హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / వేసవికి పశుగ్రాసం నిల్వ సిద్దంకు ముఖ్య పద్ధతులు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

వేసవికి పశుగ్రాసం నిల్వ సిద్దంకు ముఖ్య పద్ధతులు

అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్దతులలో నిల్వ చేయవచ్చు.

పశు గ్రాసాన్ని పండించుకోవడం ఎంత ముఖ్యమో అదే విధంగా మీ దగ్గర మిగిలి పోయిన పశు గ్రాసాన్ని నిలవ చేసుకోవడం కూడా అంతే ఉపయోగం. అనువైన కాలంలో ఎక్కువగా లభించే పశుగ్రాసాన్ని వివిధ పద్దతులలో నిల్వ చేయవచ్చు. ఇటు నిలువ చేసిన గడ్డిని, పశుగ్రాస కొరత ఉండే ఎండాకాలంలో మార్చి నుంచి జులై మాసం వరకు పశువులకు మేతగా ఉపయోగించవచ్చును. పశుగ్రాసాన్ని నిలువ చేసే పద్ధతులు రెండు విధాలు.

 1. 'హే' గా తయారు చేయడం
 2. 'సైలేజి' తయారు చేడయం

‘హే' గా తయారు చేయడం

 • ధాన్యపుజాతిగడ్డిని గాని, గడ్డిజాతి పంటలను గానీ, లేదా పప్పుజాతి పంటలను గాని, పూతదశ కంటే ముందు దశలో కోసి, వాటిని ఎండబెట్టి, కొరత కాలంలో వాడుకోవడాన్ని 'హే' గడ్డి, లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఆకులు, కొమ్మలతో తడిలేకుండా ఉంటుంది.
 • ఎక్కువగా ఉన్న పశుగ్రాసాన్ని నిలువ చేసే పద్దతుల్లో ఇది చాలా తేలికయినది. ఈ పద్ధతితో గ్రాసంలోని నీటి శాతం బాగా తగ్గేవరకు దానిని ఎండనివ్వాలి. పూయడం, బూజు పట్టకుండా ఉండేలా తేమ శాతాన్ని తగ్గించాలి. పప్పుజాతి గ్రాసాలతో కలిపి లేదా కలపకుండా 'హే' ను తయారు చేయవచ్చును. “హే' ను రెండు రకాలుగా తయారు చేయవచ్చు.

సాధారణ పద్ధతిలో:

 • పొలంలోనే పనలుగా వేసి గడ్డిని సాగనిస్తారు. ఈ పద్ధతిలో గడ్డి బాగా ఎండుతుంది.
 • ఈ పద్ధతిలో 'హే' తయారు చేయడానికి పంటను మంచు బిందువులు అన్ని ఆవిరి అయిన తర్వాత మాత్రమే కోయాలి.
 • కోసిన గడ్డిని పొలంలోనే ఆరనివ్వాలి. ప్రతి 4-5 గంటలకు ఒకసారి బోద పనలను తిప్పుతూ ఉండాలి.
 • తేమ శాతం 40% వరకు వచ్చిన తర్వాత తేలికగా ఉండే కుప్పలుగా వేయాలి. తరువాత రోజు మళ్ళీ తేమ శాతం 25% వచ్చే వరకు వాడనివ్వాలి. ఇలా ఎండిన గడ్డిని సుమారు 20% తేమ ఉండేలా చూసుకొని నిలువ చేసుకోవాలి. వర్షాకాలంలో షెడ్ లలో ఈ గడ్డిని వాడబెట్టి 'హే' తయారు చేయాలి.

యాంత్రిక పద్ధతి:

 • ఈ పద్దతిలో ఇనుప కంచెలను ఉపయోగించి తయారు చేసిన ఫేములలో గడ్డిని ఎండబెడతారు. బర్సీం, లూసర్న్ గడ్డిని ఈ విధంగా ఎండబెట్ట వచ్చును. ఇలా ఎండ బెట్టడం వల్ల 2-3 శాతం మాంసకృత్తులు మాత్రమే నష్టం అవుతాయి.
 • ఆలస్యంగా కోతలు కోయడం వల్ల పోషకాలు తగ్గుతాయి. పప్పుజాతి మొక్కలలో కోతదశలో, ఆకులు, కాయలు ఎండి రాలిపోతాయి. వాడ బెట్టడం వల్ల కెరోటిన్, క్లోరోఫిల్ పరిమాణం తగ్గిపోతుంది.

'సైలేజి' తయారు చేయడం

 • పచ్చిగా ఉండే పశుగ్రాసాన్ని ముక్కలుగా చేసి, గాలి లేకుండా పులియబెట్టి, నీరు కూడా లేకుండా ఉండే స్థితిలో నిలువ చేయడాన్ని 'సైలేజి' అని అంటారు. ఆక్సిజన్ కూడా లేని పరిస్థితిలో నిలువ చేయడం వల్ల, పశుగ్రాసంలోని నీటిలో కరిగే పిండిపదార్థాలన్నీ, ఆర్గానిక్ ఆమ్లాలుగా మారి, గ్రాసం ఆమ్ల పరిమాణాన్ని పెంచుతాయి.
 • ఈ పరిస్థితులలో బాక్టీరియా, శిలీంధ్రాలు పెరగలేవు. దీనివల్ల పోషకాహార నష్టం జరగకుండా నాణ్యత పెరుగుతుంది. పశువులు దీనిని చాలా ఇష్టంగా తింటాయి. బాగా అరిగించుకుంటాయి.
 • సైలేజీ నాణ్యత గడ్డిలోని ఎండు పదార్థం, కరిగించబడే తీపి పదార్థాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే ముడి మాంసకృత్తులకు తీపి పదార్థాల నిష్పత్తి కూడా చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. పంటను 50 శాతం పూతదశలో కోసినపుడు, లేదా పాలదశలో కోసినపుడు తయారు చేసే 'సైలేజి' మంచి నాణ్యతను కలిగి ఉంటుంది.
 • మొక్కజొన్న, జొన్న, సజ్జ, మొదలగు పంటలను 50% మాత దశలో కోని సైలేజీకి ఉపయోగించాలి. నేపియర్ గడ్డి అయితే 45-50 రోజుల వ్యవధిలో, ఇతర గడ్డిని కూడా పూత దశలో కోసి సైలేజీకి ఉపయోగించాలి.
 • నీటి ఊటలేని ఎత్తైన ప్రదేశంలో పాతర తవ్వి వాటి అడుగు భాగాన, పక్కలకు సిమెంటు గోడలు కట్టాలి. చాఫ్ కట్టర్ తో సన్నగా నరికిన మేతను పాతరలో నింపి, ట్రాక్టరుతో నడిపి పాతరలో గాలి లేకుండా చేయాలి. ప్రతి టన్ను గడ్డికి 2-3 కిలోల బెల్లపు మడ్డి, 2 కిలోల రాతి ఉప్పు పొరల మధ్య చల్లాలి.
 • పాతరను భూమికి 2-3 అడుగుల ఎత్తు వరకు నింపి, దానిపై మందపాటి పాలిథీన్ షీట్ లేదా వరిగడ్డిని గాని పరచి మట్టి, పేడ మిశ్రమంతో పూత పూసి (అలికి) ఏ మాత్రం గాలి. వర్షపు నీరు పాతరలోకి పోకుండా జాగ్రత్త పడాలి. గోతులను నింపే ముందు గోతుల అడుగు భాగం పక్కలకు వరిగడ్డి వేసిన ఎడల పాతర గడ్డి వృథాకాకుండా ఉంటుంది.
 • లేనిచో గాలి, నీరు సోకిన పాతరగడ్డి బూజుపట్టి చెడిపోతుంది. ఇలా నిలువ చేసిన గడ్డి త్వరగా రసాయనిక మార్పుకు గురవుతుంది. మంచి గడ్డి లేత పసుపు పచ్చ రంగులో మగ్గిన పండ్ల సువాసనతో తేమను కలిగి ఉంటుంది. చెడిపోయిన మాగుడు గడ్డి : ముదురు గోధుమ రంగు లేదా నలుపు రంగుతో పులుపు వాసన కలిగి ఉంటుంది.

పచ్చిమేత (సైలేజి)గా నిల్వ చేయడం:

 • సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో అధిక దిగుబడినిచ్చే పచ్చిమేతను గుంతల్లో పాతరవేసి నిల్వ చేయటాన్ని సైలేజి అంటారు. భూమిలో గుంత తీసి పచ్చిమేతను నిల్వచేయడం చాలా తేలికయిన పని. మూడు నెలల్లో 5 పాడి వశువులకు 12 టన్నుల సైలేజి అవసరమవుతుంది.
 • ఒక ఘనపడుగు గుంతలో తయారు చేయబడ్డ సైలేజి బరువు 15 కిలోలు ఉంటుంది. 15 టన్నుల సైలేజి తయారు చేయడానికి 1000 ఘనపు అడుగుల పాతర కావాలి. ఇందుకొరకు 8 అడుగుల వెడల్పు, 5 అడుగుల లోతు, 25 అడుగుల పొడవు గల గుంతను తవ్వుకోవాలి.
 • సైలేజి చేయడానికి పచ్చిమేతలో 60 శాతం మించి నీరు ఉండరాదు. మొక్కజొన్న, జొన్న, సజ్జ పంటలను కంకి గింజ గట్టి పడుతున్న సమయంలో, నేపియర్ గడ్డిని ముదరనిచ్చి సైలేజి చేయడానికి వాడుకోవాలి.

సైలేజి ఎలా వాడాలి?

 • అలవాటు పడేవరకు పశువులు సైలేజిని తినకపోవచ్చు. పాలు పితికిన తర్వాత లేదా పాలు పిండడానికి నాలుగు గంటల ముంద పశువులకు మేపాలి. లేకపోతే పాలకు సైలేజి వాసన వస్తుంది. పాడిపశువు ఒక్కింటికి సుమారుగా 20 కిలోల సైలేజిని ఇతర ఎండుమేతతో కలిపి మేపాలి.

సైలేజి ఎప్పుడు తీయాలి?

 • పాతర వేసిన గడ్డి రెండు మూడు నెలలకు మాగి కమ్ముటి వాసన కలిగిన సై లేజీగా తయారవుతుంది. దీన్ని అవసరాన్ని బట్టి ఎప్పుడైనా తీయవచ్చు. అవసరం లేకుంటే 2-3 సంవత్సరాల వరకు చెడిపోకుండా సైలేజిని , నిలువ ఉంచుకోవచ్చు.
 • సైలేజి గుంత తెరిచిన తరువాత నెలరోజులలోపు వాడుకోవాలి. లేకపోతే ఆరిపోయి చెడిపోతుంది. మొత్తం కప్పునంతా ఒకసారి తీయకుండా ఒక పక్క నుంచి బ్రెడ్ ముక్కలు లాగా తీసి వాడుకోవాలి.

పాడి పశువులున్న రైతుకు 4 నెలల వరకు సైలేజిని మేపాలంటే తయారు చేసుకోవలసిన సైలేజి పరిమాణం:

 • మొక్కజొన్న పంటతో రైతు సైలేజీని పరిమాణాన్ని, సైలేజి గుంతలను ఈ కింది విధంగా లెక్కించవచ్చు. ఒక ఘనపుటడుగు గుంతలో తయారు చేయబడిన సైలేజీ బరువు 15 కిలోలు.
 • సైలేజి అందించాల్సి ఉండే కాలం (మార్చి నుండి జూన్ వరకు) - 4 మాసాలు
 • ఒక పశువుకు రోజుకు ఇవ్వాల్సిన సైలేజి పరిమాణం – 20 కొలోలు
 • 10 పశువులకు 120 రోజులకు కావలసిన సైలేజి 24,000 కిలోలు (120 రోజులు X 20 కిలోలు X 10 పశువులు)
 • ఒక ఎకరం విస్తీర్ణంలో మొక్కజొన్న పశుగ్రాస దిగుబడి సుమారుగా - 20,000 కిలోలు
 • 24,000 కిలోల మొక్కజొన్న పశుగ్రాసం సాగుచేయడానికి కావాల్సిన విస్తీర్ణం - 1.25 ఎకరాలు
 • 15 కిలోల పచ్చిమేతను సైలేజిగా తయారీకి కావలసిన స్థలం -1 ఘ. చ. అ
 • 15 కిలోల పచ్చిమేతను సైలేజి తయారీకి కావలసిన స్థలం -1 ఘ. చ. అ
 • 24,000 కిలోల పచ్చిమేతను సైలేజి తయారీకి కావలసిన స్థలం - 1600 ఘ. చ. అ
 • 1 నెలకు కావలసిన సైలేజి గుంత తయారీకి కావలసిన గుంత పరిమాణం - 400 ఘ. చ. అ. కావలసిన ఒక గొయ్యి సైజు పొ 20” X వె 10” X లోతు 4 (6000 కిలో సైలేజీ పరిమాణం)
 • సైలేజి పాతర తెరిచిన నెల లోపు వాడుకోవాలి. కాబట్టి ఈ సైజులో 4 గొయ్యిల్ని తయారు చేసుకొని, ప్రతి నెల ఒక గోతిని మాత్రమే తీసి ప్రతిరోజు ఒక పశువుకు 20 కిలోల చొప్పున 30 రోజులు అందించాలి. ఈ విధంగా ఎలాంటి న వున్య లేకుండా అందించడం సాధ్యమవుతుంది.
2.99416909621
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు