పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

బిందు సేద్యంతో ‘సేద్యం బాగుబాగు’

నీటిని కాపాడుకుందాం పంటలు పండిస్దాం.

p18.pngపంటలు పండించడానికి నీటి కొరత ఎంతగానో ఉన్న ఈ తరుణంలో ఉన్న నీటిని అప్పుడప్పుడు వచ్చే కరెంటును దృష్టిలోకి తీసుకున్నట్లయితే తక్కువ నీరు, తక్కువ సమయంలో, పంటకు సరైన దశలో, సరైన రీతిలో సరైన మోతాదులో అవసరమైన భాగంలో నీటిని అందించడానికి అత్యంత ఉత్తమమైన పద్ధతి డ్రిప్ లేదా బిందు సేద్యం.

బిందు సేద్యం వల్ల కలిగే లాభాలు:

 • మొక్కకు కావాల్సిన నీటిని బొట్టు బొట్టుగా వేరు దగ్గరలో డ్రిప్పర్ల ద్వారా నీటిని అందిస్తుంది. దీని వలన సాధారణ పద్ధతితో పోల్చితే 30-50 శాతం వరకు నీటిని ఆదా చేయవచ్చు.
 • ఈ పద్ధతి ద్వారా లోతుగా, ఎత్తు పల్లాలుగా ఉన్న, తేలిక పాటి నేలల్లో లేదా నల్లరేగడి నేలల్లో, కొండ ప్రాంతాల్లో కూడా ఎంతో అనువుగా ఉంటుంది. అంతేకాక నేలను చదును చేయడం, గట్టు కట్టడం వంటి కాలువలు తవ్వడం వంటి పనులు ఉండవు ఎరువులు వేసే పనికూడా ఉండదు. దీని వలన ఖర్చు తగ్గుతుంది.
 • వేరుభాగంలో బొట్టు బొటుగా నీరు అందజేయబడుతుంది. దీని వలన నీరు వృథా కాదు, మొక్కల మధ్య వరుసల మధ్య నీరు నిల్వ ఉండదు కావున కలుపు బెడద ఉండదు..
 • బిందు సేద్యంలో ఎరువులు కూడా మొక్కలకు అందించవచ్చు. (ఫర్టిగేషన్) తక్కువ నీటితో తక్కువ ఎరువును మొక్కకు సకాలంలో వేరుభాగంలోనే నేరుగా అందించడం వలన మొక్క ఎరువులను వినియోగించే సామర్థ్యం పెరుగుతుంది. ఖర్చు తగ్గుతుంది.

డ్రిప్ ద్వారా నీటిని అందించడంలో పాటించాల్సిన మెళకువలు:

 • p19.pngడ్రిప్ పెట్టుకోదలచిన రైతులు ముందుగా తన భూమి విస్తీర్ణం, నేల స్వభావం, బోర్ (నీటి వసతి) వేసే పంటలు, పంట నీటి అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోవాలి.
 • డ్రిప్ సిస్టంలో మూడు ప్రధానమైన భాగాలు ఉంటాయి. ఎ) హెడ్ కంట్రోల్, బి) ఫిల్టర్ యూనిట్, సి) పి.వి.సి. ప్రధాన, ఉప ప్రధాన పైపులు, డ్రిప్పర్లు
 • హెడ్ కంట్రోల్ యూనిట్ పి.వి.సి. పైపుల ద్వారా నీటిని సరఫరా చేయడంలో, డ్రిప్పర్ ద్వారా నీరు మొక్క భాగంలో పడేంత వరకు కావాల్సిన పీడనాన్ని ఒకేరీతిలో ఉంచేందుకు ఉపయోగపడుతుంది.
 • ఎక్కువ పీడనంతో కనక డ్రిప్ ను రన్ చేసినట్లయితే పైపులు పగిలి, వ్యవస్థ పాడైపోతుంది.
 • ప్రధానమైన భాగం ఫిల్టర్ యూనిట్ - ఫిల్టర్ సరిగా ఉంటేనే డ్రిప్ సరిగా పనిచేస్తుంది. బోర్ ఉన్న భూముల్లో చెత్త, దుమ్ము, ఇసుక, మట్టి రేణువులను వడకట్టడానికి డిస్క్ ఫిల్టర్/ హైడ్రోసైక్లోన్ ఫిల్టర్స్ను వాడాలి. లేదంటే రేణువులు, ఇసుక డ్రిప్పర్స్లో ఇరికి, డ్రిప్ వ్యవస్థ పాడైపోతుంది.
 • పి.వి.సి. ప్రధాన, ఉప ప్రధాన పైపులు నేల, భూమి ఆకారాన్ని బట్టి అమర్చుకోవాలి. దీనికంతటికి ఇంజనీరింగ్ విభాగం నుండి సలహా పొందవచ్చు.
 • నీటిని, ఎరువులను (ఫర్టిగేషన్) మొక్కకు వేరు దగ్గర బొట్టు బొట్టుగా అందించవచ్చు.
 • ఒక వేళ డ్రైవ్ రంద్రాలు, పైపులు మూసుకుపోయినట్లయితే ఆమ్ల చికిత్స ద్వారా వాటిని శుభ్రపరచవచ్చు.
 • పి.వి.సి. ఉప ప్రధాన/లాటరల్స్ ను అవసరమైనప్పుడు పరచుకొని పంటకాలంలో నీరందించి, అవసరం లేనప్పుడు చుట్టి జాగ్రత్త చేసుకోవాలి.

డ్రిప్ వ్యవస్థ పని విధానం మెరుగు పరచడానికి పాటించాల్సిన మెళకువలు:

 • ఫిల్టర్ ను తరచు శుభ్రం చేసుకోవాలి.
 • తగిన పీడనం వద్దే డ్రిప్ను తడపాలి.
 • వాల్వ్ ని సరైన పద్దతిలో విప్పి ప్రధాన, ఉప ప్రధాన లాటరల్స్ పై పీడనం ఎక్కువగా పడకుండా పొలం అంతా నీరందించాలి.
 • లాటరల్స్/ఉప ప్రధాన పైపులు ఆమ్ల చికిత్సతో శుభ్రపరచాలి.
 • అవసరం అయిపోయాక లాటరల్స్ ని చుట్టి నేరుగా ఉంచాలి.

లాటరల్స్ వైండర్:

లాటరల్స్ ను చుట్టే యంత్రం - డ్రిప్ వాడాక వాటిని లాటరల్స్ను జాగ్రత్త చేయడం ప్రధాన సమస్య. దానికోసం రైతు వెసులుబాటుగా | ఉండటానికి గాను కొత్తగా లాటరల్స్ను చుట్టు యంత్రం మనకు అందుబాటులో ఉంచారు. దీనిలో లాటరల్ ఒక కొన భాగం దానిలో (వైండర్)లో ఉంచి దానికి ఉన్న హ్యాండిల్ తిప్పుతూ ఉండాలి. దీని ద్వారా లాటరల్ మొత్తం చుట్టగా చుట్టబడుతుంది. సులభంగా జాగ్రత్త చేయబడుతుంది. లేకపోతే చుట్టలు కట్టడం చాలా కష్టం. తర్వాత పంట కాలంలో పరచుకోవడం తేలికవుతుంది.

డ్రిప్ అనువైన పంటలు

 • పండ్ల తోటలు మామిడి, దానిమ్మ, జామ ఏరకమైన పండ్ల తోటల్లో అయినా మనం ఉపయోగించవచ్చు.
 • పత్తిలో, మిరపలో, కూరగాయల పంటల్లో డ్రిప్ చాలా బాగా పనిచేస్తుంది,
 • పూల తోటల్లో కూడా అన్ని రకాల పంటల్లో డ్రిప్ అనువైనది..

ఆధారం: ఎన్. సుమలత, ఎం.ఎ.ఓ., జైపూర్, పి. సురేష్, పి.ఎచ్.డి స్కాలర్, ఎం. రాజేంద్రప్రసాద్, పి.ఎచ్.డి. స్కాలర్.

2.98979591837
పల్లి అసిరిరాజు Aug 04, 2020 06:20 AM

మోటారు, బోర్లు, లేని భూమిలో బిందూసేద్యం చేసే విధానం గురించి తెలియజేయండి.

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు