హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / వ్యవసాయంలో స్త్రీల శ్రమ తగ్గించుట - సాంకేతిక పరిజ్ఞానం
పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

వ్యవసాయంలో స్త్రీల శ్రమ తగ్గించుట - సాంకేతిక పరిజ్ఞానం

మహిళా శ్రామికుల పని సామర్థ్యం పెంచి వారి శ్రమ ను తగ్గించాలన్న ఉదేశ్యంతో ఈ సమాచారాన్ని క్రింద పొందుపరుస్తున్నాం.

వ్యవసాయ క్షేత్రాలలో స్త్రీలు రోజుకు సుమారు 7 నుండి 8 గంటల పాటు పనిలో నిమగ్నమై ఉంటారు. పనిలో సాంకేతిక పనిముట్లను తక్కువగా వాడటం శారీరక సామర్థ్యంతో ప్రధానంగా పనులను నిర్వహించడం వల్ల స్త్రీలు అధిక శ్రమ, అలసట చెందుతుండడమే కాక, పనులు సకాలంలో నిర్వహించ లేకపోతున్నారు. ద్వితీయ వ్యవసాయ ఉత్పత్తుల నిర్వహణలో కూడా సాంకేతికరణ అందుబాటులో లేక పెట్టుబడికి, రాబడికి మధ్య వ్యత్యాసం పెరిగి వ్యవసాయం ఈ రోజు లాభసాటి ఉపాధిగా కొనసాగించే పరిస్థితిలో లేదు. స్త్రీలు అధిక సంఖ్యలో పనిచేసే వ్యవసాయ పనులలో శారీరక శక్తి వినియోగం కన్నా వృధా ఎక్కువ అవుతోంది. మహిళా శ్రామికుల పని సామర్థ్యం పెంచి వారి శ్రమ ను తగ్గించడంలో ఉపయోగపడే ఆధునిక వ్యవసాయ పనిముట్లపై పరిచయం, పరిజ్ఞానం పెంపొందించాలనే ఉద్దేశ్యంతో సమాచారాన్ని క్రింద పొందుపరుస్తున్నాం.

వరి పంటకు అనువైన పరికరాలు

వరి విత్తనం నేరుగా భూమిలో నాటు యంత్రం

రైతు వారీ పద్ధతిలో వరినాట్లు వేసేందుకు అధిక సంఖ్యలో మహిళా శ్రామికులు అవసరం అవుతారు. అదనులో చేయవలసిన ముఖ్యమైన పని కావడం వల్ల స్త్రీలు వంచిన నడుము ఎత్తకుండా అనేక గంటల పాటు శ్రమించాల్సి ఉంటుంది.

మహిళా నేతృత్వంలో సాగుబడి చేసే తేలికపాటి నేలలు గల వ్యవసాయ క్షేత్రాలలో వరి నాటు యంత్రాలను, నర్సరీ పెంచి, నాట్లు వేసే విధానానికి ప్రత్యామ్నాయంగా వాడవచ్చు. వరి నాటు యంత్రాన్ని ఉపయోగించి, మొలకెత్తించిన వరి ధాన్యాన్ని భూమిలో సాళ్ల ప్రకారం నేరుగా నాటే వీలుంది. ఈ నాటు యంత్రానికి గల పొడవైన పిడి వలన నడుముపై భారము తగుతుంది. ఇద్దరు మహిళలు తేలికగా నడిపే వీలుంది. పని కాలంలో 51 శాతం ఆదా అవుతుంది. నాట్ల సమయంలో వచ్చే నడుము నొప్పి, తల తిరగడం వంటి ఇబ్బందుల నుండి స్త్రీలకు మినహాయింపు లభిస్తుంది. ధర సుమారు రూ. 6500/- నుండి రూ.7000/- వరకు ఉంటుంది.

ఎరువులను వెదజల్లే పరికరం

రైతు వారీ పద్ధతిలో వరి పంటలో ఎరువులను చేతితో వెదజల్లడం తెలిసిందే. దీని వలన ఎరువు సరిగా వ్యాపించక వృధా అయ్యే అవకాశం ఉంది. ఎరువును వెదజల్లే పరికరం, చిన్నసైజు స్పేయరు వలె ఉండి, శరీరంపై అమర్చుకునే వీలుంటుంది. పిడిని త్రిప్పతూ ఈ పరికరం ద్వారా ఎరువులను సమాన పరిమాణంలో జల్లుకోవచ్చు.

మేలు రకం కొడవలి

ఇది సాంప్రదాయ కొడవలికి భిన్నంగా ఉండే ఆధునిక కొడవలి. తేలికగా ఉండటం, పదును ఎక్కువ కాలం నిలిచి ఉండటం, కోత సులభతరం కావడం అన్నది దీని ప్రత్యేకత, కోతలకు ఉపక్రమించే ఫ్రీలు సాధారణంగా స్థానికంగా తయారయ్యే కొడవళ్ళనే వాడుతూ ఉంటారు. అందువల్ల అవి త్వరగా తమ పదునును కోల్పోయి, కోత కష్టం అవుతుంది. తద్వారా భుజాలపై అధిక శ్రమ కలుగుతుంది. ఈ నాణ్యమైన కొడవలితో ఎక్కువ శ్రమ లేకుండానే పంటను కోయడం వీలవుతుంది. కొడవలి పిడి బాగుండడం వల్ల చేతితో కొడవలిని పట్టుకోవడం సులభంగా ఉంటుంది.

ధాన్యాన్ని శుద్ధి చేసే మోటారు యంత్రం

ఈ యంత్రం పెడల్ తోనూ, మోటారు సహాయంతోను రూపొందించబడినది. ఇవి చిన్నరైతులకు అనువైన యంత్రాలు, ధాన్యం శుద్ధి చేయడం, నాణ్యత వారీగా వేరు చేయడం ఈ యంత్రం ద్వారా వీలవుతుంది. ముఖ్యంగా మహిళలు ఎక్కువ శ్రమ పడకుండా ధాన్యాన్ని శుద్ధి చేయగలుగుతారు. ఒక రోజుకు నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ళ ధాన్యం దీని ద్వారా శుద్ధి చేయవచ్చు. దీనికయ్యే విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువ. ఇది 0.5 హార్స్ పవర్ మోటరు ద్వారా నడిపించవచ్చు.

వ్రేలాడే జల్లెడ

ఇది ధాన్యాన్ని శుద్ధి చేసే పరికరం. మార్కెట్కు పంపడానికి ముందు ధాన్యాన్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇది నాలుగు తాళ్ళ సహాయంతో పై కప్పుకు వ్రేలాడుతూ ఉంటుంది. పరికరాన్ని చేతితో నడుపుకొని చాలా సులువుగా ఒక గంటలో సుమారు యాభై కిలోల ధాన్యాన్ని శుద్ధి చేసేందుకు వీలవుతుంది. పొలాల్లో విద్యుచ్చక్తి లేనప్పడు ఈ వ్రేలాడే జల్లెడ ఎంతో లాభ దాయకంగా ఉంటుంది.

పంట నూర్పిడి యంత్రం

ఇది పంటలను నూర్చేందుకు రూపొందించి బడిన యంత్రం. కాలితో తొక్కుతూ దీన్ని తిప్పడం ద్వారా వరి పంటను నూర్చడం ఈ యంత్రం ప్రత్యేకత. ఈ యంత్రాన్ని వాడడం ద్వారా సాంప్రదాయ పద్ధతి కన్నా ఎంతో త్వరగా పని పూర్తవ్వడమే కాక, నలభై శాతం వరకు స్త్రీల శ్రమ, సమయం ఆదా అవుతాయి. వరి, ప్రొద్దుతిరుగుడు మొదలైన పంటల ఆధారంగా నడిచే యంత్రాలు కూడా ఉన్నాయి.

మెట్ట సాగులో అనువైన పరికరాలు

సీడ్ డ్రిల్

ఇది విత్తనాలను సులువుగా నాటేందుకు తయారు చేయబడిన చేతితో నడిపే యంత్రం. పొలంలో విత్తనాలు నాటేందుకు ఇది ఎంతో సమర్థవంతంగా పని చేస్తుంది. మహిళలు తేలికగా వాడేందుకు అనువుగా ఇది రూపొందించబడింది. మొక్కల మధ్య సరైన దూరం వుండేలా మొక్కజొన్న ఆముదం వంటి విత్తనాలు నాటేందుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

మేలు రకం కలుపు పరికరాలు

సాళ్ళలో పెరిగిన కలుపు తీసేందుకు స్త్రీలు మోకాళ్ళు వంచి కూర్చుని, కూర్చాలను ఉపయోగించి పని చేస్తారు. చక్రాల దంతిని వాడడం ద్వారా మోకాళ్ళ పైనా, నడుము పైన ఏ మాత్రం వత్తిడి కలుగకుండా, నిలుచుని కలుపు మొక్కలను ఏరడం సులభమౌతుంది. ఈ కలుపు తీసే పరికరాలలో వరి పొలంలో వాడే క్రోనోవీదరు, మెట్ట పొలంలో వాడే దంతులలో అవసరాన్ని బట్టి "వి" ఆకారం బ్లేడును వివిధ దూరాలలో అమర్చిన 8 మొనలు గల బ్లేడ్లను రోక్ వంటి బద్దీలను అమర్చుకుని వాడుకోవచ్చు. అంతే కాకుండా, పొడవైన పిడితో నిలుచుని కలుపు తీసే త్రిశూల్ వీడర్ మొదలైనవి కూడా బాగా పనిచేస్తాయి.

హార్వెస్ట్ బ్యాగ్

సాధారణంగా ప్రత్తి తీసేందుకు, ఆమదాలు ఏరేటప్పడు అదే విధంగా కోసిన కాయలని ఒక దగ్గరకు చేర్చేందుకు స్త్రీలు తమ చీర చెంగులతో ఒడి ఏర్పరచుకొని అందులో వేస్తుంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా, కోసిన వంటను వేసేందుకు రూపొందించిన ఈ రకమైన సంచిని భుజాలకు తగిలించుకోవడం ద్వారా రెండు చేతులను ఉపయోగించి గింజలను కోయగలగడమే దాని ప్రత్యేకత. అంతే కాక సంచి బరువు వీపుపై సమానంగా పడే వీలు ఉంటుంది. పూలు, కూరగాయలు తెంపి వేసుకునేందుకు కూడా అనువైన సంచులు తయారు చేయబడ్డాయి.

వేరుశనగ కాయలు తొక్క ఒలిచే యంత్రం

వేరుశనగను సులువుగా ఒలిచేందుకు రూపొందించబడిన యంత్రం. ఇది ఒక అర్ధ చంద్రాకారపు పాత్రను కలిగి ఉంటుంది. దీని హ్యాండిల్కి ఒక ఇనుప పాదం అమర్చబడి ఉంటుంది. వేరుశనగ కాయల నుండి గింజలు వేరుచేయడం శ్రమతో కూడిన పని. ఈ యంత్రం ద్వారా ఒక గంటకు యాభై కిలోల చొప్పన వేరుశనగ పప్పును ఒలిచేందుకు వీలవు తుంది. గింజ విరగకుండా వేరు చేయబడటం, మహిళలు ఎక్కువ శ్రమ పడకుండానే పని చేయగలగటం దీని ప్రత్యేకత. దీనితో ఆముదపు కాయల నుండి కూడా గింజలను వేరు చేయడం ఎంతో సులభం.

మొక్కజొన్న గింజలు ఒలిచే పరికరం

మొక్కజొన్నలను చేతితో ఒలవడం స్త్రీలకు అధిక శ్రమను, చేతుల, కండరాల నొప్పలను కలిగిస్తుంది. ఈ పరికరం వాడటం ద్వారా వారి శ్రమను గణనీయంగా తగ్గించవచ్చు. ఇది ఒక గొట్టం వంటి ఆకారం గల పరికరం. దీనిలో ఉండే సులువుగా మొక్కజొన్నను ఒలిచేందుకు సహాయ పడతాయి. ఈ పరికరం ఉపయోగించి ఒక్కొక్క మహిళ రోజుకి ఒకటిన్నర క్వింటాళ్ళ మొక్కజొన్నను ఒలవవచ్చు.

పవర్ వీడర్

దీన్ని కలుపు తీయడానికి డీజిల్ సహకారంతో నడుపుతారు. చేతితో కలుపు తీయు పరికరం తక్కువ పొలం ఉన్న వాళ్ళకి మాత్రమే పనికి పొలమైన వాడవచ్చు. గడ్డి తీయడానికి మొక్కలను పెరకడానికి అందరి పంటలో కలుపు తీయడానికి వేరే వేరే బ్లేడ్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి కావలసిన బ్లేడ్లు బిగించవచ్చు. ఇది తక్కువ డీజిల్ తో ఎక్కువ పనిచేస్తుంది. శ్రమ తక్కువ. వంగనవసరం లేకుండా ఎన్ని గంటలైనా పనిచేయవచ్చు.

ఫర్టిలైజర్ బ్రాడ్కాస్టర్

ఇది పొలంలో ఎరువు చల్లడానికి ఉపయెగపడుతుంది. యూరియా మరియు వర్మీ కంపోస్ట్ లాంటి పొడిగా ఉండే ఎరువులు వెయ్యడానికి మాత్రమే వాడాలి. ఎరువు దీనితో చల్లినప్పుడు నామానంగా పడుతుంది. అదే చేతితో వేసినప్పుడు ఒకచోట ఎక్కువగా, ఒక చోట తక్కువగా పడుతుంది. దీంట్లో 10 కిలోల వరకు నింపి ఎంత దూరం వరకు పడాలో కూడా సర్దుబాటు చేసుకోవచ్చు గుండ్రంగా ఉన్న ఉబ్బలో ఎరువు నింపి బెల్టును నడుముకు కట్టుకోవాలి. ఒక వైపు లివర్ ఉంటుంది దాని తిప్పుతూ పొలంలో నడుస్తూ ఉంటే ఎరువు 4 అడుగుల దూరం వరకు పడుతుంది.

కూరగాయలు, పూల సాగులో స్త్రీలకు అనువైన పరికరాలు

నారు నాటు పరికరము (చేతి పరికరము)

టమాట, మిరప, వంగ మొదలైన కూరగాయ పంటలలో నారు మొక్కలను రైతు మహిళలు నడుము వంచి, చేతితో భూమిలో నాటుకుంటారు. ఈ పని ఎంతో శ్రమతో కూడినది. అదనులో పూర్తి చేయవలసిన ఈ పనికి స్త్రీలు తమ శక్తిని, కాలాన్ని వెచ్చిస్తుంటారు.

నారు నాటు యంత్రం

ఈ పరికరము రైతు మహిళల కోసం తయారుచేయబడినది. ఈ నారు నాటు యంత్రం గొట్టంవలె ఉండి మహిళలకు సులువైన పద్ధతిలో విత్తనం భూమిలో నాటుటకు ఉపయోగపడుతుంది. సాధారణంగా విత్తనం వేసేందుకు అధిక సంఖ్యలో మహిళా శ్రామికులు అవసరం అవుతారు. ఈ యంత్రాన్ని ఉపయోగించడం ద్వారా నేరుగా సులభపద్ధతిలో భూమిలో విత్తనం కాని, నారు కాని నాటవచ్చు. కేవలం ఒకరు లేదా ఇద్దరు మహిళల సహాయంతో సులువుగా విత్తనాలను నాటడం వీలౌతుంది. దీని మూలంగా మహిళల శ్రమ, సమయం ఆదా అవటమే కాక అదనులో పని త్వరగా పూర్తవుతుంది. ఈ పరికరం వాడటం ద్వారా స్త్రీలు వంచిన నడుము ఎత్తకుండా అనేక గంటల పాటు శ్రమించాల్సిన అవసరం లేదు.

ట్రాక్టరు సహాయంతో కూరగాయల మొక్కలను నాటే యంత్రం

ఇది కూరగాయల మొక్కలను నాటే యంత్రం. కూరగాయల పెంపకం చాలా శ్రమతో కూడుకున్న పని. అధిక ఆదాయాన్నిచ్చే కూరగాయల పెంపకంలో మహిళలు పడే శ్రమ కూడా దీనిని మించి ఉంటుంది. ఈ కూరగాయల మొక్కలను స్త్రీలు చేతితోనే నాటుతూ ఉంటారు. కూరగాయల మొక్కలను నాటే యంత్రాన్ని ట్రాక్టరు సహాయంతో ఉపయోగించడం ద్వారా సమయాన్ని శ్రమనీ గణనీయంగా ఆదా చేసుకోవచ్చు. క్యాబేజి, మిర్చి, కాలీఫ్లవర్ మొదలైన మొక్కలను ఈ యంత్రం ద్వారా పొలంలో నాటుకోవచ్చు. ఈ కూరగాయల మొక్కలని నాటే యంత్రం ద్వారా రోజుకు 0.5 హెక్టార్ల పొలంలో మొక్కలను నాటుకోవచ్చు.

కూరగాయలు, పూలు తెంపే పరికరాలు:

రైతువారీ పద్ధతిలో బెండకాయలు, వంకాయలు వంటి నూగు కలిగిన కూరగాయలను, పూలను త్రుంచే పనిలో ఎక్కువగా పిల్లలు, మహిళలు పాల్గొంటారు. నూగు, ముళ్ల వల్ల చేతి వ్రేళ్లకు రంధాలు, గాయాలు కలుగుతూ పనిలో సౌలభ్యం తగ్గి, జాప్యం పెరుగుతుంది. ఎటువంటి రక్షణ తొడుగులు లేకపోవడం, చిన్న బ్లేడు వంటి త్రుంచే పరికరాలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం.

రింగ్ కట్టర్ /ప్లయిర్ కట్టర్

రింగ్కట్టర్ ను సులభంగా వ్రేళ్ల మధ్య ధరించవచ్చు. చివరున్న చిన్న బ్లేడు సహకారంతో సులభంగా కాయలను, పూలను తెంచవచ్చు. ఫ్లయిర్ కట్టర్ కూడా కత్తెర వంటి చిన్న తరహా చేతి పరికరం. సమయంలో 20 శాతం ఆదాతో, సులభంగా ఉపయోగిసూ చేతి వ్రేళ్లకు గాయాలు కాకుండా పనిచేయవచ్చు. రింగ్ కట్టర్లు మార్కెట్లో జత రూ. 50/- చొప్పన లభిస్తాయి.

ఫింగర్ గార్డ్స్

వేలి మొనలకు ధరించే చిన్న రక్షణ తొడుగులు గోళ్లలో ఇరుక్కునే పూలరసి, నూగు, రసాయనిక మందుల వల్ల మండడం లాంటి అసౌకర్యం నుండి రక్షణగా ఉపయోగపడతాయి.

గౌజులు

వివిధ రకాల మిల్టిన్స్, గౌజులను కూడా రైతు మహిళలు కుట్మకొని చేతులకు రక్షణగా ఉపయోగించవచ్చు. సమయంలో ఆదా, వనిలో చురుకుదనం వీటి వలన పెరుగుతుంది.

టిల్లర్

టిల్లర్ ను తెలుగులో నేలను సాగు చేయు పరికరం అని కూడా అంటారు. దీనిని భూమి పదును చేయడానికి వాడుతారు. ముఖ్యంగా గట్టిగ ఉన్న నేలలను పదును చేసి మట్టిని తిరగతోడుతుంది. దానితో మొక్కలకు కావలసిన సుష్మపోషకాలు, సేంద్రియ పదార్ధాలు భూమి లోపలికి వెళ్ళిపోతాయి.

ఈ టిల్లర్ తేలికగా మెసుకెళ్లడానికి అనువుగా ఉంటుంది. ఇది డీజిల్ తో నడువబడుతుంది. ఇది అయిపోయిన తర్వాత స్లొర్ చేయాలంటే ఎక్కువ స్ధలం కూడా అవసరం లేదు. ముఖ్యంగా ఇది చిన్న, సన్నకారు రైతులకు బాగా ఉపయెగపడుతుంది. కూరగాయలు, పులా తోటల్లో రెండు సళ్ళ మధ్య దూరం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది మొక్కలను పాడు చేయకుండా వాడటానికి ఉపయెగపడుతుంది.

ఇతర పరికరాలు

బంగాళాదుంపల తొక్క తీసే యంత్రం

ఇది బంగాళా దుంపల నుండి తొక్కను వేరు చేసే యంత్రం. చేతితో బంగాళాదుంపల తొక్కను తీసూ శ్రమ పడే మహిళల ఉపయోగార్థం రూపొందించబడింది. గ్రామీణ ప్రాంతాలలో బంగాళాదుంప చిమ్స్ తయారుచేసే పరిశ్రమలలోని మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరమైన యంత్రం. దీనిలో బంగాళాదుంపలను వేసి చేతితో త్రిప్పడం ద్వారా గంటకు సుమారు ముప్పై కిలోల దుంపల నుండి తొక్కను వేరు చెయ్యవచ్చు. దీని ద్వారా మహిళల అధిక శ్రమ నివారించబడుతుంది.

చిప్స్ తయారు చేసే యంత్రం

ఇది చేతితో పనిచేసే చిప్స్ తయారీ యంత్రం. దీనిలోని నాలుగు సిలెండర్లలలో బంగాళాదుంపలను నింపి, దీనిని తిప్పడం వల్ల పరికరం అడుగున అమర్చబడిన పదునైన బ్లేడ్లు బంగాళాదుంపలను పలుచని చిప్స్గా క్షణాల్లో తరిగేస్తాయి. ఆవిధంగా గంటకు ముప్పై క్రిలోల చిప్స్ చొప్పన తయారవుతాయి.

పాలు పితికేందుకు ఉపయోగపడే పీట (మిల్కింగ్ స్టాండ్, సూల్)

ఇది పాలను పితికేటప్పడు స్త్రీలు సుఖంగా కూర్చునేందుకు రూపొందించబడినది. సాధారణంగా స్త్రీలు ముని వేళ్ళపై ఏ ఆధారం లేకుండా కూర్చొని, తమ మోకాళ్ళ మధ్యలో ఒక పాత్రను ఉంచుకుని దానిలోకి పాలని పితుకుతూ ఉంటారు. శరీరం బరువంతా ముని వేళ్ళపైనా, మోకాళ్ళ పైనా పడడం వల్ల తీవ్రమైన శ్రమకు అసౌకర్యానికి గురౌతారు. ఈ ఆధునిక పీటను వాడడం ద్వారా ఆ శ్రమను నివారించవచ్చు. ఇది కూర్చునేందుకు తగినంత ఎత్తు కలిగి, ముందుకు వెనుకకూ కదిలేందుకు వీలుగా చక్రాలు బిగించబడిన పీట, ఈ పీటకు ముందు భాగంలో పాల పాత్రను ఉంచుకునేందుకు ఒక చట్రం బిగించబడి ఉంటుంది. ఈ పీటపై కూర్చుని పాలు పితకడం ఎంతో సౌకర్యంగా ఉండడమే కాకుండా స్త్రీలు త్వరగా అలసటకు గురికారు.

తలపై బరువు మోసే పరికరం (హెడ్ లోడ్ మ్యానేజర్)

అదే విధంగా వ్యవసాయ కూలీలు పశుగ్రాసాన్ని పంట చెఱుకును, నిర్మాణ కూలీలుగా పనిచేసే స్త్రీలు ఇటుకలను గంపలోకి చేర్చుకోని తలపై మోస్తూ అధిక శ్రమను పొందుతూ ఉంటారు. ఈ కోప్ తో చేసిన పరికరాన్ని నడుముకు కట్టుకోవడం ద్వారా ఇటుకల యొక్క బరువు భుజాలపై పడి, తలపై పడే భారాన్ని అధిక శాతం తగ్గిస్తుంది. తద్వారా ఇటుకలు మోసే స్త్రీలు మెడనొప్పి నుండి తప్పించుకోగలుగుతారు. ఇటుకల భారం సరాసరి తలపై పడకుండా విభజింపబడి శ్రమను తగ్గిస్తుంది.

ఆధారం : వ్యవసాయ పంచాంగం

2.99095022624
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు