పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు అవసరం

సూచనల మేరకే పురుగు మందులు వాడే దిశగా రైతులు కృషి చేస్తారని వ్యవసాయశాఖ ఆశిస్తోంది.

ఆధునిక వ్యవసాయంలో చీడపీడల నివారణలో పురుగు మందులు ఒక అనివార్య భాగమైపోయాయి. అయితే అవి కేవలం చీడపీడల నివారణకే కాక ప్రత్యక్షంగా, పరోక్షంగా పర్యావరణం, మానవాళిపై కలుగజేస్తున్న దుష్ప్రభావాలపై ఇప్పుడిప్పుడే అవగాహన పెరుగుతోంది. రసాయన పురుగు మందుల వాడకం గత శతాబ్ద కాలంగా పెరుగుతూ వచ్చింది. సస్యరక్షణలో వాడుతున్న మందుల వాటా చూస్తే - పురుగు మందులు 60 శాతం, తెగుళ్ళ మందులు 18 శాతం, కలుపు మందులు 16 శాతం, జీవ కీటకనాశినులు 3 శాతం, ఇతరాలు 3 శాతంగా ఉన్నాయి. అంటే అత్యధికంగా పురుగుల నివారణలోనే మందుల వాడకం ఎక్కువగా ఉంది. దేశంలో మొత్తంగా వాడుతున్న సస్యరక్షణ మందుల్లో 50 శాతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, పంజాబ్ ఈ నాలుగు రాష్ట్రాల్లోనే వాడుతున్నట్లు నివేదికల ద్వారా తెలుస్తున్నాయి.

అయితే పురుగుమందులే పరిష్కారమా ? అని చూస్తే రాను రాను మేలు చేసే కీటకాలు, జీవాలు, పక్షుల ఉనికికి నష్టం వాటిల్లి పురుగుల ఉధృతి పెరిగిపోతోంది. వరిలో నష్టం చేసే పురుగులు 1940లో 10 రకాలు ఉండగా, ప్రస్తుతం 17 రకాల పురుగులు నష్టం కలగజేస్తున్నాయి. అలాగే గోధుమలో రెండు పురుగులే నష్టం చేసేవిగా ఉండేవి, అయితే ఇప్పుడు 19 రకాల పురుగు నష్టం చేస్తున్నట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది రసాయన మందుల వాడకం పెరుగుతున్న కొద్దీ పంటల్లో చీడపీడల ఉధృతి కూడా పెరుగుతోంది.

మనం ఉపయోగిస్తున్న పురుగు మందుల్లో 1-2 శాతం మందు మాత్రమే ఉద్దేశించిన లక్ష్యాన్ని చేరుతుండగా మిగతాది మన జల వనరులు, వృక్ష జంతుజాలాలు, మనుషులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. మొక్కలలో పరాగ సంపర్కానికి దోహదపడే తేనెటీగలు, సీతాకోక చిలుకలు అనేక మిత్ర కీటకాలు చనిపోతున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే పురుగు మందుల వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు పాటించక అనేక ప్రమాదాలకు గురవుతున్న స్థితిని గమనిస్తున్నాం.

వాడే క్రిమి నాశక మందుల విష తీవ్రతను బట్టి వాటిపై ఎరుపు, పసుపు, నీలం, ఆకుపచ్చ రంగులతో విష ప్రభావాన్ని సూచిస్తారు. ఆ తీవ్రతను బట్టి కూడా వాడకంలో మనం తీసుకునే జాగ్రత్తలు మరింత క్షేమదాయకంగా ఉండాలి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని శాస్త్రవేత్తలు, వ్యవసాయశాఖ అధికారుల సహకారం, సూచనల మేరకే పురుగుమందులు వాడే దిశగా రైతులు కృషి చేస్తారని వ్యవసాయశాఖ ఆశిస్తోంది. అనవసర ఖర్చును తగ్గించుకోవడమే కాక దీర్ఘకాలిక దుష్ప్రభావాలను నివారించవచ్చు. ఆ దిశగా అందరూ కృషి చేస్తారని వ్యవసాయశాఖ ఆశిస్తోంది.

3.00660066007
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు