పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వాతావరణం - పంటల పరిస్ధితి

తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.

భారత వాతావరణ విభాగం వారి సమాచారం ప్రకారం సాధారణంగా కేరళలో నైరుతి రుతుపవనాలు జూన్ 7వ తేదీన ప్రవేశిస్తాయి. కాని ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు కేరళలో మే 30వ తేదీన ప్రవేశించాయి. అనగా వారం రోజులు ముందుగా నైరుతి రుతుపవనాలు భారత ఉపఖండంలోకి ప్రవేశించాయి. తెలంగాణ రాష్ట్రంలో నైరుతి రుతుపవనాలు జూన్ 12వ తేదీన ప్రవేశించి రాష్ట్రమంతటా విస్తరించాయి.

రాష్ట్రంలో ఖరీఫ్ పంట కాలంలో సాధారణ వర్షపాతం 719.3 మి.మీ. కు గాను 646.3 మి.మీ. అంటే సాధారణ (-10%) వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల కాలంలో (01.06.2017 నుండి 30.09.2017) రాష్ట్రంలో కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ గద్వాల్ జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆదిలాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, జనగామ, యదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కొమరంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల, మెదక్ జిల్లాల్లో సాధారణం కన్న తక్కువ వర్షపాతం నమోదైంది.

రాష్ట్రంలో 01, 10, 2017 నుంచి 29 12, 2017 నరకు కురిసిన వర్షపాత వివరాలను జిల్లాల వారీగా గమనిస్తే పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్ అర్బన్, కరీంనగర్, మేడ్చల్ ముల్కాజ్, గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, జోగులాంబ, వనపర్తి జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. మంచిర్యాల్ , నిర్మల్, జగిత్యాల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్ది పేట్, జనగామ, యదాద్రి భువనగిరి, నల్గొండ జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది, ఆదిలాబాద్, కొమరంభీమ్ అని ఫాబాద్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, రాజన్న సిరిసిల్ల, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, ఖమ్మం జిల్లాల్లో సాధారణ వర్షపాతం కంటే తక్కువ వర్షపాతం నమోదైంది.

వాతావరణాధారిత వ్యవసాయ సలహాలు:

 • తెలంగాణ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైనట్లైతే వరి నారుమడిలో చలి ప్రభావం తగ్గించి నారు ఎదుగుదలకు
 • పాలిథీన్ షీట్లతో నారుమడిని రాత్రిళ్ళు కప్పి ఉదయం వేళల్లో తీసివేయాలి.
 • ప్రతి రోజు సాయంత్రం నారుమడికి నీరు పెట్టాలి, ఉదయం నీటిని తీసివేయాలి.
 • ఎకరా పొలానికి సరిపడే నారుమడికి 2 కిలోల యూరియా పైపాటుగా నారువిత్తిన 10-15 రోజుల్లో చల్లాలి.
 • వరి నారుమళ్ళలో కార్బోఫ్యూరాన్ 3జీ గుళికలను 200 చ.మీ. నారు మడికి (5 సెంట్లకు) ఒక కిలో చొప్పున నారు పీకడానికి వారం రోజుల ముందు చల్లుకోవాలి.

కందిలో ఆకుచుట్టు పురుగు, మారుక మచ్చల పురుగు, శనగపచ్చ పురుగు నివారణకు,

ఆకుచుట్టు పురుగు:

 • 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 2 మి.లీ. క్వినాల్ఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

మారుక మచ్చల పురుగు:

 • 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 0.75 మి.లీ. నోవోల్యూరాన్ తో పాటు 1.0 మి.లీ. డైక్లోరోవాస్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. శనగపచ్చ పురుగు నివారణకు, ఈ కింది సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించాలి.
 • శనగ పచ్చ పురుగు లార్వాలను తినడానికి అనుగుణంగా ఎకరాకు 10-15 పక్షి స్థావరాలను ఏర్పరచాలి.
 • శనగ పచ్చ పురుగుల ఉనికిని గమనించడానికి ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను అమర్చాలి.
 • పురుగు గుడ్లు, తొలిదశ లార్వాల నివారణకు, 5 శాతం వేపగింజల కషాయాన్ని పిచికారీ చేయాలి.
 • కుసుమలో ఆకుతినే పురుగు, పేనుబంక ఆశించడమైనది. నివారణకు,

ఆకుతినే పురుగు:

 • 2 మి.లీ. క్వినాల్ ఫాస్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక:

 • 2 మి.లీ. డైమిథోయేట్ లేదా 2.5 మి.లీ. క్లోరోపైరిఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
 • వేరుశనగలో టిక్క ఆకుమచ్చల తెగులు నివారణకు, 1 గ్రా. కార్బండజిమ్ లేదా 2 గ్రా. క్లోరోథాలోనిల్ లేదా 2 మి.లీ. హెక్సాకొనజోల్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
 • రబీ నారుమళ్ళలో నారుకుళ్ళు నివారణకు 3 గ్రా. కాపర్-ఆకి-క్లోరైడ్ మందును లీటరు నీటిలో కలిపిన ద్రావణంతో నారుమళ్ళను_బాగా తడపాలి.
 • వివిధ కూరగాయ పంటలలో తెల్ల దోమ, పేనుబంక, తామరపురుగుల నివారణకు

తెల్ల దోమ:

 • 2 మి.లీ. ట్రైజోఫాస్ లేదా 0.2 గ్రా. అసిటామిప్రిడ్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

పేనుబంక:

 • 2 మి.లీ. డైమిథోఎట్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

తామర పురుగులు:

 • 1.5 గ్రా. ఎసిఫేట్ లేదా 2 మి.లీ. ఫిప్రోనిల్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో వివిధ పంటలను ఆశించటానికి ఆస్కారం ఉన్న చీడపీడలు:

 • కందిలో ఆకుచుట్టు పురుగు, మారుక మచ్చల పురుగు
 • కుసుమలో అకుతినే పురుగు, పేనుబంక
 • వేరుశనగలో టిక్క అకుమచ్చ తెగులు
 • కూరగాయ పంటలలో తెల్లదోమ, పేనుబంక, తామర పురుగులు
 • గొర్రెలలో చిటుకు, మశూచి వ్యాధి
2.99530516432
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు