హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

వివిధ పంటలలో రసాయనిక ఎరువుల సమర్ధ వినియోగానికి రైతులు పాటించాల్సిన యాజమాన్య పద్ధతులు

మనిషి తన జీవనానికి ముఖ్యంగా మొక్కల మీద ఆధారపడ్డాడు. మొక్కలు పెరగడానికి పోషకాలు (ఎరువుల రూపంలో ఉండే పోషకాలు) కావాలి. ఇవి గాలి నుండి నీటి నుండి, నేల నుండి సహజంగా లభ్యమవుతాయి. ఆధునిక వ్యవసాయ రంగంలో రసాయన ఎరువులు కీలకమైన పాత్రను పోషిస్తున్నాయి. ఆశించిన దిగుబడులు సాధించడానికి రసాయనిక ఎరువులు ఖచ్చితంగా వాడాలి. వీటి వినియోగం యజమాన్యం సమాతుల్యతను గురించి సరైన అవగాహన ఉన్నప్పుడే ఎరువుల నుండి పూర్తి ఫలితం పొందగలం.

ఎరువుల వినియోగం

ఎరువుల వినియోగ సామర్ధ్యం అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఎరువుల వినియోగ సామర్ధ్యం అంటే ఒక కిలో రసాయనిక పోషకాన్ని పంటకు అందించ్నప్పుడు వచ్చే దిగుబడిని, ఎలాంటి రసాయన ఎరువు వాడకుండా వచ్చిన దిగుబడిని బేరీజు వేసుకొని తదనుగుణంగా రసాయన ఎరువులను వాడటాన్ని సమర్ధ ఎరువుల వినియోగం అంటారు.

ఉదాహరణకు ఒక రైతు తన ఎకరా వరి పొలంలో ఎలాంటి రసాయన ఎరువులు వేయకుండా 15 క్వింటాళ్ళ దిగుబడి సాధిస్తే అదే రైతు ఇంకొ ఎకరంలో 180 కిలోల సత్రజని ఎరువును వాడి 40 క్వింటాళ్ళ దిగుబడి సాధించినప్పుడు ఎరువుల వినియోగ సామర్థ్యం లెక్కిస్తే 40-15/180x100 - 13.88 శాతం (14 శాతం) అంటే ఒక కిలో నత్రజని ఎరువును ఉపయోగించడం వలన 14 కిలోల పంట దిగుబడి వచ్చింది అనే అర్థాన్ని ఇస్తుంది.

ఎరువుల వినియోగ సామర్ధ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యాంశాలు

నేల:

నేల భౌతిక రసాయన జీవ లక్షణాలు రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

ఉదాహరణకు - ఎరువుల ముఖ్యంగా ఎర్ర చల్క నేలల్లో 15-30 సెం.మీ. లోతుల్లో సాధారణంగా గట్టిపొర ఉంటుంది. అదే ఇసుక నేలల్లో గట్టిపొర ఉండరు. అదే విధంగా నల్లరేగడి నేలల్లో బంక, ఒండ్రు మట్టి శాతం ఎక్కువ కనుక మురుగు సమస్య చాలా తీవ్రంగా, పరాలు అధికంగా పడినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో చల్క భూముల్లో లోతు దుక్కులు చేయాలి. ఇసుక భూముల్లో స్థూల రంధ్ర పరిమాణం ఎక్కువ కావున ఎరువులు వృథా కాకుండా విభజించి ఎరువులు తగిన మోతాదులో వేయాలి. నల్లరేగడి భూముల్లో పాదులు, కాలువలుగా మంచి అంతరకృషి చేస్తే గాలి ప్రసరణ బాగా జరిగి వేసిన రసాయన ఎరువులు వినియోగ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఇసుక చల్క నేలలో పోషకాల శాతం తక్కువ కావున అధిక దిగుబడులు సాధించడానికి రసాయనిక ఎరువులైనటువంటి నజ్రతని, పొటాష్ ఎరువులను 2-4 సార్లు విభజించి వేసుకోవాలి. భాస్వరం ఎరువులను ఆఖరి దుక్కిలో వేయాలి.

వాతావరణం:

ఉష్ణోగ్రత, వర్షపాతం, పగలు, రాత్రి కాలాల మధ్య తేడా కూడా ఎరువుల వినియోగ సామర్థ్యం పైన ప్రభావం చూపిస్తాయి. చలికాలంలో నత్రజని ఎరువుల నత్రజనీకరణ తక్కువగా ఉంటుంది. భాస్వరం ఎరువులను ఖరీఫ్ సీజన్ కంటే చలికాలంలో ఎక్కువగా వేయాలి. విత్తనాలు కలిగిన మెట్ట ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటే రసాయన ఎరువులు అధికంగా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ఎండ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో తేమ తక్కువగా ఉండడం చేత ఎరువుల వినియోగసామర్థ్యం తగ్గుతుంది.

పంట వేరు వ్యవస్థ - సాగు పద్ధతులు:

పంట వేరువ్యవస్థ పంట సరళి, మొక్కల మధ్య దూరం, పంటకాలం, ఇలాంటివి కూడా ఎరువుల వినియోగ సామర్థ్యం కూడా ఎక్కువగా ఉంటుంది. పంటసాగు పద్ధతులు, ఏ సమయంలో విత్తాలి, ఎప్పుడు ఎరువులు వేయాలి, ముఖ్యంగా కీలక దశల్లో సరైనమోతాదులో సరైన పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది.

ఎరువులను ఎలా వాడాలి?

సత్రజని, భాస్వరం, పొటాష్ పోషకాలను ఆహార పంటలకు 2:1 లేదా 42:2 నిష్పత్తిలో వాడమని సిఫారుసు చేస్తుండగా రైతులు సత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను అవసరమైన దాని కన్నా రెండు నుండి రెండున్నర రెట్లు అధికంగా చేస్తున్నారు. తద్వారా అవసరం లేని పోషకాన్ని వేసి వృధా చేయడం వలన ఖర్చు పెరగడం పోషకాల సమతుల్యత లోపించడం, దిగుబడి తగ్గడం నేల ఆరోగ్యం ఫలదత క్షీణించడం జరుగుతూనే ఉంటుంది.

ఎరువులను పొదుపుగా వాడాలి

అవసరమైన మేరకే ఎరువులను వేయడం, వేసిన ఎరువులు సమర్థవంతంగా మొక్క తీసుకునేటట్లు చేయడం ద్వారా ఎరువు ఖర్చు తగ్గించుకోవచ్చు. రసాయన ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

ఎరువులు ఎంత చేయాలి?

నేల సహజ వనరు కావున మొక్కలకు కావాల్సిన పోషకాలు నేలలో కొంత మోతాదులో అందుబాటు రూపంలో ఉండే అవకాశం ఉంటుంది. నేల లక్షణాలను బట్టి పోషకాల లభ్యతల్లో సాధారణంగా తేడాలుంటాయి. చేసే పైరును బట్టి. నేలలోని పోషకాల ఆధారంగా ఏ పోషకం ఎంత మోతాదులో కావాలో నిర్ధారించాలి. ఇది భూసార పరీక్షల ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది.

ఎరువుల వినియోగ సామర్ధ్యాన్ని పెంచే పద్ధతి

ఎరువుల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలంటే ఎరువులు ఎంత చేయాలన్నది ఎంత ముఖ్యమో అది వేయాల్సిన పద్దతి కూడా అంతే ముఖ్యం. సరైన పద్ధతిలో ఎరువులు వేసినప్పుడు మొక్కలు పోషకాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటాయి.

ఎరువులను వెదజల్లే పద్ధతి

విత్తడానికి ముందుగానీ, నాటే సమయంలో గానీ పైపాటుగా కానీ ఎరువును పొలమంతా సమానంగా పడేటట్లు చల్లే విధానాన్ని వెదజల్లే పద్ధతి అంటారు.

మొక్కలు పొలం నిండ దగ్గర దగ్గరగా ఉండి, వరుసలలో లేని పైర్లకు వేర్లు నేలలోకి అల్లుకొని ఉండి పైర్లకు ఈ పద్దతి బాగా ఉపయోగపడుతుంది.

వరి పొలాలకు పశుగ్రాస గడ్డి జాతి మొక్కలకు ఈ పద్ధతి చాలా అనుకూలం. పొలం చదునుగా లేకును, చలం మీద ఎరవులు సమానంగా పడేటట్లు చల్లకపోయినా పైరు పెరుగుదలలో తేడా హెచ్చు తగ్గులు  వచ్చే అవకాశం ఉంటుంది. నీరు నిలిచి ఉన్న పొలంలో గానీ, నీరు లేని పొలంలో కానీ ఎరువులు చల్లితే వృధా అవుతాయి. ఏ రసాయన ఎరువుల పొలానికి చల్లిన నేలలో కరిగేటట్లు చేయాలి. తగినంత తేమ ఉండాలి.

మొక్క మొదళ్ళ దగ్గర ఎరువు వేయడం:

పొలం మీద వెదజల్లడం ఉన్న వేర్ల దగ్గర ఎరువులు వేయడం మంచి పద్దతి. తక్కువ ఎరువులో ఎక్కువ పోషకం మొక్కకు అందేటటు చేయవచ్చు. దూరం దూరం మొక్కలున్నప్పుడు వేర్లు తక్కువగా వాడి చెంది ఉన్నప్పుడు భూసారం తక్కువ ఉన్న నేలలకు ఈ పద్ధతి అనుకూలం.

గొర్రుతో వేయడం - సీడ్ కమ్ ఫెర్టిలైజర్ ప్రిల్:

సహాయంతో విత్తనం ఎరువు ఒకసారి కావాల్సిన దూరంలో కావాల్సిన లోతులో పడేటట్లు చేసుకోవచ్చు విత్తనం చేసేదానికి 5 సెం.మీ. లోతులోను 5 సెం.మీ. దూరంలోను ఎరుపు పడితే మొలకెత్తగానే వేరకు కషకాలు అందుబాటులో ఉంటాయి. ఎరువు చేసేటప్పుడు విత్తనానికి తగలకుండా జాగ్రత్త పడాలి. మొట్ట ఆరుతడి పైర్లకు బాగా ఉపయోగపడుతుంది.

చిన్న గుంత తవ్వి మొక్క మొదళ్ళ దగ్గర వేయడం:

మొక్క మొక్కకు దూరం తక్కువైనప్పుడు మొక్క వరుసల్లో ఒక పక్కగానీ, రెండు పక్కల గానీ, 4-5 సెం.మీ. లోతైన నాగలి చాలు తీసిగానీ, గొర్రుతోగానీ, చేతితోగానీ ఎరుపు వేసి కప్పి చేయాలి. మెట్ట పైర్లలో తగినంత తేమ ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఆచరించవచ్చు.

పండ్ల తోటలలో ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడం

చెట్టు వయస్సును బట్టి మొక్కకు సంబంధించిన వేర్లు మొక్క తల కట్టు వరకు వ్యాపించి ఉంటాయి. అంతవరకు పారుచేయాలి. సాధారణంగా నేలపై పొలంలో పీచు పేర్లు ఎక్కువగా వ్యాపించి ఉండటమే కాకుండా పోషకాలను చురుకుగా తీసుకుంటాయి. మొక్క మొదలు నుండి వయస్సును బట్టి ఒకటి నుండి ఒకటిన్నర అడుగుల దూరం వదిలి, నేలలో తగినంత తేమ ఉన్న సమయంలో పాదంతా ఎరువులు చల్లి పారతో పలుచగా తిరగ వేయాలి. దీని వలన ఎరువులు బాగా మట్టిలో కలిసిపోవడం జరిగి, ఆవిరి ద్వారా గానీ నీటి ద్వారా గానీ పోషకాలు నష్టమయ్యే అవకాశం ఉండదు. ఈ పద్ధతిలో ఇసుక నేలలో మూడు దఫాలుగా, బరువు నేలలో రెండు దఫాలుగా విభజించి ఎరువులు వేసుకోవాలి.

పైరు పోషకాలు పిచికారీ చేసే పద్ధతి

భూమిలో తగినంత తేమ లేనప్పుడు ఎరువు వేసిన తర్వాత నీరు పెట్టడానికి వసతి లేనప్పుడు, సమస్యాత్మక భూముల్లో పోషకాలు అందించడానికి పిచికారీ చేయడానికి తగినంత విస్తీర్ణంలో అకులు ఉన్నప్పుడు ప్రత్యేకించి కొద్ది పరిమాణంలో అవసరమైన సూక్ష్మపోషకాలను అందించడానికి పిచికారీ పద్ధతి అనువుగా ఉంటుంది.

 • సాధారణంగా అన్ని పైర్లమీద ఫలవృక్షాల మీద 2-3 శాతం, ద్రావణం పిచికారీ చేయవచ్చు.
 • పప్పుధాన్యపు పైర్లకు పత్తికి పూత సమయంలో 2 శాతం డి.ఎ.పి., ద్రావణాన్ని పిచికారీ చేయవచ్చు.
 • మొక్కలు సూక్ష్మపోషకాలను నేలలో వేసిన దానికన్నా పిచికారీ పద్దతిలో శక్తి వంతంగా, త్వరితంగా ఉపయోగించుకుంటాయి.
 • ఇటీవల ప్రాచుర్యంలోకి వచ్చిన స్ప్రింక్లర్లు డ్రిప్ పద్ధతుల ద్వారా సాగునీటితో పాటు ద్రవ ఎరువులను కలిపి అందించడం వల్ల ఖర్చు తగ్గుతుంది.

ఎరువులు ఎలా ఎంపిక చేసుకోవాలి, ఏ నేలకు ఏ ఎరుపు పనికి వస్తుంది?

 • యూరియా, అమ్మోనియం సల్ఫేట్, కాల్షియం, అమ్మోనియం, నైట్రేట్ ఎరువులలో ఉన్న ముఖ్య పోషకం, నత్రజని అయినప్పటికీ అది రసాయనికంగా వివిధ రూపాల్లో ఉంటుంది.
 • ఎరువుల లక్షణాలు కూడా వేర్వేరుగా ఉన్నాయి.
 • ఇసుక పాలు తక్కువ ఉన్న మాగాణి భూముల్లో తప్ప మిగతా ఉన్న అన్ని నేలలకు పంటలకు పైరు అడుగులోను, పైపాటుగా యూరియా వేసుకోవచ్చు.
 • అమ్మోనియం సల్ఫేటును క్షార గుణం నేలలకు, సున్నపు పాలు ఎక్కువగా ఉన్న నేలలకు ఎప్పుడైనా చేసుకోవచ్చు.
 • ఆమ్ల భూములకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చే భూములకు చేయరాదు.
 • కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అన్ని భూములకు ఎప్పుడైనా వేసుకోవచ్చు.
 • కానీ వరిలో చిరుపొట్ట దశలో మాత్రమే వేసుకోవాలి. కానీ ఆఖరి దమ్ములో పైరు అడుగులోను, మొదటి సారి పైపాటు సమయాల్లో వేస్తే అందులోని నైట్రేట్ నత్రజని వృథా అవుతుంది,
 • సూపర్ ఫాస్పేట్ ను సాధారణంగా అన్ని పైర్లకు సామాన్య సిద్ధి గల నెలలకు కార నేలలకు చేయవచ్చు.
 • ఆమ్ల గుణం గల నేలలకు సల్ఫైడ్ ఇంజురీ వచ్చే నేలలకు వేయరాదు.
 • అమ్ల గుణం గల నేలలకు డై కాల్షియం ఫాస్ఫేట్, రాక్ ఫాస్ఫేట్ వంటి పనికి వస్తాయి.
 • అయితే ఇది క్షారగుణం గల నేలలకు, సాధారణ పైర్లకు ఉపయోగపడవు. కాఫీ, టీ, రబ్బరు తోటలకు వేయదగినవి,
 • ఫలవృక్షాలు, తోట వృక్షాలు వంటి బహువార్షికాలను వాడవచ్చు. మ్యూరేట్ ఆఫ్ పొటాషిను పాలచౌడు తప్ప మిగిలిన అన్ని నేలలకు వాడవచ్చు. పొగాకు పైరుకు వేయరాదు. నాణ్యత తగ్గిపోతుంది.
 • సల్ఫేట్ ఆఫ్ పొటాష్ అన్ని నేలలకు అన్ని పైర్లకు వాడవచ్చు.
 • కాంప్లెక్స్ ఎరువుల్లో అమ్మోనియం ఫాస్పేట్ అన్ని నేలలకు అన్ని పైర్లకు వేయవచ్చు.
 • నైట్రోఫాస్పేట్ మెట, ఆరుతడి పైర్లకు ఎర్ర నేలలకు, సామాన్య రసాయన స్థితిగల నేలలకు, కొద్దిపాటి ఆవు గు లం గల నేలలకు బాగా ఉపయోగపడుతుంది.
 • వాటిని సరి పైరుకు వేస్తే అందులోని నైట్రేటు సత్రజని వృథా అవుతుంది.
 • ఈ మెళకువలు పాటించి ఎరువులను ఎంపిక చేసుకోవడం వల్ల పేరుకు పోషకాలు సమర్థవంతంగా ఉపయోగపడతాయి.
 • ఎరువులను ఎప్పుడు ఎన్ని సార్లు విభజించి చేయాలి : మొక్కలకు వేసిన పోషకాలు ఉపయోగపడే సామర్థ్యం పెంచడంలో సరైన సమయం, అవసరమైనన్ని సార్లు విభజించి వేయడం అత్యంత ప్రభావాన్ని చూపుతాయి.

నేల స్వభావం

పెరు కాల పరిమితి, సీజన్, పైరుకు పోషకం అవసరమయ్యే దశల ఆధారంగా ఎరువులను విజభించి వేయాలి. సాధారణంగా సత్రజని 2-4 సార్లుగా, భాస్వరం ఒకేసారి పొటాష్ రెండుసార్లు వేయాల్సి ఉంటుంది.

ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచడం ఎలా?

 • ప్రాంతాన్ని బట్టి ఎరువును బాగా వినియోగించుకునే రకాలను, హెబ్రీడ్లను ఎంచుకోవాలి.
 • సరైన సమయంలో విత్తాలి, మొక్కల సాంద్రత తగ్గకుండా చూడాలి.
 • సేంద్రియ, జీవన ఎరువులను విరివిగా వాడి తర్వాత పంట పెరుగుదలకు కావాల్సిన పోషకాలతో పాటు నేల స్థితి ఏర్పరచాలి.
 • పప్పుజాతి పైర్లను పంటల సరళిలో చేర్చడం మొక్క కీలక దశల్లో తప్పనిసరిగా నీటి తడులు ఇవ్వడం
 • భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వేసుకున్నట్లయితే పోషకాల లోపాలు లేదా అధిక పోషకాల వినియోగాన్ని తగ్గించవచ్చు.
 • నీటి ఎద్దడి ఉన్న సమయంలో పైపాటుగా 2 శాతం యూరియా గ్రామాలకాన్ని పిచికారీ చేయాలి. సూక్ష్మ పోషకాల లోపాలు నివారించాలి. సమస్యాత్మక నేలను బాగు చేసే కారకాలు ఉపయోగించాలి.

నత్రజని వినియోగ సామర్థ్యం పెంచాలంటే?

 • పలు దఫాలుగా విభజించి వేయాలి.
 • మెల్లగా లభ్యస్థితిలోకి వచ్చే నత్రజని ఎరువులైన వేపపూత లేదా గంధకం పూత పూయబడిన యూరియా వాడాలి.
 • సేంద్రియ, రసాయన ఎరువులను మిళితం చేసి వాడాలి.

భాస్వరం:

 • నేలలో స్థిరీకరించబడే భాస్వరం ఎరువును తగ్గించడంతో పాటు సమతుల్యత పాటించాలి.
 • సేంద్రియ ఎరువుల వాడకం, మొక్క దగ్గర ఎరువు చేయడం
 • భాస్వరాన్ని కరగదీసే బ్యాకి , ఫాస్ఫోబ్యాక్టీరియా లాంటివి విత్తనానికి పట్టించి వేయాలి.
 • భాస్వరాన్ని గ్రహించి విఎఎం లాంటివి వాడటం

పొటాషియం:

 • తేలిక నేలల్లో పలు దఫాలుగా విభజించి వేయాలి.
 • సేంద్రియ ఎరువులు వాడాలి.
 • ఎరువులు, పోషకాల సమతుల్యత పాటించాలి.

గంధకం:

 • గంధకం ఇంకిపాయ గుణవాన్ని తగ్గించాలంటే
 • సేంద్రియ ఎరువులు వాడాలి. గాలి ప్రసరణ బాగా జరిగేటట్లు చూడాలి.

ఇనుము:

 • సేంద్రియ ఎరువులు వాడడం.
 • చౌడు నేలలను బాగు చేయడం.

జింకు:

 • జింకును భాస్వరం ఎరువులతో కలిపి వేయరాదు.
3.01937046005
Venkatesh Aug 04, 2020 10:28 PM

Vari naatu vesinappatinunchi panta kosevaraku em mandhulu vadali e dhashalalo vadali

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు