పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వాతావరణ పరిస్దితులు : పంటలలో చీడపీడలు

వాతావరణ పరిస్దితులు : పంటలలో చీడపీడలు

పురుగు/తెగులు

అనుకూల పరిస్దితులు

వరి
కాండం తొలిచే పురుగు

1. రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి సూర్యరశ్మి రోజుకు 7 గంటలకు మంచి వుండటం.

2. కరువు పరిస్దితులు నెలకొన్న సంవతసరాలలో దీని ఉధృతి ఎక్కువగా వుంటుంది.

3. ఆలస్యముగా నాట్లు వేయటం ముదురు, నారు నాటటం.

4. నత్రజని లోపం అధికంగా ఉన్న నేలల్లో కాండం బలహీనముగా ఉండుట వలన

సుడిదోమ

1. ఆగష్టు మాసములో 300-400 మి.మీ. వర్షపాతం లేదా పొలంలో అధికంముగా నీరు నిల్వ ఉండటం వలన.

2. రాత్రి ఉష్ణోగ్రతలు 21-23o సెల్సియస్ మధ్య మరియు పగటి ఉష్ణోగ్రతలు 25-30o సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు.

3. నత్రజని అధిక మోతాదులో వాడినపుడు.

4. కాలిబాటలు తీయని పోలాల్లో

పచ్చ దోమ

1. బెట్ట పరిస్దితులు మరియు అధిక ఉష్ణోగ్రతలు

2. పొలం చుట్టూ కలుపు అధికంగా ఉండటం

3. అధిక మోతాదులో నత్రజని వాడటం

ఉల్లికోడు/గొట్టపు రోగం

1. ఋతుపవనాలు ఆలస్యమై, ఆలస్యముగా నాటినపుడు (ఆగష్టు-సెప్టెంబర్ నెలల్లో

2. గాలిలో తేమ 82-88% ఉన్నపుడు

3. సెప్టెంబరులో 200 మి.మీ కన్నా అధిక వర్షపాతం నమోదైనప్పుడు.

అకుముడత

1. ఆలస్యముగా నాట్లు పడి (ఆగష్టు-సెప్టెంబరు నెలల్లో), ఆ ప్రాంతాలలో అధిక వర్షాలు పడి తదుపరి బెట్ట పరిస్దితులు నెలకొనడం మరియు వారం పాటు మబ్బులతో కూడిన వాతావరణం

2. పొలం చుట్టూ నీడ ప్రదేశాలు ఉండటం.

3. నత్రజని ఎరువులను అధిక మోతాదులో వాడటం .

వరి ఈగ

1. ఆశించే కాలం : ఖరిఫ్ లో నాట్లు అలస్యమైనపుడు, రబీలో ఎక్కువగా ఆశిస్తుంది.

2. ఆశించే దశ : నారుమడి/పిలకదశ, నాటిన 40 రోజులలోపు.

హిస్పా (తాటాకు తెగులు)

1. తొలకరిలో ముందు మంచి వర్షాలు పడి తరువాత బెట్ట పరిస్థితులు నెలకొంటే, పగటి-రాత్రి ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువగా ఉండి, గాలిలో అధిక తేమ ఉంటె .

2. పొలంలో నిడ ప్రదేశాలున్నా.

3. నత్రజని ఎరువులు ఎక్కువగా వాడిన పోలాల్లో

అగ్గి తెగులు

1. నత్రజని అధిక మోతాదులో వాడినప్పుడు.

2. గాలిలో తేమ అధికంగా ఉండటం

3. మబ్బుతో కూడిన వాతావరణం

4. సన్నని వర్షపు జల్లుతో కూడిన వాతావరణం

5. ఉష్ణోగ్రతలు 25-300 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు

పొట్ట కుళ్ళు తెగులు

1.రాత్రి ఉష్ణోగ్రత 300 సెల్సియస్ కన్నా ఎక్కువగా ఉన్నపుడు

2. గాలిలో తేమ 80% కంటే ఎక్కువగా ఉన్నపుడు

మాని పండు తెగులు

1. బిర్రు పొట్ట దశ నుండి పుష్పించే సమయములో చిరు గాలులతో కూడిన వర్షం లేదా అధిక తేమతో కూడిన వాతావరణం లేదా తుఫానుతో కూడిన వర్షం ఈ తెగులుకు అనుకూలం

బకానే తెగులు (ఫుట్ రాట్)

1. చల్లని పొడి వాతావరణం, విత్తనశుద్ది చేయకుండా నారు పోసినప్పుడు, తద్వారా తెగులు సోకిన మొక్కలు పొలంలో నటినప్పుడు ఉధృతి ఎక్కువగా ఉంటుంది.

1. ప్రకృతి వైపరిత్యాలు, వరదలు సంభవించినప్పుడు ఎలుకలలో సూపర్ బ్రీడింగ్ జరిగి ఉధృతి ఒకసారిగా పెరుగుతుంది.

మొక్కజొన్న

రసం పీల్చే పురుగులు

పొడి వాతావరణం

టర్సికం అకుమచ్చ తెగులు

పూత దశలో అధిక తేమతో కూడిన వాతావరణం, ఉష్ణోగ్రతలు 18-270 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు, మంచుతో కూడిన వర్షపు జల్లులు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.

త్రుప్పు తెగులు

అధిక తేమతో కూడిన చల్లని వాతావరణం

బొగ్గు కుళ్ళు తెగులు

పూత దశ తరువాత నేలలో తేమ శాతము తగ్గటము మరియు అధిక ఉష్ణోగ్రతలు ఉన్నపుడు ఈ తెగులు ఉధృతి అధికముగా ఉంటుంది.

బూజు తెగులు

అధిక తేమ మరియు ఉష్ణోగ్రతలు 20-250 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు ఈ తెగులు త్వరగా వ్యాప్తి చెందుతుంది

మేడిన్ వడలు తెగులు

గింజ పాలు పోసుకొనే దశలో, నీటి ఎద్దడి, వేడి వాతావరణం (20-320 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు), అధిక తేమ వ్యాప్తికి అనుకూలం

జొన్న

గింజ బూజు తెగులు

పూత మరియు గింజ గట్టిపడే సమయములో వర్షాలు పడితే ఎక్కువగా వ్యాపిస్తుంది.

బంక కారు తెగులు

పూత మరియు గింజ గట్టిపడే సమయములో ఆకాశం మేఘావృతమై, చల్లని మరియు తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.

కంది

పచ్చ పురుగు

ఖరిఫ్ లో మందుగా తక్కువగా వర్షాలు, నవంబర్ నెలలో అధిక వర్షాలు, రాత్రి ఉష్ణోగ్రతల్లో ఒక్కసారి పెరుగుదల ఈ పురుగు ఉధృతికి అనుకూలం. గుడ్ల దశలో లేదా లార్వా దశలో వర్షం కురిస్తే ఈ పురుగు ఉధృతి తగ్గుతుంది.

పెసర/మినుము

పల్లాకు తెగులు మరియు ఆకు ముడత వైరస్ తెగులు

పొడి వాతావరణం మరియు బెట్ట పరిస్ధితులు ఎక్కువగా కాలం (7 నుండి 10 రోజులు) కొనసాగితే తెల్లదోమ ఉధృతి ఎక్కువై తద్వారా పల్లాకు తెగులు ఎక్కువగా వ్యాపిస్తుంది.

బూడిద తెగులు

విత్తిన 30-35 రోజుల తర్వాత గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాపిస్తుంది.

త్రుప్పు తెగులు

చల్లని పొడి వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం

సోయాచిక్కుడు

పొగాకు లద్దె పురుగు

ఉష్ణోగ్రత 20-300 సెల్సియస్, సూర్యరశ్మి మరియు అధిక తేమతో కూడిన వాతావరణం ఈ పురుగు వ్యాప్తికి అత్యంత అనుకూలం

అకుముడత

అధిక ఉష్ణోగ్రత మరియు బెట్ట పరిస్దితుల్లో ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది

మోవ్వుతొలుచు ఈగ

అత్యధిక ఉస్నోగ్రత 30-330 సెల్సియస్ మరియు తత్యల్ప ఉష్ణోగ్రత 23-240 సెల్సియస్ మధ్య, సూర్యరశ్మి 3-5.5 గంటలు మరియు గాలిలో తేమ 55-58 శాతం మధ్య ఉన్నపుడు ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది

పెంకు పురుగు

అత్యధిక ఉస్నోగ్రత 30-340 సెల్సియస్ మరియు తత్యల్ప ఉష్ణోగ్రత 22-240 సెల్సియస్ మధ్య మరియు గాలిలో తేమ 55-58 శాతం మధ్య ఉన్నపుడు ఈ పురుగు ఉధృతి పెరుగుతుంది

వేరుకుళ్ళు తెగులు (రైజోక్టోనియా)

పంట లేత దశలో సుదీర్ఘమైన తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు అనుకూలం

బాక్టీరియా అకుమచ్చ తెగులు

దీర్ఘకాలం చల్లని తేమతో కూడిన వాతావరణం ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం

అకుమచ్చ తెగులు (ఆల్టర్నేరియా)

ఉష్ణోగ్రత 20-320 సెల్సియస్ వర్షము మరియు గాలిలో తేమ 80 శాతం పైన ఉన్నపుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది

కుంకుమ తెగులు

ఉష్ణోగ్రత 19-300 సెల్సియస్ వర్షము మరియు గాలిలో తేమ 90 శాతం పైన ఉన్నపుడు ఈ తెగులు వ్యాప్తి చెందుతుంది

వేరుశనగ

ఎర్ర గొంగళి పురుగు / బొంత పురుగు

తొలకరి వర్షాల తరువాత నేల 10 నుండి 20 సెం.మీ. మేర తడిచినట్లయితే ఎక్కువగా ఆశిస్తుంది

అకుముడత

బెట్ట పరిస్దితులలో ఎక్కువగా ఆశిస్తుంది

వేరు కుళ్ళు తెగులు

ఈ తెగులు పైరు 30 రోజుల తరువాత బెట్ట పరిస్ధితులు ఉన్నపుడుఎక్కువగా ఆశిస్తుంది

తిక్కా అకుమచ్చ తెగులు

అధిక వర్షపాతం ఆకు మీద తేమ మరియు అత్యదిక ఉష్ణోగ్రత 31 నుండి 350 సెల్సియస్ మధ్య మరియు అత్యల్ప ఉష్ణోగ్రత 18 నుండి 230 సెల్సియస్ మధ్య ఉన్నపుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది.

త్రుప్పు లేదా కుంకుమ తెగులు

వర్షాలు గాలిలో అధిక తేమ మరియు ఉష్ణోగ్రత 20 నుండి 260 సెల్సియస్ మధ్య ఉన్నపుడు ఈ తెగులు ఉధృతి అధికంగా ఉంటుంది

మొదలు కుళ్ళు తెగులు

అధిక నేల మరియు గాలిలో ఉష్ణోగ్రత ఈ తెగులు ఉధృతికి కారకాలు విత్తనం కుళ్ళు తెగులు, ఉష్ణోగ్రత 15 నుండి 400 సెల్సియస్ మధ్య మరియు వేరుకుళ్ళు తెగులు, ఉష్ణోగ్రత 30 నుండి 350 సెల్సియస్ మధ్య ఉన్నప్పుడు ఎక్కువ ఆశిస్తుంది.

కుసుమ

పేనుబంక

డిసెంబర్మరియు జనవరి మాసాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 12-150 సెల్సియస్ మధ్య ఉండి మబ్బులతో కూడిన ఆకాశం ఉన్నట్లయితే ఉధృతి ఎక్కువ. వర్షాలు ఉధృతంగా కురిస్తే దానంతట అదే పోతుంది

అకుమచ్చ తెగులు

విత్తన 60 రోజులు నుండి ముఖ్యంగా డిసెంబర్-జనవరి మాసాల్లో వర్షాలు కురవడం లేదా ఆకాశం మేఘావృతమై ఉండటం గాలిలో తేమ 70 శాతం మించి ఉండటం ఈ తెగులు ఉధృతికి అనుకూలం

స్టెరిలిటి మొజాయిక్ వైరస్

ఏప్రిల్ – మే నెలల్లో వర్షాలు పడితే ఆగష్టు నుండి అక్టోబర్ మాసాల్లో తెగులు ఆశించే అవకాశం ఎక్కువ

ప్రొద్దుతిరుగుడు

ఆల్టర్నేరియా అకుమచ్చ తెగులు

విత్తనం వేసిన 50 నుంచి 60 రోజులు తరువాత చలి లేదా వర్షంలో కూడిన వాతావరణం అనుకూలం

త్రుప్పు తెగులు

చల్లని పొడి వాతావరణం తెగులు వ్యాప్తికి అనుకూలం.

పువ్వు లేదా తల కుళ్ళు తెగులు

పూత దశలో అధిక వర్షాలు పడినప్పుడు ఆశిస్తుంది.

ఆముదం

ఎర్ర గొంగళి పురుగు/బొంత పురుగు

తొలకరి వర్షాల తరువాత నేల 10 నుండి 20 సెం.మీ మేర తడిచినట్లయితే ఎక్కువగా ఆశిస్తుంది.

బూజు తెగులు

ఆముదం మొక్క గెల వేసే సమయంలో తుఫాను వలన ఎడతెరిపీ లేకుండా 3-4 రోజులు చిరుజల్లులు మరియు గాలిలో తేమ 90 శాతం పైన రాత్రి ఉష్ణోగ్రతలు 22 సెల్సియస్ కంటే తక్కువగా ఉన్నచో ఎక్కువగా ఆశిస్తుంది.

వేరు కుళ్ళు/మసి తెగులు

బెట్ట మరియు అధిక నెల ఉష్ణోగ్రతలు ఈ తెగులు వ్యాప్తికి అనుకూలం.

ఆల్టర్నేరియా అకుమచ్చ తెగులు

రాత్రి ఉష్ణోగ్రతలు 16-200 సెల్సియస్ మధ్య మబ్బులు మరియు అధిక తేమతో కూడిన వాతావరణం అనుకూలం

చెఱకు ఎర్ర నల్లి (మైట్స్)/లక్క తెగులు

వేసవి కాలములో వాన జల్లులు పడి, ఆ జల్లులు ఒరుపు సమయంలో ఎక్కువగా కనిపిస్తుంది

పసుపు నల్లి

ఉష్ణోగ్రతలు 26-290 సెల్సియస్ మధ్య ఉండి గాలిలో తేమ 60 నుండి 70 శాతం ఉంటె ఉధృతికి అనుకూలం

ప్రత్తి

పచ్చ పురుగు (హెలికోవెర్పా)

ఖరీఫ్ లో ముందుగా వర్షాలు, నవంబర్ నెలలో అధిక వర్షాలు రాత్రి ఉష్ణోగ్రతల్లో ఒక్కసారి పెరుగుదల ఈ పురుగు ఉధృతికి అనుకూలం. గ్రుడ్ల దశలో లేదా లార్వా దశలో వర్షం కురిస్తే ఈ పురుగు ఉధృతి తగుతుంది.

లద్దె పురుగు

పగటి ఉష్ణోగ్రతలు 30-320 సెల్సియస్ రాత్రి ఉష్ణోగ్రతలు 21-330 సెల్సియస్ 4 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం ఉధృతి పెరగడానికి దోహద పడుతుంది

తెల్ల దోమ

10 రోజులకు మంచి బెట్ట పరిస్ధితులు

వేరు కుళ్ళు తెగులు

భూమిలో అధిక తేమ ఉన్నపుడు ఈ తెగులు వ్యాపిస్తుంది

నల్ల మచ్చ తెగులు

మబ్బుతో కూడిన వాతావరణం మరియు పొడి వాతావరణం అనుకూలం

త్రుప్పు తెగులు

అధిక తేమతో కూడిన చల్లని వాతావరణం.

పండాకు తెగులు (బాక్టీరియా ఆకు ఎండు తెగులు)

రాత్రి ఉష్ణోగ్రత 210 సెల్సియస్ కన్నా తగ్గినపుడు, గాలి వేగం అధికంగా ఉన్నప్పుడు, ప్రతికూల వాతావరణ పరిస్దితులు (బెట్ట మరియు అధిక తేమ) మొక్కలో నత్రజని, భాస్వరం మరియు పొటాషియం పోషక లోపాలు ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాపిస్తుంది.

కాండం కుళ్ళు లేదా మొదలు కుళ్ళు వైరస్ తెగులు

పైరు 20 నుండి 40 రోజులు ఉన్నప్పుడు బెట్ట పరిస్ధితులు నెలకొని తామర పురుగులు ఎక్కవగా ఉండి, పొలము చుట్టూ ఎక్కువ పార్ధినియం మొక్కలు ఉన్నట్లయితే ఆశించే అవకాశం ఎక్కవ.

కాయ కుళ్ళు తెగులు

ప్రత్తి కాపు దశలో అధిక వర్షాలు ఉన్నప్పుడు ఈ తెగులు వ్యాపిస్తుంది.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

3.00426439232
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు