హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / పురుగు మందులను పిచికారీ చేసి సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

పురుగు మందులను పిచికారీ చేసి సమయంలో రైతులు తీసుకోవలసిన జాగ్రత్తలు

పంటలకు పురుగు మందులు పిచీకారీ చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి తీసుకోవలసిన జాగ్రత్తలు.

పంటలకు పురుగులు తెగుళ్ళు ఆశించినప్పుడు వాటి నివారణకు పురుగు మందులు పిచికారీ చేసే సమయంలో రైతులు సరియైన జాగ్రత్తలు పాటించకపోతే పురుగు మందుల ప్రభావం వలన మానవాళికి జంతు జాలమునకు ప్రాణాపాయం కూడా సంభవించవచ్చును. చాలా వరకు పురుగు మందులు గాలి ద్వారా, చర్మము ద్వారా శరీరము లోపలికి ప్రవేశించి దీర్ఘకాలిక రోగాలకు దారి తీస్తాయి. పురుగు మందులు త్రాగే నీటిని ఆహార పదార్ధాలను కలుషితం చేయకుండా వాటిని ఉపయోగించిన తరవాత ఖాళీ దబ్బలను భూమిలో పాతి పెట్టాలి.

ముఖ్యంగా పంటలకు పురుగు మందులు పిచీకారీ చేసే సమయంలో రైతులు అప్రమత్తంగా ఉండి తీసుకోవలసిన జాగ్రత్తలు:

 • పురుగు మందులను కొనేముందు అవి అసలైన ప్యాకింగులతో ఉన్నాయో లేదో జాగ్రత్తగా పరిశీలించి కొనుగోలు చేయండి.
 • పురుగు మందులు ఉపయోగించే ముందు లేబులును వివరాల పత్రాన్ని పూర్తిగా చదవండి.
 • పురుగు మందుల డబ్బాలను పిల్లలకు అందకుండా తాళం వేసి భద్రాపరచండి.
 • ఆహార పదార్ధాలతో పాటుగా పురుగు మందులను నిలువ చేయరాదు.
 • పురుగు మందులను పిచికారీ చేసే సమయంలో రక్షణ కల్పించే వస్త్రాలను ధరించండి.
 • పిచికారీ చేసే ప్రదేశాలలోనికి పిల్లలు వెళ్లకుండా జాగ్రత్త వహించాలి, పిల్లల చేత పిచికారీ చేయించరాదు.
 • మిట్ట మధ్యాహ్నం తీవ్రమైన ఎండలో పురుగు మందులు పిచికారీ చేసినపుడు వాడద్దెబ్బ తగలడానికి అవకాశం ఉన్నందున రైతులు తగు జాగ్రత్త వహించవలెను
 • పురుగు మందు చల్లుతున్న ప్రదేశం వద్ద ఆహారం పదార్ధాలను ఉంచరాదు.
 • పురుగు మందులను చేతితో కలుపరాదు
 • సిఫారసు చేసిన పరిమానాన్ని సరిగా కొలిచి నీటితో కలిపేటప్పుడు కర్రతో బాగా బెట్టండి, చిందకుండా ఉండటానికి గరాటను ఉపయోగించండి.
 • గాలివీచే దిశలోనే పిచికారీ చేయండి.
 • పురుగు మందులను గాలికి వ్యతిరేక దిశలో పిచికారీ చేయరాదు.
 • చిల్లుపడిన, పాడైన స్ప్రేయర్ ను లేదా డస్టర్ ను వాడకండి.
 • నాజిల్ ను శుభ్రపరచడానికి నోటితో గాలిని ఊదకండి.
 • పిచికారీ చేసేటప్పుడు ఎటువంటి ఆహార పదార్ధాలను తినకండి, తాగకండి, ధూమపానానికి దూరంగా ఉండండి.
 • పురుగు మందు పిచికారీ చేసిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కొని ఆహార పదార్ధాలను తీసుకోవాలి.
 • ప్రమాదవశాత్తూ పురుగు మందు శరీరం పై పడితే మలినమైన దుస్తులను, శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకోండీ.
 • ప్రమాదవశాత్తూ పురుగు మందు విషప్రభావం కలిగితే ప్రాధమిక చికిత్స చేసి డాక్టరును సంప్రదించండి.
 • పురుగు మందుల ప్రభావం వల్ల అనారోగ్యం బారిన పడినప్పుడు డాక్టరుకు పురుగు మందు డబ్బా వివరాల కరపత్రాన్ని చూపించి, వెంటనే సరైన వైద్య చికిత్స చేయించండి.
 • ప్రయాణికులతో వెళ్ళే వాహనాలలో ఆహార పదార్ధాలతో పాటు పురుగు మందులను తీసుక వెళ్లరాదు.
 • వాడిన ఖాళీ పురుగు మందు డబ్బాలను గృహ అవసరాలకు వాడరాదు.
 • వాతావరణం అనుకూలంగాలేనప్పుడు పురుగు మందులను పిచికారీ చేయరాదు.
 • పరిసరాలు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోండి.
 • ఖాళీ డబ్బాలను విరగగొట్టి భూమిలో పాతిపెట్టండి.
 • మందు చల్లిన పొలంలో హెచ్చరిక బోర్డును పెట్టండి.
3.00638977636
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు