పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పుట్టగొడుగుల పెంపకం

శిలీంద్రాలు మొక్కలలో హానికరమైన తెగుళ్ళు కలుగాజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు.

శిలీంద్రాలు మొక్కలలో హానికరమైన తెగుళ్ళు కలుగాజేయడమే కాకుండా మనిషికి ఆహారంగా కూడా ఉపయోగపడతాయి. అటువంటివే పుట్టగొడుగులు. ఎన్నో పోషక విలువలు కలిగి క్రొవ్వు మరియు పిండి పద్ధారం తక్కువగా ఉండటం ముఖ్యంగా మాంనసకృత్తులు అధికంగా ఉండటం వలన పోషక లోపముతో బాధపడుతున్న మహిళలకు, చిన్న పిల్లలకు ముఖ్యంగా మధుమేహం వ్యాధిగ్రస్తులకు ఇదొక ప్రత్యామ్న ఆహారంగా సూచిస్తున్నారు. ఇటివల కాలంలో పుట్టగొడుగులలో ఉండే పోషక విలువలు, ఉపయోగాల గురించి అందరిలో అవగాహన పెరుగుతున్నందు వల్ల మరియు వాతావరణ పరిస్ధితులకు అనుకూలమైన వివిధ రకాల పుట్టగొడుగులు అందుబాటులో ఉండటం వలన చాలా మంది నిరుద్యోగ యువత, మహిళలు పుట్టగొడుగుల పెంపకం పై ఆసక్తి చూపిస్తున్నారు .

పుట్టగొడుగుల్లో సుమారు 20,000 రకాల జాతులు కలవు. అయితే కేవలం 2000 జాతులను మాత్రమే ఆహారంగా తీసుకోవచ్చు. ఇందులో 200 రకాలను మాత్రమే కృత్రిమమైన వాతావరణంలో పెంచగలం. వీటిలో సాధారంగా కేవలం 4 రాకలనే సాగుచేస్తారు.

పుట్టగొడుగుల రకాలు మరియు వాటికీ అనువైన వాతావరణ పరిస్ధితులు

క్ర.సం.రకాలుఉష్ణోగ్రతతేమ(%)కాలం
1. వరిగడ్డి పుట్టగొడుగులు 28-350 సెల్సియస్ 80-95 మర్చి – సెప్టెంబర్
2. బటన్ పుట్టగొడుగులు 14-160 సెల్సియస్ 90-95 సెప్టెంబర్ – జనవరి
3. ఆయిస్టర్ పుట్టగొడుగులు 24-280 సెల్సియస్ 80-85 జూన్ – ఫెబ్రవరి
4. పాల పుట్టగొడుగులు 30-350 సెల్సియస్ 80-95 మార్చి – అక్టోబర్

పుట్ట గొడుగుల్లో అనేక రకాల పోషక పదార్ధాలున్నాయి. ముఖ్యంగా మానసకృ త్తులు అధికంగా ఉండటం వల్ల మనదేశంలో. పెరుగుదలకు కావాల్సిన లైసిన్ అనే అమైనో ఆమ్లం వీటిలో ఉండటం వల్ల ఇవి అధిక జీర్ణ శక్తిని (60-70%) కలిగి ఉంటాయి. ఇవే కాకుండా పుట్టగొడుగుల్లో 89-91 % నీరు, 0.97 – 1.26% లవణాలు, 2.78-3.94% మానసకృత్తులు, 0.25-0.65% కొవ్వుపదార్ధాలు, 0.09-1.67% - పిచు పదార్ధాలు మరియు 5.30 – 6.28% - పిండి పదార్ధాలు వుంటాయి.

పుట్టగొడుగులు పెంచుట వలన లాభాలు

 • ఇవి తక్కువ వ్యవధిలో వ్యవసాయ వ్యర్ధ పదార్ధలయిన గడ్డి, చొప్ప ఇతర పదార్ధాలలో కొద్ది పాటి ఖర్చతో వీటిని పెంచవచ్చు. నిరుద్యోగ యువతకు పుట్ట గొడుగుల పెంపకం వరదాయకం.
 • ప్రతి 100 గ్రా. తాజా పుట్ట గొడుగులు 43 కిలో కేలరీల శక్తినిస్తాయి.
 • పుట్టగొడుగుల్లో కొవ్వు పదార్ధాలు చాలా తక్కువగా ఉండటమేకాక ఇవి శరీరానికి అవసరమైన మంచి కొలస్ట్రాల్ ను పెంచుతూ, గుండె జబ్బులకు కారణమయ్యే చేడు కొలస్ట్రాల్ ను తగ్గిస్తుంది.

పుట్టగొడుగుల రకాలు

తెల్ల గుండి పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగులు చిన్నగా తెల్లగా గుండిల మాదిరిగా ఆకర్షణియంగా ఉండటం వల్ల వీటికి ఆపేరు వచ్చింది. వరి లేదా గోధుమ గడ్డి, ఇతర రసాయన ఎరువుల కలయిక తయారు చేసిన పదార్ధం పై మాత్రమే పెంచగలం వీటిని ఎక్కువగా ఉత్తర భారతదేశంలో సాగు చేస్తున్నారు. వీటి పెరుగుదలకు 14-16 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 90-95 % గాలిలో తేమ ఉండే చల్లని ప్రదేశాలు అనుకూలం. వీటి పెంపకానికి సాంకేతిక పరి నం ఏంతో అవసరం. ఆధార పదార్ధం అత్యంత నాణ్యమైనదిగా ఉండాలి.

ముత్యపు చిప్ప పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగులు విచ్చుకొని ముత్యపు చిప్ప ఆకారంలో ఉండటం వల్ల వీటికి ఆపేరు వచ్చింది. వీటిలో తెల్ల ముత్యపు చిప్ప, ఎల్మ్ ముత్యపు చిప్ప, గ్రే మరియు పింక్ రకం ప్రాచుర్యంలో ఉన్నాయి. ఈ పుట్టగొడుగుల సాగుకు 24 - 28o సెంటిగ్రోడ్ ఉష్ణోగ్రత, 80-85% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూలం వీటిని రైతులు తమ వద్ద లభించే వరిగడ్డితోనే కాక వ్యవసాయ సంబంధమైన ఏ వ్యర్ధపదార్డం ఉపయోగించి అయినా సులభంగా పండించావచ్చును. మిగతా రకాలతో పోలిస్తే ఇవి అధిక దిగుబడులను ఇస్తాయి. కాబట్టి తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితే అధిక లాభాలను సంపాదించే రకంగా ఇవి ప్రాచుర్యాన్ని పొందాయి. వీటిని అధికంగా దక్షిణ భారతదేశంలో సాగు చేస్తారు.

పాల పుట్టగొడుగులు

ఈ పుట్టగొడుగుల పెంపకం కొద్దిపాటి చిన్న మార్పులతో ముత్యపుచిప్ప పుట్టగొడుగుల పెంపకము ను పోలి ఉంటుంది. ఈ పుట్ట గొడుగుల పెంపకాని 30-35o సెం. ఉష్ణోగ్రత మరియు 80-95o గాలిలో తేమ తగిన వెలుతురు అవసరం. మర్చి నుండి అక్టోబరు వరకు గల వాతావరణం చక్కగా అనుకూలిస్తుంది. పరిస్దితులకు అనుకూలంగా తగుపాటి జాగ్రత్తలు తీసుకుంటే సంవత్సరముంతా ఈ పుట్టగొడుగుల పెంపకం చేపట్టవచ్చును.

వరిగడ్డి పుట్టగొడుగులు

ఈ రకం పుట్ట గొడుగులు వరిగడ్డిని ఉపయోగించి పెంచుతారు. వీటి కాడలు మృదువుగా ఉండి 38 సెం.మీ. పొడవుంటాయి. వీటి పెరుగుదలకు 30-35o సెల్సియస్ ఉష్ణోగ్రత మరియు 85-90% గాలిలో తేమ ఉండే ప్రదేశాలు అనుకూల మైనవి.

ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు విధానం

వీటి పెంపకానికి మన వాతావరణం అనుకూలంగా ఉండటమే కాక సులభంగా పెంచడానికి వీలవుతుంది. అధిక లాభాలను గడించవచ్చు కాబట్టి మన వాతావరణంలో వీటి పెంపకానికి ఆసక్తి పెరిగింది.

కావాల్సిన వస్తువులు : పూరిపాక గదులు – 2, 2-3 కిలోల 3-4 సెం. మీ. పొడవు వరిగడ్డి ముక్కలు ఒక్కొక్క బెడ్ కు పాలిధీన్ సంచులు 12 x 24 అంగుళాలు 50 గేజ్ మందు కలవి. కొయ్య లేదా స్టిల్తో చేసిన అరల చట్రం, జనపనార గొనె సంచులు, పుట్టగొడుగుల విత్తనం లేదా స్పాన్, డెట్టాల్ లేదా స్పీరిట్, ట్రే, చాకు లేదా బ్లేడు మరియ స్ప్రేయర్.

పెంచే విధానం : వరిగడ్డి చౌకగా మరియు సులభంగా దొరకటం వల్ల దిన్ని వాడతారు. ముందుగా వరిగాడ్డిని 3-5 సెం. మీ. ముక్కలుగా చేసుకోవాలి. తరువాత మంచి నీటిలో 4-6 గంటలు నానబెట్టిన తర్వాత నీటిని తీసివేయాలి. ఇలా నానబెట్టిన గడ్డిని గొనె సంచిలో నింపి వేడి నీటిలో ఒక గంట పాటు ఉంచి తరువాత తీసివేసి గడ్డిలో 60-65% తేమ ఉండేలా ఆరబెట్టాలి. తేమ శాతం తనిఖీ చేయడానికి చేతినిండా గడ్డిని తీసుకోని వెళ్ళ మధ్య ఉంచి పిండినట్లయితే నీరు కారకుండా ఉన్నట్లయితే తగినంత తేమ శాతం ఉన్నట్లుగా నిర్ధారించుకోవచ్చు. పాలిధీన్ సంచుల్లో ఆరబెట్టిన వరిగడ్డి ముక్కల్ని 5 సెం. మీ. మందాన వేసి విత్తనాన్ని అంచుల వెంట కాకుండా మధ్యలో వేయాలి. 1 కేజీ వరిగాడ్డికి 50 గ్రా. స్పాన్ కలిపి మరి గట్టిగా వత్తకుండా సంచులలో నింపి రబ్బరు బ్యాండ్ బిగించాలి. తర్వాత సంచులను స్పాన్ రన్నింగ్ గదిలోకి మార్చాలి.

ప్రతి రోజు గదిలో తగినంత తేమ, ఉష్ణోగ్రత ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3-4 వారాల్లో బెడ్లపైన తెల్లని శిలింధ్రం దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా తయారైన బెడ్లపైన పాలిధీన్ సంచులను శుద్ధి చేసిన బ్లేడుతో కత్తిరించాలి. గదిలో గాలి మరియు వెలుతురు సరఫరా అయ్యేలా చూసుకోవాలి.

ఇలా చేసిన తర్వాత 6-7 రోజులకు మొదటి పంట వస్తుంది. బెడ్లను రోజుకు 2 సార్లు తడిపి తేమ 65% ఉండేలా చూసుకోవాలి. తర్వాత 15 రోజుల వ్యవధిలో రెండవ మరియు మూడవ పంట వస్తుంది. బెడ్లను ప్రతిరోజు పరిశీలిస్తూ నలుపు, ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగు ఉన్న బెడ్లను తీసి దూరంగా గుంటలో వేయాలి లేకుంటే ఇతర బెడ్లకు వ్యాపించే అవకాశం ఉన్నది. ప్రతి కిలో ఎండు గడ్డి నుండి దాదాపు కిలో పచ్చి పుట్టగోడులు వస్తాయి. వీటిని తాజాగా ఉన్నప్పుడే 24 గంటల్లో మార్కెటింగ్ చేయాలి. ఫ్రిజిలో అయితే 3 రోజుల వరకు నిల్వ ఉంటాయి. అదే ఎల్మా పుట్టగొడుగులు గది ఉష్ణోగ్రత వద్ద 3 రోజులు మరియు ఫ్రిజ్ లో అయితే 10 రోజుల వరకు నిల్వ ఉంటాయి.

పట్టిక 1 : ముత్యపు చిప్ప పుట్టగొడుగుల సాగు ఆదాయ వ్యయాలు

(ఎ) శాశ్వత ఖర్చులు (రూ.)

క్రమ సంఖ్యకావలసిన వస్తువులుపరిమాణంఖర్చు (రూ.)
1. గదులు (10 x 10 అడుగులు) 2 30,000
2. ర్యాక్స్ (6 x ½ x 6) 10 5,000
3. డ్రమ్ లుగడ్డి ఉడకబెట్టే పాత్ర 1 500
4. గడ్డి ఉడకబెట్టే పాత్ర 1 500
5. గొaనె సంచులు 30 1,000
6. గడ్డి కట్టర్ 1 1,000
7. ధర్మోహైగ్రోమీటరు 1 1.100
8. బేబి స్ప్రేయర్ 1 200
9. ఇసుక - 1,000

మొత్తం
43,300

(బి) ఉత్పత్తి ఖర్చు (రికరింగ్ వ్యయాలు) (రూ.)

క్రమ సంఖ్యకావలసిన వస్తువులుపరిమాణంఖర్చు (రూ.)
1. ఎండుగడ్డి 500 కిలోలు 1,000
2. పాలిధీన్ సంచులు 500 100
3. విత్తనం (50. రూ./కి.) 80 కిలోలు 4,000
4. రసాయనాలు 200
5. కూలీల ఖర్చులు, నీరు, కరెంటు 2,000
6. ఇతర ఖర్చులు 200
మొత్తం 7,500

సంవత్సరానికి 9 పంటలు : 7,500 x 9 = 67,500.00

ఆదాయం : 500 కిలోల ఎండుగడ్డి నుండి 500 కిలోల ముత్యపుచిప్ప పుట్టగొడుగులు దిగుబడి రావటానికి అవకాశమున్నది.

500 కిలోలు చొప్పున 9 పంటలకి 500 x 9= 4,500 కిలోలు

కిలో ముత్యపుచిప్ప పుట్టగొడుగులు వేల = రూ. 120/- అయితే ,

4,500 కిలోలకి = 4,500 x 120= రూ. 5,40,000/- వస్తుంది.

నికర ఆదాయం : 5,40,000 – (40,300+67,500)

= రూ. 4,32,000/-

ముత్యపు చిప్ప పుట్టగొడుగుల పెంపకాన్ని సంవత్సరములో మర్చి, ఏప్రిల్, మే మాసములలో చేపట్టలేము. అప్పుడు పాల పుట్టగొడుగుల పెంపకాన్ని చేపట్టినట్లయితే అధిక ఆదాయాన్ని గడించటానికి అవకాశముంది.

పాల పుట్టగొడుగుల సాగు విధానం

ఈ పుట్టగొడుగులకు అనేక వ్యవసాయ వ్యర్ధాల పై కొద్దిపాటి మార్పులు చేసి పెంచుకోనవచ్చు. వ్యర్దాలపై కొద్దిపాటి మార్పులు చేసి పెంచుకోనవచ్చును. పాలిధీన్ సంచిలో శుద్ధి చేసిన వరిగడ్డి మొక్కల్ని నింపేటప్పుడు విత్తనాన్ని అంచుల వెంటే కాకుండా మధ్యలో కూడా చేయాలి. తయారు చేసిన బెడ్లను 85-90% తేమ, 30-350 సెం. ఉష్ణోగ్రత మంచి గాలి సరఫరా ఉన్న చీకటి గదిలో 30 రోజులు ఉంచి కొద్దిపాటి వెలుతురు ప్రతిరోజు 30 నిమిషాలు బెడ్ల పై పడేటట్లు తెరిచి ఉంచాలి. తర్వాత శిలింధ్రం బెడ్లను దట్టంగా వ్యాపిస్తుంది. ఇలా పూర్తిగా శిలింధ్రం వ్యాపించిన బెడ్లను శుభ్రమైన చాకుతో రెండు సమ భాగాలుగా విభజించి, వరిగాడ్డిని శుభ్రమైన చేతిలో బాగా అదిమిన తర్వాత, 3 సెం. మీ. మందం శుద్ధి చేసిన మట్టితో కప్పాలి. దీనినే కేసింగ్ అంటారు మట్టిని పర్చిన వెంటనే సంచుల పైన 0.1 % బావిస్టీన్ మిశ్రమాన్ని పిచికారి చేయాలి. గదిలో 29-350 సెం. ఉష్ణోగ్రత మరియు 80-90% తేమ ఉండేలా జాగ్రత్త పడాలి. కేసింగ్ చేసిన 15-20 రోజుల్లో గుండుసూది పరిమాణంలో పుట్టగొడుగులు పెరుగుతాయి. పైలియస్ వ్యాసం 6-8 సెం. మీ. ఉన్నపుడు కోత కోయాలి. కాడలను కింది భాగాన కోసి మట్టి చెత్తను తీసివేయాలి. వీటిని తాజాగా పాలిధీన్ సంచుల్లో ప్యాక్ చేసి, రంధ్రాలు చేసి 20-25 రోజుల వరకు రిఫ్రిజిరేటర్ లో నిల్వ ఉంచి మార్కెటింగ్ చేసుకోవచ్చు.

పట్టిక 2 : పాల పుట్టగొడుగుల సాగు ఆదాయ వ్యయాలు

(ఎ) : శాశ్వత ఖర్చులు (రూ.)

క్రమ సంఖ్య

కావలసిన వస్తువులు

పరిమాణం

ఖర్చు (రూ.)

1.

గదులు (10 x 10 అడుగులు)

2

30,000

2.

ర్యాక్స్ (6 x ½ x 6)

10

5,000

3.

డ్రమ్ లు

1

500

4.

గడ్డి ఉడకబెట్టే పాత్ర

1

500

5.

గొనె సంచులు

30

1,000

6.

గడ్డి కట్టర్

1

1,000

7.

ధర్మోహైగ్రోమీటరు

1

1,100

8.

బేబి స్ప్రేయర్

1

200

9.

ఇసుక

-

1,000

 

మొత్తం

40,300

(బి) ఉత్పత్తి ఖర్చు (రికరింగ్ మ్యయాలు)

క్రమ సంఖ్య

కావలసిన వస్తువులు

పరిమాణం

ఖర్చు (రూ.)

1.

ఎండుగడ్డి

500 కిలోలు

1,000

2.

పాలిధీన్ సంచులు

500

100

3.

విత్తనం (50. రూ./కి.)

80 కిలోలు

4,000

4.

రబ్బరు బ్యాండ్ లు

¼ కిలో

100

5.

రసాయనాలు (బావిస్టీన్, ఫార్మాల్డహైడ్)

 

200

6.

గది శుద్ధికి (డెట్టాల్ ద్రావణం)

 

200

7.

కేసింగ్ మట్టి (శుద్ధికి)

 

200

8.

ఇతర ఖర్చులు

 

100

9.

లేబర్ ఖర్చులు, నీరు, కరింటు

 

1,000

 

మొత్తం

6,900

సంవత్సరానికి 8 పంటలు : 6,900 x 8 = రూ. 5,200

ఆదాయం : 500 కిలోల ఎండుగడ్డి నుండి 500 పాల పుట్టగొడుగులు వస్తాయి.

8 పంటలకు గాను : 500 x 8= 4000 కిలోలు

ఇప్పుడు ఉన్న మార్కెట్ రేటు ప్రకారం = 4000 x 120

ఆదాయం = రూ. 4,80,000/-

నికర ఆదాయం : 4,80,000 – (40,300+55,200) =రూ. 3,84,500/-

వరిగడ్డి పుట్టగొడుగులు సాగు చేయు విధానం

వరిగడ్డి పుట్టగొడుగులు గడ్డి పుట్టగొడుగులు అని, ప్యాడి స్ట్రా పుట్టగొడుగులు అని అంటారు. ఈ పుట్టగొడుగులను పెంచుటకు 28-35o సెం. ఉష్ణోగ్రత మరియు గాలిలో తేమ 80-90% అనుకూలము. ఈ పౌత్తగోడుగులు విత్తనం వేసిన 15 రోజులలో కోతకు వస్తాయి. ఇవి ముత్యపు చిప్ప పుట్టగొడుగుల కన్నా చాలా రుచికరంగా ఉంటాయి. ఈ రకం పుట్టగొడుగుల నిల్వ కాలం 24 గంటలు మాత్రమే ఉంటుంది. తర్వాత పుట్టగొడుగులు నీరులాగ వాసన ప్రసరింపచేస్తాయి. వంద కిలల ఎండిన వరిగాడ్డికి 13 కిలల తాజా పుట్ట గడుగులు వస్తాయి, కిలోకి రూ. 350/- చొప్పున మొత్తం రూ. 4,550/- లు వస్తాయి. వంద కీలోల ఎండిన వరిగడ్డి ఖరీదు రూ. 200/- ఉంటుంది. కూలీల ఖర్చు పోను 100 కేజీల ఎండుగడ్డి నుండి రూ. 2000/- నుండి రూ. 3000/- వరకు ఆదాయం ఉంటుంది. వీటి పెంపకం సులభం, తక్కువ పెట్టుబడితో అధిక లాభాన్ని పొందవచ్చు. అంతర్జాతీయ స్ధాయిలో మంచి మార్కెట్ ఉన్నది. ఆహారపు మిలువలు కూరగాయలు మరియు పండ్ల కంటే ఎక్కవ. వీటిని శాఖహరముగా వాడవచ్చు.

ఒక కిలో వరిగాడ్డిని సుమారు 5 సెం. మీ లావు, 85-90 సెం.మీ. పొడవు గల కట్టలుగా కట్టాలి. ఇటుకలు పేర్చి నేల మట్టానికి కొంచెం ఎత్తుగా మడి చేయడానికి ప్లాట్ ఫాం తయారు చేయాలి. గడ్డి కట్టలను నీటిలో ముంచి సుమారు 12-16 గంటలు నానబెట్టి తీయాలి. ఎక్కవగా ఉన్న నీరు జరిపోయేటట్లు కట్టలను 15-20 నిమిషాలు నిలబెట్టాలి. కొయ్య చట్టాన్ని డెట్టాల్ తో తుడుచి శుభ్ర పరచాలి. దానిని ప్లాట్ ఫాం పై ఉంచి మొదటి వరుస 6-8 గడ్డి కట్టలను ఒకదాని ప్రక్కన ఒకటిగా పేర్చాలి. మొదటి వరుస కట్టల పై పుట్టగొడుగుల విత్తనాన్ని అంచుల నుండి 10 సెం. మీ ఎడంగా కుప్పలుగా నలుగు ప్రక్కలా ఉంచాలి. మొదటి వరుస గడ్డి కట్టల పై సుమారుగా 5 గ్రా. పప్పుపోడిని మరియు నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా నీటిని చల్లాలి. అదే విధంగా మొదటి వరుసకు అడ్డంగా రెండో వరుస వేసి మూడవ వరుసకు అడ్డంగా నాల్గవ వరుస గడ్డి కట్టలను పేర్చుతూ వరుసల మధ్య విత్తనాన్ని, పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాని. ఐదవ వరుస పై అంచుల వెంటనే కాకుండా ఉపరితలం అంతటా విత్తనం పప్పుపొడి, యూరియా నీళ్ళను చల్లాలి. చేతులతో కట్టలను కొంచెం నొక్కి మైనపు కాగితంతో కప్పాలి. ప్రతి రోజు మైనపు కాగితాన్ని తీసి మడిలో తేమ ఆరిపోకుండా కొంచెం మంచి నీటిని చల్లాని. గది/పాకలో తగినంత తేమ, చల్లదనం కొరకు గోడల వెంట తడిపిన గొనె పట్టాలను వ్రేలడదిసి అవసరము మేర వాటిని నీటితో తడుపుతూ ఉండాలి. రెండు వారాలలో పుట్టగొడుగుల మొలకలను గమనించవచ్చును.

ఇవి 4-5 రోజులలో బాగా పెద్దవి అవుతాయి. గొడుగులు విచ్చుకోకముందే అంటే గుండి దశలోనే వాటిని కోసుకోవాలి. ఒక వారం రోజులలో రెండవ కాపు మరొక వారంలో మూడవ కాపు వస్తాయి. పుట్టగొడుగులు ప్రతి మడికి 2-3 కిలోలు రాగలవు. మడికి చీమలు పట్టకుండా 10 శాతం బి.హెచ్.సి పొడిన చల్లాలి. మడిని నీలి / ఆకుపచ్చ / నలుపు రంగు గల శిలింధ్రము ఆశించే అవకాశముంది. అటువంటిది వాటిని తీసి నాశనం చేయాలి. లేనిచో మిగిలిన వాటికీ కూడా ఈ శిలింధ్రం వ్యాపించి ఎక్కువ నష్టం కలుగచేస్తుంది. గొడుగులు విచ్చుకోక ముందు కోయవలెను. కోసిన తరువాత వేడి నీళ్ళలో గాని, ఉప్పు నీళ్ళలో గాని ఉంచవలెను.

పుట్టగొడుగుల పెంపకములో పాటించవలసిన మెళకువలు

 • మంచి రకం విత్తనం (స్పాన్) నే వాడాలి.
 • పూర్తి పరిశుభ్రతను పాటించాలి.
 • గదిలో తగినంత ఉష్ణోగ్రత తేమ వుండేలా జాగ్రత్త వహించాలి.
 • వారానికి కనీసం 2 సార్లు గోడలు, నేల పై శాతం ఫార్మాలిన్ ద్రావణాన్ని పిచికారి చేయాలి.
 • పిచికారి చేసె సమయంలో బెడ్స్ పై నీరు పడకుండా తప్పనిసరిగా ఏదైనా కప్పాలి. క్రాపింగ్ రూమ్ లలో తగినంత వెలుతురు, గాలి ప్రసరణ వుండేలా చూడాలి. క్రాపింగ్ సమయంలో పుట్టగొడుగులు కొసాక మాత్రమే బెడ్స్ పై నీరు చల్లాలి.
 • గదిలోకి ఎలుకలు, కీటకాలు ప్రవేశించుకుండా చూడాలి. గది కిటికీలకు జాలి బిగించాలి.
 • ఆకుపచ్చని నల్లని మచ్చలు కనిపించిన బెడ్స్ ను తక్షణం అక్కడి నుండి తొలగించి పారమేయాలి. తద్వారా వ్యాధి వ్యపిచకుండా నిరోధించవచ్చు.

పుట్టగోడుగులపై వచ్చే వ్యాధులు – నివారణ

ఏ రకానికి చెందినా పుట్టగొడుగులు అయినా, పరిశుభ్రమైన వాతావరణంలో తగు జాగ్రత్తలతో పెంచి ఎట్టువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలి. లేకుంటే తరచుగా బెడ్స్ మీద నలుపు, ఆకుపచ్చ బూజులు కనిపిస్తూ ఉంటాయి. ఇవి బెడ్లపై కనిపిస్తే దానిని జాగ్రత్తగా చాకుతో తీసివేసి, ఆ ప్రదేశాలలో బావిస్టిన్ (0.1 శాతం) పిచికారి చేయాలి. స్పాన్ రన్నింగ్ గదుల్లో దోమలు, నల్లులు, స్ప్రింగ్ టైల్స్, నులి పురుగులు, బాక్టీరియా మరియు వైరస్ కూడా బెడ్స్ ని ఆశిస్తాయి. పుట్టగొడుగులను ప్రధానంగా స్టాప్ మిల్ డ్యూ, బ్రౌన్ ప్లాస్టర్ మోల్డ్, వైట్ ప్లాస్టర్ మాల్డ్, అవివ్ గ్రీన్ మాల్డ్, నలుపు, ఆకుపచ్చ, బాక్టీరియా మచ్చ తెగుళ్ళు ఆశిస్తాయి.

వీటి నివారణకు గదిలో బావిస్టిన్ (0.1 శాతం) లేదా ఫార్మాల్డీహైడ్ (10%) గదులు, గోడల వెంట గొనె సంచుల పైన మరియు నేల మీద ఉన్న ఇసుక పైన ప్రతి 10 రోజులకు ఒకసారి చల్లాలి. అలానే బెడ్స్ లో దోమ కన్పించినట్లయితే వవేప ద్రావణాన్ని (5 మి. లీ./లీ. నీటికి) కలిపి చల్లాలి పుట్టగొడుగుల బెడ్స్ లో బాక్టీరియా మచ్చలు కనిపేస్తే 2 గ్రా. బ్లీచింగ్ పౌడర్ 10 లీ. నీటిలో కలిపి చల్లాలి. క్రాపింగ్ రుపింగ్ రూమ్ లో ఎప్పటికప్పడు ఫార్మలిన్ 5% ద్రావణాన్ని పిచికారి చేయాలి. పెంచే గదిలో వెలుతురు లేనట్లయితే పుట్టగొడుగులు పొడవుగా మందమైన కాడలు ఏర్పడి క్రాప్ పరిమాణం తగుతుంది. అలాగే గాలి తక్కువగా ఉన్నట్లయితే పుట్టగొడుగులు చిన్నవిగా, గుంపులుగా ఏర్పడతాయి.

పుట్టగొడుగులుతో చాలా పసందైన వంటకాలు చేసుకోవచ్చు. వీటితో పుట్టగొడుగుల వేపుడు, బిర్యానీ, పకోడీలు, మంచూరియ, సమేసా, బజ్జిలు, ఆమ్లెట్, కట్ లెట్ తదితర వంటకాలు చేసుకోవచ్చు.

పుట్టగొడుగులు నిల్వ, ప్యాకింగ్ మరియు మార్కెటింగ్

 • తాజా పుట్టగొడుగులు 24 గంటల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు. కనుక సూర్యరశ్మిలో గానీ విధ్యుచ్చక్తి ఉపయోగించి కాని ఎండబెట్టి నిల్వ చేయవచ్చు.
 • తాజా పుట్టగొడుగులను 0.5% నుండి 1.5% పోటాషియం మేటబైసల్ఫేట్ లేదా 600 మి.గ్రా. సాధారణ ఉప్పు లీటరు నీటిలో కరిగించగా ఏర్పడిన ద్రావణంలో 5 నిమిషాలు కడిగి వైర్మేష్ మీద అరబెట్టడం వల్ల రంగు మారుపు.
 • ఇలా ఎండబెట్టిన వాటిని గాలి చొరబడిని డబ్బాలో ప్యాక్ చేయాలి.
 • నిల్వ ఉంచినప్పుడు సిలికాజెల్ ఒక చిన్న ప్యాక్ ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి.
 • నిల్వ ఉంచినప్పుడు సిలికాజెల్ ఒక చిన్న ప్యాక్ ను డబ్బాలో వేసినట్లయితే పుట్టగొడుగులు మెత్తబడకుండా ఉంటాయి. ఎండిన పుట్టగొడుగులు 6 నెలల వరకు నిల్వ ఉంటాయి.
 • పుట్టగొడుగులను 0.5% నిమ్మ ఉప్పుతో కడిగితే కొంత వరకు రంగు మారవు.

ప్రాసెసింగ్

పుట్టగొడుగులను ఎండలో ఎండబెట్టవచ్చు లేదా వేడిగాలి వచ్చే ఒవెన్ లో 60 డిగ్రీ సెంటి గ్రేడ్ వద్ద ఆరబెట్టాలి. ఎండిన పుట్టగొడుగులను పొడిగా చేసి, సూప్ పౌడర్, నూడిల్స్ వంటి వాటిని చేయవచ్చు.

తేజా ఆయిస్టర్ రకం లాభదాయకం. అయితే వాటిని 2 రోజుల వ్యవధిలో అమ్మివేయాలి. అమ్ముడు కాకపోతే ఎండబెట్టి అమ్ముకోవచ్చు. అయితే 10 కిలోల తాజా పుట్టగొడుగుల నుండి ఒక కిలో ఎండు పుట్టగొడుగులు మాత్రమే వస్తాయి. నాణ్యతను బట్టి ధర ఉంటుంది.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.00242718447
రాగం సాంబశివరావు Jul 15, 2018 10:01 AM

జయశంకర్ జిల్లా భూపాలపల్లి వెంకటాపురం మండలం మాకు పుట్టగొడుగుల పెంపకం స్పాన్ కావాలి నా సెల్ నెంబర్ 77*****49

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు