పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

లెమన్ గ్రాస్ సాగులో మెళకువలు

లెమన్ గ్రాస్ సాగులో మెళకువలు, సాగు పద్ధతుల గురించి తెలుసుకుందాం.

లెమన్ గ్రాస్ ను తెలుగు రాష్ట్రాలలో నిమ్మగడ్డి లేదా వాసన గడ్డి అని బాగా ప్రాచుర్యం పొందింది. నిమ్మగడ్డి బహువార్షిక ఉష్ణమండల పంట. దీని సాగుకు మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలోనూ తగిన వాతావరణం కలిగి ఉంది. సాగుకు మంచి అవకాశాన్ని ఇస్తుంది.

నిమ్మగడ్డి ఆకులు, కాండం తదితర భాగాలలో మంచి సుగంధ పరిమళాన్ని వెదజల్లే సుగంధ తైలాన్ని కలిగి ఉంటుంది. అందువలన సుగంధ తైల పరిశ్రమలలో దీనిని విరివిగా ఉపయోగిస్తారు. నిమ్మగడ్డిని కృత్రిమంగా విటమిన్-ఎ తయారీలో వాడే ముడి పదార్థాలలో ముఖ్యమైనది. నిమ్మగడ్డికి ఔషధ గుణాలు కూడా కలిగి ఉన్నది అందులో భాగంగా ఇది బ్యాక్టీరియాను నిరోధించే శక్తిని కలిగి ఉంది. అలాగే ఈ సుగంధ తైలానికి దోమలను వికర్షించే శక్తి / గుణాన్ని కలిగి ఉండడం మూలాన దీనిని దోమలను నివారించే ముందుల తయారీలో వినియోగిస్తారు.

వాతావరణం

సాధారణంగా నిమ్మగడ్డి ఉష్ణమండల ప్రాంతపు పంట. వాతావరణం పొడిగా ఉండి గాలిలో తేమ ఆర్ద్రత శాతం అధికంగా గల ప్రాంతాలు సాగుకు అనుకూలం. ఉష్ణోగ్రత 25-30 డిగ్రీల సెంటీగ్రేడ్ గల ప్రాంతాలు సాగుకు అనుకూలం. 30 డిగ్రీల కన్నా ఎక్కువ ఉష్ణోగ్రత గల ప్రాంతాలలో నూనెశాతం పై ప్రభావం చూపుతుంది. సూర్యరశ్మి అధికంగా సోకే ప్రాంతాలు బాగా అనుకూలం.

నేలలు

నిమ్మగడ్డిని బాగా సారవంతమైన ఒండ్రు నుండి ఎర్ర రేగడి, ఇసుక నేలల్లో సాగుచేపట్టవచ్చు. ఇసుక, ఎర్ర రేగడి నేలల్లో మంచి ఎరువుల యాజమాన్యం సహకారంతో లాభసాటి సాగుచేపట్టవచ్చు. మురుగు నీటి సౌకర్యం బాగా కలిగి ఉండే నేలలు అనుకూలం, సున్నపు రాయి, నీటి నిల్వ గల ప్రాంతాలు సాగుకు పనికిరావు.

రకాలు

సాగులో ఉన్న జాతులు - మూడు రకాల జాతుల నిమ్మగడ్డి సాగులో ఉన్నది. అందులో

  1. సింబోపోగన్ పెండలస్ (జమ్మూ నిమ్మగడ్డి)
  2. సింబోపోగన్ ఫ్లెక్సువ్సస్ (తూర్పు భారత నిమ్మగడ్డి)
  3. సింబోపోగన్ సిట్రాటస్ (పడమటి భారత నిమ్మగడ్డి)

సింబోపోగన్ పెండలస్: సాగులో ఉన్న రకాలు - ప్రమాన్, చిర్ హరిత్, ఆర్.ఆర్.ఎల్-16, ఆర్.ఆర్.ఎల్సి.ఎన్-5, కలాం (సి.పి.కె-ఎఫ్-2-38), తవి రోసా, జి.ఆర్. ఎల్-1, జోర్లాబ్-ఎల్-2, సి.కె.పి. -25, ఆర్.ఆర్.ఎల్-57, ఆర్.ఆర్. ఎల్-59, ఆర్.ఆర్.ఎల్-38, ఆర్.ఆర్.ఎల్-39

సింబోపోగన్ ఫ్లెక్సువ్సస్: సాగులో ఉన్న రకాలు - ప్రగతి, సీమా, కావేరి, కృష్ణ, ఎన్. ఎల్.జి.-64, సుగంధి, ఒ.డి. -410

సింబోపోగన్ సిట్రాటస్: సాగులో ఉన్న రకాలు -- థాయ్-1, జి.అర్.ఎల్-౧ వర్షపాతం తక్కువ గల ప్రాంతాలు, ఆమ్ల నేలలో సాగుకు పడమటి భారత నిమ్మగడ్డి రకాలు అనుకూలం.

ప్రవర్ధనం

నిమ్మగడ్డిని విత్తనం, శాఖీయోత్పత్తి ద్వారా కూడా ప్రవర్థనం చేయవచ్చు. విత్తనం ద్వారా ప్రవర్ధనానికి విత్తనాన్ని ఇసుకలో 1:3 నిష్పత్తిలో కలిపి నారుమడిలో విత్తుకొని 45 రోజుల మొక్కలను ప్రధాన పొలంలో నాటుకోవచ్చు. విత్తనం 5 రోజుల తర్వాత మొలకెత్తుతుంది. 20-25 కిలోల విత్తనం ఒక హెక్టారు పొలానికి నేరుగా విత్తుకోవడానికి అవసరం అవుతుంది. అదే నారుమడి ద్వారా విత్తుకోవడానికి 3-4 కిలోల విత్తనం సరిపోతుంది.

అదే శాఖయోత్పత్తి ద్వారా పిలకలను కూడా ఉపయోగించవచ్చు. మంచి తైలశాతం, ఎక్కువ తైల దిగుబడి కోసం పిలకల ద్వారా చేసుకుంటే పొందవచ్చు. కానీ పిలకల లభ్యత లేని పక్షంలో విత్తనం ద్వారా ప్రవర్ధనం చేపట్టడం మంచిది.

నాటేకాలం

నిమ్మగడ్డిని నీటి పారుదల గల ప్రాంతాలు/పొలాల్లో ఏడాది పొడవునా అక్టోబరు -నవంబర్ కాకుండా నాటుకోవచ్చు. మే చివరి వారం నుండి జూన్ మొదటి వారంలో వర్షాధారంగా సాగుచేసే ప్రాంతాల్లో నాట్లు వేసుకోవచ్చు..

నాటే విధానం, నాటే దూరం

నిమ్మగడ్డిని నాటడానికి ముందుగా ప్రధాన పొలాన్ని బాగా దుక్కిదున్ని బాగా చదును చేసుకోవాలి. అలాగే కింద సూచించిన ఎరువుల మొత్తం భాస్వరం, ఎరువులను, పొటాషియంను నేలలో వేసి బాగా కలియదున్నాలి. వరుసలలో 60 సెం.మీ. దూరంలో బోదెలను వేసుకోవాలి. 60 సెం.మీ. దూరంలో నాటుకోవాలి. వర్షాధారంగా సాగుచేపట్టే ప్రాంతాలలో 30 సెం.మీ. వరుసల మధ్య 30 సెం.మీ. దూరంలో మొక్కలను నాటుకోవాలి. 1,11,000 పిలకలు అవసరం అవుతాయి ప్రతి హెక్టారుకు.

ఎరువుల యాజమాన్యం

నిమ్మగడి ఒక హెక్టారు పంటకు 275 కిలోల నత్రజని, 50 కిలోల భాస్వరం, 175 కిలోల పొటాషియం ప్రతి సంవత్సరం వేసుకోవాలి. అలాగే దీనితో పాటుగా కంపోస్టు లేదా సేంద్రియ ఎరువును 10 టన్నులు వేసుకోవాలి. ప్రతి హెక్టారుకు మొదటి దుక్కిలోనే వేసి బాగా కలపాలి. మొత్తం భాస్వరం, పొటాషియం నాట సమయంలో లేదా చివరి దుక్కిలో వేసుకొని బాగా కలపాలి. సిఫార్సు చేసిన నత్రజని ఎరుపును మొత్తం పంట కాలంలో 6 దఫాలుగా విభజించి వేసుకుంటే మంచి దిగుబడి పొందవచ్చు.

నీటి యాజమాన్యం

ప్రధాన పొలంలో నాటిన వెంటనే నీటిని మొక్కలకు అందించాలి. అలాగే మొదటి నెలలో ప్రతి రెండు రోజులకొకసారి నీటి తడి అవసరం. ఆ తర్వాత మొక్కలు కుదురుకున్నాక వారానికి ఒక తడి సరిపోతుంది.

కలుపు యాజమాన్యం

సాధారణంగా మొదటి 3-4 నెలలో కాలంలో కలుపు యాజమాన్యం బాగా అవసరం. దీనిని కూలీల సహాయంతో తీయించవచ్చు. 3-4 నెలల తర్వాత మొక్కలు బాగా ఏపుగా పెరిగి అంతగా కలుపు తీయాల్సిన అవసరం ఉండదు. మొత్తానికి నిమ్మగడ్డిలో సంవత్సరానికి 3-4 సార్లు కలుపు తీయాల్సిన అవసరం ఉంటుంది. రసాయనిక పద్ధతుల ద్వారా పంట కోసిన తర్వాత డైయురాన్ లేదా ఆక్సిస్లోలాస్ 1.5 కిలోలు ప్రతి హెక్టారుకు పొడి మందు వాడుకోవచ్చు

అంతర కృషి /అంతర పంటలు

నూధారంగా  సాగుచేసే - పొలాల్లో వేసవిలో డిసెంబర్ నుండి మే ప్రాంతాలలో పొలాలు వాడుగా ఎండినట్టుగా కనిపిస్తాయి. వాటిని మే మాసంలో నిప్పు పెడితే రుతుపవనాల తర్వాత అది త్వరగా చిగురించడానికి, అలాగే చెదల నివారణకు దోహదం చేస్తాయి.

నిమ్మగడ్డి బాగా సూర్యరశ్మి గల ప్రాంతాలలో సాగుకు అనుకూలం కావున దీనిని అంతర పంటగా వేసుకుంటే దానిలో సుగంధ తైల శాతం, తైల దిగుబడి కూడా

పంటకోత, దిగుబడి

నిమ్మగడి బహువార్షిక పంట అనగా 5 సంవత్సరాల దాకా పంట వస్తుంది. మొదటి సంవత్సరంలో 3 కోతలు ఆ తర్వాత సంవత్సరంలో 5-6 కోతలు వస్తాయి. నిమ్మగడిని నాటిన 15 రోజుల తర్వాత మొదటి కోతకు వస్తుంది. పంటను నేల మట్టానికి 10 సెం.మీ. ఎత్తులో కోసుకోవాలి. ఆ తర్వాత కోతలు 65-70 రోజుల వ్యవధిలో చేపట్టాలి. దిగుబడి పై ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ధత, నేల సారవంతత కూడా ప్రభావం చూపుతాయి.

కోత తర్వాత 15 టన్నులు ప్రతి హెక్టారుకు పంట దిగుబడి వస్తుంది. ఆకులలో 0.5 శాతం తైల శాతం ఉంటుంది. 375 కిలోల తైలాన్ని ప్రతి సంవత్సరం ఒక హెక్టారుకు పొందవచ్చు. పంట కోసిన వెంటనే డిస్టిలేషన్ యూనిట్ లేదా సుగంధ తైల పరిశ్రమకు పంపించాలి. అలా జరగని పక్షంలో పంటను సూర్యరశ్మి తగలని ప్రదేశంలో మూడు రోజుల పాటు సూనె శాతం తగ్గకుండా నిల్వ చేసుకోవచ్చు.

సస్యరక్షణ

నిమ్మగడ్డిని సాధారణంగా పురుగులు ఆశించవు. కానీ కొద్ది వరకు కొన్ని ప్రాంతాలలో నల్లి ఆశిస్తుంది. దీని నివారణకు క్లోరిపైరిఫాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. నులి పురుగుల నివారణకు పొలంలో ఫోరేట్ గుళికలను చల్లుకోవాలి. కానీ పంటను నష్టపరిచేంతగా పురుగులు ఆశించవు.

తెగుళ్ళ విషయానికొస్తే మచ్చ తెగులు, అకు ఎండు తెగులు నివాణకు డైధేన్-ఎం-45 3 గ్రా. లీటరు నీటికి కలిపి ప్రతి 15 రోజుల వ్యవధిలో పిచికారీ చేసుకోవాలి.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు