పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సమగ్ర వ్యవసాయం

ప్రస్తుతం వాతావరణ పరిస్ధితులు మారాయి. కాబట్టి వ్యవసాయాన్ని సమర్ధవంతగా వినియోగించుకోవడం అత్యవశ్యం.

తెలంగాణ రాష్ట్రంలో 47 లక్షల హెక్టార్ల భూమిని వివిధ పరిస్థితుల్లో సాగు చేస్తున్నారు. మొత్తం 55 లక్షల కుటుంబ కమతాలుంటే అందులో 85% రైతులు చిన్న, సన్నకారు రైతులే. ఒకప్పుడు రైతులందరూ పంటలతో పాటు పాడిపశువులు, గొర్రెలు, మేకలు, కోళ్ళ పెంపకం చేపడుతూ ఖచ్చితమైన ఆదాయం పొందడమే కాకుండా పశువుల పేడను పొలంలో వేయడం ద్వారా భూసారాన్ని కూడా కాపాడారు. క్రమంగా వివిధ కారణాల దృష్టా పశు సంపద లేని వ్యవసాయాన్ని రైతులు చేపడుతున్నారు. కొంత మంది రైతులు, ఒకే ఒక వాణిజ్య పంట సాగుచేస్తు నష్టపోతున్నారు. కొంత మంది రైతులు, ఒకే ఒక వాణిజ్య పంట సాగుచేస్తు నష్టపోతున్నారు. ప్రస్తుతం వాతావరణ పరిస్ధితులు మారాయి. వర్షం అనుకున్న సమయానికి కావలసినంత కురవడం లేదు. కమతాలు కూడా చిన్న చిన్నవిగా అయిపోయి ఆదాయం లభించటం లేదు. కాబట్టి వ్యవసాయాన్ని సమర్ధవంతగా వినియోగించుకోవడం అత్యవశ్యం.

వివిధ వాతావరణ పరిస్దితులకు, సామజిక, ఆర్ధిక పరిస్ధితులకు అనువుగా ఉండే వ్యవసాయ అనుబంధ రంగాలను ఎన్నుకొని కలగలుపుగా వ్యవసాయం చేపట్టాలి. ఉద్యాన పంటలు, పశుపోషణ, జీవాల పెంపకం, అటవీ వ్యవసాయం మొదలైన వాటితో పాటు వ్యవసాయ వ్యర్ధాలను లేదా ఉప ఉత్పత్తులను ఉపయోగించుకుంటూ కుటీర పరిశ్రమలైన పుట్టగొడుగుల పెంపకం, అటవీ వ్యవసాయం లేదా ఉప ఉత్పత్తులను ఉపయోగించుకుంటూ కుటీర పరిశ్రమలైన పుట్టగొడుగుల పెంపకం, పట్టు పురుగుల పెంపకం, తెనేటిగల పెంపకం, వర్మి కంపోస్టింగ్, బయోగ్యాస్ యూనిట్లు వంటి వాటి పైన కూడా దృష్టి పెట్టాలి. ఈ విధంగా వ్యవసాయాన్ని అనుబంధ రంగాలతో కలిపి చేసుకోవడాన్నె సమగ్ర వ్యవసాయం అంటాము. ఇందులో ఒక వ్యవస్ధ నుండి లభించే ఉత్పత్తులు/వ్యర్ధాలు మరో వ్యవస్ధకు వనరులుగా లేదా పెట్టబడులుగా ఉపయోగపడతాయి. ఈ సమగ్ర వ్యవసాయంలో పంటలు, పశువులు, చెట్లు ముఖ్యమైనవి. రాష్ట్రంలో వివిధ సాగు పరిస్ధితులల్లో వ్యవసాయం చేపడుతున్నాం. ఆయా పరిస్ధితులు, వనరుల లభ్యతను బట్టి శాస్త్రీయ పద్ధతులలో సమగ్ర వ్యవసాయం చేపట్టవచ్చు. సాధారణంగా 70-80% భూమిలో ఆహార పంటలు వేసుకుని, మిగిలిన విస్తీర్ణంలో అనుబంధ రంగాలను ఎంచుకోవాలి.

వర్షాధార తేలిక భూములు

కేవలం నైరుతి ఋతు పవనాల ద్వారా కురిసే వర్షమే ఈ పరిస్ధితులల్లో చేసే వ్యవసాయానికి ఆధారం. రైతులు కేవలం ఖరిఫ్ జొన్న, మొక్కజొన్న, ఆముదం, వేరుశనగ, ప్రోద్దుతిరుగుడు, ప్రత్తి, కంది, పెసర, సజ్జ పంటలను సాగు చేస్తున్నారు. సగటు భూమి 2-3 ఎకరాలు. అందులో ఇంటికవసరమైన చిరుధాన్యాలు, పప్పుదినుసులు, నూనెగింజలను సాగు చేసుకోవచ్చు. ఎక్కడ సమగ్ర వ్యవసాయానికి రైతు, ఎకరా పొలంలో జొన్న+కందులు, ఒక ఎకరాలో ఆముదం సాగు చేసుకునట్లయితే, సగటున 10 టన్నుల జొన్నచొప్పు, 1 టన్ను కంది పొట్టు, 4 టన్నుల వేరుశనగ మొదళ్ళు, 4 టన్నుల రాగి మొదళ్ళు, 3 టన్నుల ఆముదం అవశేషాలు ఉత్పత్తి అవుతాయి. వీటిని వినియోగించుకొని పాడి పశువుల పోషణ చేపట్టవచ్చు. అదనంగా పొలం గట్లపైన సుబాబుల్, తుమ్మ, సేస్బేనియా, గ్లైరిసీడియ లాంటి బహువర్శికలను కూడా పెంచుకొని పచ్చిమేతను పొందవచ్చు. అదే విధంగా మెట్ట ప్రాంతంలో ఫలాలనిచ్చే రేగు, సీతాఫలం, నేరేడు మొక్కలు కూడ గట్లపైన వేసుకోవచ్చు. పశువులకు మేతగా ఉపయోగపడని పంటల వ్యర్ధాలను కల్చివేయకుండా కంపోస్ట్ గా లేదా వర్మికంపోస్ట్ గా తయారు చేసుకొని పంటలకు వేసుకోనట్లయితే భూసారాన్ని కాజ్పడుకోవడమే కాకుండా, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకోవచ్చు. ఈ విధంగా 3 ఎకరాలలో సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే సంవత్సరానికి పంటల నుండి (జొన్న+కందులు-ఒక ఎకరా, వేరుశనగ – ఒక ఎకరా, రాగులు – అర ఎకరా, ఆముదం అర ఎకరా) రూ. 35,000/- నికర ఆదాయం మరియు మేకల పెంపకం (5 ఆడ+1 మగ) నుండి రూ. 16,000/- నికర ఆదాయం, 30 పెరటి కోళ్ళ (వనరాజా/గిరిరాజా/గ్రామ ప్రియ) నుండి రూ. 9,000/- నికర ఆదాయం పొందవచ్చు.

పశువుల పేడ, ఆముదం పంట అవశేషాలు మరియు ఇతర వ్యర్ధాల నుండి 13-14 టన్నుల సేంద్రియ ఎరువులను పొందవచ్చు. ఇది 3 ఎకరాలకు సరిపోతుంది. ఈ రకంగా భూసారాన్ని కాపాడుకుంటూ, కుటుంబ ఆహార మరియు పోషక భద్రతను సాధించి, ఆదాయాన్ని క్రమబద్ధంగా సంవత్సరం పొడవునా పొందవచ్చు. ఈ పద్ధతులను పోతిన్చినట్లయితే అననూకుల వాతావరణ పరిస్ధితులలో కూడా నష్టపోకుండా వ్యవసాయాన్ని చేపట్టవచ్చు.

వర్షాధార నల్లరేగడి నేలలు

ఈ పరిస్ధితులల్లో రైతులు ప్రత్తి, మొక్కజొన్న, కంది, కూరగాయలు, పశుగ్రాస జొన్న – శనగ వంటి పంటలు విత్తుకుంటారు. ఈ విధంగా మూడు ఎక్కరలున్న రైతు వివిధ రకాల పాటలను సాగు చ్సినట్లయితే ఒక ఎకరా మొక్కజొన్న + కంది నుండి రూ. 20,000/- నికర ఆదాయం, ఒక ఎకరా ప్రత్తి నుండి రూ. 30,000/- నికరాదాయం, ఒక ఎకరా పశుగ్రసజోన్న – శనగల నుండి రూ. 20,000/- నికర ఆదాయం (మొత్తం మూడు ఎకరాల పంట సాగు నుండి రూ. 70,000/- నికర ఆదాయం) పొందవచ్చు. అలాగే పాడి పశువుల (గ్రేడేడ్ ముర్రా - 2) నుండి రూ. 16,000/- నికర ఆదాయం, మేకల పెంపకం (లోకల్ 8 ఆడ + 1 మగ) ద్వారా రూ. 20,000/- వికర ఆదాయం పెరటి కోళ్ళ (వనరాజా/గిరిరాజా/గ్రమప్రియ - 30) ద్వారా రూ. 8000/- నికర ఆదాయం వర్మి కంపోస్ట్ ద్వారా కూడా అదనపు ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా సమగ్ర వ్యవసాయం ద్వారా సుమారుగా లక్ష నలబై వేల రూపాయల వరకు నికర ఆదాయం పొందవచ్చు. పశువుల, మేకల పచ్చిమేత కోసం సుబాబుల్, తుమ్మ, గ్లైరిసిడియ మరియు సేస్బేనియా లాంటి బహువార్షికాలు కూడా గట్లపైన వేసుకోవాలి. మొక్కజొన్న, జొన్న చొప్ప, కంది పొట్టు శనగ పొట్టును జాగ్రత్తగానిల్వ చేసుకొని 3 పశువులను సమర్ధవంతంగా మేపవచ్చు. గట్లపైన బహువర్షికలు మేకలకు సరిపోతాయి. ఈ విధానంలో కూడా రైతు 3 ఎకరాలకు కావాల్సిన 15 టన్నుల సేంద్రియ ఎరువును తయారు చేసుకొని పొలంలో ప్రతి సంవత్సరం వేయడం ద్వారా ఎల్లప్పుడు నేల సారాన్ని కాపాడుకోవచ్చు.

బోరు బావుల క్రింద సాగు

నీటి వసతి ఉన్నప్పుడు తేలిక నేలల్లోను, నల్లరేగడి నేలల్లోను ప్రణాళిక బద్ధంగా ఖరిఫ్- రబీలో, పంటలు మరియు ఆధారిత అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఖచ్చితమైన ఆదాయాన్ని పొందవచ్చు. మేకల కోసం పొలం గట్లపైన సుబాబుల్, సేస్బేనియా, గ్లైరిసీడియ, తుమ్మ మొక్కలను నాటుకోవాలి. అలగే గట్ల పొడవున కరోండ మొక్కలు నాటుకున్నట్లయితే అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. ఈ తరహా వ్యవసాయంలో పరిస్ధితులు రైతుకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరం పొడవునా పని పొందడమే కాకుండా అదనంగా 400 పని దినాలను ఇతరులకు కల్పించవచ్చు. ఇంటికి కావాల్సిన తిండి గింజలతో పాటు, పశువులకు, మేకలకు, కుందేళ్ళకు, కోళ్ళకు మెత సమృద్ధిగా లభిస్తుంది. ప్రతి సంవత్సరం 15 టన్నుల సేంద్రియ ఎరువు ఉత్పత్తి అవుతుంది. కనుక దీర్ఘకాలికంగా నేల సారవంతంగా ఉంటుంది. పశువుల పేడతో గోబర్ గ్యాస్ ప్లాంట్ నెలకొల్పి, గృహ అవసరాలకు కావాల్సిన ఇంధనాన్ని, విధ్యుత్తును తయారు చేసుకోవచ్చు. ఇందుకు గాను నెడ్ కాప్ ద్వారా సబ్సిడీ కూడా పొందవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సోలార్ పంపు సెట్లను కూడా సబ్సిడీ ద్వారా ఏర్పాటు చేసుకొని విద్యుత్ సమస్యను అధిగామించి, ఖచ్చితమైన దిగుబడులను పొందవచ్చు. రైతులు వర్మికంపోస్ట్, వర్మివాష్ ను సొంతంగా తయారు చేసుకొని వాడుకోవచ్చు. అన్ని అనుబంధ రంగాలను అనుసంధానం చేసి సమగ్ర వ్యవసాయం చేపట్టినట్లయితే ఉదాహరణకు రెండున్నర ఎకరాలలో పంటల సాగు (పెసర+కంది-అర ఎకరా, రాగి-వేరుశనగ అర ఎకరా, వరి-మొక్కజొన్న-అర ఎకరా, పశుగ్రసాలు-కో-4, కో-5 మరియు లూసర్న్ గడ్డి-అర ఎకరా, కూరగాయలు-అర ఎకరా) నుండి రూ. 50,000/- నికర ఆదాయం, అర ఎకరా జామతోట నుండి రూ. 10,000/- నికర ఆదాయం, పాడి పశువుల (మేలు జాతి ముర్ర-3) నుండి రూ. 1,15,000/- నికర ఆదాయం, మేకల (లోకల్ 4 ఆడ + 1 మగ) పెంపకం ద్వారా రూ. 16,000/- నికర ఆదాయం, పెరటి కోళ్ళ నుండి (30-వనరాజా/గిరిరాజా/గ్రమప్రియ) రూ.8000/- నికర ఆదాయం, నీటితో పాటు కౌజు పిట్టలు లేదా కుందేళ్ళ వంటి పెంపకం చేపట్టినట్లయితే రూ. 50,000/- నుండి రూ. 60,000/- వరకు నికర ఆదాయం లభిస్తుంది. మొత్తం మీద సుమారుగా రూ. 2,00,000/- నుండి రూ.2,30,000/- వరకు నికర ఆదాయం పొందవచ్చు. ఈ విధంగా స్ధిరమైన రాబడిని పొందుతూ పది మందికి పనిని కల్పిస్తూ పర్యావరణాన్ని, తద్వారా మానవాళి మనుగడను కాపాడుతూ రైతు ఆర్ధికాభివృద్ధి సదించవచ్చు.

ఆయకట్టు ప్రాంతం

ప్రాజెక్టులు, చెరువుల క్రింద రైతులంతా ఎక్కవగా వరి సాగు చేస్తున్నారు. అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో మురుగు నీటి సౌకర్యం లేక వరి దిగుబడులు గణనీయంగా తగ్గుతున్నాయి. వరితో పాటు బహూవార్షిక పశుగ్రాసాలు సాగు చేసుకునే అవకాశ మున్నందున పాడి పరిశ్రమ చాలా ఆశాజనకంగా ఉంటుంది. అదే విధంగా నీటి ముంపు ప్రాంతాల్లో చేపల పెంపకం కూడా చేపట్టవచ్చు. ఈ విధంగా పంట సాగు (ఒక ఎకరా వరి-వరి) నుండి రూ. 35,000/-, ఒక ఎకరా వరి-మొక్కజొన్న నుండి రూ. 40,000/- ముప్పావు ఎకరా పచ్చిగడి లేదా ప్యారా గడ్డి నుండి రూ. 20,000/- నికరాదాయం, పావు ఎకరా కూరగాయల ద్వారా రూ. 10,000/- నికరాదాయం, పాడి పశువుల నుండి (మేలు జాతి ముర్ర-3) రూ. 1,15,000/- నికర ఆదాయం, పెరటి కోళ్ళ ద్వారా (50-వనరాజా/గిరిరాజా/గ్రామ ప్రియ) రూ. 11,000/- నికరాదాయం, కుందేళ్ళ పెంపకం లేదా పుట్ట గొడుగుల సాగు ద్వారా రూ.15,000/- నుండి రూ. 20,000/- వరకు నికర ఆదాయం మరియు ఎకరా వరి పొలం చుట్టూ, 3 మీ. వెడల్పు మరియు 1.5 మీ. లోతు కందకంలా చేసి చేపలు పెంచినట్లయితే రూ. 10,000/- నుండి రూ. 15,000/- నికరాదాయం పొందుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవచ్చు. ఈ పద్ధతిలో సాలీనా రూ. 2,50,000/- నుండి రూ. 2,75,000/- వరకు నికరాదాయం లభిస్తుంది. ఈ విధమైన సమగ్ర వ్యవసాయ విధానాల వల్ల రైతుకు ఒక వ్యవస్ధలో నష్టం వచ్చినా మరో దానిలో వచ్చే రాబడి వల్ల ఆర్ధికంగా నిలదొక్కుకోవడాని అవకాశం ఉంటుంది. వ్యవసాయ వ్యర్ధాల సమర్ధ వినియోగం జరిగి, సాగు ఖర్చు తగ్గుతుంది. వంట చెఱకు, పశుగ్రాసాల కొరత వుండదు. పశుపోషణ ఆరోగ్యవంతంగా వుంటుంది. చిన్న, సన్నకారు రైతులకు నిరంతర ఉపాధి మరియు స్ధిరమైన ఆదాయం లభిస్తుంది,. భూసార మరియు పర్యావరణ భద్రత లభిస్తుంది.

సమగ్ర వ్యవసాయంపై మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త (అగ్రానమి), సమగ్ర వ్యవసాయం పై అఖిల భారత సమన్వయం పరిశోదన విభాగం, డైమండ్ జుబ్లీ బ్లాక్ రాజేంద్రనగర్, హైదరాబాద్, ఫోన్ నెం.: 040-24017463

3.00522875817
రెడ్డి వేణు గోపాల కృష్ణ Dec 11, 2019 07:11 AM

మాగాణీ భూములలో సమగ్ర వ్యవసాయం చేపడదామనుకొనే ఔ త్సాహిక రైతుల కోసం నమూనా సమగ్ర వ్యవసాయ ప్రణాళిక సచిత్రంగా తెలియజేయగలరు

మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు