాండం తొలుచు పురుగు, కందిలో మారుక మచ్చల పురుగు, వారిలో అకుముడత పురుగు 20-40 మి.లీ
ఫ్ల్యుబెండమైడ్ 20% డబ్ల్యు.డి.జి టకుమి, సురక్ష, ఫ్ల్యూటన్ వారిలో కాండం తొలుచు పురుగు, కందిలో మారుక మచ్చల పురుగు, వరిలో అకుముడత పురుగు 125 గ్రా.
ఇమామేక్టిన్ బెంజోయేట్ 5 ఎస్.జి ప్రోక్లెయిమ్, మిసైల్, స్పోలైట్, రోబట్, తత్కాల్, ఎమ్జెట్, ట్రస్ట్ శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు 90 గ్రా.
ఇమిడాక్లోప్రిడ్ 30.5% ఎస్.సి కన్ఫిడార్ సూపర్, టేర్ మాక్స్, జంబో రసం పీల్చే పురుగుల సముదాయం 40-50 మి.లీ
క్లోరాంట్రానిలిప్రొల్ 18.5 ఎస్.సి కోరజేన్ వారిలో కాండం తొలుచు పురుగు, అపరాలు, కూరగాయల్లో కాయ తొలుచు పురుగులు 60 మి.లీ
క్లోర్ ఫెన్ పైర్ 10% ఎస్.సి ఇంట్రిప్రిడ్, లేపిడో, రికార్డ్ క్యాబెజిలో డైమండ్ బాక్ మాత్ మిరపలో నల్లి 300 మి.లీ
ఫిప్రొనిల్ 80 డబ్ల్యు.జి జంప్, రూలర్ 80 కాండం తొలుచు పురుగు, ఆకు ముడత మరియు తామర పురుగులు 30-40 గ్రా.
నోవాల్యురాన్ 10 ఇ.సి రీమాన్ ప్రత్తిలో కాయ తొలుచు పురుగు 200 మి. లీ
స్ప్రేరోమెసిఫెన్ ఒబెరాన్, ఓలేజ్ మంగు మరియు తెల్లనల్లి 200 మి. లీ
డైఫేన్ ధయురాన్ పోలే, పెగాసస్ క్యాబేజిలో డైమండ్ బాక్మాత్ మరియు పలు పంటలలో రసం పీల్చే పురుగుల సముదాయం 240 గ్రా.
బుఫ్రోఫెజిన్ 25 ఎస్.సి అప్లాడ్, ప్లోట్ స్, జావా, ఇర్వీ, హపిల్, బెంజ్ వరిలో సుడిదోమ 330 మి. లీ
ఎధీప్రోల్ 40% + ఇమిడా క్లోప్రిడ్ 40% డబ్ల్యు.జి గ్లామోర్ వరిలో సుడిదోమ 50 గ్రా.
ఫ్లోనికమిడ్ 50% డబ్ల్యు.జి ఉలాలా ప్రత్తిలో దీపపు పురుగు, పెనుబంక మరియు తెల్లదోమ 75 గ్రా.
నోవాల్యురాన్ 5.25% + ఇండాక్స్కార్బ్ 4.25% ఎస్.సి ప్లెతోరా శనగపచ్చ పురుగు మరియు పొగాకు లద్దె పురుగు, టమాటలో కాయతొలుచు పురుగులు 350 మి. లీ.
ధయాక్లోప్రిడ్ (21.7% ఎస్.సి) అలాంటో, స్ప్లెండర్ ప్రత్తిలో రసం పీల్చే పురుగులు, సోయచిక్కుడులో పెంకు పురుగు 250 మి. లీ.
డైనోటోఫ్ల్యురాన్ 20% ఎస్.జి టోకెన్, ఓషిన్ వరిలో సుడిదోమ 80 గ్రా.
పైమెట్రోఫ్యురాన్ 50% డబ్ల్యు.జి (గుళికలకు 25గ్రా. ఇసుక) ఫెర్ టేరా వరిలో సుడిదోమ 120 గ్రా.
క్లోరాంట్రానిల్ 0.4% జి ఫెర్ టేరా వరిలో కాండం తొలుచు పురుగు 4 కిలోలు
ఇమిడాక్లోప్రిడ్ 40% + ఫిప్రోనిల్ 40% డబ్ల్యు.జి లాసెంటా చెఱకులో వేరు పురుగు 175-200 గ్రా.
ఇండాక్సాకార్బ్ 14.5% + ఎసిటామిప్రిడ్ 7.7% ఎస్.సి సిసర్, ఇండోప్రిడ్ ప్రత్తి మిరపలో రసం పీల్చు మరియు కాయతొలుచు పురుగులు 160-200 మి. లీ.
ఎసిఫేట్ 50% ఇమిడాక్లోప్రిడ్ 1.8 ఎస్.పి లాన్సర్గోల్డ్, స్టార్గోల్డ్ ప్రత్తిలో రసం పిల్చు మరియు కాయతొలుచు పురుగులు 400 మి. లీ.
ఫ్ల్యుబెండమైడ్ 3.5 + హెక్సాకొనజోల్ 5% డబ్ల్యు.జి ఆరిజిన్ వారిలో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత మరియు పాము పొడ తెగులు 400 గ్రా.

శిలీంధ్ర నాశిసులు

రసాయనిక వాణిజ్య నామము నియంత్రించబడు తెగులు మోతాదు ఎకరానికి (150 లీ. నీటిలో కలిపి)
డైఫెన్ కొనజోల్ 2.5% ఇ.సి స్కోర్ అనేక రకాల అకుమచ్చ, బూడిద తెగుళ్ళు, వేరు మరియు కాండం కుళ్ళు, కాలర్ రాట్ 100 మి. లీ.
టేబుకోనజోల్ 2% డి.ఎస్ రక్సిల్ మిరపలో కొమ్మ మరియు కయకుళ్ళు, వేరు మరియు కాండం కుళ్ళు కలర్ రాట్ 40 గ్రా.
మెటిరామ్ 55% + పైరాక్లాస్ట్రోబిన్ 5% డబ్ల్యు.జి కబ్రియోటప్ పలు పంటలలో అకుమచ్చ, టమాటలో ఎర్లి బ్లైట్, ఆలుగడ్డలో లేట్ బ్లైట్, దానిమ్మలో కాయమచ్చ తెగులు 600 గ్రా.
టేబుకోనజోల్ 50 + ట్రైఫ్లోక్సి స్ట్రోబిన్ 25 డబ్ల్యు నేటివో వరిలో పొడ తెగులు, అగ్గితెగులు, గింజ మచ్చ, టమాటాలో ఎర్లి బ్లైట్ 160 గ్రా.
ఫినమిడాన్ 10% + మాంకోజెబ్ 50% డబ్ల్యు.డి.జి సెక్టిన్ బూజు తెగులు, అలుగాడ్డలో లేట్ బ్లైట్ 500 – 600 గ్రా.
ట్రైసైక్లోజోల్ 62% డబ్ల్యు.పి మెర్జర్ వరి అగ్గి తెగులు, ఆకు ఎండు తెగులు 400 గ్రా.
పైరక్లాస్ట్రోబిన్ 20% డబ్ల్యు.జి హెడ్ లైన్ ప్రత్తి వేరుశానగలో అకుమచ్చ, టమాటలో ఎర్లి బ్లైట్ 100 మి. లీ
అజక్సిస్ట్రోబిన్ 20% డబ్ల్యు.జి ఎమిస్టర్ అన్ని రకాల అకుమచ్చలు, బూడిద తెగులు టమాటలో ఎర్లి బ్లైట్, అలుగాడ్డలో లేట్ బ్లైట్ 150 మి. లీ.
ఆజాక్సిస్ట్రోబిన్ 11% + టేబుకొనజోల్ 18.3 ఎస్.సి కాస్టోడియా మిరపలో కయకుళ్ళు మరియు బూడిద తెగులు వారిలో పముపొడి తెగులు 240 – 300 మి. లీ.

విచక్షణా రహితంగా సస్యరక్షణ మందులను వాడటం వలన పురుగులు రోగనిరోధక శక్తి పెంపొందించుకొని ఫలితంగా చీడపీడల నివారణ రైతులకు ఒక గుదిబండగా మారటం ఈ మధ్య కాలంలో సర్వసాధారామైనది. ప్రస్తుత్త అంచనాల ప్రకారం సుమారు 441 రకాల పురుగులు మన పంట పొలాలలో ఎక్కువగా వాడే పురుగు మందులకి రోగ నిరోధక శక్తిని పెంపొందించుకున్నాయి. ఇటువంటి గడ్డు పరిస్దితులను అధిగమించే క్రమంలో సస్యక్షణ మందులను మిశ్రమాల వాడక రూపంలో ప్రణాళిక పరంగా ఒక దాని తరువాత ఒకటి వాడటం, మార్చుకుంటూ వాడటం వంటి జాగ్రత్తలు కొంతవరకు సహకరించాయని చెప్పుకోవచ్చు. ఈ నేపధ్యంలో ఈ విధమైన మిశ్రమాల మరియు ఇతర పద్ధతుల వాడకంలో మేలు చేసే అంశాలు మరియు కీడు చేసే అంశాలు ఉన్నాయిని రైతు సోదరులు గుర్తించాలి.

సస్యరక్షణ మందుల మిశ్రమాల వలన లాభాలు

 • మిశ్రమాల వాడకం వలన, ఉద్దేశించబడిన పురుగు రోగనిరోధక శక్తి పెంపొందించుకొనటానికి మనం వీలైనంత వరకు ఆలస్యం చేయవచ్చు.
 • రెండు సస్యరక్షణ మందులను కలపటం వలన వేర్వేరుగా వాడిన దానికంటే రెండింటిని కలిపి వాడినప్పుడు పురుగును నియంత్రించే గుణం వృద్ది చెందినట్లు చూడటం జరిగినది.
 • రెండు సస్యరక్షణ మందులను వెర్వేరు దశల మీద ఒకే సమయంలో పనిచేసి ఎక్కువ పురుగు నియంత్రణకు దోహదం చేయటం జరుగుతుంది.
 • కొన్ని రకాల సస్యరక్షణ మందులను త్వరితగతిన పని చేసే గుణం కలిగి ఉంటె మరికొన్ని రకాల మందులు ఎక్కవ కాలం పని చేసే గుణం కలిగి ఉంటాయి. నీటిని వేర్వేరుగా వాడటం కంటే కలిపి వాడినపుడు రెండు రకాల లాభాలను ఒకేసారి పొందుతూ ముఖ్యంగా వైరస్ రోగాలకు మూలమయిన పురుగుల సముదాయాలను సమర్ధవంతంగా అరికట్టవచ్చు.
 • పురుగు మందులు వేర్వేరుగా వాడే కంటే మిశ్రమాలను సమర్ధవంతంగా అరికట్టవచ్చు.

సస్యరక్షణ మందుల మిశ్రమాల వలన నష్టాలు

 • కొన్ని రకాల సస్యరక్షణ మందులను కలిపి మిశ్రమాలుగా వాడినపుడు వాటిలో కలిసే గుణం లేకపోవటం వలన పిచికారి చేసిన తరువాత మొక్కలు మడిపోవటం (ఫైటోటాక్సిసిట్) లేక ఒకదాని మీద ఒకటి పనిచేసి క్షమత తగ్గిపోవటం వంటి నష్టాలు జరుగవచ్చు.
 • రెండు సస్యరక్షణ మందులు వేర్వేరుగా వాడినపుడు చీడపీడల మీద చూపే ప్రభావం కంటే రెండింటి మిశ్రమం కలిపినపుడు ప్రభావము తగ్గవచ్చు.
 • ఉదా : మంగుకు ఉద్దేశించబడిన బైఫెనాజెట్ అనే మందుతో ఇతర పురుగులకు ఉద్దేశించబడిన క్లోరిఫైరిఫాస్ లేక కార్బరిల్ లేక మిధోమిల్ లేక అక్సామిల్ కలిపినపుడు బైఫెనాజెట్ మందు ప్రభావం గణనీయంగా తగ్గినట్లు చూడటం జరిగింది.

 • రెండు వేర్వేరు సస్యరక్షణ మందులు మిశ్రమంగా కలుపుతున్నప్పుడు ఉత్పన్నమయ్యే మరొక ముఖ్య సమస్య మిశ్రమాలు భౌతికంగా ఒకదానికి ఒకటి కలవక పోవటం, కలిపినపుడు పిచికారి అనువైన ద్రావకంగా కాకుండా అట్టలుగా కాని, ముద్దులుగా కాని లేక కణికలుగా కాని ఉండిపోతాయి. పిచికారి చేయటానికి అనువుగా ఉండకపోవచ్చు.
 • రైతు స్ధాయిలో రెండు సస్యరక్షణ మందులు భౌతికంగా కలిసే గుణం ఉన్నదా లేదా తెలుసుకోవటానికి కలపాలనుకొంటున్న రెండు సస్యరక్షణ మందుల నమూన మోతడులను ఒక పాత్రలో కలుపుకొని సుమారు 15 నిమిషాల వరకు కదుపకుండా ఉంచాలి.
 • కార్బండాజిమ్, ధైరమ్ వంటి మందులను ట్రైకోడర్మా విరిడి, సుడోమెనాస్ మందులు కలిపి పిచికారి పెయరాదు.
 • కాపర్ సంబంధిత మందులు గంధకం (సల్ఫర్) ద్రావణాలతో కలుపరాదు.
 • ప్రత్తిలో కాపర్ ఆక్సిక్లోరైడ్, మాంకోజెబ్ లను ఇతర పురుగు మందులతో కలుపునప్పుడు ఆకులు పెళుసుగా మారుతాయి.
 • నియోనికోటినాయిడ్ సంబంధిత మందులు సిఫారసు చేసిన మొతాదు కంటే ఎక్కువ వాడినప్పుడు ఆకులు పెళుసుబారటం లేదా బెండ ఆకుల మాదిరిగా మారుతాయి.• వేప మందైన అజాడిరాక్టిన్ అన్ని తెగుళ్ళ మందులలో కలుస్తుంది.
 • ఆ తరువాత కలుపుకున్న ద్రావణం పిచికారి అనువుగా ఉంటే మిశ్రమము వాడుకోదగ్గని లేక అట్టలు, ముద్దలు లేక కణికలుగా కనబడితే మిశ్రమము కలుపుకోవటానికి వీలు లేదన్న విషయాన్ని రైతు సోదరులు గుర్తించాలి.

 • సిఫారసు చేసిన మొతాదును వాడని పక్షంలో మిశ్రమంకు కూడా పురుగులు రోగ నిరోధక శక్తి పంచుకునే ఆస్కారం ఉంటుంది.
 • మిశ్రమాలు ఉద్దేశించబడిన పురుగుల మీద ప్రభావం చూపినప్పటికీ పంటపొలాల్లో ఇతర చీడపీడలు నష్ట పరిమాణ స్థాయికి చేరవచ్చు.
 • వివిధ రకాల మిశ్రమాలు కనుక వాడినట్లయితే పురుగుల రోగ నిరోదక శక్తి కొన్ని సందర్భాలలో ద్విగుణీకృతమై వివిధ రకాల సస్యరక్షణ మందులకు ఒకే సమయంలో నిరోధక శక్తి పంరుగవచ్చు.
 • కొన్ని సందర్బాలలో మిశ్రమాలను సిఫారసు చేసిన మోతాదులో వాడాలనుకున్నప్పుడు ఖర్చుపరంగా రైతుపై భారం పడవచ్చు.
 • మిశ్రమాలలో వాడే సస్యరక్షణ మందుల ప్రభావం పరిధి పెరగటం వలన ఉద్దేశించబడిన చీడపీడలకు బాగా ప్రభావవంతంగా పని చేసినప్పటికీ, మిత్ర పురుగుల మీద దుష్ప్రభావం చూపుతూ పర్యావరణ సమతుల్యత పరమైన సమస్యలు తలెత్తవచ్చు.

మిశ్రమాలను వడవలసి వచ్చినప్పుడు రైతు సోదరులు పాటించవలసిన మెళకువలు

 • రెండు గాని రెండు కంటే ఎక్కువ గానీ హానికారక పురుగులకు ఒకే సమయంలో పిచకారి చేయవలసి వచ్చినప్పుడు మాత్రమే మిశ్రమాలను వాడాలి.
 • సస్యరక్షణ మందులను వేర్వేరుగా వాడుకున్నప్పుడు పురుగుల రోగనిరోధక శక్తి పెరిగిన సందర్భాలు కాని లేక పెరిగే ఆస్కారం ఉన్న చోట మాత్రమే మిశ్రమాలు వాడాలి.
 • రసం పీల్చే పురుగుల ద్వారా త్వరితగతిన వైరస్ తెగుళ్ళు వ్యాపిస్తున్నప్పుడు సత్వర ఫలితాల కోసం మాత్రమే మిశ్రమాలు వాడుకోవాలి.
 • పెండు వేర్వేరు సస్యరక్షణ మందులను మిశ్రమంగా వాడాలనుకున్నప్పుడు పనిచేసే విధాన పరంగా మరియు ఉద్దేశించబడిన పురుగుల పరంగా వ్యత్యాసం ఉన్న మందులనే మిశ్రమంగా తయారు చేసుకోవటానికి ఎంపిక చేసుకోవాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

చివరిసారిగా మార్పు చేయబడిన : 1/7/2021© C–DAC.All content appearing on the vikaspedia portal is through collaborative effort of vikaspedia and its partners.We encourage you to use and share the content in a respectful and fair manner. Please leave all source links intact and adhere to applicable copyright and intellectual property guidelines and laws.
English to Hindi Transliterate