పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

రైతుల సమస్యలు - శాస్త్రవేత్తల సలహాలు

సమస్యలు - సలహాలు

ప్రత్తిలో పిండినల్లి నివారణ తెలపండి?

మురళి, కంగల్ గ్రాII మరియు మం., నల్గొండ జిల్లా

ప్రత్తి పంట నాశించే పిండి పరుగు యొక్క తల్లి, పిల్ల పురుగులు, కొమ్మలు, కాండం, మొగ్గలు, పువ్వులు మరియు కాయల నుండి రసాన్ని పీలుస్తాయి. ఈ పరుగు ఆశించిన మొక్కలు ఎదగక గిడసబారి పోతాయి. మొనోక్రోటోఫాస్ మరియు నీరు 1:4 నిష్పత్తిలో కలిపిన ద్రావణం పంట విత్తిన 20,35, 50 మరియు 65 రోజులలో మొక్క లేత కాండానికి బ్రష్ ద్వారా పూయడం వలన పిండి పురుగును నమర్థవంతంగా అరికటుకోవచ్చును. ఈ పురుగు ఉధృతిని బట్టి ప్రొఫెనోఫాస్ 50 ఇ.సి. 2 మి.లీ లేదా ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి చేనంతా తడిచేటట్లు పిచికారి చేయవలెను.

రాగి పంటలో గులాబి రంగు పురుగు నివారణ తెలపండి?

సంతోష్, నారాయణఖేడ్ గ్రాII మరియు మం|, మెదక్ జిల్లా

బాగా ఎదిగిన లార్వాలు లేత గులాబి రంగులో ఉంటాయి. లార్వాలు కాండాన్ని తొలిచి సొరంగాలు చేసి లోపలి భాగాలను తినడం వలన మొవ్వ చనిపోతుంది. పంట కంకి దశలో ఆశిస్తే అవి తెల్ల కంకులుగా మారుతాయి. నివారణకు క్లోరోపైరిఫాస్ 2.5 మి.లీ కలిపి పిచికారి చేయాలి.

ప్రత్తిలో బూజు తెగులు నివారణ తెలపండి?

నారాయణ, లక్షిపూర్ గ్రాI జైనాథ్ మం|, ఆదిలాబాద్ జిల్లా,

ఆకుల మీద కోణాకారపు తెల్లటి మచ్చలు ఏర్పడి బూజు తెగులు శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు భాగాన ఏర్పడతాయి. ఉధృతిని బట్టి ఆకు పైభాగాన వ్యాపించి ఆకులు పసుపు రంగులోకి వూరి వండుబారి రాలిపోతాయి.

నివారణకు లీటరు నీటికి కరిగే గంధకం 3గ్రా. లేదా 1 గ్రా, కార్చెండిజిమ్ కలిపి పిచికారి చేయాలి.

వరిలో ఆకుమడత (తెల్ల తెగులు) నివారణ తెలపండి?

రవి, మూవెర్ల గ్రాI కామెపల్లి మంl, ఖమ్మం జిల్లా,

పిల్ల పరుగులు ఆకు రెండు అంచులను కలిపి గొట్టంగా చేసి లోపలి నుండి ఆకుపచ్చని పదార్ధాన్ని గీకి తింటాయి. ఆకులు తెల్లగా మారి తర్వాత ఎండిపోతాయి. నివారణకు పిలక దశలో తాడును చేనుకు అడ్డంగా 2-3 సార్లు లాగి ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పోటాకు దశలో ఆశించినప్పడు కార్తాప్ హైడ్రోక్లోరైడ్ 2 గ్రా.లు. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.4 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వరిలో ఆకునల్లి నివారణ తెలపండి?

కృష్ణయ్య, కొత్తకోట గ్రాII మరియు మం|, మహబూబ్నగర్ జిల్లా

ముందుగా ఆకులపై చిన్న తెలుపు మచ్చలు ఏర్పడి తర్వాత బూడిద లేదా ఎరుపు రంగు నుండి కాషాయ రంగుకు మారే మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పై నుండి క్రిందికి ఎండుతూ పొలమంతా ఎర్రగా కనుబడుతుంది. నివారణకు నీటిలో కరిగే గంధకం 3 గ్రా.లు లేదా డైకోఫాల్ 5.మి.లీ లీటరు నీటికి చొప్పన కలిపి పిచికారి చేయాలి.

వరిలో కాండం కుళ్ళు తెగులు నివారణ తెలపండి?

సురేష్, చిట్యాల గ్రాII మరియు మం|, వరంగల్ జిల్లా,

పిలకలలోని క్రింద వరుస ఆకులు పసుపు రంగులోనికి మారిపోతాయి. మొదలు వద్ద నున్న కణుపు లోపలి భాగం కుళ్ళి పోవడం వల్ల కాండం బలహీనపడి విరిగిపోతుంది. తెగులు గుర్తించిన వెంటనే 1 గ్రా. కార్భండాజిమ్ లేదా 2.మి.లీ హెక్సాకొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేసి తెగులును నివారించవచ్చు.

మిరపలో సెర్మోస్పోరా ఆకుమచ్చ తెగులు నివారణ తెలపండి?

రాజు, మంథని గ్రాII మరియు మం|, కరీంనగర్ జిల్లా,

ఆకులపై బూడిద రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పండుబారి రాలిపోతాయి. దీని నివారణకు లీటరు నీటికి మాంకోజెబ్ 1.5 గ్రా. లేదా కార్భండిజమ్ 1 గ్రా, చొప్పన కలిపి పిచికారి చేయాలి.

టమాటాలో నారుకుళ్ళ తెగులు నివారణ తెలపండి?

రాములు, పెద్ద లింగాపురం గ్రాII మరియు ఎల్లంతగుంట మం., కరీంనగర్ జిల్లా

ఈ తెగులు ఆశించడం వలన, నారుమడిలో మొక్కల మొదళ్ళు కుళ్ళిపోయి, నారు గుంపులు, గుంపులుగా చనిపోతుంది. విత్తటానికి ముందు తప్పని సరిగా 3 గ్రా. ధైరం లేదా మాంకోజెబ్ కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేయాలి. నారుమడిలో తెగులు కనిపించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లీటరు నీటిలో కలిపి నారుమడిని 10 రోజుల వ్యవధితో 2-3 సార్లు తడపాలి.

వంగలో కాయ తొలుచు పరుగు నివారణ తెలపండి?

వెంకట్ రెడ్డి, మల్కారం గ్రాII మరియు శంషాబాద్ మంll, రంగారెడ్డి జిల్లా

మొవ్వు మరియు కాయ తొలుచు పురుగు నాటిన 30-40 రోజుల నుండి ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలిచి నష్టాన్నికలుగచేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పరుగు ఆశించిన కొమ్మల చివర్లు త్రుంచి వేసి నాశనం చేసి ప్రొఫెనోఫాస్ 2.మి.లీ లేదా సైపర్ మెత్రిన్ 1.మి.లీ లీటరు నీటిలో కలిపి రెండుసార్లు 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారి చేయాలి.

ఉల్లిలో తామర పురుగుల నివారణ తెలపండి?

కృష్ణ, అజిలాపూర్ గ్రా| దేవరకద్ర మం|, మహబూబ్నగర్ జిల్లా

తామర పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వలన తెల్లటి మచ్చలు ఏర్పడతాయి. దానితో బాటుగా ఆకులపై, కాడలపైన ఉదారంగు మచ్చలు కూడా ఏర్పడతాయి. వీటి నివారణకు డైమిధోయేట్ లేదా ఫిప్రోనిల్ 2.మి.లీ. +మాంకోజెబ్ 3 గ్రా. లీటరు నీటికి చొ|న కలిపి 10 రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు పిచికారి చేయాలి.

కాకరలో ఆకుమచ్చ తెగులు నివారణ తెలపండి?

భాస్కర్, మన్నెవారి తుర్కపల్లి గ్రాII మరియు మం|, నల్గొండ జిల్లా

ఆకులపై, కాయలపై గుండ్రని చిన్న మచ్చలు ఏర్పడి, ఎండి రాలిపోతాయి. పిందె దశలో రాలిపోతాయి. దీని నివారణకు తెగులును గమనించిన వెంటనే కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. లేదా కార్బెండజిమ్ 1 గ్రా. లేదా కార్బెండజిమ్ + మాంకోజెబ్ కలిపిన మిశ్రమమును 2 గ్రా. లీటరు నీటికి కలిపి 10 రోజులకు ఒకసారి చొప్పన రెండుసార్లు పిచికారి చేయవలెను.

బీరలో పండు ఈగ నివారణ తెలపండి?

దుర్గాప్రసాద్, చర్ల గ్రాII మరియు మం., ఖమ్మం జిల్లా,

పూత దశలో తల్లి ఈగలు పువ్వులపై గ్రుడ్లను పెడతాయి. ఇవి పూత పిందె లోనికి చేరి కాయలను తిని నష్ట పరుసాయి. దీని నివారణకు పూత, పిందె దశలో మలాథియాన్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో పిచికారి చేయాలి. మలాథియాన్+100 గ్రా, చక్కెర లేదా బెల్లం పాకం లీటరు నీటిలో కలిపి మట్టి ప్రమదలలో పోసి పొలంలో అక్కడక్కడ పెట్టాలి. ఇది విషపు ఎరగా పనిచేస్తుంది.

నిమ్మలో ఆకుమడత నివారణ తెలపండి?

శ్రీనివాస్, తుంగతుర్తి మరియు మం|, నల్గొండ జిల్లా

ఆకులపై తెల్లటి పొరలు వంకర టింకరగా ఏర్పడి, ఆకు ముడతలు పడి గట్టి తెగులు ఎక్కువగా ఆశించి ఆకులు రాలిపోతాయి. దీని నివారణకు ధయామిథాక్సామ్ 1 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.5 మి.లీ లీటరు నీటికి కలిపి లేత చిగుర్ల దశలో, 10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలి.

ధనియాలులో పేనుబంక నివారణ తెలపండి?

భూమయ్య, జూలపల్లి గ్రాII మరియు మం|, కరీంనగర్ జిల్లా

ఆకులు, పూత నుండి రసాన్ని పీల్చి గింజలు ఏర్పడకుండా చేస్తాయి. దీని నివారణకు లీటరు నీటిలో మిధైల్ డెమటాన్ 2.0 మి.లీ లేదా డైమిధోయేట్ 2.0 మి.లీ. కలిపి పిచికారి చేయాలి.

పత్తిలో మెగ్నీషియం లోప నివారణ తెలపండి?

మల్లేష్, మక్కతల్, మహబూబ్నగర్ జిల్లా,

లీటరు నీటికి మెగ్నిషియం సల్ఫేట్ పైరు వేసిన 45 మరియు 75 రోజుల తరువాత రెండుసార్లు పిచికారి చేసుకోవాలి.

ఆముదము విత్తే సమయం తెలపండి?

రాఘవేంద్ర, అనవాడ, మహబూబ్నగర్ జిల్లా.

రబీలో అక్టోబర్ మాసంలో విత్తుకోవచ్చు.

పసుపు రకాలు తెలపండి?

రాములు, జగిత్యాల.

అమలాపురం, ఆర్మూరు, దిండిగాం, ఇరోడ్, కోడూరు, వొంటిమిత్ర, పి 317, జిల్ఫర్మ్-1, జిల్ఫర్మ్-2, మొదలగునవి.

మిరపలో పూత రాలుట నివారణ తెలపండి?

సత్తయ్య, తాండూర్, మంచీర్యాల.

ప్లానోఫిక్స్ ఒక మి.లీ మందును 4-5 లీటర్లు నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి.

వరిలో జింకు లోప నివారణ తెలపండి?

గట్టయ్య, మానకోడూరు, కరీంనగర్ జిల్లా

ఆఖరి దమ్ములో ఎకరాకు 20 కిలోల జింకు సల్ఫేటు వేయాలి. లీటరు నీటికి 2 గ్రా. జింకు సల్పేటు చొప్పన కలిపి 5 రోజుల వ్యవధిలో 2,3 సారు పిచికారి చేసుకోవాలి.

ఆవాలు వితే సమయం తెలపండి?

మహేందర్, సిరిసిల్ల,

అక్టోబరు మొదటి పక్షం నుండి నవంబరు మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చును.

జొన్నలో విత్తన శుద్ధి వివరాలు తెలపండి?

సుదర్షన్ రెడ్డి, అలంపూర్ జోగులాంబ.

మొవ్వ ఈగ బారి నుండి పంటను రక్షించుటకు 3 గ్రా, ధయోమిథాక్సామ్ 70% డబ్ల్యుఎస్ లేదా 1.2 మి.లీ ఇమిడాక్లోప్రిడ్ కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి.

కందిలో రకాలు తెలపండి?

రఘునాధ్ రెడ్డి, కొండూరుగు, రంగారెడ్డి జిల్లా

ఎల్.ఆర్.జి-41,లక్ష్మి ఆశ, మారుతి, డబ్ల్యు.ఆర్.జి-27, పాలెం కంది, సూర్య, వరంగల్ కంది-53, తాండూరు తెల్ల కంది, రుద్రేశ్వర, హనుమ మొదలగునవి.

వరిలో ఎరువుల యాజమాన్యం తెలపండి?

వెంకటేశ్, పరిగి, వికారబాదు.

యూరియా 33 కిలోలు దుక్కిలో, పిలకలు వేయు దశలో చిరుపొట్ట దశలో, మూడు దఫాలుగా వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును దమ్మలోనే వేయాలి. పొటాష్ ఆఖరి దమ్మలో వేసుకోవాలి.

మినుము రకాలు తెలపండి?

రామమూర్తి, ముదికొండ,

యల్.బి.జి-752. తేజ, లాం-23, వరంగల్-26, మధిర వినుము 207. వీ.యు -31, తులసి మొదలగునవి.

పసుపులో కలుపు నివారణ తెలపండి?

రాజు, వనపర్తి,

జ. నాటిన 24-48 గంటలలోపు అట్రుజిన్ లీటరు నీటికి 5గ్రా, చొప్పన పిచికారి చేసుకోవాలి. 1-2 రోజులలో ఆక్సీఫ్లోర్పెన్ (గోల్) 1.5 మి.లీ లీటరు నీటికి కలుపుకొని పిచికారి చేసుకోవాలి.

సపోటా రకాలు తెలపండి?

శేఖర్, శంకర్పల్లి, రంగారెడ్డి කිඳා.

పాల, క్రికెట్ బాల్, ద్వారపూడి, కీర్తిబర్తి, కాలిపత్తి, పి.కె.యం-1, పి.కి.యం-3, మొదలగునవి.

3.01262626263
అంజనరెడ్డి,శింగనమల మండలం,అనంతపురం జిల్లా Oct 31, 2018 09:48 PM

బీరలో బూడిద తెగులు మరియు ఆకుమచ్చ తెగులు నివారణకు సలహా ఇవ్వండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు