హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / ప్రస్తుతం కంది పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

ప్రస్తుతం కంది పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ

ప్రస్తుతం కంది పంటలో చేపట్టవలసిన సస్యరక్షణ.

మన రాష్ట్రంలో కంది పంటను ముఖ్యంగా మహబూబ్ నగర్, వికారాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్, కొమరంభిం ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల్, సూర్యాపేట మరియు నల్గొండ జిల్లాల్లో ఎక్కవగా సాగు చేస్తున్నారు. ప్రస్తుతం కంది మొగ్గ నుండి పూత దశలో అనగా అతి సున్నితదశలో ఉంది. ఈ దశలో వివిధ పురుగులు, తెగుళ్ళు ఆశించి నష్టపరిచే అవకాశముంది. కావున సరైన సమయంలో వాటిలో గుర్తించి తగు యాజమాన్య పద్ధతులు చేపడితే మంచి దిగుబడులు సాధించే అవకాశం కలదు.

తెగుళ్ళు

ఫూజేరియం ఎండు తెగులు: కందిలో ప్రధానమైన సమస్య ఫూజేరియం ఎండు తెగులు. ఇది భూమి ద్వారా సంక్రమిస్తుంది. ఈ తెగులు మెలిక దశ నుండి పూత, కాత దశ వరకు వ్యాపించే అవకాశం ఉంది. ఈ తెగులు లక్షణాలు గమనించినట్లయితే మొక్కల చిగుర్లు లేదా కొమ్మల క్రైండికి వంగి వాడిపోయినట్లు ఉండడం చూడవచ్చు. క్రమేణా ఆకులన్నీ పండుబారి, మొక్కలు గుంపులు గుంపులుగా ఎండిపోతాయి. ఇలా ఎండిపోయిన మొక్కలను పీకితే సులభంగా బయటకు ఉదివస్తాయి. కాండంను మధ్యభాగం నుండి చీల్చి చూస్తే లోపలి కణజాలం మొత్తం గోధుమ లేదా నలుపు రంగులు మారిపోవును. ఈ తెలుగు పాశికంగా ఆశించినట్లయితే కాండం క్రమీద నుండి క్రమేపి పైకి గులాబీ లేదా గోధుమ రంగు ఛాయా కనిపిస్తుంది.

నివారణ చర్యలు

 1. పంట మార్పిడి పద్దతిని ఖచ్చితంగా పాటించాలి.
 2. వ్యాధి నిరోధక రకాల్ని సాగుచేయాలి. ఉదా: డబ్ల్యుఆర్ జిఇ-97, డబ్ల్యుఆర్ జిఇ- 93, డబ్ల్యుఆర్ జిఇ- 65, ఐసిపియల్ - 87119
 3. 3 గ్రా. కార్బండజిమ్ లేదా డైరమ్ తో విత్తనశుద్ధి చేయాలి.
 4. కంది పంటతో పాటు జొన్న, సజ్జలంటి పంటలను అంతరపంటలుగా సాగు చేయాలి.
 5. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బండజిమ్ 1 గ్రా. లీటరు నీటిలో కలిపి మొక్క మెదళ్ళ చుట్టూ పోయాలి.

అల్తర్నేరియా ఆకుమచ్చ తెగులు : ఆలస్యంగా విత్తిన కందిలో అలాగే వర్షాలు తరువాత అధిక తేమ ఉండటం వలన ఈ తెలుగు ఆశించే అవకాశం కలదు. ఈ తెగులు ముదురాకుల పై మీదట సోకుతుంది. ఈ తెగులు సోకినా ఆకుల పై గోధుమ రంగులో వలయకారపు మచ్చలు వస్తాయి. ఇవి క్రమేపి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఆకుఅంతటా మాడిపోవును.

నివారణ చర్యలు

 1. 2 గ్రా. మ్యంకోజెబ్ లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేయాలి.

గొడ్డు మెతు తెగులు (స్టెరిలిటీ ముజాయిక్ తెగులు) : ఈ తెగులు నల్లి ద్వారా వ్యాపిస్తుంది మరియు బెట్ట వాతావరణం పరిస్ధితులలో ఎక్కవగా సోకుతుంది. తెగులు సోకినా మొక్క లేత ఆకుపచ్చ ఆకులను విపరీతంగా తొడుగుతుంది. ఈ తెగులు సోకితే మొక్క పూతే పూయుడు, కాయ కాయదు. అంటే మొక్కలో గల ప్రత్యత్పత్తి భాగాలన్నీ శాఖీయ భాగాల వలే మార్పు చెందును. ఈ తెగులు వల్ల మొక్కలకు పూత, కతా రావు కనుక దీన్ని గొడ్డుమెతు తెగులు అంటారు.

నివారణ చర్యలు

 • 3 గ్రా. నీటిలో కరిగే గంధకపు పొడి లేదా 4 మీ.లి. డైకోపాల్ లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 • ఈ తెగులును తట్టుకునే రకాలైన ఐసిపియల్ - 87119, ఐసిపియల్ - 8506, బియన్ యమార్ 853, బియాస్ యమార్ 736 లాంటి రకాలను సాగు చేయాలి.

పురుగులు

శనగపచ్చు పురుగు : వర్షం లేదా చిరుజల్లులు పడినప్పుడు, రాత్రి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగినప్పుడు ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది. దీని తల్లి పురుగు లేత పసుపు తెలుపు రంగు గ్రుడ్లను పూమొగ్గల పై ఒక్కొక్కటిగా (విడివిడిగా) పెడుతుంది. గ్రుడ్ల నుండి బయటకు వచ్చిన పిల్ల పురుగులు తొలిదశలో పూమొగ్గలు, లేత ఆకుల్ని గోకి తింటాయి. తరువాత కాయల్ని తొల్చి లోపలి ప్రవేశించి సగం శరీరికం కాయ బయట, సగం లోపల ఉండేలా కాయలోపల గింజల్ని తింటుంది. ఈ పురుగు ఆశించిన కాయల పై గుండ్రటి రంద్రాన్ని గమనించవచ్చు. దీని నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్దతులను అవలంభించాలి.

నివారణ చర్యలు

 • ఈ పురుగుల్ని తొలిదశలోనే గుర్తి సై వేపనంబంధ రసాయనాల్ని పిచికారి చేయాలి. వేప నూనె/ వేపగింజల కషాయంను 5 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేస్తే తల్లి పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు.
 • ఎకరాకు 5 లింగాకర్షక బట్టల్ని అమర్చి పురుగు ఉదృతిని గమనించాలి.
 • ఎకరాకు 200 లార్వాలకు సమానమైన యాన్ పివి వైరస్ ద్రావణం లేదా బాసిల్డ్ తురంహెన్నీస్ ను 400 గ్రా. చొప్పున ఎకరాకు సరిపడా నీటిలో కలిపి సాయంత్రం వేళలో పిచికారీ చేయాలి.
 • పురుగు ఉదృతి మరి ఎక్కవగా ఉంటే స్థాపనోషద్ 0.3 మీ.లి. లేదా ప్లుబెండమైడ్ 0.2 మీ.లి. లేదా క్లొరంత్రనిలిపారోల్ 0.3 మీ.లి. లేదా ఇండక్షరర్బ్ 1.0 మీ.లి. లేదా లండసైహలోత్రిన్ 1.0 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కాయ రసం పీల్చు పురుగు: బగ్స్ జాతికి చెందిన 3 రకాల పురుగులు పిండే, గింజ కట్టే సమయంలో బెట్ట పరిస్ధితులు, అధిక ఉష్ణోగ్రతలు ణమేదైతే ఎక్కవగా ఆశించి గింజల నుండి రసం పీల్చి వేయును. అందువలన గింజల పై నొక్కులు ఏర్పడి ఎండిపోయి, మెలకెత్తవు.

నివారణ చర్యలు

 • వీటి నివారణకు డైమిదోయేట్ 2.0 మీ.లి. లేదా మెనోక్రోటోఫాస్ 1.6 మీ.లి. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

సాధారణంగా రకాన్ని బట్టి పంట పూతకు రావడం జరుగుతుంది. స్వల్పకాలిక రకాలు 90-100 రోజులకు, మధ్యకాలిక రకాలు 120-130 రోజులకు పూతకు వస్తాయి. కనుక రైతు సోదరులు వారు సాగు చేయు రకాన్ని బట్టి వివిధ చీడపీడల ఉదృతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ తగు నివారణ చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించవచ్చును.

ఆధారం : తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం

3.09090909091
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు