పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మార్కెట్ ఇంటలిజెన్స్

తాము కోసిన పంటను నిలువ ఉంచాలా లేదా అమ్మవలెనా మరియు ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది

మన దేశంలో వ్యవసాయ పంటల ఉత్పత్తి గత 50 సంవత్సరాలుగా గణనీయంగా పెరిగింది. వీటితో పాటు వాణిజ్య పంటల వాటా కూడా పెరిగింది. మొత్తం ఉత్పత్తిలో మార్కెట్కు వచ్చే ఉత్పత్తుల వాటా కూడా పెరిగింది. ఈ పరిస్థితులలో ధరలపై అవగాహన, మార్కెట్ సమాచారం రైతులకు ఎంతో అవసరం. కానీ సమాచారం సక్రమంగా అవసరమైన సమయంలో రైతులకు, వినియోగదారులకు అందడంలేదు. మార్కెట్ సమాచారం రైతులు, వ్యాపారస్తులు తీసుకునే నిర్ణయాలలో కీలక పాత్ర వహిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రొ.జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, రాజేంద్రనగర్, హైదరాబాద్లోని వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం నందు 2013 సం.లో మార్కెట్ ఇంటెలిజెన్స్ కేంద్రంను ప్రారంభించారు. ఈ కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్న దాదాపు పది ముఖ్యమైన పంటల (మొక్కజొన్న శనగ, వేరుశనగ, ఎండు మిర్చి, ప్రత్తి, కంది , పెసర, మినుము, పసుపు, సోయాబీన్) ధరలను సేకరించి, విశ్లేషించి సంబంధిత సమాచారాన్ని మార్కెట్ పోకడలను మరియు ధరల అంచనాలను సూచిస్తుంది. ధరల అంచనా, ప్రధాన పంటలు విత్తే సమయానికి ముందు మరియు కోత కోసే సమయానికి రెండు కాలాలలో (వర్షాకాలము మరియు యాసంగి) రైతులకు అందిస్తారు. ధరల అంచనాలను ప్రాంతీయ పత్రికలు, ఆంగ్ల దినపత్రికలు, మాస పత్రికలు, టి.వి. రేడియోల ద్వారా చేరవేస్తారు. ఈ సమాచారం ఇంటర్నెట్లోని (అంతర్జాలం) వివిధ సంస్థల వెబ్ సైట్ల ద్వారా అందుబాటులో ఉంచబడుతుంది. అంతేకాకుండా ఇఫ్కో కిసాన్ సంచార్ లిమిటెడ్ సహకారంతో మొబైల్ ఫోన్ల ద్వారా రైతులకు చేరవేస్తుంది. రైతులు పంట కాలానికి ముందు తమ పంటల సరళిని నిర్ణయించుటకు, తాము కోసిన పంటను నిలువ ఉంచాలా లేదా అమ్మవలెనా మరియు ఏ సమయంలో ఏ మార్కెట్లో విక్రయించాలో మొదలగు నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమాచారం బాగా ఉపయోగపడుతుంది.

విత్తు సమయము, కోత సమయము మరియు ధర అంచనాలు వేయు నెలలు

పంట

కాలము

ధర అంచనాలు వేయు నెలలు

విత్తు సమయం

కోత సమయం

విత్తే ముందు

కోత ముందు

మొక్కజొన్న

వర్షాకాలం

 

మే

సెప్టెంబర్

జూన్-జూలై

అక్టోబర్-నవంబర్

యాసంగి

సెప్టెంబర్

డిసెంబర్

అక్టోబర్ – డిసెంబర్

జనవరి- మార్చి

కంది

వర్షాకాలం

మే

నవంబర్

జూన్-జూలై

డిసెంబర్ – జనవరి

పెసర

వర్షాకాలం

మే

ఆగష్టు

జూన్-జూలై

డిసెంబర్ – జనవరి

మినుము

యాసంగి

సెప్టెంబర్

డిసెంబర్

అక్టోబర్-నవంబర్

జనవరి – ఫిబ్రవరి

శనగ

యాసంగి

సెప్టెంబర్

డిసెంబర్

అక్టోబర్-నవంబర్

జనవరి – ఫిబ్రవరి

వేరుశనగ

వర్షాకాలం

మే

సెప్టెంబర్

జూన్-జూలై

అక్టోబర్ - డిసెంబర్

యాసంగి

సెప్టెంబర్

డిసెంబర్

అక్టోబర్ - డిసెంబర్

జనవరి – ఏప్రిల్

సోయాబీన్

వర్షాకాలం

మే

ఆగస్టు

జూన్-జూలై

సెప్టెంబర్ - అక్టోబర్

ప్రత్తి

వర్షాకాలం

మే

అక్టోబర్

జూన్ – ఆగస్టు

నవంబర్ - ఫిబ్రవరి

 

మిరప

వర్షాకాలం

మే

అక్టోబర్

జూన్ – ఆగస్టు

నవంబర్ – డిసెంబర్

యాసంగి

సెప్టెంబర్

జనవరి

అక్టోబర్ – డిసెంబర్

ఫిబ్రవరి – మే

పసుపు

వర్షాకాలం

మే

నవంబర్

జూన్ – ఆగస్టు

డిసెంబర్ - జనవరి

రైతులకు ప్రభుత్వ మద్దతు మరియు మార్కెట్ ధరలు, ఇతర మార్కెట్ సమాచారాన్ని తెలియజేసే అంతర్జాలం (ఇంటర్నెట్) వివిధ వెబ్ సైట్ల వివరాలు

http://www.cacp.dacnet.nic.in

http://www.agmarknet.nic.in

http://www.enam.gov.in

http://www.apeda.gov.in

http://www.eands.dacnet.nic.in

http://www.ikisan.com

http://www.pjtsau.ac.in/agri_market.php

http://www.indiancommodities.com

http://www.agriwatch.com

http://www.farmer.gov.in

http://www.mkisan.gov.in

http://www.tsmarketing.in

http://www.agrimarketing.telangana.gov.in

http://www.iffcolive.com

రైతులు తమ ఉత్పత్తులను మార్కెట్కు తీసుకువచ్చేటపుడు తీసుకోవలసిన జాగ్రత్తలు మరియు ముఖ్యమైన మార్కెట్లు

వరి

తేమ 14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1-2 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 2-3 శాతంలోపు ఉండవలెను. ఎర్ర గింజలు 2 శాతంకు లోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

చెర్ల, మిర్యాలగూడ, మలుగు, మధిర, సూర్యాపేట, కేసముద్రం, వేములవాడ, చొప్పదండి.

మొక్కజొన్న

తేమ 12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.25–0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బ తిన్న గింజలు 1 శాతంలోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

బాదెపల్లి, చెర్ల, నిజామాబాద్, సిద్దిపేట, అచ్చంపేట, నాగర్ కర్నూల్,

కంది

తేమ 10-14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10-0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 3-4 శాతం వరకు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్ల

తాండూరు, సూర్యాపేట, ఆదిలాబాద్, సిద్దిపేట, నారాయణపేట, బాదెపల్లి,

పెసర

తేమ 10-14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10-0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 1-5 శాతం వరకు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

సూర్యాపేట, ఖమ్మం, కేసముద్రం, తిరుమలగిరి.

మినుము

తేమ 10-14 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.10-0.75 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 1-5 శాతం వరకు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

సూర్యాపేట, చెర్ల, నిజామాబాద్

శనగ

తేమ 12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1-4 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 2-6 శాతం వరకు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెటు

నారాయణపేట, అలంపూర్, అదిలాబాద్.

సోయాచిక్కుడు

తేమ 7-12 శాతంలోపు ఉండవలెను. వేరే వంట పదార్ధాలు 0.2-1.0 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 0.5-2.0 శాతం లోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

ఆదిలాబాద్, నిజామాబాద్, గాంధారి, తాండూర్ కమ్మరపల్లి,

వేరుశనగ

తేమ 8 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 1-3 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 1-5 శాతం వరకు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

గద్వాల, బాదెపల్లి, వరంగల్, సూర్యపేట, తిరుమలగిరి.

నువ్వులు

తేమ 5–7 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్ధాలు 0.5-2.0 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న గింజలు 1-3 శాతంలోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

వరంగల్, బాదెపల్లి,

ఆముదం

తేమ 5–7 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్ధాలు 0.5-2.5 శాతం వరకు ఉండవచ్చును. దెబ్బతిన్న మరియు రంగు మారిన గింజలు 3–7 శాతం లోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

బాదెపల్లి, నాగర్ కర్నూలు, కద్ర, గద్వాల్, నారాయణ్ పేట్,

ప్రత్తి

తేమ 10 శాతం లోపు ఉండవలెను. ప్రత్తిని పూర్తిగా విచ్చిన కాయలనుండి మాత్రమే తీయవలెను. ప్రత్తిని ఉదయము సాయంత్రం వేళలలోనే ఏరవలెను. వాతావరణం లో తేమ ఎక్కువగా ఉన్నప్పడు ప్రత్తిని ఏరరాదు. చెత్త మరియు ఇతర పదార్థాలు 3–7 శాతంలోపు ఉండవచ్చును.

ముఖ్యమైన మార్కెట్లు

వరంగల్, ఆదిలాబాద్, బైంసా, ఖమ్మం, పెద్దపల్లి, జమ్మికుంట.

మిరప

తేమ 8-12 శాతంలోపు ఉండవలెను. వేరే పంట పదార్థాలు 0.25–0.75 శాతం వరకు ఉండవచ్చును.దెబ్బతిన్న గింజలు 3 శాతంలోపు ఉండవచ్చును, మిరవ కాయులు సమాన రంగు, ఆకారం కలిగి ఉండవలెను.

ముఖ్యమైన మార్కెట్లు

ఖమ్మం, వరంగల్, చెర్ల, నిజామాబాద్.

పసుపు

తేమ 12 శాతంలోపు ఉండవలెను. విరిగిన పసుపుకొమ్మలు 3 శాతంలోపు ఉండవలెను మరియు 75 శాతం పసుపుకొమ్మలు 3 సెం.మీ. కంటె ఎక్కువ పొడవు ఉండవలెను.

ముఖ్యమైన మార్కెట్లు

నిజామాబాద్, మెట్పల్లి, కరీంనగర్, కేసముద్రం

తెలంగాణలోని ముఖ్య వ్యవసాయ మార్కెట్లు మరియు ఫోన్ నెంబర్లు

క్ర.సం.

జిల్లా

వ్యవసాయ మార్కెట్ కమిటీ

సంప్రదించవలసిన ఫోన్ నెం.

1.

ఆదిలాబాద్

ఆదిలాబాద్

7330733416

2.

భద్రాద్రి (కొత్తగూడెం)

చెర్ల (నూగూరు)

7330733409

3.

జగిత్యాల

మెట్పల్లి

7330733346 

జగిత్యాల

7330733325

4.

జయశంకర్ (భూపాలపల్లి)

ములుగు

7330733502

5.

జోగులాంబ (గద్వాల్)

ఆలంపూర్

7330733280,

గద్వాల్

7330733269

6.

కామారెడ్డి

గాంధారీ

7330733255

7.

కరీంనగర్

చొప్పదండి

7330738321

జమ్మికుంట

7330733314

కరీంనగర్

7330733309

8.

ఖమ్మం

ఖమ్మం

7330733375

మధిర

7330733392

వైరా

7330733404

9.

మహబూబాబాద్

కేసముద్రం

7330733495

10.

మహబూబ్ నగర్

బాదెపల్లి

7330733263

దేవరకద్ర

7330733303

మహబూబ్ నగర్

7330733259

నారాయణపేట్

7330733288

11.

నాగర్ కర్నూలు

నాగర్ కర్నూలు

7330733275

అచ్చంపేట

7330733282

12.

నల్గొండ

మిర్యాలగూడ

7330733557

13.

నిర్మల్

బైరాసా

7330733427

14.

నిజామాబాద్

ఆర్మూర్

7330733245

నిజామాబాద్

7330733218

15.

పెద్దపల్లి

పెద్దపల్లి

7330733318

16.

రాజన్న (సిరిసిల్ల)

వేములవాడ

7330733328

17.

సిద్ధిపేట

సిద్ధిపేట

7330733537

18.

సూర్యాపేట

సూర్యాపేట

7330733328

తిరుమలగిరి

7330733584

19.

వికారాబాద్

తాండూర్

7330733618

20.

వరంగల్ అర్బన్

వరంగల్

7330733470

ఆధారం: వయసాయ పంచాంగం

3.0120240481
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు