పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వర్మి కంపోస్టు

సేంద్రీయ వ్యర్థ పదార్ధాల నీద ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడము ద్వారా తయారు చేయబడే క్పోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు.మాములుగా తయారుచేసే కంపోస్టు కన్నా వర్మి కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి.

సేంద్రీయ వ్యర్థ పదార్ధాల నీద ప్రత్యేకమైన వానపాములను ప్రయోగించడము ద్వారా తయారు చేయబడే క్పోస్టు ఎరువునే వర్మి కంపోస్టు అంటారు.

మాములుగా తయారుచేసే కంపోస్టు కన్నా వర్మి కంపోస్టులో ఎన్నో సుగుణాలున్నాయి. ముఖ్యంగా వర్మి కంపోస్టులో పోషక విలువలు ఎక్కువ. పశువుల ఎరువులో సరాసరిన నత్రజని, ఫాస్ఫేట్ పోషకాలు వరుసగా 0.75, 0.17 మరియు 0.55 శాతం ఉండగా, వర్మి కంపోస్టులో సరాసరిన ఇవి 1.23 నుండి 2.40, 0.67 నుండి 1.93 మరియు 0.35 నుండి 0.63 శాతంగా వేసిన వ్యర్థ పదార్థంపై ఆధారపడి వుంటాయి. ఇదే విధంగా వర్మి కంపోస్టులో పైరు ఎదుగుదలకు దోహదపడే ఎన్నో ఇతర సేంద్రీయ రసాయనాలు ఉన్నాయి.

వర్మి కంపోస్టుకు అవసరమైనవి

వానపాములు

భూమిపై పొరలలో ఉంటూ బొరియలు చేయని వానపాములు సేంద్రియ వృద్ధి పదార్ధాల నుండి కంపోస్టు చేయడానికి పనికివస్తాయి. ఇవి 1. యూడ్రిలన్ యాసిడ్ 2. అయిసీనియా ఫొయిటికా 3. పెరియాబిక్స్ ఎక్స్ కవేటస్ 4. లుంబ్రికస్ రుబెల్లస్

సేంద్రీయ తేమ వ్యర్థ పదార్థాలు

వ్యవసాయ ఉత్పత్తుల శేష వ్యర్థ పదార్ధాలు, ముఖ్యంగా చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థ పదార్ధలు వర్మి కంపోస్టు తయారీకి ఉపయోగపడతాయి. ఇంకా ఇతర పారిశ్రిమళ ద్వారా లభించే వ్యర్థ పదార్ధలు.

ఇతర అవసరాలు

వానపాములు తిన్నగా ఎండను తట్టుకోలేవు. కాబట్టి వాటి రక్షణ కొరకు తగిన నీడను కల్పించాలి. ఇందుకు గాను పందిరి వేయటానికి వరిగడ్డి, తాటి ఆకులు, పాతగోనె సంచులు, పాలిధీన్ సంచులను వినియోగించవచ్చు. పందిరి వేయటం వల్ల వానపాములకు నీడనివ్వటమేకాక, ఎరువు నుండి తేమ తొందరగా ఆవిరైపోకుండా కాపాడవచ్చు. అంతేకాక వర్షం తిన్నగా ఎరువు మీద పడి పోషకాలు నష్టపోకుండా కూడా రక్షించుకోవచ్చు. పరిగడ్డి లేదా పాత గోనె సంచులను వర్మి కంపోస్టు బెడ్ లపై కప్పటానికి ఉపయోగించవచ్చు.

వర్మి కంపోస్టు బెడ్ లను తయారుచేయటం

భూమికి సమాంతరంగా 3 అడుగుల వెడల్పు ఉండేటట్లు మలకు వీలైనంత పొడువున వర్మి కంపోస్టు బెడ్లను ఏర్పాటుచేసే వాటిని సిమెంటుతో గట్టిగా చెయవచ్చు లేదా పేడను ఉపయోగించి గట్టిపర్చవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న నోలపై నుమారుగా (45 సెం.మీ.) రెండు అడుగుల ఎత్తు వరకు వర్మి కంపోస్టు చెయ్యాలనుకుంటున్న వ్యర్థ పదార్థాలను (చెత్త, ఆకులు, పేడ మున్నగునవి) వేయాలి. పేడ ఒక పొరగా వేయాలి. వ్యర్ఝపదార్ధాలు, పేడను వేసేటప్పుడు బెడ్ పైన నీరు చల్లాలి. ఇలా రెండు నుండి మూడు వారాల వరకు నీరు చల్లుతుండాలి.

ఇలా బాగా కుళ్ళిన బెడ్డుపైన వానపాములను వదలాలి. వానపాములను వదిలేటప్పుడు బెడ్ ను కదిలించి వదిలితే మంచిది. ఈ వానపాములు ఆహారాన్ని, తేమను వెదుక్కొంటూ లోపలికి వెళతాయి. ఉవి ప్రతి రోజు తమ బరువుకు వెయ్యి వరకు వానపాములను వదలాల్సి ఉంటుంది.

బెడ్ పైన పాత గోనె సంచులను గాని, వరిగడ్డిని గాని పర్చాలి. ఇలా చేయటం వలన తేమను కాపాడటమే కాక, వానపాములకు కప్పలు, పక్షులు, చీమల నుండి రక్షణ కల్పించవచ్చు. వానపాములను వదిలిన బెడ్ లపై ప్రతిరోజు పలుచగా నీరు చల్లుతుండాలి. ఈ విధంగా చెయ్యటం వలన వ్యర్ధ పదార్ధాలను 60 నుండి 90 రొజుల్లో వర్మి కంపోస్టుగా తయారుచేసే వీలుంది.

బెడ్ నుండి వర్మి కంపోస్టును తీయటానికి 4 లేదా 5 రోజుల ముందు నీరు చల్లటం ఆపివేయ్యాలి. ఇలా చెయ్యటం వలన వానపాములు తెమను వెదుకుతూ లోపలికి వెళ్ళి అడుగుభాగానికి చేరతాయి. బెడ్ పైన కప్పిన గోనె సంచులను లేదా వరిగడ్డిని తీసివేయాలి. తరువాత ఎరువును శంఖాకారంగా చిన్న చిన్న కుప్పలుగా చెయ్యాలి. వానపాములు లేని ఎరువును 2 – 3 ఎమ్.ఎమ్ జల్లెడతో జల్లించి సంచుల్లో నింపి నీడ గల ప్రదేశంలో నిల్వ ఉంచుకోవాలి. బంతిలా చుట్టుకొని ఉన్న వానపాములను ఎరువు నుండి వేరు చేసి తిరిగి వర్మి కంపోస్టు తయారీకి వాడకోవచ్చు.

ఎరువును తొలిగించిన బెడ్ లపైన వ్యర్ద పదార్థాలు 45 సెం.మీ. ఎత్తు వరకు పరచి మరల పైన చేసిన విధంగా కంపోస్టును తయారు చేసుకోవచ్చును. ఇలా సంవత్సరానికి 6 సార్ల వరకు వర్మి కంపోస్టును తయారుచేసే వీలుంది.

వర్మి కంపోస్టు తయారైనది లేనిది తెల్సుకౌవటమెలా?

వానపాములు వ్యర్ద పదార్థాలు తిన్న తరువాత వీటి విసర్జన పదార్ధమే మంచి ఎరువుగా మారుతుంది. ఎరువు తయారైన తరువాత వానపాములు అందులో నిలవవు. అవి పైకి వచ్చి గోనె సంచులను అచుక్కొని వుంటాయి. అంతేకాక ఎరువు లేకుండా గోధుమ రంగులో టీ పౌజరు లా కనిపిస్తుంది. వర్మి కంపోస్టు తయారైందని తెల్సుకోవటానికి ఇది గుర్తుగా భావించవచ్చు. ఈ దశలో నీరు చల్లటం ఆపివేస్తే, వానపాములు తేమను వెతుక్కొంటూ అడుగు భాగానికి చేరుతాయి.

వర్మి కంపోస్టును రైతులు ఎకరాకు 8 నుండి 12 క్వింటాళ్ళ వరకు వివిధ పంటలకు వాడవచ్చు. పండ్ల తోటలకు కూడ బాగా ఉపకరిస్తుంది. ప్రతి చెట్టుకు 5 నుండి 10 కిలోల వరకు ఈ ఎరువును వేయ్యటం వల్ల మంచి ఫలితాలను సాంధించవచ్చు. వర్మి కంపోస్టును సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు వాడవచ్చు.

ఇప్పటికే వర్మి కంపోస్టు తయారుచేస్తున్న రైతుల నుండి అవసరమైన వానపాముల్ని కొనవచ్చు. వర్మి కంపోస్టు యూనిట్ పరిమాణాన్ని బట్టి మొదట కావలసినన్ని వానపాములను కొనాల్సి వుంటుంది. తరువాత ఇవే వృద్ధి చెందుతాయి. ఇప్పటికే వర్మి కంపోస్టును తయారుచేసే రైతులు సమీపంలో లేకపోతే ఈ క్రింది వారి నుండి వానపాములను సేకరించవచ్చు.

 • పొపైటీ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్వాలిటి అఫ్ లైఫ్, ఇం.నెం. 3-6-369/ఎ/20, మెదటి అంతస్తు, వీధి సెం. 1, హిమాయత్ నగర్, హైదరాబాద్ – 29, ఫోన్ 040-27634384
 • ఆఫీసర్ ఇన్ఛార్జ్, మిలటరీ డైరీ ఫామ్, అల్వాల్, సికింద్రాబాద్.
 • రూరల్ టెక్నాలజీ ఫార్క్ ఎన్.ఐ.ఆర్.డి., రాజేంద్రనగర్, హైదరాబాద్.

వర్మి కంపోస్టును బయట నుండి కొని క్రమం తప్పకుండా వాడటం అర్థికంగా అంతగా లాభదాయకం కాకపోవచ్చు. అయితే స్వయంగా వర్మి కంపోస్టును తయారుచేసుకొని వాడితే ఎంతో లాభం ఉంటుంది.

వర్మీ కంపోస్టు తయారు చేసే పద్ధతి, వినియోగంలో మెళకువలు

అధిక దిగుబడులను ఆశించి రైతులు విచక్షణా రహితంగా వాడే రసాయనిక ఎరువుల వలన మన భూమిలో ఉన్న ప్రయోజనకరమైన సూక్ష్మజీవులు నశించి మన పంట పొలాలు నిర్జీవంగా మారుతున్నాయి. దీనితో పాటు సేంద్రియ పదార్థాల కొరత కూడా ఏర్పడుతోంది. దీని వలన మొక్కలు సరిగ్గా ఎదగక ఆశించిన పంట దిగుబడి రావడం లేదు. ఆరోగ్యకరమైన పంటకు సారవంతమైన నేలలు కావాలి. భూసారాన్ని పెంచేందుకు కాలుష్య నివారణకు సేంద్రియ ఎరువుల అవసరం ఎంతైనా ఉంది. ఈ సేంద్రీయ ఎరువులలో వర్మీ కంపోస్టు ముఖ్యమైనది. వానపాములు రైతు నేస్తాలుగా ఎప్పుడో గుర్తించారు. అయితే ఈ వానపాములు సేంద్రియ ఎరువులు ఎక్కువగా ఉన్న నేలల్లో బొరియలు చేస్తూ నేలను గుల్ల పరుస్తాయి. వీటికి సేంద్రియ పదార్థంతో మిళితమైన మట్టి ఆహారం. అంటే సుమారుగా 70 శాతం మట్టిని, 30 శాతం సేంద్రియ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. కానీ 70-80 శాతం వ్యర్థపదార్థాలను 10-30 శాతం మట్టిని తినే వానపాములను ఉపయోగించి వ్యర్థపదార్థాలను సేంద్రియ పదార్థాలుగా మార్చ వచ్చు. వీటిని వివిధ రకాల సేంద్రియ వ్యర్థాలను ఆహారంగా తీసుకుని విసర్జన గావిస్తుంటాయి. ఈ విసర్జన పదార్థాన్నే వర్మీ కంపోస్టు లేదా వర్మీ కాస్టింగ్ అంటారు.

వర్మీ కంపోస్టుకు అనువైన వాన పాముల రకాలు

వానపాములను వాటి ఆహారపు అలవాట్లు, జీవన విధానాన్ని బట్టి రెండు వర్గాలుగా విభజించారు. అవి:

 1. భూమి పై పొరల్లో నివసించే వానపాములు (సర్ ఫేస్ డ్రిల్లర్స్),
 2. భూమి లోపలి పొరలలో నివసించే వానపాములు (డీప్ బర్రోయర్స్)

భూమిపై పొరలలో నివసించే వానపాములు (సర్ ఫేస్ డ్రిల్లర్స్):

ఈ రకపు వానపాములు భూమి పై పొరలలో నివసిస్తూ 90 శాతం వ్యవసాయ వ్యర్థాలను 10 శాతం మట్టిని ఆహారంగా తీసుకుని చాలా వ్యర్థాలను కంపోస్టుగా మారుస్తాయి. ఉదా : ఐసీనియా పోయిటెడ్, యుడిల్లుప్ యుజిని, వానపాములను శాస్త్రీయ పద్ధతిలో ఎరువుల తయారీకి ఉపయోగిస్తున్నారు.

 • వీటి జీవిత కాలం 28 నెలలు.
 • వీటి ప్రత్యుత్పత్తి సామర్థ్యం చాలా ఎక్కువ.
 • ఒక వానపాము ఏడాదికి 200-250 వరకు కుటుంబాన్ని అనుకూల పరిస్థితుల్లో వృద్ధి చేసుకోగలదు.
 • ఇవి భూమిపై పొరలలో ఉంటాయి. కనుక వీటిని వర్షం, సూర్యకాంతి నుండి కాపాడడానికి రక్షణగా ఏదన్నా షెడీగానీ, పాకను గానీ ఏర్పాటు చేయాలి.
 • ఇవి 20-25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద చురుకుగా పని చేసి ఎక్కువ ఫలితాలను ఇస్తాయి.

భూమి లోపలి పొరలలో నివసించే వానపాములు (డీప్ బర్రోయర్స్)

ఇవి 90 శాతం మట్టిని 10 శాతం వ్యవసాయ వ్యర్థ పదార్దాలను ఆహారంగా తీసుకుంటాయి.

 1. ఇవి భూమి నుండి 3 మీటర్ల వరకు తొలచుకుంటూ వెళ్ళి సేంద్రీయ పదార్థాలను తయరు చేస్తాయి.
 2. వీటి జీవిత కాలం 15 సంవత్సరాలు.
 3. వీటిని షెడ్లలో పెంచి పొలాలలో ప్రవేశ పెట్టడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

వర్మీ కంపోస్టు తయారీకి అవసరమైన వస్తువులు:

షెడ్ నిర్మాణం: ఈ రకం వానపాములు భూమిపై పొరలలో నివసించే వానపాములు కాబట్టి వీటిని ప్రకృతిలోని ఎండ వరాల నుండి కాపాడుకునేందుకు సేంద్రియ పదార్థాల లభ్యతను బట్టి షెడ్లు ఏర్పరచుకోవాలి.

సేంద్రీయ శేష వ్యర్థ పదార్థాలు: పంట పొలాలలో లభించే వ్యర్థ పదార్థాలయిన చెత్త, కలుపు మొక్కలు, పండ్ల తొక్కలు వర్మీ కంపోస్టు తయారీకి బాగా ఉపయోగపడతాయి. ఒక టన్ను వర్మీ కంపోస్టు తయారీకి 2 టన్నుల వ్యర్థ పదార్థాలు అవసరం అవుతాయి.

వానపాములు: చదరపు మీటరుకు 1000 (1 వీ) చొప్పున ఒక టన్ను వర్మీ కంపోస్టు తయారు చేయడానికి సుమారు 3000 (3-వీ) వానపాములు అవసరం అవుతాయి.

నీరు, పేడ: నీరు, పేడ కూడా తగు మోతాదులో అవసరం అవుతాయి.

వర్మీ కంపోస్టు తయారు చేసే విధానం:

షెడ్ నిర్మాణం: తూర్పు - పడమర దిశలో ఉండే విధంగా ఏటవాలుగా నిర్మించాలి.

బెడ్ తయారీ: 5 మీ. పొడవు, 1 మీ. వెడల్పు 3 అడుగుల ఎత్తు ఉండే విధంగా నాపరాయితో నేల పైన బెడ్ ఏర్పరచుకోవాలి. బెడ్ అడుగుభాగాన్ని మూడు అంగుళాల మందంతో గడ్డి లేదా ఇసుక లేదా మట్టి నింపి తగినంత నీటితో తడిపి గట్టిపరచాలి.

బెడ్ నింపే పద్దతి:

మొదటి పొర: 2,3 అంగుళాల వరకు వ్యర్థ పదార్థాలు నింపి, వాటి పైన పేడనీటిని చిలకరించాలి.

రెండవ పొర: పశువుల ఎరువు, వ్యవసాయ వ్యర్థాలు కలిసి చివికిన పదార్ధాన్ని 6 అంగుళాల మందంతో బెడ్ అంతటా సమానంగా తగినంత నీటితో తడిపి ఉంచాలి. అందువల్ల నెమ్మదిగా కుళ్ళి మెత్తగా తయారవుతుంది. ఇలా 20-25 రోజుల (3వారాలు) నీటితో తడపాలి. ఆ తరువాత వానపాములను ప్రవేశపెట్టాలి.

వానపాములు వదిలిన తరువాత 50-60 రోజుల వరకు ప్రతిరోజు శీతాకాలంలో, వేసవిలో రెండుమూడు సార్లు బెడ్ ను నీటితో తడపాలి. వేడి నుండి వానపాములను కాపాడుకునేందుకు, షెడ్ పక్కలకు తడిపిన గోనే పట్టాలను వేలాడదీయాలి.

వర్మీ కంపోస్టు తయారు అయినది తెలుసుకోవడం ఎలా?

 • వర్మీ కంపోస్టు గోధుమ నుండి నల్ల రంగుకు మారుతుంది.
 • వర్మీ కంపోస్టు వాసనరాదు.
 • గుళికలు ఉండి తేలికగా ఉంటుంది.
 • రంగు రూపు మారిన వర్మీ కంపోస్టు గమనించిన వెంటనే బెడ్ తడపడం ఆపేయాలి. నాలుగు రోజుల తరువాత బెడ్లో గల పదార్థాలను కుప్పగా చేసి ఉంచాలి. ఇందువలన వానపాములు బంతిలా చుట్టుకుని కుప్పలోని అడుగుభాగానికి చేరుకుంటాయి. మెత్తగా పైన ఉన్న వర్మీ కంపోస్టు జల్లెడ లేదా జల్లించే మిషను ద్వారా జల్లించి ఆరబెట్టి సంచులలో నింపాలి.

వర్మీ కంపోస్టులో పోషకాల యాజమాన్యం

మన పరిసరాలలో, పంట లభించే వ్యర్థ పదార్థాలను కుళ్ళింపచేసి వానపాములకు ఆహారంగా వేసి తద్వారా వచ్చిన వర్మీ కంపోస్టు ఎరువులో ఈ కింది విధంగా పోషక విలువలు ఉన్నట్లు పరిశోధనల్లో గుర్తించారు,

పోషకాలు: నత్రజని -1.6 శాతం, భాస్వరం - 0.7 శాతం, పొటాషియం - 0.5 శాతం, మెగ్నిషియం - 0.2 శాతం, ఇనుము -175, 0 పి.పి. ఎం., మాంగనీస్ - 96.0 పి.పి. ఎం, జింక్ -24. 5 పి.పి. ఎం., కాపర్ - 5.0 పి.పి.ఎం.

వర్మీ కంపోస్టు వాడే విధానం-మోతాదు: పండ్లు, కూరగాయలు, పూల తోటలలో వర్మీ కంపోస్టును మొక్క మొదలులో వేసి దానిపై మట్టితో కప్పి పలుచగా నీళ్లు ఇవ్వాలి.

పంటలు: 3 - 4 టన్నులు/హెక్టారుకు వేయాలి.

పండ్ల తోటలు: ప్రతిచెట్టుకు 5 - 10 కిలోలు వేయాలి.

పూల తోటలు: ఎకరానికి 200 - 300 కిలోలు, గులాబీ మొక్కకి ఒక్కింటికి 200 - 300 గ్రా. వేయాలి.

వర్మీ కంపోస్టును వినియోగించడం వల్ల కలిగే లాభాలు

 • వర్మీ కంపోస్టును పంటలపై వినియోగించడం వల్ల దానిలో ఉండే మిత్ర సూక్ష్మజీవులు భూమిలో అభివృద్ది చెంది అక్కడ వాటి సంఖ్యను పెంచుకుంటూ నిర్జీవ భూములు నుంచి జనసహిత భూములుగా చేయడంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాయి.
 • వర్మీ కంపోస్టులో మొక్కకు అవసరమయ్యే అన్ని రకాల స్థూల సూక్ష్మ పోషక పదార్థాలు కావాల్సిన మోతాదుల్లో లభ్యమవుతాయి. పోషక పదార్థాలు పుష్కలంగా అందడం వల్ల వర్మీ కంపోస్టు వాడి సాగు చేసిన వంటలు ఆరోగ్యవంతంగా ఎదుగుతాయి.
 • దీని వల్ల ఆయా పంటలకు చీడపీడలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే సస్యరక్షణ కొరకు వాడే మందుల వాడకం తగ్గుతుంది.
 • వర్మీ కంపోస్టులో సహజమైన హార్మోన్లు, విటమిన్లు లభిస్తాయి. వీటిని భూమిలో కలిపినప్పుడు పెరుగుతున్న మొక్కల వేర్ల పెరుగుదల, మొక్క బాహ్య అంతర లక్షణాలలో గణనీయమైన అభివృద్ధి జరిగి మొక్కలు బలంగా పెరుగుతాయి.
 • వర్మీ కంపోస్టును ఉపయోగించి పండించిన పంటలు కోసిన తరువాత తాజాగా ఉండి ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. వర్మీ కంపోస్టును వాడటం వల్ల స్వాభావిక పర్యావరణ కాలుష్యం అవకుండా ఉంటుంది.

వానపాముల ఎరువు తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

 • బెడ్లలో ప్లాస్టిక్ పదార్థాలను గానీ, గాజు ముక్కలు రాళ్ళు, కోడిగుడ్ల పెంకులు గానీ ఉండరాదు.
 • బెడ్ పైన పక్షులు, ఉడతలు, తొండలు, ఎలుకలు ఆశించి వానపాములను తినకుండా గడ్డితో లేదా జాలితో లేదా గోనెతట్టుతో బెడ్లను అడుగు మందం కప్పాలి.
 • వర్మీ కంపోస్టు షెడ్ చుట్టూ జాలి కట్టి కాకులు గద్దలు, కొంగలు, పాములు, ఎలుకలు రాకుండా చూసుకోవాలి.
 • బెడ్లలో నీరు నిలువ ఉండకుండా చూసుకోవాలి.

వర్మి కంపోస్టుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామ

ఫ్రొఫెసర్ & హెడ్, కీటక శాస్ర విభాగం, వ్యవసాయ కళాశాల, రాంజేద్రనగర్, హైదరాబాద్. ఫోన్ నెం. 040-24015011, ఎక్స్టెంషన్ - 377

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.01164294955
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు