పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వంగలో అశంచే చిడపిడలు – వాటి సస్యరక్షణ

కూరగాయల పంటల సాగుతో తక్కువ సమయం ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉంటుంది. చిన్నకారు మరియు సన్నకారు రైతులు కూరగాయల సాగుతో మంచి లాభాలు గడిస్తారు. తెలంగాణలో టమాట, వంగ, బెండ, చిక్కుడు మరియు చీడపీడలు వాటి నివారణ గురించి తెలుసుకుందాం.

పురుగులు

మొవ్వ మరియు కాయతొలుచు పురుగు : ఈ పురుగు సుమారు 11-93 శాతం నష్టం కలుగజేస్తుంది,. మొక్కలు పెరిగే వయస్సులో మొవ్వును, తర్వాత దశలో కాయలను తొలచివేతుంది. కాయలు ఒక్కోసారి వంకర తిరిగి ఉంటాయి. వంకాయ మొక్కల మొవ్వు భాగం వాలిపోయి కాయల పై రంధ్రాల్లో పిల్ల పురుగులు విసర్జించడాన్ని గమనించి ఈ పురుగు ఉనికిని గుర్తించవచ్చు. ఒక్కో పిల్ల పురుగు సుమారుగా 4-6 కాయలను నష్టపరుస్తుంది. తద్వారా కాయలు అమ్మకానికి పనికిరావు.

నివారణ

 • నారుమడి నుంచి నారును ప్రధాన పొలంలో నాటే ముందు నారును రైనాక్సీపైర్ 5 మి.లీ/లీ నీటిలో మూడు గంటలు ముంచి తర్వాత నాటుకోవాలి.
 • లింగాకర్షక బుట్టలను ప్రధాన పొలంలో 100 ఎరలు/హెక్టారుకు 10 మి. ఎండంలో ఆకర్షింపబడి బుట్టలో పడి చనిపోతాయి.
 • ట్రైకోగ్రామ ఖిలోనిస్ బదనికలను పూత సమయంలో వదిలినట్లయితే ఈ పురుగును నివారించవచ్చు.
 • వేపనునే 5 మి.లీ/లీ (లేదా) వాటి సంబంధిత మందులు 500 గ్రా./హె పిచికారి చేసుకోవాలి.
 • ఎమామేక్టన్ బెంజోయేట్ 0.4 గ్రా/లీ (లేదా) ధయోడికార్బ్ 2గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
 • అక్షింతల పురుగు: పిల్ల పురుగులు గుంపులుగా ఆకుల అడుగు భాగాన చేరి పత్రహరితాన్ని గోకి తినటం వల్ల ఆకులు జల్లెడలాగా తయారవుతాయి. ఈ పురుగుల ఉధృత ఎక్కువగా ఉన్నప్పుడు ఆకుల ఈనెలు మిగిలి ఎండిపోతుంది.

  నివారణ: ఈ పురుగు ఆశించిన వెంటనే వేపనునే 5 మి.లీ/లీ 1:1 నిష్పత్తిలో పిచికారీ చేయాలి. సైపర్మెత్రిన్ 04 మి.లీ లేదా క్లోరోపైరిఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

  ఎర్రనల్లి: ఆకుల పై బూడిద వర్ణపు మచ్చులు ఏర్పడతాయి. పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల మొక్కలు ఎదగవు.

  నివారణ : అవసరాన్ని బట్టి పురుగు ఉధృతి ఎక్కువ కాకుండ నీటిలో కరిగే గంధకం పొడి 3గ్రా. (లేదా) దైకోఫాల్ 5.0 మి.లీ (లేదా) ఫెన్జాక్విన్ 2.5 మి.లీ. లీటరు నీటికి కలిపి మార్చి మార్చి పిచికారి చేసుకోవాలి.

  తెల్లదోమ : పిల్ల పురుగులు మరియు తల్లి పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు వాడిపోయి ఎండిపోతాయి.

  నివారణ : ఈ పురుగుల నివారణకు డైమిధోయేట్ 2 మి.లీ. (లేదా) ఎసిఫేట్ 1.5 గ్రా/లీ నిటికి కలిపి పిచికారి చేయాలి.

  తెగుళ్ళు

  బాక్టీరియా ఎండు తెగులు : ఇది ఎక్కువగా వేసవిలో ఆశిస్తుంది. ఒకసారి దీని ఉనికిని పొలంలో గమనిస్తే ఏళ్ళ తరబడి ఈ తెగులును పొలంలో గమనించవచ్చు. తొలిదశలో ఆకులు ముడుచుకుపోతాయి. క్రింది ఆకులు రాలిపోతాయి. వెుక్కల కాండం కణజాలం ముదురు రంగులో మారిపోతాయి. చివరికి మొక్కలు చనిపోతాయి.

  నివారణ

  • తెగుళ్ళను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి.
  • పంట మార్పిడి చేయాలి.
  • కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా. (లేదా) బోర్లో మిశ్రమం 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

  మాగుడు తెగులు (లేదా) నారుకుళ్ళ తెగులు

  అప్పడే మొలకెత్తిన చిన్నచిన్న మొక్కలు నారుమడిలోనే చనిపోతాయి. తరువాత దశలో నారు వడలిపోయి గుంపులు గుంపులుగా చనిపోతాయి.

  నివారణ: విత్తనశుద్ధి కాప్లాన్ 2 గ్రా. లేదా సిరాసిన్ 2 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

  సెప్లోరియల్ ఆకుమచ్చ తెగులు

  ఈ తెగులు సాధారణంగా పిందె కట్టె దశలో ముదురు ఆకుల మీద కనిపిస్తుంది. ముదురు ఆకుల మీద ఎక్కువ మచ్చలు ఏర్పడతాయి. ఆకు అడుగు భాగంలో చిన్నని గుండ్రటి నీటి మచ్చలు ఏర్పడి మచ్చలు పెద్దవైనప్పడు వీటి అంచులు ముదురు రంగులోను మధ్య భాగం కృంగి ఊద రంగులోను ఉండి పసుపు రంగు వలయాలతో చుట్టబడి ఉంటాయి.

  నివారణ

  • పంట మార్పిడి చేయాలి.
  • ఒక కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్ (లేదా) కాప్లాన్ లేదా ధైరమ్ కలిపి విత్తనశుద్ధి చేయాలి.
  • తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పడు ఒక లీటరు నీటికి 1 గ్రా, కార్భండాజిమ్ (లేదా) 2.5 గ్రా. మ్యాంకోజెబ్ (లేదా) థయోఫనేట్ మిథైల్ కలిపి పిచికారి చేయాలి.

  వెర్రి తెగులు

  ఆకులు చిన్నగా, సన్నగా ముడుచుకోనిపోయి మొక్కలు గుబురుగా మారుతాయి. మొక్క పూత, కాత లేకుండా గొడుబారి పోతుంది. తెగులు సోకిన మొక్కల్ని పొలంలో గుర్తించిన వెంటనే నాశనం చేయాలి.

  నివారణ

  • ఈ తెగులు వ్యాప్తి చేసే పచ్చదోమ నివారణకు ఇమిడాక్టోప్రిడ్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • నారుమడిలో నారు తీయుటకు వారం రోజుల ముందు 40 చ.మీ. నారుమడికి 100 గ్రా, ఫ్యూరడాన్ గుళికలు వేయాలి.
  • నాటిన రెండు వారాల తరువాత రెండో దఫాగా ఎకరాకు 8 కిలోల ఫ్యూరడాన్ గుళికలు వేయాలి.
  • నాటే ముందు నారు వేర్లను 1 గ్రా, టెట్రాసైక్లిన్ లీటరు నీటిలో కలిపిన ద్రావణంలో మంచి నాటాలి.
  • నాటిన నాలుగైదు వారాల తరువాత వారం పదిరోజుల తేడాతో లీటరు నీటికి 2 మి.లీ. చొప్పన డైమిధోయేట్ కలిపి 3 సార్లు పిచికారి చేయాలి.
3.00980392157
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు