పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వర్షపు నీటి యాజమాన్యం

వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం.

సారవంతమైన భూమి, వర్షపు నీటి యాజమాన్యం మెట్ట వ్యవసాయానికి మూలాధారం. సాధారణంగా మెట్ట పొలాలు వాలుగా ఉంటాయి. వర్షాకాలంలో వచ్చే వాన తాకిడికి నేల కోతకు గురి అవుతుంది. పొలంలోని పోషక పదార్థాలు, మెత్తని మట్టి వాన నీటి ద్వారా కొటుకొని పోయి, భూమి సారహీనంగా తయారవుతుంది. ఇలా కొట్టుకొని పోయిన ఒండ్రు మట్టి చెరువులోకి చేరుకొని, పూడిక లాగా పోగు పడుతుంది. క్రమంగా చెరువు గర్భం మేరక అవుతుంది.

రాష్ట్రంలో వర్షం ద్వారా సమకూరే 22.8 మి.హె.మీ. నీటిలో 10 శాతం మాత్రమే నేలలో ఇంకి మిగతాది వివిధ రూపాలలో వృథా అవుతున్నట్లు అంచనా. అందుచేత మెట్ట పొలాల్లోని భూసారం, నీటి వనరులను కాపాడుకోవలసిన బాధ్యత మన మెట్ట సాగు రైతులకు ఉంది. మెట్ట భూముల్లో స్థిరమైన దిగుబడులు ఆదాయం పొందాలంటే వాన నీటిని భూమిలోకి ఇంకునట్లుగా చేయాలి. భూమి పరిగ్రహణ శక్తికి మించి వచ్చిన వర్షపు నీటిని వేగం తగ్గించి వాలు కింద భాగానికి పోయేటట్లు చేయాలి.

మెళకువలు:

కాంటూరు (ఈనె కట్టు) సేద్యం

రైతులు పొలాన్ని దున్నటం, విత్తడం, అంతర కృషి చేయడం, ఇతర సేద్యపు పనులు ఈనెకటు (కాంటురు) పద్ధతి ద్వారా చేయడం మంచిది. దీనికి ముందుగా కాంటూరు సూచిక రేఖలను ఏ చట్రం ద్వారా లేక వ్యవసాయ విస్తరణశాఖ అధికారుల సహాయంతో చేసుకోవాలి.

అనువైన పంటల సరళి

వాన తాకిడికి అద్దం లేని భూమి మీద నీరు పడి వేగంగా ప్రవహించేటప్పుడు, నేల కోత ఏర్పడుతుంది. అందుచే మెట్టసాగు రైతులు తమ పొలాలను తొలకరి వానలలో త్వరగా నేలపై పరచుకొని పప్పుదినుసు పంటలను పెసర, మినుము, అలసంద, వేరుశనగ, ఉలవలు పంటల సరళిలో అంతర పంటగా చేర్చుకోవాలి. ఇవి నేలకు రక్షణగా పనిచేస్తాయి. ఉదాహరణకు ఎర్ర నేలల్లో జొన్న + కంది, జొన్న - పెసర, మొక్కజొన్న పెసర, వేరుశనగ + కంది వంటివి అనువైన అంతర పంటలు. నల్లరేగడి నేలల్లో, ఎక్కువ వర్షపాతం పరిస్థితుల్లో వర్షాధారంగా రెండు పంటల (జొన్న - కుసుమ / శనగ, పెసర-కుసుమ) సరళిని అనుసరించవచ్చు.

సేంద్రియ పదార్థాల వాడకం

పంట వేసిన తరువాత పంట వరుసల మధ్య గైరిసీడియా లేక సుబాబుల్ రెమ్మలు లేక గానుగ రెమ్మలు లేక పశుగ్రాసానికి పనికిరాని గడ్డి (గోసారెడ్డి), ఇతర సేంద్రియ పదార్థాలు (పశువుల ఎరువు) కప్పటం చాలా లాభదాయకం. దీనివల్ల భూమి పైపొరను వర్షపు తీవ్రత వలన కోతకు గురికాకుండా అరికట్టవచ్చు. పొలంలోని నీరు ఆవిరి కావడం తగ్గుతుంది.

వాలు గట్లు

ఈ గట్లు వాలు 1.5 శాతం ఎక్కువగా ఉన్న పొలంలో వేసుకోవాలి. ఉదా: రాయలసీమ ప్రాంతంలోని సాలు సరి వర్గం 620 మి.మీ. ఉండి వర్షం తాకిడి తీవ్రత లేని ప్రాంతాలలో వర్షపు నీటిని భూమి లోనికి ఇంకునట్లుగా చేయడానికి కాంటూర్ గట్లను వేసుకోవాలి. సేద్యపు భూమిని సమతల ప్రాంతాలను కలుపుతూ వేసే గట్లను వాలు గట్లు అంటారు. గట్టు తగ్గకుండా 0.5 చ.మీ. విస్తీర్ణం ఉండునట్లుగా చూడాలి. నేల వాలును బట్టి 20-70 సెం.మీ. ఎడంలో ఈ గట్లను వేసుకోవచ్చు. నల్లరేగడి పొలంలో గట్ల పైభాగం చిన్న కాలువలు ఉండేటట్లుగా నిర్మించాలి. ఎర్ర నేలల్లో కాలువ లేకుండా నిర్మించాలి. ఈ గట్లు చాలా కాలం మన్నడానికి సెంట్రస్ లేదా స్టీలో గడ్డిని వేసుకోవచ్చు.

గ్రేడెడ్ గట్టు

వర్షపు తీవ్రత ఎక్కువగా ఉండి సాలుసరి వర్షం 600-800 మి.మీ. వచ్చే ఎర్ర నేలలు లేక నల్లరేగడి నేలల్లో వాలుకు అడ్డంగా నిర్మించుకోవాలి. ఈ గట్లపై చివరి నుండి కింది వరకు (0.2-0.4 శాతం) అనగా 5 లేక 10 సెం.మీ. వాలు వలన కలిగే నీటికి పరిగ్రహణ శక్తికి మించిన వరద నీరు నిదానంగా ప్రవహించి, ఏర్పాటు చేసిన నీటి కాలువల ద్వారా నీటి ఏ గుంటలలో కలుస్తుంది. గట్ల విస్తీర్ణం 0.3 నుండి 0.5 చ.మీ. వైశాల్యం ఉండేటట్లు నిర్మించాలి. పాలు పక్కగా ఉండే గట్లు దూరం తగ్గుతుంది.

జీవ గట్లు

తక్కువ వాలు ఉన్న మెట్ట పొలంలో కాంటూర్, గ్రేడెడ్ గట్ల మధ్య ప్రతి 10-20 మీ. నిడివిగా ప్రాంతానికి అనువైన గడ్డిని పెంచుకోవచ్చు. దీనికి అంజన్, సైలో లేక ఖస్ గడ్డి రకాలను జీవ గట్టుగా వాడుకోవచ్చు. వేసిన పంటలతో నీటికి పోటీ పడకుండా పంట కాలంలో పెరిగే గడ్డి 30 సెం.మీ. ఉండేటట్లుగా కోయాలి. నీటి కాలువలు : గ్రేడెడ్ గట్ల నుంచి వచ్చిన మిగులు నీరు, నీటి కాలువల ద్వారా నీటి గుంటలలో నిల్వ చేయవచ్చు. నీటి కాలువలలో ప్రవాహ వేగం తగ్గించడానికి అనుకూలమైన స్టైలో లేక అంజన్ గడ్డిని పెంచాలి. గడ్డిని మరింత ఎక్కువ ఎత్తు పెరగకుండా ఉంచితే నీటి కాలువలలో మట్టి పేరుకోకుండా ఉంటుంది.

గొడ్డు సాళ్ళను ఏర్పరచడం

పొలంలో అనువైన పంటలు వేసిన తర్వాత నీరు సమానంగా ఇంకేటట్లుగా నాగలితో రెండు లేక మూడు సాళ్ళ మధ్యలో రోడ్డు సాళ్ళను 30-40 రోజులకు కలుపు తీసి పైపాటు వేసిన తరువాత ఏర్పడేటట్టు చేసుకోవాలి. భూమి వాలును బట్టి సుమారు 1-3 మీటర్లకు ఒకటి చొప్పున లోతుగా తీయాలి. ఇట్టి గొడ్డు సాళ్ళు సాధారణ వర్షం కురిసినప్పుడు వర్షపు నీటిని భూమి ఉపరితలంపై ప్రవహించి వెళ్ళిపోకుండా అడ్డగించి భూమిలోకి ఇంకేటట్లు చేసి పంటకు తేమను ఎక్కువ కాలం వరకు అందజేయటమే కాక అధిక వర్షాలు కురిసినప్పుడు ఎక్కువైన నీటిని కూడా భూమి ఉపరితలంపై ప్రవహించి మట్టి కొట్టుకొని పోకుండా మురుగు నీటి కాలువలాగా కూడా పనిచేస్తుంది. కనుక అట్టి గొడ్డు సాలు అనబడే లోతైన విత్తన శనవేయని నాగటి సాలు మెట్ట సేద్యంలో ముఖ్యమైనది. ఈ విధంగా చేయటం వలన వర్షాభావ పరిస్థితులలో రైతు పద్ధతి కంటే సుమారు 20 శాతం అధిక దిగుబడి వచ్చునని రైతుల పొలాల్లో ప్రదర్శన క్షేత్రాల ద్వారా నిరూపించారు.

సేద్యయోగ్యం కాని భూములను అలాగే వదిలివేయక వాటిలో గడ్డి విత్తనాలు చల్లి గడ్డిని, చెట్లను పెంచటం వలన భూమిని నేలకోత బారి నుండి రక్షించడమే కాక వర్షం ఎక్కున కురవడానికి దోహదకారిగా పనవాళికి ఉపయోగకారిగా చేయవచ్చు.

ఎత్తైన ప్రదేశాలు, గుట్టల నుండి వర్షం పడినప్పుడు ప్రవహించే నీటి వేగం వలన భూమి పైపొరలోని సారవంతమైన మట్టి కొట్టుకొని పోయి కొంత కాలం వరకు చిన్న చిన్న కసుమలు, తరువాత పెద్ద కనుమలుగా మారి, సేద్య యోగ్యమైన భూములు కూడా పనికిరాకుండా పోతాయి. కనుక గుట్టల అడుగు భాగాన 2 మీటర్ల వెడల్పు 22 సెం.మీ. లోతు గల ట్రెంచులను ఫిల్టర్ స్ట్రిప్ తీసి మట్టిని కింద భాగంలో నేసి నీటిలో గడ్డిని పెంచడం, వివిధ జాతుల గుబురుగా పెరిగే మొక్కలను నాటడం చేయాలి. ఇలా చేయటం వల్ల వర్షపు నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించి నేలకోత నివారించబడుతుంది. అంతేకాక ఎత్తైన ప్రాంతాలు, గుట్టల పైభాగంలో కాంటూర్లలో గుంతలు (లైంచులు) తవ్వించడం, మొక్కలు నాటడం వలన కూడా వర్షపు నీరు చాలా వరకు అక్కడక్కడ ఇంకి నీటి ప్రవాహ వేగం తగ్గటమే కాక నాటిన చెట్లు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఎత్తైన ప్రాంతాలు, గుట్టల కింద ప్రదేశంలో గల ఏటవాలు భూములలో కాంటూరు గట్టు వేసి వాటిపై గడ్డి, చెట్లు పెంచడం చేత ఆ ప్రదేశం నేల కోత బారినుండి రక్షించబడి వర్షపు నీరు అక్కడక్కడే ఇంకి భూమిలో తేమ బాగా ఉండి మంచి ఫలసాయం పొందడానికి వీలవుతుంది.

గుట్టల నుండి, ఎత్తైన ప్రదేశాల నుండి వర్షపు నీటి ప్రవాహం వలన ఏర్పడిన చిన్న చిన్న కనుమలకు అడ్డంగా రాతి కట్టడాలు చేయటం, గుబురు మొక్కలు పెంచడం, పెద్దవైన కనుమలకు అడ్డంగా రాతి కట్టడాల ద్వారా నీటి ప్రవాహాన్ని అడ్డగించి ఆ కనుమలలో అక్కడక్కడ అవసరాన్ని బట్టి గుంతలు తవ్వి నీటిని పైనుండి కొట్టుకొని వచ్చిన మట్టిని అక్కడక్కడే ఆపడానికి వీలవుతుంది.

నీటి గుంటలు

చివరగా పల్లపు ప్రాంతాలలో చిన్నచిన్న కుంటలు లేదా చెకర్యాలు, ఊట చెరువులు నిర్మించి, ఎత్తు ప్రదేశాల నుండి వచ్చే నీటిని వృధా పోకుండా అడ్డగిస్తే ఆ నీరు భూమిలోకి ఇంకిపోయి భూగర్భ జల నిలువ పెరగడమే కాక ఎక్కువైన నీరు పంట పొలాల్లో ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు నీటి పరిగ్రహణ . శక్తికి మించి వచ్చిన వర్షపు నీటిని నీటి కాలువల ద్వారా, గ్రేడెడ్ గట్ల ద్వారా నీటి గుంటలోని మళ్ళించాలి. నీటి గుంటలలో నిలువ ఉంచిన నీరు నిలుపరి పంటలకు బెట్ట తగిలినప్పుడు, కూరగాయల సారు పెంచుకోవడానికి మేలైన నీటి యాజమాన్య పద్ధతుల ద్వారా సండ్ల చెట్ల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. పెట్టుబడి తక్కువ ఉన్న రైతు సోదరులు, నీటి గుంటలను, ఉకిట చెరువులుగా కూడా మార్చుకొని, తమ భూనీటి వనరులను పెంచుకోవచ్చు.

ఇటువంటి చర్యలను నీటి పరీవాహక ప్రాంత ప్రాతిపదికపై చేపట్టాలి. అవసరమైన వనరులను వ్యవసాయశాఖ ద్వారా గానీ లేక బ్యాంకుల ద్వారా కానీ సమకూర్చుకోవాలి.

మన రాష్ట్రంలోని మెట్ట సాగు రైతులు సాంప్రదాయక పద్ధతులలో కొన్ని భూసార నీటి సరిరక్షణ చర్యలను తమ పొలాల్లో చేస్తున్నారు., ఉదా : మట్టి లేక రాతి గట్లను వాలును బట్టి అడ్డంగా వేసి వర్షపు నీటిని కాపాడడం, పొలాల సరిహద్దు గట్ల వెంబడి అగేవ్ మొక్కలను నాటుకోవడం వర్షపు నీటిని చెట్ల మధ్య ఉన్న గుంటలలో కానీ, చెరువులలో నిల్వ చేయడం వేరుశనగ పొట్టును పొలంలో చల్లి దున్నటం, చెరువు మట్టిని మెట్ట పొలాలకు వేసి నీటి పరిగ్రహణ శక్తిని, భూసారాన్ని పెంచడం పొలంలోని గల్లీలో వాలుకు అడ్డంగా ఇసుక బస్తాలను వాడడం, సాంప్రదాయ రోట్టను ఉపయోగించి వర్షపు నీటి పరిమాణం గమనించి వ్యవసాయ పనులు చేయడం. పైన ఉదహరించిన పద్దతులను రైతు సోదరులు తమ పొలాల్లో తామే చేసుకోవడం వలన మెట్ట పొలాల నుండి అధిక దిగుబడిని పొందవచ్చు.

3.02264150943
గంగు శ్రీనివాసరావు Oct 14, 2018 09:56 AM

మా భూమి ఎప్పుడు టడిగానే ఉంటుంది.
ఎందుకంటే భూమి కి పై భాగంలో కాలువ నిరంతరం పారుతూనే ఉంటుంది.
మరి మేము ఎలాంటి పంటలు వెస్తే బాగుంటాయి
దయచేసి వివరించండి

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు