పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

మెట్టసాగులో మెళకువలు

తెలంగాణలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది.తెలంగాణలో ఎర్రనేలలు 54%, నల్లనేలలు 23%, ఒండ్రు నేలలు 9% మరియు మిగితా నేలలు 7% ఉన్నాయి.

తెలంగాణలో సుమారు 60% వ్యవసాయం వర్షాధారంగానే జరుగుతుంది. రాష్ఠ్రంలో సరాసరి సంవత్సర వర్షపాతం 906 మి.మీ. కాగా, అందులో 76% వర్షం నైరుతి ఋతుపవనాల ద్వారా కురుస్తుంది. తెలంగాణలో ఎర్రనేలలు 54%, నల్లనేలలు 23%, ఒండ్రు నేలలు 9% మరియు మిగితా నేలలు 7% ఉన్నాయి. ఈ నేలల్లో మెట్ట వ్యవసాయం జరుగుతుంది.

భూసంరక్షణ

వర్షం తక్కువగాను మరియు సకాలంలో పడక పోవటం వలన పంటల దిగుబడిలో చాలా వ్యత్యాసముంటుంది కాబట్టి మెట్టసాగులో భూసంరక్షణ మరియు ఆధునిక మెట్ట వ్యవసాయ సాగు పద్దతులను అనుసరించి అధిక దిగుబడులను సాధించవచ్చు.

ఎర్ర నేలలు

ఎర్రనేలలు లోతు తక్కువ మరియు నీటిని నిల్వ వుంచుకొనే శక్తి కూడా తక్కువగా ఉంటుంది. తక్కువ సమయంలో అధిక వర్షం లేక ఎడతెరిపి లేకుండా తుఫాను వర్షాలు కురిసినప్పుడు నీరు ఒరవడి రూపంలో నష్టపోవడం జరుగుతుంది. ఈ ఒరవడి ద్వారా సారవంతమైన పైపొర మట్టి, అందులోని పోషక పదార్ధాలు నష్టపోవడం జరుగుతుంది. వీటిని రక్షించడానికి కాంటూరు గట్లు, జీవగట్లతో వాలుకు అడ్డంగా సేద్యం చేయాలి. కనుక మెట్ట వ్యవసాయాభివృద్ధిలో భూసంరక్షణ చాలా ప్రాధాన్యమయినది.

  • వాలుకడ్డంగా దుక్కిదున్నడం, విత్తనం, అంతరకృషి చేయటం వలన నీటి ఒరవడిని ఎక్కడిక్కడే అరికట్టి ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింప చేయవచ్చు.
  • పొలంలో కాలువలు మరియు బోదెలను ఏర్పాటు చేయాలి. తద్వారా తక్కువ వర్షపాతం సమోదైనప్పుడు తేమ సంరక్షించబడుతుంది. అలాగే అధిక వర్షపాతం కురిసినప్పుడు మురుగు నీరు బయటకు వెళ్ళుటకు వీలపుతుంది లేదా ప్రతి 2.4 నుండి 3.6 మీ. అంతరంలో దుంపనాగలితో గొడ్డు చాలును ఏర్పాటు చేయాలి.
  • బెట్టపరిస్థితులలో ఒకటి లేక రెండుసార్లు దంతి సహాయంతో తేలికగా అంతరకృషి చేస్తే దుమ్ము రక్షక కవచంగా ఏర్పడి తేమను సంరక్షించబడుతుంది.
  • రెండు శాతం వాలు కలిగిన నేలల్లో ప్రతి 50 మీ. దూరానికి 0.63 ఘనపు మీ. పరిమాణంలో కాంటూరు గట్లు వేయాలి.
  • నేల పైపొర గట్టిపడే భూములకు ఎకరాకు 15 టన్నుల ఇసుకను తోలి కలియదున్నాలి. ఇటువంటి భూముల్లో వేరుశనగ ఉడలు సులభంగా దిగి, కాయలు బాగా పూరడానికి అవకాశముంటుంద. వర్షపు నీరు బాగా భూమి లోపలికి ఇంకి నీటి వృధా తగ్గుతుంది.
  • జొన్న, వేరుశనగ పంటల్లో అంతరపంటగా కందిని వేసేటప్పుడు, కందితోపాటు ఒరవడిని అరికట్టే పంటలయిన ఉలవ, ఆలసంద కలిపి విత్తితే, ఒరపడే అరికట్టబడటమే కాకుండా, అధిక నికరాదాయం పొందవచ్చు.

నల్ల నేలలు

నల్ల నేలలను నీటిని నిల్వ వుంచుకునే శక్తి అధికం. వర్షపు నీరు త్వరగా ఇంకినందువలన ఎక్కువ శాతం నీరు, మట్టి కొట్టుకొనిపోతుంది. ఈ నేలల్లో అధిక దిగుబడి సాధించడానికి భూసంరక్షణ దున్నడంలో కొత్త సాంకేతిక పద్దతులు అవలంభించాలి.

  • ఎర్రనేలలు కాంటూకు గట్ల మాదిరిగా నల్ల నేలలకు 0.8 ఘనపు మీటర్ల గేడెడ్ గట్లు వేయాలి. ఈ గట్ల పైభాగాన 0.1 – 0.25 శాతం వాలుతో నీరు పోవడానికి కాలువ ఏర్పరచి, ఈ కాలువలను పెద్ద కాలువలతో కలిపి, నేల కోత లేకుండా, నీటిని బయటకి పోయేలా చేయాలి.
  • వెడల్పాటి బోదెలు – కాలువలుగా నేలను తయారుచేసి, వెడల్పాటి బోదెలపైన విత్తుకోవాలి. కాలువలు మురుగు నీటిని బయటకి పంపడానికి ఉపయోగపడతాయి. లోతైన నల్లరేగడి నోలలకు అనుకూలం లేదా మూడు మీటర్ల వెడల్పుతో, 20 సెం.మీ. ఎత్తు గల వెడల్పాటి బోదెలు చేసి విత్తుకొన్న మంచి దిగుబడులు వస్తాయి. బోదెలు ప్రక్కన కాలువలు, తక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు ఇంకడానికి, ఎక్కువ వర్షం వచ్చినప్పుడు నీరు బయటకు పోవడానికి ఉపయోగపడతాయి.
  • ఎకరానికి 8 టన్నుల పశువుల ఎరువు వేస్తే నీరు బాగా ఇంకుతుంది.

మేలైన యాజమాన్య పద్దతులు

అనువైన పంటలు మరియు విత్తే సమయం

వర్షం వచ్చే సమయాన్ని మరియు స్వభావాన్ని బట్టి పంటలను నిర్ణయించుకోవాలి. వివిధ మాసాల్లో విత్తవలసిన పంటలు ఊ క్రింద ఇవ్వబడ్డాయి.

వ్యవసాయ వాతావరణ మండలము

నేలలు

అనువైన పంటలు

ప్రత్యామ్నాయ పంటలు

ఆగష్ట్

సెప్టెంబర్

ఉత్తర మరియు వధ్య తెలంగాణా మండలాలు (అదిలాబాద్, కొమరంభీం, జగిత్యాల, జనగాం, జయశంకర్, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిర్మల్, మంచిర్యాలా, మెదక్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సంగారెడ్డి, సిద్ధిపేట)

తేలిక నేలలు

జొన్న, కంది

ఉలవలు, ప్రొద్దుతిరుగుడు, ఆముదం

ఉలవలు

మధ్యస్థం మరియు బరువు లేలలు

ప్రత్తి, సోయాబీన్, జొన్న, మినుము

ప్రొద్దుతిరుగుడు, కంది, ఆముదం (దగ్గరగా విత్తుకొనుట)

-

తోలిక నేలలు

వేరుశనగ, కంది, జొన్న, ఆముదం

ఉలవలు, జొన్న (చొప్పకు), సజ్జ, రాగి, ఆముదం, ప్రొద్దుతిరుగుడు.

పెసర

దక్షిణ తెలంగాణా మండలం (మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నవపర్తి, జోగులాంబ గద్వాల్, నల్గొండ, యాదాద్రి, సూర్యాపేట, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్)

మధ్యస్తము మరియు బరువు నేలలు

ప్రత్తి, జొన్న, ఆముదం

ఆముదం, కంది (దగ్గరగా విత్తుకొనుట)

 

సూచన

సెప్టెంబర్ మాసము నుండి సాధారణ రదీ పంటలు బరువైన నేలల్లో విత్తుకోవచ్చు

మెట్ట పొలాలకు అనువైన పంట రకాలు

పైరు

రకాలు

నూనెగింజలు

వేరుశనగ

వేమన, తిరుపతి-4, జె.ఎల్-24, కదిరి-5, కె-6, కె-9, నారాసణి, అభయ, ఐ.సి.జి.ఎ-91114, అనంత, గ్రీష్మ, కదిరి హరితాంధ్ర.

ఆముదం

క్రాంతి, జ్వాల, జ్యోతి, హరిత, కిరణ్, పి.సి.యస్-262, పి.సి.బెచ్-111, జి.సి.హెచ్-32

ప్రొద్దుతిరుగుడు

మార్డన్, ఎ.పి.యస్,హెచ్-11, కె.సి.యస్.హెచ్-1, ఎన్.డి.యస్.పెచ్-1

నువ్వులు

మాధవ, గౌరి, రాజేశ్వరి, శ్వేత, ఎలమంచెలి-11, ఎలమంచలి-17, చందన

కుసుమ

మంజీర, సాగర్ ముత్యాలు, భీమ, జి.యస్.ఎఫ్-

అపరాలు

 

కంది

పల్నాడు(ఎల్.ఆర్.జి-30), అభయ, ఎల్.ఆర్.జి-41, టి.ఆర్.జి-33, ఐ.సి.పి.ఎల్-85063, పి.ఆర్.జి-100, డబ్లు.ఆర్.జి-27, పి.ఆర్.జి 158, పి.ఆర్.జి. 176

పెసర

యమ్.ఎల్-267, మధీర-295, పుష్కర, వరంగల్-2, యల్.జి.టి-450, యల్.జి.టి-407, టి.యం-96-2, పూస-105

మినుము

కృష్మయ్య, ప్రభవ, ఎల్.బి.జి-623, ఎల్.బి.జి-752, ఎల్.బి.జి-20, పి.యు-31

ఉనవలు

మారుకుల్తి, పి.హెచ్.జి-9, పి.డి.యం-1, వి.జెడ్.యె-1, పాలెం-1, పాలెం-2

శనగ

నంద్యాల శనగ-1, క్రాంతి, శ్వేత,అన్నెగిరి, జె.జి-11, కె.ఎ.కె-2, విహార్, జాకి-9218, ఎన్.బి.ఇ.జి-49

సోయాచిక్కుడు

పింకె-472, యెం.ఎ.సి.పెచ్-58, బాసర్, జె.ఎస్.335

చిరుధాన్యాలు

జొన్న

సి.యస్.హెచ్-5, సి.యన్.హెచ్-6, సి.యస్.బెచ్-9, పి.యస్.హెచ్-1, ఎన్.టి.జె-1, ఎన్.టి.జె-2, ఎన్.టి,జె-3, ఎన్.టి.జె-4, యం-35-1, పి.ఎస్.వి-56, సి.ఎస్.వి-31

సజ్జ

ఐ.సి.యం.వి-221, ఐ.సి.టి.పి-8203, రాజ్-171, పి.హెచ్.బి-3

కొర్ర

ప్రసాదు, చిత్ర, లేపాక్షి, కృష్ణదేవరాయ, మరసింహరాయ, శ్రీలక్ష్మీ, సూర్యనంది.

వాణిజ్య పంటలు

ప్రత్తి

యస్.ఎ-1325 (వరసింహ), కాంచన, శివనంది, అరవింద, యాసంగి

విత్తనం మరియు విత్తే పద్దతి

మెట్టసాగులో ముఖ్యంగా జొన్న, సజ్జ, రాగి, వేరుశనగ, కంది, ఉలవలు, ఆలసందలు, ఆముదం లాంటి పంటలు ముఖ్యమైనవి. అన్ని పంటలలో పోల్చితే ఒక ఎకరానికి సరిపడే విత్తన మోతాదు, దాని ఖరీదు వేరుశనగలో ఎక్కువ. అందువలన వేరుశనగ కాయల నుండి వచ్చే చిన్న, సన్న గింజలను వేరుచేసి ఎక్కువ ఖరీదుతో పెద్ద సైజు విత్తనాన్ని రైతులు కొంటూ ఉండటం వలన విత్తనపు ఖరీదు ఎక్కువ అవుతుంది. కాని సన్నని విత్తనాలు కూడా విత్తుటకు ఉపయోగపడవచ్చును. దీనివలన వేరుశనగ దిగుబడిలో ఎలాంటి తేడాలు వుండవు.

మెట్టసాగులో ఎర్రనేలల్లో వర్షాధారంగా పండించే పంటలను 50-60 మి.మీ. మరియు నల్లరేగడి భూముల్లో 60-70 మి.మీ. వర్షం పడిన తరువాత నేలలో తగిన తేమ ఈ తేలిక నేలల్లో రెండు లేక మూడు రోజులలో ఆరిపోతుంది. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని సాధారణంగా వాడుకలో వున్న విత్తే గొర్రులతో కాక తక్కువ కాలంలో ఎక్కువ ఎకరాలకు విత్తడానికి వీలుగా ఎద్దులతో లాగే విత్తే పరికరాలను వాడాలి. ఈ పంటలన్నింటికి విత్తనశుద్ధి చేసి విత్తుకోవాలి. సిఫార్సు చేసిన ఎరువులను నేలలో తేమను అనుసరించి వేసి, సమగ్ర కలుపు నివారణ చర్యలు చేసినట్లయితే అధిక దిగుబడులు సాధించవచ్చు.

వర్షపు నీటి యాజమాన్యం

మెట్ట ప్రాంతాల్లో 10 నుండి 4 రోజుల వరకు పంటకాలంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనవచ్చు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం లేక తుఫాను వలన ఎడతెరిపి లేకుండా వర్షం కురవడం వలన పొలం నుండి నీరు పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా ప్రవహించే నీటిని నీటి కుంటలలో నిలువ చేసి, పంట కాలంలో పదిరోజులకు మించి వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు, స్ప్రింకర్ల ద్వారా గంటసేపు ఒక తడియుస్తే, మెట్ట ప్రాంతాల్లో 20-30% దిగుబడి పెరుగుతుంది. పరివాహక ప్రాంతాన్ని బట్టి నీటి గుంతలను 350-500 ఘ.మీ. పరిమాణంలో తయారుచేసుకోవచ్చు. నీటి గుంతలు 10-20 మీ. పొడవు, 10 మీ. వెడల్పు, 2.5 మీ. లోతు తవ్వుకోవాలి. నీటి గుంతల్లో నీరు నిల్వ ఉండడానికి 6 భాగాలు మట్టి, ఒక భాగం సిమెంటు కలిపి పూయవచ్చు. ఇలా పూత పూయడం వలన నీటి గుంటల్లో నీరు పెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. నీటి గుంతలో నీరు రెండు నెలల వరకు నిల్వ ఉంటుంది. నీటి గుంటల్లో నిల్వ చేసిన నీటిని వినియోగించి ఒక తడి (20 మి.మీ. లేదా 30 మి.మీ.) వర్షాధా పంటలకు (ప్రత్తి, కంది, మొక్కజొన్న, జొన్న మరియు ఆముదం) యివ్వాలి. అయితే సూక్ష్మ సేద్య పద్దతులైన స్ప్రిక్లర్ లేక బిందు సేద్యంలను వినియోగిస్తే తక్కువ నీటిని ఎక్కువ పంట విస్తీర్ణంకు ఇవ్వవచ్చు. అలాగే నీటి వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. సున్నితపు దశలో తడిని ఇచ్చినప్పుడు దిగుబడి పెరుగుతుంది. వేసవిలో పడిన వర్షపు నీరు నీటి గుంతలతో నిల్వ వుంటే, ఈ నీటిని వినియోగించి బిందెల ద్వారా ప్రత్తి పంటను జూన్ లో (వర్షాల ఆగమనం ఆలస్యమైనప్పుడు) విత్తుకునే 20 రోజులకు బెట్టకు గురైన పంట వర్షాభావ పరిస్థితులను తట్టుకోగలదు. ఆ తరవాత వర్షాలు అదునుగా పడితే మేలైన దిగుబడులు పొందవచ్చు.

ప్రత్యామ్నాయ భూవినియోగం

మెట్ట పొలాలకు అనువైన పండ్ల తోటలు

మెట్ట భూములందు పండ్ల తోటలను ప్రోత్సహించి, బీడు భూములను, క్షార భూములను, కొండ భూములను, కొండ ప్రాంతాలను సాగులోనికి తీసుకురావచ్చు. రేగు, సీతాఫలం, ఉసిరి, మామిడి, సపోట తక్కువ నీటితోనే ఫలసాయాన్నివ్వగలవు. కావున వీటిని మెట్ట పంటలుగ పెంచవచ్చు. సాగు నీరు అందివ్వగల పరిస్థితులలో సపోట, మామిడి మరియు దానిమ్మను బీడు భూముల్లో కూడా సాగు చేయవచ్చు. ఈ తోటల్లో 3 సం. వరకు అంతర పంటలను పెంచి, అధిక ఆదాయం పొందవచ్చు.

మిశ్రమ వ్యవసాయం

వర్షాధారంగా ఒకే ఒక పంట సాగు చేసే రైతులకు 4 నెలల వరకు మాత్రమే ఉపాధి వుంటుంది. రైతులు పంటలతో పాటు, పశుపోషణ, కోళ్ళ పెంపకం, మేకల పెంపకం, గొర్రెల పెంపకం, పుట్టగొడుగుల పెంపకం, తేనేటీగల పెంపకం వంటి వాటిపై కూడా దృష్టి సాధించితే అదనపు నికర ఆదాయాన్ని పొందవచ్చు. ఒక హెక్టారు విస్రీర్ణంలో వేరుశనగ పండించే రైతు దానితోపాటుగా, 10 గొర్రె పిల్లలను 4 నెలల పాటు పెంచుకోవడంలో అదనపు నికరాదాయాన్ని పొందడానికి వీలవుతుంది.

పశువులు, గొర్రెలు, మేకలు మరియు కోళ్ళ పెంపకం ద్వారా లభించే ఎరువును పంట పొలాలకు వాడుకోవచ్చు. దీని ద్వారా నేలల్లో సేంద్రీయ కర్బన శాతము పెరుగుతుంది.

సేంద్రీయ కర్బనం ఎక్కువగా ఉన్న నేలల్లో, నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తుంది. బరువు నేలలు గుల్లబారి వేర్లుప చక్కగా పెరగడానికి సహాయ పడుతుంది. నీరు ఇంకడం పెరిగి, మురుగు నీటి పారుదల సౌకర్యం మెరుగుపడుతుంది. ఇసుక నేలల్లో మట్టి రేణువుల అమరికను క్రమబద్ధం చేస్తుంది. వీటిని గ్రహించి తేమను ఎక్కువ కాలం నిల్వ చేసుకొనే సామర్థ్యం పెరగడానికి దోహదపడుతుంది. బెట్టపరిస్థితిని తట్టుకొనే శక్తి పెరుగుతుంది.

ప్రస్తుతము మన రాష్ట్రంలోని నేలల్లో సేంద్రీయ కర్బనం అత్యల్పస్థాయిలో (0.5% కంటే తక్కువ) ఉన్నది. సేంద్రీయ కర్బన స్థాయిని పెంచడానికి తగినంత పరిమాణంలో ఆయా ప్రాంతాలలో అందుబాటును బట్టి పశువుల ఎరువు, పచ్చిరొట్ట ఎరువు, పచ్చి ఆకు ఎఁరువు, కొళ్ళపెంట, గొర్రెల ఎరువు, గొర్రెలు మందకట్టుట, వర్మి కంపోస్టు వంటి ఎరువులను విస్తృతంగా ఉపయోగించాలి. సేంద్రీయ వ్యవసాయ వల్ల దీర్ఘకాలిక సుస్థిరచ సాధించవచ్చు.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.01422475107
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు