హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / బి.టి పత్తిలో రసం పీల్చే పురుగుల సమగ్ర సస్య రక్షణ
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బి.టి పత్తిలో రసం పీల్చే పురుగుల సమగ్ర సస్య రక్షణ

రాష్ట్రంలో పండించే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైన పంట. వాటి గురించి తెలుసుకుందాం.

రాష్ట్రంలో పండించే ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైన పంట. పత్తిలో సుమారుగా 10 రకాల పురుగులు మన రాష్ట్రంలో పైరును ఆశించి పంటకు నష్టాన్ని కలుగజేస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా పచ్చదోమ, పేనుబంక, తామర పురుగులు, తెల్లదోమ, పిండినల్లి, ఇవి పత్తి ఆకుల నుండి రసాన్ని పీల్చడం ద్వారా పంటకు అపారమైన నష్టాన్ని కలుగచేస్తున్నాయి. ఈ పురుగులను నియంత్రించడానికి రసాయన మందులు విచక్షణా రహితంగా ఉపయోగించడం వలన పంట దిగుబడి తక్కువ కావడమే కాకుండా, పురుగు ఉధృతి ప్రారంభంలో తగ్గిన తర్వాత ఉధృతి రెట్టింపు అవుతుంది. దీనివలన పంట అధిక నష్టానికి గురి అవుతుంది. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకొని పురుగుల యాజమాన్యాన్ని సమగ్ర సస్యరక్షణ పద్ధతులు పాటించడం వలన పురుగుల ఉధృతి తగ్గటమే కాకుండా, పంటకు అయ్యే ఖర్చు కూడా తగ్గించుకొని తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను పొందవచ్చు.

పచ్చదోమ : పిల్ల పురుగు, రెక్కల పురుగు ఆకు అడుగు భాగాన చేరి ఆకుల నుండి రసాన్ని పీలుస్తాయి. దీనివలన ఆకులు మొదటగా దోనెలుగా మార్చుకొని, లేత పసుపు రంగుగా మారి తరువాత అంచుల నుండి ఎరుపు రంగుకు తిరిగి క్రమేపి ఎండి రాలిపోతాయి. ఈ పురుగు ఎక్కువగా ఆశించినప్పుడు మొక్కలలో ఎదుగుదల క్షీణించి మొగ్గలు ఏర్పడక దిగుబడులు విపరీతంగా తగ్గి నష్టం కలుగుతుంది. పైరు తీవ్రత దశలో పురుగుల ఉధృతి అధికంగా ఉంటుంది.

పేనుబంక : మొదట ఒక్కొక్కటిగా ఉండి పేనుబంక పురుగులు క్రమేపి కొమ్మ చివర గుంపులుగా ఉండి రసాన్ని పీలుస్తాయి. దీనివలన ఆకులు అడుగు భాగం వైపునకు దోనెలుగా మారి ముడుచుకుంటాయి. ఈ పురుగుల తేవంటి జిగురు పదార్థాన్ని విసర్జిస్తాయి. దీని వలన నల్లటి బూజు ఏర్పడి మొక్కలు చనిపోతాయి.

తామర పురుగు : తామర పురుగులు సన్నగా పసుపు గోధుమ రంగులో ఉంటాయి. వీటి పిల్ల, పెద్ద పురుగులు ఆకుల అడుగున చేరి ఆకుల రసాన్ని పీలుస్తాయి. ఇవి రసాన్ని ఎక్కువగా పీల్చడం వలన ఆకులు ముడుచుకొని పోవటవే కాక పెళుసుబారతాయి. ఆకుల అడుగుభాగాన వెండి వలె మెరిసే చారలను, వేగంగా తిరుగుతూ ఉండే గోధుమ రంగు గల పేను పురుగులను చూసి వీటి ఉధృతిని గమనించవచ్చు.

తెల్లదోమ : పైరు ముదిరిన కొమ్మలు, కాయలు ఏర్పడిన దశలోతరచుగా తెల్లదోమ ఆశిస్తుంది. వీటి పిల్ల - పురుగులు కదలకుండా ఆకు అడుగుభాగాల వద్ద ఉంటాయి. తల్లి పురుగులు తెల్లగా ఉండి ఎగరగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. తెల్లదోమ ఆశించిన ఆకులు పసుపు వర్ణానికి మారుతాయి. కొన్ని సార్లు పొడ మచ్చలు ఏర్పడతాయి. ఆ తరువాత ఈ పురుగులు ఆకుల అడుగుభాగం నుండి రసాన్ని పీల్చడం వలన మొక్కలు గిడసబారడంతోపాటు, కాయలు పక్వానికి రాకుండా పగిలిపోతాయి.

పిండినల్లి : ఈ పురుగు తెల్లని మైనం పూత కలిగి కదలిక లేకుండా స్థిరంగా ఒకే చోట ఉంటాయి. ఈ పురుగులు మొదట ఆకుల కింద చివరి, క్రమేపి కాండాలను ఆశించి గుంపుగా ఉంటూ రసం పీల్చడం వలన మొక్కలు ఎండిపోయి చనిపోతాయి.

ఎర్ర నల్లి : తల్లి, పిల్ల పురుగులు ఆకు అడుగు భాగాన పలుచని బూజు గూడులలో గుంపుగా చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులపై చిన్న చిన్న తెల్లని పొడ మచ్చలు ఏర్పడి పసుపు రంగులోకి మారి ముడతలు పడి క్రమేపి ఎండి రాలిపోతాయి.

సమగ్ర సస్యరక్షణ పద్దతులు : అందుబాటులో ఉన్న వివిధ సస్యరక్షణ పద్దతులు మేళవించి వాతావరణానికి ఎలాంటి నష్టం కలుగచేయకుండా పంటకు నష్టం కలుగజేసే పురుగులను అదుపులో ఉంచే ప్రక్రియ సమగ్ర సస్యరక్షణ. ఈ పద్ధతి ద్వారా పురుగులను అదుపులో ఉంచి అవి పురుగు మందులను తట్టుకొనే శక్తిని సంతరించుకోకుండా నిరోధించడమే కాకుండా, పురుగు మందులను వాడకంలోను లోటుపాటులను సరిచేసి ప్రకృతిలో సమతుల్యాన్ని నెలకొల్పడం సాధ్యమవుతుంది. రైతు స్థాయిలో పాటించదలచిన సమగ్ర సస్యరక్షణ చర్యల్లో కొన్ని..

 • ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్. ఎస్.తో శుద్ధి చేయబడిన విత్తనాలను వాడడం వలన పంట విత్తిన 30 రోజుల వరకు రసం పీల్చే పురుగులు ఆశించకుండా ఉంటాయి.
 • తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగుల నివారణకై ఇమిడాక్లోప్రిడ్ 600 ఎఫ్. ఎస్. 9 మి.లీ. కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసిన విత్తనాలే మార్కెట్లో లభిస్తాయి.
 • పత్తి పైరులో స్వల్పకాలిక పైరులైన పెసర, మినుము, సోయాచిక్కుడు వంటి పంటలను అంతర పంటగా సాగుచేయాలి. దీనివలన మిత్ర పురుగుల సంతతి బాగా పెరిగి పత్తి పైరును నష్టపరిచే పురుగులను అదుపు చేయగలుగుతాయి.
 • పత్తి పైరు చుట్టూ జొన్న లేక మొక్కజొన్న పంటలను అవరోధ పంటలుగా సాగుచేయాలి.
 • తొలి దశలో ఆశించే రసం పీల్చే పురుగులను అదుపులో పెట్టడానికి కాండం మీద మందు పూత పద్దతిని పాటించాలి. విత్తిన 30, 45 రోజులలో మోనోక్రోటోఫాస్ 1:4 నిష్పత్తిలో వాడాలి (1 పాళ్ళు ముందు, 4 పాళ్ళు నీరు) 60 రోజుల వయస్సులో ఇమిడాక్లోప్రిడ్ 1:20 నిష్పత్తిలో వాడాలి. కాండం పూత పద్ధతి ద్వారా పచ్చదోమ, పేనుబంక పిండినల్లి పురుగులను ఎటువంటి పురుగు మందుల పిచికారీ లేకుండా 70 రోజుల వరకు అదుపు చేసుకోవచ్చు. పురుగు మందులను పిచికారీ చేయకపోవడం వలన తొలిదశలో మిత్రపురుగుల సంతతి పెరిగే చీడపీడలను అదుపు చేయడంలో సహకరిస్తాయి.
 • తెల్లదోమలను పసుపు పచ్చని ఎరలలో పురుగు ఉనికి, ఉధృతిని అంచనా వేసి సకాలంలో నియంత్రణ చేపట్టాలి. 5 శాతం వేపగింజల కషాయాన్ని లేక వేపనూనె 5 మి.లీ. లీటరు నీటిలో కలిపి లేక వేప సంబంధిత పురుగు మందులను తెల్లదోమ అదుపు చేయడానికి ఉపయోగించాలి.
 • పిండినల్లి అదుపు చేయడానికి ఈ పురుగులు ఆశ్రయం కలిగించే కలుపు మొక్కలైన పిచ్చిబెండ, వయ్యారిభామ, ఇతర కలుపు మొక్కలను పొలంలో, గట్లమీద నుండి నిర్మూలించాలి.
 • పొలంలో పిండినల్లి మొదటగా ఆశించిన పత్తి మొక్క భాగాలను గుర్తించి పొలం నుండి తీసివేసి కాల్చివేయడం ద్వారా మిగతా మొక్కలకు వ్యాపించకుండా అరికట్టవచ్చు.
 • పురుగు పొలమంతా వ్యాప్తి చెందితేనే పురుగుమందులు వాడుకోవాలి. దానికొరకు ప్రొఫెనోఫాస్ బీటరు నీటికి 2 మి.లీ. + 1 మి.లీ. నూచాన్ కలిపి పిచికారీ చేయాలి.
 • రసం పీల్చే పురుగులకై మందులు - అసిఫేట్ 1.5 గ్రా. / లీటరు నీటికి; ఇమిడాక్లోప్రిడ్ 0.4 మి.లీ. / 1 లీటరు నీటికి ; ఎసిటామిప్రిడ్ 0.2 గ్రా. / లీటరు నీటికి; థయోడికార్బ్ 0.2 గ్రా. / లీటరు నీటికి; ఫిప్రోనిల్ 2 మి.లీ./లీటరు నీటికి.

సాధారణంగా సెప్టెంబరు, అక్టోబరు నేలల్లో తామర పురుగుల తాకిడి అధికంగా ఉంటుంది. కాబట్టి వీటి నివారణకు ప్రత్యేకంగా ఫిప్రోనిల్ అనే మందును వాడాలి.

pp9.pngపైన తెలిపిన సస్యరక్షణ పద్ధతులు పాటిస్తూ, పురుగుల ఉధృతి స్థాయిని బట్టి అవసరం మేరకు పైన తెలిపిన పురుగు మందులను సమయానుకూలంగా పిచికారీ చేసుకోవాలి. ఒక పురుగు మందు పలు పర్యాయాలు పిచికారీ చేయకుండా మిగతా పురుగు - మందులతో మార్పిడి చేసుకొని వాడాలి.

3.01907356948
Boini mallaiah Jul 28, 2020 04:04 PM

పత్తి పంట మొక్క ఎదుగుదలకు రసం పీల్చు పురుగుల కు ఎలాంటి మందులు పీచ్చికారి చెయ్యాలో తెలుపగలరు
ఫోన్ నెంబర్ 99*****52 అన్ని మందులు ఒకే దగ్గర కలపాల వేరు వేరుగా కలపాలి తెలుపగలరు

M lalu Dec 04, 2019 02:21 PM

Super

Panjabrao Bhagath Sep 22, 2019 09:17 PM

ప్రతి మంచి ముందు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు