హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / రైతు స్థాయిలో మెలక శాతం పరీక్షించే పద్దతి
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రైతు స్థాయిలో మెలక శాతం పరీక్షించే పద్దతి

లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి.

కాలాలవారీగా వాతావరణ పరిస్థితులను బట్టి అనువైన పంటల సాగుకు రైతులు సిద్దమవుతుంటారు. అధిక దిగుబడులు సాధించి మంచి ఫలసాయం పొందాలనేదే అందరి భావన. లాభసాటి పంటకు విత్తనం ప్రధానం. మొలక శాతం బాగా ఉన్న విత్తనాన్ని సేకరించుకోవాలి.

విత్తనం కొనుగోలు చేశాక మొలక శాతాన్ని పరీశీలించి నణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉంటేనే విత్తుకోవాలి. మొలక శాతాన్ని లెక్కించడానికి నాలుగు పద్దతులున్నాయి.

ట్రే పద్దతి

లావు గింజలైన ఆముదం, వేరుశనగ, ప్రత్తి విత్తనాలను ట్రే పద్దతిలో పరీక్షించవచ్చు. ఒక ప్లాస్టిక్ ట్రేని గాని, కుండని గాని ఇసుకతో నింపి వంద విత్తనాలను అంగుళం లోతుగా నిర్ణీత ఎడంతో విత్తాలి. ఇసుకను నీటితో తడుపుతూ ఉంటే 7-10 రోజుల్లో మెలకలు వస్తాయి. వందకు ఎన్ని మొలకలొచ్చాయో లెక్కించి శాతాన్ని తెలుసుకోవచ్చును. నిర్దేశించిన శాతం కన్నా తక్కువ మొలకలొస్తే నాణ్యత లోపించి విత్తనాలుగా భావించాలి.

గుడ్డలో మూటకట్టే పద్దతి

వంద విత్తనాలను తడి గుడ్డలో మూటకట్టి, ప్లేటులో పెట్టి తరుచూ మూటను నీటితో తడుపుతుండాలి. మెలకొచ్చాక లెక్కించి శాతాన్ని తెలుసుకోవచ్చును.

పెట్రిడిష్ పద్దతి

వంగ, టమాట, మిరప వంటి చిన్న విత్తనాల మొలక శాతాన్ని ఈ పద్దితి ద్వారా తెలుసుకోవచ్చు. పెట్రిడిష్ బ్లాటింగ్ పేపరు అమర్చి నీటిలో తడపాలి. దానిపై మంద విత్తనాలను అమర్చి మూత పెట్టాలి. తేమ ఆరిపోకుండా బ్లాటింగ్ పేపర్ ను నీటిలో తడుపుతుండాలి. మొలకెత్తిన గింజలను లెక్కించి మొలక శాతాన్ని సులభంగా తెలుసుకోవచ్చును.

పేపరు టవలు పద్దతి

పరి, ప్రత్తి, ప్రొద్దుతిరుగుడు, జొన్న తదితర విత్తనాల్లో మొలక శాతాన్ని తెలుసుకోవడానికి ఈ పద్దతి అనుకూలంగా ఉంటుంది. ముందుగా పేపరు టవలు లేదా మందపాటి వస్త్రాన్ని తీసుకొని నీటితో తడపాలి. దీన్ని నేలపై పరిచి వంద విత్తనాలను వరుస క్రమంలో అమర్చాలి. విత్తనాలను మరో పేపరు టవలు గాని, వస్త్రాన్ని గాని కప్పాలి. ఈ రెండింటిని చాపలా చుట్టి చివర్లను దారంతో కట్టి లోతైన పాత్రలో ఏటవాలుగా పెట్టాలి. అప్పుడప్పుడు నీటిలో తడిపితే మొలకలొస్తాయి. మొలక శాతాన్ని లెక్కించేటప్పుడు కుళ్ళిపోయిన, మొలక రాని గట్టి విత్తనాలను బూజు పట్టిన, వేరు, కాండం పూర్తిగా అభివృద్ధి చెందని, బలహీనంగా ఉన్న మెలకలను పరిగణలోకి తీసుకోకూడదు.

వివిధ పంటలలో నిర్దేశించబడిన విత్తన మొలక శాతం

90% – మొక్కజొన్న (సంకర రకాలు)

85% – శనగ

80% – వరి, ఉలవలు, లూసర్న్, మొక్కజొన్న (సూటి రకాలు)

75% – జొన్న, కంది, పెసర, మినుము, జీలుగ, అలసంద

70% – ఆముదం, వేరుశనగ, ప్రొద్దుతిరుగుడు, సోయాచిక్కడు.

65% - ప్రతి, బెండ, కాలిప్లవర్

60%- మిరప, బోస, బీర, పుచ్చ, సొరకాయ, పొట్లకాయ, పాలకూర

ఆధారం: వయసాయ పంచాంగం

3.00819672131
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు