హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / రైతు స్థాయిలో ఆహార పరిశ్రమలు నెలకొల్పడం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రైతు స్థాయిలో ఆహార పరిశ్రమలు నెలకొల్పడం

రైతులు తాము పండించే పంటల నుండి విలువాధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటి వాణిజ్యం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చును.

రైతుల ఆదాయం పెంచుకోవడానికి వారి జీవనశైలిని మెరుగు పరచుకోవడానికి వ్యవసాయంతో పాటు వ్యవసాయేతర పనులు చేయడం అనేది చాలా అవసరం. అలాంటి వాటిలో రైతులు తాము పండించే పంటల నుండి విలువాధారిత ఉత్పత్తులను తయారు చేసి వాటి వాణిజ్యం ద్వారా ఆదాయం పెంచుకోవచ్చును. ఈ విలువలను జోడించడం అనేది చాలా పెద్ద మొత్తంలో కాకుండా కొద్దిపాటి విలువలను జోడించి పంట విలువలను పెంచుకోవచ్చును. అయితే వారి వారి స్థాయిని, స్టోమతను బట్టి పెద్ద ఎత్తున కూడా విలువలను జోడించే పరిశ్రమలు నెలకొల్పవచ్చును. కొన్ని దేశాలలో అయితే వారు పండించిన పంటను వాణిజ్యం చేసూ, కొంత పంటను విలువాధారిత ఉత్పత్తులకు వాడి తద్వారా అధిక ఆదాయం పొందుతున్నారు. ఇలా రైతుల స్థలాలనే చిన్న పరిశ్రమలుగా మార్చుకోవటం వల్ల అనేక లాభాలు ఉన్నాయి.

  1. వంట నాణ్యతను తగ్గకుండా విలువలను జోడించవచ్చును. ఇలా చేయడం వలన దూర ప్రాంతాలకు పంపి వివిధ పద్ధతుల ద్వారా నిల్వ చేసే శ్రమ తగ్గి పదార్ధాల విలువ, నాణ్యత ఎక్కువగా ఉంటాయి. నాణ్యమైన ఉత్పతులను ప్రజలకు అందించవచ్చు.
  2. పంట కోసిన తరువాత జరిగే నష్టాలను, పంట నాణ్యతను, రవాణా మరియు నిల్వ ద్వారా జరిగే నష్టాలను తగ్గించి లాభాలను పొందవచ్చును.
  3. సానికంగా ఆర్ధిక అభివృద్ధి జరుగుతుంది.
  4. రైతు కుటుంబానికి చెందిన వారు అందరూ కూడా ఉత్పతులను తయారు చేసే దిశగా నైపుణ్యం సంపాదించవచ్చును.
  5. రైతుకు, వినియోగదారునికి సామాజిక సంబంధం ఏర్పడడంతో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా రైతులకు నేరుగా లాభాలను అందించవచ్చును.
  6. పండించే పంటకు ఏ విధమైన విలువలను జోడించవచ్చని రైతుకు మంచి అవగాహన వస్తుంది.
  7. విలువలను జోడించడానికి అనుగుణంగా పంట నాణ్యతను పెంచే అవగాహన వస్తుంది.
  8. స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పించడం వల్ల ప్రభుత్వంపై భారం తగ్గించవచ్చును.

అయితే ఇలా పరిశ్రమలు పెట్టుకోవాలి అంటే పెట్మబడితో పాటు విలువలను జోడించడానికి అవసరమయ్యే సాంకేతిక పరిజ్ఞానం అవసరం. ఈ పరిజానం రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలలో, సి.ఎఫ్.టి.ఆర్.ఐ లాంటి కేంద్ర సంస్థలలో లభిస్తుంది. కొద్దిపాటి ఫీజును చెల్లించి సాంకేతిక పరిజ్ఞానం పొందవచ్చును. దాని తరువాత అది నెలకొల్పడానికి అవసరమయ్యే యంత్రాలు, విద్యుచ్చక్తి మొదలయినవి సమకూర్చుకోవాలి. అవసరమయ్యే పెట్టుబడిని బ్యాంకులు, ఖాదీబోర్డ్ మరియు చిన్న పరిశ్రమల సంస్థల ద్వారా పొందవచ్చును.

పంటకు మార్కెట్ ధర తక్కువగా ఉన్నప్పడు, పంట దిగుబడి అధికంగా వచ్చినప్పడు రైతు ఏ మాత్రము నష్టపోకుండా అధికంగా ఉన్న పంటకు అనేక రకాలయిన విలువలను జోడించి ఉత్పత్తులను తయారు చేసుకోవచ్చు.

చిరుధాన్యాల ఉత్పత్తులు

ఈ మధ్య కాలంలో ఆరోగ్యం పరంగా కానీ, వాతావరణ మార్పుల పరంగా కానీ చిరుధాన్యాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చిరుధాన్యాలను పండించే రైతులు వాటిని ధాన్యం రూపంలో అమ్ముకునేకంటే సులభంగా చేయగలిగే విలువాధారిత ఉత్పతులను తయారుచేసే చిన్న పరిశ్రమలను నెలకొల్పుకోవచ్చును. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం విశ్వవిద్యాలయం లోని చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రంలో లభిస్తుంది.

బియ్యం పిండి పట్టించి మురుకులు, చకినాలు చేస్తున్నట్లుగా చిరుధాన్యాలైన సజ్జలు, రాగులు, జొన్నలు కొర్రలు వంటి వాటి ద్వారా అనేక పదార్థాలను తయారు చేయవచ్చును. వాటిలో కొన్ని చిరుధాన్యాల ఉత్పత్తుల కేంద్రంలో తయారు చేస్తున్నారు.

పొట్టుతీసిన గింజలు

చిరుధాన్యాలు వాడే ముందు కొద్దిగా పొట్టు తీయాల్సి ఉంటుంది. దాని నుండి తయారయ్యే అన్నం, రొట్టెల పిండి చాలా మృదువుగా ఉండి ఉపయోగానికి వీలుగా ఉంటుంది. ఇలాంటి గింజల పొట్టు తీయడానికి రూ. 75,000 నుండి లక్ష దాకా విలువ చేసే యంత్రం అందుబాటులో ఉంది. ఇలా పొట్టు తీసిన గింజలను వాటి ద్వారా వచ్చే ఉత్పత్తులను అమ్మవచ్చును.

పిండి

గింజలను పొట్టు తీసి వాటి నుండి పిండి, రవ్వను తయారు చేసుకోవచ్చును. దీనికి కావలసిన యంత్రాల విలువ రెండు లక్షల రూపాయలు వరకు ఉంటుంది.

అటుకులు

గింజలను నానబెట్టి, వేడి చేసి, అటుకలు తయారు చేసే ఎడ్జ్ రన్నర్ ఉపయోగించి వేసి అటుకులు తయారు చేసుకోవచ్చును. వాటి విలువ సుమారుగా లక్షన్నర వరకు ఉంటుంది.

పేలాలు

ఇవి కూడా సులభంగా చేయగలిగే విలువాధారిత పదార్థాలు. సాధారణంగా మొక్కజొన్నలతో తయారుచేసే వీటిని ఇతర చిరుధాన్యాలు ఉపయోగించి చేయడం ద్వారా విలువను, ఆదాయాన్ని పెంచుకోవచ్చును.

బిస్మెట్లు

అన్ని రకాల చిరుధాన్యాలతో మామూలు బిస్మెట్ల కంటే అధిక పోషకాలు కలిగిన బిస్కెట్ల తయారు చేసుకోవచ్చు. దాదాపు రెండు లక్షల పెట్టుబడి పెడితే 50-60 కిలోల బిస్కెట్లు తయారు చేసుకోవచ్చు.

టమాటా ఉత్పత్తులు

రాష్ట్రంలో టమాటా పండించే రైతులు దిగుబడి అధికంగా వచ్చి అమ్మకాలు లేనప్పడు పంట వ్యర్థంగా పడేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు దాని నుండి గుజజ్జ, సాస్, టాఫీలు, పచ్చళ్ళు, ఒరుగులు మొదలైన విలువాధారిత ఉత్పత్తులు తయారు చేసుకోవడం వల్ల జరగబోయే నష్టాన్ని లాభాలుగా మార్చుకోవచ్చును. ఇలా చేసిన వాటిని రైతే స్వయంగా రైతు బజార్లలో అమ్ముకోవచ్చు.

ఇవే కాకుండా ప్రతి రైతు తాము పండించే పంటకు ఎలాంటి విలువాధారిత పదార్ధాలు తయారు చేయవచ్చునో తెలుసుకోవడానికి పట్టణాలలోని సూపర్ మార్కెట్లను సందర్శించడం ఒక మంచి పద్ధతి. ఇలాంటి అవగాహన రైతుకు ఉండడం వల్ల పంట పండించడం వరకే పరిమితం కాకుండా పరిశ్రమలు నెలకొల్పడానికి ఆలోచన చేసే అవకాశం ఉంటుంది.

ఇటీవల కాలంలో ప్రభుత్వం కూడా రైతులకు ಮೇಲು ಪೆಸಿ ఉద్దేశ్యంతో ఆహార పరిశ్రమలను ఎక్కువగా నెలకొల్పడానికి దోహదపడేలాగా రాష్ట్రంలో రెండు పెద్ద సెంటర్లు ప్రతిపాదించింది. అందులో భాగంగా ఖమ్మం జిల్లాలో ఒక సెంటరు నిర్మాణం చేపట్టింది. ఇలాంటి సెంటర్లు ఉండటం వల్ల రైతు స్వంతంగా పరిశ్రమలు పెట్టుకొలేనప్పడు ఈ సామూహిక స్థలంలో వారికి కావలసిన విలువాధారిత్ర వదారాలను తయూరు చేసుకోవచ్చు. ఇలా తయారు చేయడానికి అక్కడ లభించే యంత్రాలు ఇతర సదుపాయాలను వాడుకోవడానికి కొద్దిపాటి రుసుము చెల్లించాల్సి ఉంటుంది.

ఇలా రైతు స్థాయిలో - ఆహార పరిశ్రమలు నెలకొల్పడం ద్వారా రైతు లాభపడడం మాత్రమే కాకుండా ఎన్నో రకాల విలువాధారిత వదారాలను వినియోగదారులకు అందించే అవకాశం ఉంటుంది. తద్వారా దేశంలో ఆహార ఉత్పత్తుల శాతాన్ని పెంచవచ్చు గ్రామస్తులకు పరిశ్రమలు అందుబాటులో ఉండడం వల్ల దాని ద్వారా లభించే పోషక విలువలు ఉన్న ఆహార ఉత్పత్తులు వాడడం వల్ల పోషకాహార భద్రత మెరుగు పడుతుంది.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

3.01639344262
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు