పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సర్పగంధం సాగు – మెళకువలు

ఔషధ విలువలు కలిగిన సర్పగంధం సాగు మెళకువల గురించి తెలుసుకుందాం.

సర్పగంధ (రావుల్పియ సెర్పెంటిస) అపోసైనేసియా కుటుంబానికి చెందింది. సాధారణంగా అడవి ప్రాంతాల్లో సహజ సిద్ధంగా పెరుగుతుంది. దీనిని పాతలగుడి, నల్లపాము చేరు లేదా ఇండియన్ పామునేరు అని కూడా అంటారు. సుగంధ వేరు భాగం సహజసిద్ధంగా ఔషధ విలువలు కలిగి ఉంది. అందువల్ల ఈ పంటకు మార్కెట్ విలువ చాలా ఎక్కువ ఉంటుంది. సర్పగంధ వేర్లలో రెసెర్పిన్, సెర్పెంటైన్, అజ్మలిన్ ఇంకా మరెన్నో ఔషధాలు సాధారణంగా 1.4-3 శాతం కలిగి ఉంటాయి. ఈ ఆల్కలాయిడ్స్ ను కలిగిన - సుగంధ వేర్లను రసం తీయడానికి ఉపయోగిస్తారు. అలా తీసిన రసాన్ని శుద్ధి చేసి ఆ తరువాత అధిక రక్తపోటును తగ్గించడానికి, నరాల బలహీనతకు, కంటి శుక్లాలు తగ్గించడానికి, కలరా, కుష్టి వ్యాధులు నయం చేయడానికి, హృద్రోగ నివారణకు ఇలా ఎన్నో వ్యాధులు నయం చేయడానికి వాడుతున్నారు. ఈ పంటకు మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా మంచి మార్కెట్ విలువ ఉంది.

నారుముడి పెంపకం

సుగంధ విత్తనాలలో మొలకెత్తే తత్వం త్వరగా నశించిపోతుంది గనుక తాజా పండ్లనుంచి తీసిన విత్తనాలను నాటుకోవడం ప్రయోజనకరం. పండ్ల నుంచి వేరుచేసిన విత్తనాలను ముందుగా నారుమడి పోసుకోవాలి. నారుమడి పోసేముందు విత్తనాలను ఉప్పునీటిలో వేసి 5 నిమిషాలు ఉంచి, నీటిలో పైకి తేలిన విత్తనాలను పనికిరానివిగా గుర్తించి వాటిని తీసివేసి నీటి అడుగుభాగానికి చేరిన విత్తనాలను తగు జాగ్రత్తతో విత్తుకోవాలి. ఈ విధంగా ఎన్నిక చేసిన విత్తనాలను 24 గంటలు నీటిలో నానబెట్టి నాటుకోవడం వల్ల విత్తనం మొలకశాతం పెరుగుతుంది. విత్తనాలను జిబ్బరిల్లిక్ 150 పి.పి.ఎం ఆమ్లంలో విత్తేముందు 5-10 నిమిషాలు ఉంచి విత్తుకుంటే విత్తనం మొలకశాతం పెరుగుతుంది. మొక్క ఎదుగుదల దశలో శిలీంధ్రాలు ఆశించకుండా ఉండేందుకు విత్తనాలను శిలీంధ్రనాశినులు అయిన సేరిసాన్ లేదా కాప్టాన్‌ ను తగిన మోతాదులో విత్తనాలతో కలిపి నాటుకోవడం - ఉత్తమం. సాధారణంగా నారుమడి పోసుకోవడానికి మే-జూన్ నెలలు అనుకూలంగా ఉంటాయి. నారుమడులలో జీవన ఎరువులు, పశువుల ఎరువులు వేసి నారుమడులు తయారు చేసుకోవడం వల్ల మెరుగైన పంటను పొందవచ్చు. జీవన ఎరువులు మొక్కల ఎదుగుదలలో క్రియాశీలకంగాను, మొక్కలకు హానికరం చేసే శిలీంధ్రాల నుండి కాపాడటంలో ఉపయోగపడతాయి. విత్తిన 4-5 వారాలలో విత్తనాలు మొలకెత్తడం గమనించవచ్చు. నాలుగు నుండి అయిదు అకులు వచ్చిన మొక్కలను పొలంలో నాటుకోవచ్చు. ఈ విధంగా చూసుకున్నట్లయితే 50-60 రోజుల్లో మొక్కలు నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి.

ప్రవర్ధనం

విత్తనాలు, కత్తిరించిన ముదురు కొమ్మలు కత్తిరించిన వేళ్ళు, వెళ్ళ మొదళ్ళ ద్వారా ప్రవర్ధనం చేసుకోవచ్చు. పైన చెప్పిన అన్ని పద్దతులలో విత్తనాలు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చు. ఒక ఎకరాకు 2.5-8.0 కిలోల విత్తనం అవసరం అవుతుంది. లేదా అయిదు సెంటీమీటర్ల నిడివిన ఎంచుకునేటప్పుడు మూడు లేదా నాలుగు కణుపులున్న ముదురు కొమ్ములను ఎంచుకున్నట్లయితే అవి త్వరగా వేరుతొడుగుతాయి. దాదాపు మూడు వారాల్లో ఇవి నాటుకోవడానికి సిద్ధంగా ఉంటాయి. సాధారణంగా - 40-65 శాతం కొమ్మలు మాత్రమే వేరు - తొడుగుతాయి. కనుక కనీసం ఒక ఎకరాది నలభై కిలోల వేరు కత్తిరింపులు కావాల్సి ఉంటుంది.

నాటడం

సర్పగంధ 75 సెం.మీ. వరకు పెరుగుతుంది. కనుక నాటేటప్పుడు వరుసల మధ్య సెం.మీ. మొక్కల మధ్య 30 సెం.మీ. ఎడంతో నాటుకోవాలి. సర్పగంధ సాధారణంగా సెప్టెంబరు - 1 అక్టోబర్ నెలలో పుష్పిస్తుంది. ఆ తరువాత మరొక నెలకు పళ్ళు వస్తాయి. పళ్ళు బాగా నలపు రంగులోకి మారి వదలిపోతున్నప్పుడు కోసి విత్తనాలకోసం సిద్ధం చేసుకోవాలి.

నేల రకం

బంకమన్నుతో కూడిన రేగడి లేదా ఒండ్రు - నేలలు లేదా బంకమను కలిసిన నేలల్లో ఈ మొక్కలు బాగా పెరుగుతాయి. నేలలో అష్ట గుణం మొక్కల పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ పంటకు మురుగు నీరుపోయే సౌకర్యం కల్పించాలి.

వాతావరణం

సుగంధ మొక్కలు పాక్షికంగా నీడను కోరుకుంటాయి. ఉష్ణ వాతావరణం, వర్షపాతం అధికంగా గల భూముల్లో బాగా పెరుగుతుంది.

ఎరువుల వాడకం

మొదటి దుక్కిలో 5 టన్నుల పశువుల ఎరువును వేయాలి. అలాగే చివరి దుక్కిలో 20 కిలోల నత్రజని 30 కిలోల భాస్వరం, 30 కిలోల పొటాషియం నిచ్చే ఎరువులను వేయాలి.

నీటి యాజమాన్యం: తాకాలంలో నెలకు ఒకసారి, వేసవిలో నెలకు రెండుసార్లు నీటి తడులు ఇవ్వాలి.

సస్యరక్షణ

సాధారణంగా సుగంధ మొక్కలకు వేరుపురుగు ఆశిస్తుంది. కనుక దీని నివారణకు మొక్కలు నాటే సమయంలో లిండేన్ కెమికల్ పొడిని పొలంలో తగు మోతాదులో కలపాలి. ఇవి కాకుండా సుగంధను శిలీంధ్రాల తాకిడి కూలి ఎక్కువగానే ఉంటుంది. అందుకే శిలీంధ్ర నాశిని అయిన చైతన్ ఎం.45, 2 గ్రా. లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అకుమచ్చ తెగులు, ఎండు తెగులు సోకిన మొక్కలను తొలగించి కాల్చివేయాలి.

దిగుబడి

సర్పగంధ పంట 18 నెలలకు కోతకు వస్తుంది. సాధారణంగా చలికాలంలో వేళ్ళ దిగుబడి, వేళ్ళలో రసాయనాలు అధికంగా ఉంటాయి కనుక శీతాకాలంలో వేళ్ళను తవ్వి తీయడం లాభదాయకం. సర్పగంధ వేళ్ళు సుమారు 50 సెం.మీ. నుండి ఒక మీటరు పొడవు పెరుగుతాయి. తవ్వేటప్పుడు తల్లివేరు, ఎల్లవేర్లను పూర్తిగా తవ్వి తీయాలి. ఇలా తవ్వి తీసిన ఎర్లను మొక్క కాండం నుండి వేరుచేయాలి. వేర్లలో తెసుశాతం ఎంత తగితే అంత మంచిది కనుక వేరుచేసిన వేర్లలో తేమశాతం 20-12 వచ్చే వరకు ఆరబెట్టాలి. బాగా ఎండిన వేర్లను 10-15 సెం.మీ. పొడవు గల ముక్కలుగా చేసి గాలి చొరబడని డబ్బాలలో నిలువ చేయాలి. తాజాగా కోసిన వేళ్ళు అముపు వాసనతో చేదుగా ఉంటాయి. ప్రస్తుత మార్కెట్లో తల్లి వేర్లకు ఎక్కువ గిరాకి ఉంది. నాటిన 6 నెలలకు సుమారు 700-800 కిలోల ఎండు పేర్లు అలాగే 3 సంవత్సరాల తరువాత 1200 కిలోల ఎండు వేళ్ళ దిగుబడిని ఆశించవచ్చు. వీటితో పాటుగా 3 నుండి 4 కిలోల విత్తనాలు కూడా లభిస్తాయి. ఎందువేర్లు ఖరీదు సునూరు రూ.70-100/- కిలో ఉంటుంది.

3.0
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు