పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పంటలలో ద్రవ రూప జీవన ఎరువుల ప్రాముఖ్యత

ద్రవ రూప జీవన ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం.

ప్రస్తుతం మారుతున్న అధునాతన వ్యవసాయ రంగంలో జీవన ఎరువుల వాడకం ఎంతో ప్రాచుర్యం పొందుతున్నాం. సేంద్రియు వ్యవసాయంలో విరివిగా వాడుతున్నారు. ద్రవ రూప జీవన ఎరువులైన అజోస్పైరిల్లం, పి.ఎస్.బి. మొదలైనవి పొడి రూపంలో లభ్యమయ్యే జీవన ఎరువుల కన్నా మంచి ఫలితాలు ఇస్తున్నాయి.

ద్రవ జీవన ఎరువులను వాడవలసిన పద్ధతి

విత్తనానికి పట్టించే పద్ధతి

కిలో విత్తనానికి 5-6 మి.లీ. జీవన ఎరువును సమాన మోతాదులో 10 శాతం చక్కెర లేదా బెల్లం ద్రావణంలో కలిపి విత్తనానికి పట్టించాలి. తర్వాత పది నిమిషాలు నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.

భూమిలో చేసే పద్ధతి

ఎకరం పొలానికి జీవన ఎరువును 300-500 మి.లీ. తీసుకొని 10 లీటర్ల నీటితో కలిపి 100-200 కిలోల పశువుల ఎరువు లేదా వానపాముల ఎరుపు లేదా ఏదైనా సేంద్రియ ఎరువుతో కలిపి విత్తనం నాటే సాళ్ళలో పడేలా వేసుకోవాలి. పంట పొలంలో చేపట్టే మొదటి అంతర కృషికి ముందుగానే జీవన ఎరువును పొలంలో వేసుకోవాలి.

నారుముంచి వాడే పద్దతి

ఈ పద్ధతి ముఖ్యంగా అజోస్పైరిల్లం అనే జీవన ఎరుపు వాడటానికి ఉపయోగపడుతుంది. 70 లీటర్ల నీటిలో 300-500 మి.లీ. అజోస్పైరిల్లం జీవన ఎరువును వేసి, దీనిలో పీకిన నారు మొక్కల వేర్లను పది నిమిషాలు ముంచి నాట్లు వేయాలి.

డ్రిప్ పద్ధతిలో నీటిని పెట్టి పంటకు

300-500 మి.లీ. జీవన ఎరువు తీసుకొని డ్రిప్ ట్యాంక్లో కలిపి మొక్కలు నాటిన వారం రోజుల లోపు డ్రిప్ల ద్వారా వేసుకోవాలి.

ద్రవ జీవన ఎరువుల వలన లాభాలు

  • ఎక్కువ కాలం (సంవత్సరం పాటు) నిల్వ ఉంటాయి
  • తక్కువ సమయంలో ఎక్కువ భూమి విస్తీర్ణంకు తేలికగా వాడవచ్చు.
  • నీటిలోని బ్యాక్టీరియా అధిక ఉష్ణోగ్రతలు, ఇతర వాతావరణ ఒడిదుడుకులు తటకొని పెరుగుతుంది.
  • తేలికగా పంట వేర్ల చుట్టూ ఉన్న వాతావరణంతో సమన్వయ సంబంధం ఏర్పరచుకొని అధిక సంఖ్యలో పెరుగుతుంది.
  • పంట పెరుగుదల, ఉత్పత్తి అధికంగా ఉంటుంది.
  • సేంద్రియ వ్యవసాయంలో పంటకు కావాల్సిన పోషకాలు సమకూర్చడంతో ద్రవ జీవన ఎరువులు ప్రధాన పాత్ర వహిస్తాయి.
  • నేల భౌతిక లక్షణాలు, మెరుగుపడి భూసారం వృద్ధి చెందుతుంది.
  • నేల నుండి సంక్రమించే తెగుళ్ళను కొంతమేర అరికట్టవచ్చు.
  • రసాయన ఎరువులపై ఖర్చు తగ్గుతుంది.

జీవన ఎరువుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

జీవన ఎరువులను ఎండ, వేడి తగలని చల్లని నీడలో నిల్వ చేయాలి. గడువు తేదీ లోపల మాత్రమే ఉపయోగించాలి. రసాయనిక ఎరువులతో కలిపి జీవన ఎరువులు వాడరాదు. సేంద్రియ ఎరువుతో జీవన ఎరువు కలిపిన వెంటనే పంటకు వాడుకోవాలి. జీవన ఎరువును వేసేటప్పుడు పొలంలో తగినంత తేమ ఉండేలా చూసుకోవాలి.

3.00636942675
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు