పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వాతావరణం – పంటల పరిస్ధితి – విశ్లేషలు

వాతావరణం, పంటల పరిస్ధితి, విశ్లేషలు గురించి వివరాలు.

భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 7వ తేదిన ప్రవేశీస్తాయి. కాని ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళలో మే 30వ తేదిన ప్రవేశించాయి. అనగా వారం రోజులు ముందుగా నరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవెశించాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదిన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.

రాష్ట్రంలో ఖరిఫ్ పంట కాలంలో సాధారణ వర్షపాతం 719.3 మి.మీ కు గాను 646.3 మి.మీ అంటే సాధారణ (-10%) వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలంలో (01.06.2017 నుండి 30.09.2017) రాష్ట్రంలో కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారిగా గమనిస్తే మేడ్చల్ మల్కజ్ గిరి హైదరాబాద్, మహబుబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సాధారణం కన్న తక్కువ వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో 01. 06.2017 నుండి 20.09.2017 వరకు కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే మేడ్చల్ మల్కాజీగిరి, హైదరాబాద్ మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, జనగామ, యూదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మహబూబ్ నగర్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట మరియు ఖమ్మం කිඳාද් సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, మెదక్ మరియు వికారాబాద్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు

  • వరిలో అగ్గితెగులు నివారణకు 0.6 గ్రా, టైసైక్లోజోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • వరిలో కాండం తొలుచు పరుగు మరియు ఆకుమడత పురుగు నివారణకు 2 గ్రా. కార్తాప్ హైడ్రోక్లోరైడ్ లేదా 0.3 మి.లీ. క్లోరాంట్రానిలిప్రోల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • వరిలో కంకినల్లి మరియు గింజ రంగు మారడం గమనించినట్లయితే నివారణకు, 2 మి.లీ. ప్రొఫెనోఫాస్+ 1 మి.లీ. ప్రాఫికొనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ప్రత్తిలో ఆకుమచ్చ తెగుళ్ళ నివారణకు 30 గ్రా. కాపర్ ఆక్స్క్లోరైడ్ మరియు 2 గ్రా. ప్లాంటామైసిన్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • ప్రత్తిలో రసంపీల్చే పురుగుల నివారణకు 0.2 గ్రా. ఎసిటామిఫ్రిడ్ లేదా 0.2 గ్రా. థయోమిథాక్సామ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ప్రత్తిలో నల్లమచ్చ తెగులు గమనించినచో నివారణకు 30 గ్రా. ఆక్సీక్లోరైడ్ +2 గ్రా. ప్లాంటామైసిన్ లేదా 2 గ్రా. పోషామైసిన్ మందును 10 లీటర్ల నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో 2 నుండి 3 సార్లు పిచికారి చేయాలి.
  • ప్రత్తిలో బూడిద తెగులు గమనించినచో నివారణకు 3 గ్రా. నీటిలో కరిగే గంధకము లేదా 1 మి.లీ. కెరథేన్ మందును లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • కందిలో పైటాఫోరా ఎండుతెగులు గమనించినచో నివారణకు 2 గ్రా. మ్యాంకోజెబ్ మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారి చేయాలి.
  • ఆముదంలో బూజు తెగులు నివారణకు ముందు జాగ్రత్త చర్యగా 1 గ్రా. కార్బెండాజిమ్ లేదా 1 మి.లీ. ప్రాఫికొనజోల్ మందును వర్షం కురవడానికి 6-8 గంటల ముందుగా మరియు వర్షం కురిసిన తరువాత 6-8 గంటల వ్యవధిలో లీటరు నీటికి కలిపి మొక్క అన్ని భాగాలు తడిచే విధంగా పిచికారి చేయాలి.
  • వంగలో కొమ్మ మరియు కాయతొల్పు పురుగు నివారణకు పురుగు సోకిన కొమ్మలను త్రుంచి నాశనం చేయాలి మరియు 2 మి.లీ. ప్రా ఫెనోఫాన్ లేదా 0.4 గ్రా. ఇమామెక్టిన్ బెంజోయేట్ మందును ఒక లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • కూరగాయ పంటలలో రసంపీల్చే పరుగుల నివారణకు 2 మి.లీ. డైమిధోయేట్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారి చేయాలి.
  • దక్షిణ తెలంగాణ జిల్లాల్లో నల్లరేగడి నేలల్లో నిలువ వుండే తేమను ఉపయోగించుకుంటూ శనగ మరియు కుసుమ పంటలను విత్తుకోవలెను.
  • నీటి వసతి గల ప్రాంతాలలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న జొన్న వేరుశనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తుకోవాలి.
  • ఆరు తడి పంటలైన మొక్కజొన్న, జొన్న, వేరుశనగ మరియు ప్రొద్దుతిరుగుడు పంటలను విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

రాష్ట్రంలో ఖరిఫ్ పంట కాలంలో సాధారణ వర్షపాతం 719.3 మి.మీ కు గాను 646.3 మి.మీ అంటే సాధారణ (-10%) వర్షపాతం నమోదైంది. నైరుతి ఋతుపవనాలు కాలంలో (01.06.2017 నుండి 30.09.2017) రాష్ట్రంలో కురిసిన వర్షపాత వివరాలను జిల్లాలు వారిగా గమనిస్తే మేడ్చల్ మల్కజ్గిరి, హైదరాబాద్, మహాబూబు నగర్ మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాల పల్లి, భాద్రాద్రి కొత్తగూడం, మహబూబా బాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల, నల్గొండ, సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల మరియు మెదక్ జిల్లాల్లో సాధారణం కన్న తక్కువ వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో 01.10.2017 నుండి 25.10.2017 వరకు కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారిగా గమనిస్తే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యదాద్రి భువనగిరి, మేడ్చల్ మల్కాజ్ గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, వనపర్తి మరియు నల్గొండ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, మెదక్, నాగర్ కర్నూల్ మరియు సూర్యపేట్ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, కొమరంభీమ్ అసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ మరియు ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

వరి

  • తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదైనట్లైతే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు
  • పాలిధిన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్ళు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్ధితులు వరిలో అగ్గితెగులు/మెడవిరుపు తెగులు ఆశించుటకు అనుకూలం. నివారణకు గాను ఇసొప్రాధయోలేన్ 1.5 మి.లీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.లీ లేదా ట్రైసైక్లోజోల్ 0.5 గ్రాచొప్పున లీటరు నీటికి కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
  • ప్రతిరోజు సాయంత్రం నారుమడికి నీరు పెట్టాలి, ఉదయం నీటిని తీసివేయాలి.
  • ఎకరా పొలానికి సరిపడే నరుమడికి 2 కిలోల యూరియా పైపాటుగా నారు విత్తిన 10-15 రోజుల్లో చల్లాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్ధితులు వరిలో అగ్గితెగులు / మెడవిరుపు తెగులు ఆశించడానికి అనుకూలం. నివారణకు గాను ఐసోప్రోధయొలెన్ 1.5 మి.మీ లేదా కాసుగామైసిన్ 2.5 మి.మీ లేదా ట్రైసైక్లోజోల్ 0.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి 7-10 రోజులు వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
  • వారిలో ఆకుముడత పురుగు గమనించడమైనది. నివారణకు కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 2.0 గ్రా. లేదా క్లోరాంట్రానిలీప్రోల్ 0.3 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.
  • ఆలస్యంగా నాట్లు వేసి వరి పొలాల్లో సుడిదోమ ఉధృతి (20-30 పురుగులు దుబ్బుకు) పెరుగుతుంది. దీని నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రా + బుప్రోఫెజిన్ 1.6 మి.లీ. లీటరు నీటికి కలిపి మొక్కల మొదళ్ళ పై పడే విధంగా పిచికారీ చేయాలి. ఒక వేళ దోమ ఉధృతి (30-100 పురుగులు) మరి ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో దినోటేప్యూరాన్ 0.4 గ్రా లేదా పైమిట్రోజైన్ 0.6 గ్రా. లేదా ఎధిప్రోల్ + ఇమిడాక్లోప్రిడ్ 0.25 గ్రా, లీటరు నీటికి కలిపి మందులను మార్చి 7-10 రోజుల వ్యవధితో రెండుసార్లు పిచికారీ చేయాలి.
  • దోమ ఉధృతికి దోహదపడే మందులైన కోరిపైరిఫాన్, ప్రొఫెనోఫాస్, సింథటిక్ పైరథ్రాయిడ్స్, వివిధ బయోమందులు వాడరాదు.

మొక్కజొన్న

  • పైరు మొలిచిన 10 నుండి 15 రోజుల మధ్య మొవ్వు పురుగు ఆశించే అవకాశాలున్నాయి. నివారణకు, క్లోరోపైరిఫాస్ 2.0 మి.లీ. లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పైరు 25 నుండి 30 రోజుల దశలో కార్బోప్యూరాన్ 3జి గుళికలను ఎకరాకు 3-4 కిలోల చొప్పున మొవ్వులో వేయాలి.

ప్రత్తి

  • పత్తిలో గులాబీ రంగు పురుగు ఉనికి గమనించినట్లయితే నివారణకు, ప్రోఫినోఫాస్ 2.0 మి.లీ. థయోడికార్బ్ 1.5 గ్రా. లేదా 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 2.5 మి.లీ. క్వినాల్ ఫాస్ మందును లీటరు నీటికి కలిపి వారం వ్యవధిలో రెండు సార్లు పిచికారీ చేయాలి.

కంది

  • కంది పంటలో మరుక గూడు పురుగు సోకే సూచనలున్నాయి. ఈ పురుగు రెండు లేదా మూడు మొవ్వులను ఒక దగ్గరకు చేర్చి గూడు చేసి పూతను తింటాయి. నివారణకు వేప పిండి కషాయం 0.5 శాతం లేదా వేపనూనె 5 మి.లీ. మొగ్గ దశలో పిచికారీ చేయాలి. పురుగు ఉధృతిని బటీ క్లోరిపైరిఫాస్ 2.0 మి.లీ. + డైక్లోరోవాస్ 1.0 మి.లీ. లేదా ఫ్లుబెండమైడ్ 0.2 మి.లీ. లేదా స్పినోసాడ్ 0.3 మి.లీ. లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 0.3 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

కూరగాయలు

  • ప్రస్తుత పరిస్ధితుల్లో కూరగాయ పంటలైన బెండ, వంగ, టమాట వంటి పంటలలో రసం పిల్చే పురుగుల ఉధృతి పెరిగే సుచనలున్నాయి. ఎకారకు 10-20 మైనం పూసిన పసుపు రంగు అట్టలను పెట్టాలి. ఉధృతి ఎక్కువగా ఉంటె నివారణకు డైమిధోయేట్ లేదా మిధైల్ డేమాటాన్ లేదా ఫిప్రొనిల్ 2.0 లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • వంగ మరియు బెండలో కాయ తొలుచు పురుగు ఉధృతి పెరిగే సూచనలున్నాయి. తల్లి పురుగు నివారణకు ఎకరాకు 40 లింగాకర్షక బుట్టలు పెట్టాలి.
  • వంగలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ప్లూబెండమైడ్ 0.4 మి.లీ లేదా ప్రొఫెనోఫాస్ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • బెండలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ధయోడికార్బ్ 1.0 గ్రా లేదా నోవాల్యురాన్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • బెండలో పురుగు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే ధయోడికార్బ్ 1.0 గ్రా. లేదా నోవాల్యురాన్ 1.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
  • ప్రస్తుత వాతావరణ పరిస్ధితుల్లో అన్ని కూరగాయల్లో ఆకు మచ్చ తెగులు సోకే సూచనలున్నాయి. ముందు జాగ్రత్తగా కార్బండాజిమ్ 1.0 గ్రా. లేదా కార్బండాజమ్ + మ్యాంకోజేబ్ 2.0 మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

పశుపోషణ

    ప్రస్తుత వాతావరణ పరిస్దితులు

  • కోళ్ళలో కొక్కెర వ్యాధి, గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి మరియు నీలి నాలుక వ్యాధి, ఆవులు మరియు గేదేలలో గొంతువాపు వ్యాధి, గొంతు మరియు గాలికుంటు వ్యాధి సోకుటకు అనుకూలం వీటి నివారణకు టీకాలు వేయించాలీ.

ప్రస్తుత వాతావరణ పరిస్దితులలో వివిధ పంటలను ఆశించటానికి ఆస్కారం ఉన్న చీడపీడలు

  • వరిలో అగ్గితెగులు, సుడిదోమ మరియు కంకినల్లి
  • ప్రత్తిలో రసంపిల్చే పరుగులు, అకుమచ్చ తెగులు
  • కందిలో అకుచుట్టు పురుగు, పొగాకు లద్దె పురుగు మరియు మారుకు మచ్చల పురుగు
  • కూరగాయ పంటలలో రసంపిల్చే పురుగులు
  • గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి.
3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు