హోమ్ / వ్యవసాయం / వ్యవసాయ పంచాంగం / పంటల వారీగా వ్యవసాయ పంచాంగం / ఇతర విషయాలు / సస్యరక్షణ మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
పంచుకోండి
వ్యూస్
 • స్థితి: సవరణ కు సిద్ధం

సస్యరక్షణ మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

సస్యరక్షణ మందుల పిచికారిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకుందాం.

వ్యవసాయ రంగంలో దిగుబడులు గణనీయంగా తగ్గిపోవటానికి ముఖ్యకారణం వివిధ పంటలను ఆశించే రకరకాల చీడపీడలు. వీటిని నివారించటానికి ఒక ఎకరాకు సుమారు రూ. 3,000 నుండి రూ. 4,000 వరకు ఖర్చు పెడుతున్నారు. పొలంలో పురుగులను గమనించకుండానే పరుగు మందులను అధిక మోతాదుల్లో 4 నుండి 6 సార్లు సస్యరక్షణ మందులను పిచికారి చేయడం వలన పరాన్న జీవులు, బదనికలు నాశనమవుతున్నాయి. అంతేకాకుండా చీడపురుగుల నిరోధక శక్తి పెరిగి ఎక్కువ పంట నష్టాన్ని కల్లిస్తున్నాయి. కాబట్టి చీడపీడలను అదుపులో ఉంచేందుకు తక్కువ విష ప్రభావం గల సస్యరక్షణ మందులను అవసరాన్ని బట్టి తగిన మోతాదులో మాత్రమే వినియోగిస్తే కొంత వరకు ఈ పరాన్నజీవులను మరియు బదనికలను కాపాడుకుంటూ వాటి ద్వారా వచ్చే లాభాన్ని పొందవచ్చు. అధిక మోతాదులో సస్యరక్షణ మందులు వాడటం వలన వాటి అవశేషాలు ఆహార పదార్ధాలలో వుండి భయంకరమైన ప్రాణాంతక వ్యాధులు కలగటానికి దోహదపడుతుంది. చీడపీడల వలన రైతాంగానికి దిగుబడులు తగ్గటం ఒక్కటే కాకుండా వచ్చిన దిగుబడిలో కూడా నాణ్యత లోపించి ఆర్థికంగా రైతుకు అపార నష్టం కలుగజేస్తాయి. అంతేకాకుండా సరైన పరిజ్ఞానం లేకుండా విచక్షణా రహితంగా వాడటం వలన పెట్టుబడి అధికమవుతుంది. కావున వీటిని అధిగమించడానికి రైతులకు సస్యరక్షణ మందుల వాడకంపై పరిజ్ఞానం చాలా అవసరం.

 • మరుగు ముందును ముందుగా బకెట్లోగాని, డ్రమ్ములోగాని కలుపుకొని తర్వాత స్పేయర్లలో నింపుకోవాలి.
 • గాలి వీచే దిశలోనే సస్యరక్షణ మందుల పిచికారి చేయాలి.
 • పురుగు మందుల అవశేషాలు పంటలపైన ఉంటాయి. కాబట్టి కనీసం 7-10 రోజుల వరకు పంటకోత చేపట్టరాదు.
 • పురుగు మందులను చల్లని వేళలో ఉదయం పూటగానీ, సాయంత్రంగాని పిచికారి చేయాలి.
 • మంచు తీవ్రమైన ఎండ ఉన్నప్పడు పిచికారి చేయరాదు. మంచు ఆరిన తర్వాత చల్లితే ఎండిన మొక్క భాగాలు తేలికగా ద్రవ రూపంలో ఉన్న మందును పీల్చుకుంటాయి.
 • మబ్బు వాతావరణం, వర్షం పడే పరిస్థితులలో పిచికారి చేస్తే మందు ద్రావణం వర్షం నీటితో కొట్టుకొని పోతుంది.
 • పిచికారి తర్వాత స్పేయర్స్ని శుభ్రపరుచుకోవాలి.
 • ఖాళి పురుగు మందు డబ్బాలను గుంత తీసి పూడ్చేవేయాలి.

సస్యరక్షణ మందుల వాడకంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు

 • రైతులు పంటపై ఆశించిన పురుగు లేదా తెగులును ధృవీకరించుకోవాలి. అవస రమైతే వ్యవసాయ శాస్త్రవేత్తలను సంప్రదించాలి.
 • ఒకటి రెండు పరుగులు కనిపించగానే రైతులు సస్యరక్షణ మందులు పిచికారి చేయరాదు. ప్రకృతిలో సహజంగా మిత్ర పురుగులు ఉండి పంటలకు హాని చేసే పురుగులను తింటాయి.
 • పురుగుల బెడద ఆర్థిక నష్టపరిమితి స్థాయిలో ఉన్నప్పడు మాత్రమే పరుగు మందులను పిచికారి చేయాలి.
 • సిఫారసు చేసిన మోతాదులోనే పురుగు మందులను వాడాలి.
 • సాధారణంగా ఎకరాకు 150-200 లీటర్ల మందు ద్రావణం సరిపోతుంది.
 • పిచికారి చేసే మొక్క భాగం పరుగు మందు రకం దృష్టిలో పెట్టుకొని స్పేయర్లను ఎంపిక చేసుకోవాలి.
 • కలుపు మందులు పిచికారి చేయటానికి ప్లాట్ఫ్యాన్ నాజిల్ లేదా పడ్జెట్ నాజిల్ లేదా ఫిష్ టెయిల్ నాజిల్ ఉపయోగించాలి. సస్యరక్షణ మందులు పిచికారి చేయడానికి హెలోకోస్ నజిల్ ను ఉపయోగించాలి.
 • చీడపీడల నివారణకు వాడే సస్యరక్షణ మందులు ఎంత వ్యవధిలో ఎన్నిసారు పిచికారి చేస్తారో వ్యవసాయ శాస్రవేత్తను అడిగి తెలుసుకోవాలి.
 • పురుగు మందుల పిచికారి చేసే సమయంలో రక్షక దుస్తులు, గౌజులను ధరించాలి.
3.00514138817
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు