పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

మెట్ట సాగులో బెట్ట యజమాన్యం

మెట్ట సాగులో బెట్టను ఎదుర్కొనడానికి ప్రధాన పద్ధతుల గురించి తెలుసుకుందాం.

మన దేశ జనాభాలో 60 శాతం ప్రజలు వ్యవసాయం, వ్యవసాయానుబంధ పనుల పై ఆధారపడి జీవిస్తున్నారు. అలాగే మనదేశంలో మెట్ట ప్రాంతాలు 60 శాతం వరకు ఉండగా, వివిధ రకాల ఆహార ధాన్యాలు, అపరాలు, నూనె గింజలు మెట్ట ప్రాంతాల నుంచే ఎక్కువగా లభ్యమౌతున్నాయి. మెట్ట ప్రాంతాలలో వర్షాభావ పరిస్థితులు, నేలల్లో పోషకాల స్థాయి తగ్గడం సక్రమమైన పంట యాజమాన్య పద్ధతులను పాటించకపోవటం వలన పంటల దిగుబడి చాలా తక్కువగా ఉంటోంది. చాలావరకు మన నేలలు తకునకు కండ కలిగి ఉండడమేకాక, ప్రతి పదడుగుల దూరానికి నేలలు భిన్నంగా ఉండి పడిన వర్షపు నీటిని సంరక్షంచుకోలేక పంటను పండించడానికి వీలుగా లేక దిగుబడులు తగులుతున్నాయి. భారతదేశానికి వెన్నముక్క లాంటి వ్యవసాయ రంగం వివిధ పర్యావరణ పరిస్థితులను ఎదుర్కొనడానికి తగిన విధంగా సమాయత్తం కావాలి. ఇందువలన మెర్స పొలాలు, మెట సాగులో బెట్టి యాజమాన్యం అనేవి కీలకమైన ప్రతిశోధనాంశాలుగా మారాయి.

మెట్ట సాగులో బెట్టను ఎదుర్కొనడానికి ప్రధాన పద్ధతులు

 1. పంట వేయక ముందు పాటించవలసినవి
 2. పంట వేసేటప్పుడు పాటించవలసినవి
 3. పంట కాలంలో పాటించవలసినవి

పంట వేయక ముందు పాటించవలసినవి

నేల రకాన్ని, నేల లోతును, ప్రాంత వర్షపాతాన్ని ద్రుష్టిలో ఉంచుకొని మూడు విషయాలకు ప్రధాన్యతనివ్వాలి.

 • బెట్టను తట్టుకొనే పంటలు, రకాలను ఎంచుకోవటం.
 • నీటి నిల్వను పెంపొందించటం.
 • నేల సామర్థ్యాన్ని పెంచుకోవటం.

బెట్టను తట్టుకొనే పంటలు, రకాలను ఎంచుకోవటం:

తక్కున, అనిశ్చిత వర్షపాతం గల ప్రాంతాలలో చెట్లను తట్టుకొనే పంటలు, రకాలను ఎంచుకోవటం మంచిది. మెట్ట పంటలైన వేరుశనగ, సతి, కందులు, జొన్న సల అముదం, శనగ, పెసర, మినుము, ఉలవలు, తెల్ల కుసుమలలో బెట్టను తట్టుకొనే రకాలు లబ్యమౌతున్నాయి.

వివిధ మెట్ట పంటల్లో బెట్టను తట్టుకునే రకాలు:

వేరుశనగ – వేమన, కదిరి-6 నారాయణి

పత్తి-శ్రీశైలం, రాఘవేంద్ర

కందులు-ఎల్.ఆర్.జి-45, పి.ఆర్.జి- 158

జొన్న-ఎస్.పి.వి.-1414 సి.ఎస్.పి-15

సజ్జ-ఐ.సి.యెం.వి – 221

పెసర-ఎల్.జి.జి. – 407,406, డబ్ల్యు.జి.జి – 37

కుసుమలు – మంజీర ఎన్.ఎ.ఆర్.ఐ – 6 మొదలగునవి.

నీటి నిల్వను పెంపొందించటం:

మెట్ట ప్రాంతాలలో వాలుకు అడ్డుగా దుసుకుని, సాళ్ళలో నాటుకోవటం చాలా ఉపయోగకరం. దీనివలన పడిన వర్షపునీరు కాలువలలో సేకరించబడి భూమిలోకి ఇంకుతుంది. ఇదే కాకుండా వర్షాధార పంటలు బెట్టకు ఎండిపోకుండా, పొలంలో నీటి కుంటలు ఏర్పాటుచేసుకుంటే, ముల్యమైన పంటకాలాలలో ఒకటి నుండి రెండు తడులను పంటకు ఇవ్వవచ్చు. ఇది పంట నీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి సహాయపడుతుంది. సుమారు 250 క్యూబిక్ మీటర్ల నీరు 2.5 సెం.మీ. లోతుకు 1 హెక్టారు పంటకు తడి ఇవ్వడానికి సరిపోతాయి.

నేల సామర్ధ్యాన్ని పెంచుకోవటం:

తక్కువ లోతుగల నేలల్లో భూసారం, నీటిని పట్టి ఉంచే శక్తి తక్కువగా ఉంటాయి. స్వల్ప కాలానికి భూసారాన్ని రసాయన ఎరువుల ద్వారా పెంపొందించుకోని అధిక దిగుబడులు పొందవచ్చుగానీ, తేమని, పోషకాలను భూమి లోపల పట్టి ఉంచడం కుదరదు. ఇందుకు గాను వ్యవసాయ వ్యర్థపదార్థాలను ఎరువుగా మార్చి లేదా అలాగే భూమిలో కలుపుకొనే పద్ధతిని పాటించాలి. భూసంరక్షణ కోసం చేపట్టే యాంత్రిక పద్ధతుల్లో కంటూరు గట్లు లేదా వాలు గట్లు అత్యల్ప అల్ప వర్షపాత ప్రాంతాలలో నేల, వాన నీటి సంరక్షణకు ఉపయోగకరంగా ఉండి పంటల దిగుబడులను పెంచుతాయి.

పంట వేసేటప్పుడు పాటించవలసినవి

రుతుపవనాలు: రుతుపవనాలు సకాలంలో వస్తే

 • జూన్ మాసంలో జొన్న, మొక్కజొన్న కంది, వేరుశనగ పెసర మొదలగునవి విత్తుకోవచ్చు.
 • రుతుపవనాలు 20 రోజులు ఆలస్యంగా వస్తే ఆముదాలు, సజ్జ, పోద్ధుతిరుగుడు, గోరుచిక్కుడు మొదలగునవి విత్తుకుంటే మంచిది.
 • రుతుపవనాలు మరింత ఆలస్యమేతే ఉలవలు కొర్రలు మొదలైనవి విత్తుకుంటే మంచిది.

భూమి లోతు:

 • భూమి లోతు నేల సామర్ధ్యాన్ని బట్టి పంటల దిగుబడి మారుతూ ఉంటుంది.
 • 5-15 సెం.మీ. లోతు ఉన్న నేలల్లో జొన్న, సజ్జ, కంది, ఆముదం మొదలగు పంటలు కొంతవరకూ ఆదాయాన్ని ఇవ్వగలదు. మరికొన్ని పంటలు, కొద్ది మాత్రం పెరిగి దిగుబడినివ్వటంలో విపలమౌతుంటాయి.
 • జోన్న/సజ + కంది (2:1) లాంటి పంటల సరకి ఈ 5-15 సెం.మీ. లోతుకు సరైనవి.
 • 15-30 సెం.మీ. లోతుకు సరైనవి. భూముల్లో మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, పత్తి, గోరుచిక్కుడు మొదలైనవి లాభదాయకం.

విత్తనశుద్ధి:

 • విత్తనశుద్ధి కాప్టాన్, ధైరామ్, కార్బండైజమెతో చేసుకున్న తర్వాత అపరాలైతే రైజోబియం కల్చర్ పట్టించడం మంచిది.
 • సాధారణంగా రైతాంగం వర్షాభావ పరిస్థితులను ద్రుష్టిలో ఉంచుకుని రైజోబియం కల్చర్ వలన కలిగే లాభాలు తెలిసి ఉన్నా చేయరు. వీలు చేసుకుని విత్తనానికి రైజోబియం కల్చర్ పట్టించడం వలన వేరు బుడిపెలు ఎక్కువగా వచ్చే అవకాశం, నేలలో సూక్ష్మజీవులు ప్రుద్ధి చెందే వీలుంటుంది.

పంట విత్తుకున్నాక పాటించవలసిన బెట్ట యాజమాన్య పద్ధతులు

 • పంట విత్తిన మొదటి 20 రోజులలో బెట్ట ఏర్పడితే 50-70 శాతం దాకా మొక్కల సాంద్రత తగ్గుతుంది. ఈ ఖాళీలు అదే పంట విత్తనంతో తిరిగి వర్షపురాకతో విత్తుకోవాలి. ఒకవేళ మరింత ఆలస్యమైతే అదే ఖాళీలలో వేరే పంట విత్తనాలు అంటే ఆలసందలు (బెబ్బర్లు) లాంటి పంటలతో విత్తుకోవాలి.
 • 15 నుండి 25 రోజుల బెట్టను దాని తీవ్రతను బట్టి, బెట్టకు ముందుగా వచ్చిన వర్షపాతం, మొక్క దశను మొదలైన వాటిని దృష్టిలో పెట్టుకుని యజమాన్య పద్ధతులను పాటించాలి.
 • రెండు పంట సాళ్ళ మధ్య నాగటి సాలు అదనంగా తీయడంతో వర్షపు నీరు పడి కొద్ది సమయం నిలబడడానికి దోహదపడుతుంది. సాధారణంగా ఎర్ర నేలల్లో వర్షాలకు నేల ఉపరితలం కొంత గట్టిగా ఉండి(నేల రంధ్రాలు మూసుకుపోయి) నీరు ఇంకడం కష్టం అవుతుంది. అలాగే నల్లరేగడి నేలల్లో ఎక్కువ వరపాతమైతే డ్రైనేజీ ఛానల్ తో నీటిని బయటకు తీసి నేలలోని వేరుకి ఆక్సిజన్ అందేటట్లు చేయవచ్చు. ఈ రకంగా చేసే 0-3 శాతం దిగుబడి అధికంగా వచ్చే వీలుంది.
 • అకులలో తేమను బట్టి 1-2 శాతం యురియాని మొకుపై పిచికారీ చేయవచ్చు. ఒకవేళ అకులలో తేమ శాతం తగ్గి నారగా, బిరుసుగా ఉన్నట్లైతే, వీలైతే నీటిని పిచికారీ చేసుకోవచ్చు. ఈ పద్దతులు పొలానికి దగరలో నీటి లభ్యతను బట్టి ఉపయోగపడతాయి.
 • గ్లైరిసీడియాను గాని, ఏదైనా లభ్యమయ్యే ఆకుని కొమ్మలతో పాటు బెట్ట సమయంలో రెండు సాళ్ళ మధ్య నేలపై పరచడం వలన నేలలోని తేమ ఆవిరి కాకుండా కాపాడి, కొమ్మల ఆకులు రాలి, కుళ్ళి, పంటకు నత్రజనిని అందిస్తాయి.
 • అధిక వర్షపాతం నమోదైనప్పుడల్లా నీటి కుంటల్లో నీటిని నిల్వ చేయగలిగితే ఆరుతడి పంటను బెట్టనుంచి రక్షించుకునే వీలుంటుంది.

పైన చెప్పిన విషయాలను రైతాంగం దృష్టిలో పెట్టుకొని, మెట్ట పంటల్లో బెట్టను, బెట్ట రాక ముందునుంచే సమర్థవంతంగా ఎదుర్కొనడానికి సంసిద్ధులై ఉండాలి.

2.98954703833
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు