పంచుకోండి
వ్యూస్
  • స్థితి: సవరణ కు సిద్ధం

సస్యరక్షణ మందులు – ముఖ్య సమాచారం

వివిధ పంటల్లో ఆశించే చీడపీడల నుండి తమ పంటలను కాపాడుకోవటానికి రైతులు ఎక్కువగా సస్యరక్షణ మందుల పైనే ఆధారపడుతున్నారు.

వివిధ పంటల్లో ఆశించే చీడపీడల నుండి తమ పంటలను కాపాడుకోవటానికి రైతులు ఎక్కువగా సస్యరక్షణ మందుల పైనే ఆధారపడుతున్నారు. వీటిని విచక్షణా రహితంగా వాడటం వల్ల మనుషులకి, పర్యావరణానికి, ఇతర జంతువులకు కలిగే హాని అపారం. సస్యరక్షణ మందులను అవసారమైనప్పుడు సూచించిన మోతాదులో సిఫారసు చేసిన పంటలపై వాడినట్లయితే అవి పంటల ఉత్పాదకతను పెంచడమే కాకుండా నాణ్యమైన ఆహారాన్ని ఇవ్వగలవు. వాటిని సద్వినియోగపరచుకోవాలా లేదా దుర్వినియోగాపరచి వాతావరణాన్ని కలుషితం చేసి ప్రాణాంతకంగా చేసుకోవాలా అనే విచక్షణతో రైతులు సస్యరక్షణ మందుల నివియోగం చేయవలిసి ఉంటుంది.

హానికారక పురుగు మందులు

  • ఆర్గానోక్లోరిన్స్ (డైకోఫాల్, లిండెన్ మొదలగునవి)
  • ఆర్గానోఫాస్ఫేట్స్ (ఎసిఫేట్, క్లోరిపైరిఫాస్, డైక్లోర్వాస్, ట్రయాజోఫాస్, మోనోక్రోటోఫాస్, ప్రోఫెనోఫాస్ మొదలగునవి).
  • కార్బమేట్ (కార్బరిల్, కార్బోఫ్యూరాన్)
  • సింధటిక్ పైరద్రాయిడ్స్ (సైపర్ మెద్రిన్, ధయామిధోక్సామ్, క్లోధయానిడిన్, ధయోక్లోప్రిడ్)
  • ఫినైల్ పైరజోల్ (ఫిప్రొనిల్)
  • నియోనికోటినాయిడ్స్ తరగతికి చెందిన మందులు మరియు ఫిప్రోనిల్, మిధైల్ పెరాధియాన్ ముఖ్యంగా తెనేటీగలకు చాలా హానికారకంగా పరిశోధనల్లో వెల్లడయ్యి౦ది. దీనివల్ల పంటల్లో పరపరాగ సంపర్కం తగ్గి దిగుబడులు తగ్గుతాయి. కాబట్టి వీటి వాడకాన్ని వీలైనంత తగ్గించాలి.

అంత హనికరకం కాని పురుగు మందులు

ఇప్పటి వరకు మార్కెట్ లో అందుబాటులో ఉన్న పురుగు మందుల్లో స్పైనోశాడ్, ఎసిటామెప్రిడ్, కార్టావ్ పైడ్రోక్లోరైడ్, డైఫెనథయిరాన్, వెట్టబుల్ సల్ఫర్, టేబుఫెనోబైడ్, మిథాక్సీ ఫెనాజైడ్, ఇమామెక్టిన్ బెంజోయేట్, బ్యూప్రొఫెజిన్, పైరిప్రాక్సిఫఎన్, పైమెట్రోజైన్ వంటి వాటి వల్ల ఎటువంటి అవలక్షణాలు నిరూపణ కాలేదు. అయినప్పటికీ వీటి వాడకంలో తగు జాగ్రత్తలు అవసరం.

హానికారక తెగుళ్ళ మందులు

కాప్టాన్, క్లోరోథలోనిల్, థయోపానేట్ మిథైల్, థైరమ్, హెక్సాకొనజోల్, ప్రొరికొనజోల్, డైనోక్యాప్, ప్రొరినెబ్, కార్బండాజిమ్, ఇప్రొడమోన్, మాంకోజెబ్, ఎడిఫెన్ఫాస్, టెబుకొనజోల్.

అంత హనికరకం కాని తెగుళ్ళ మందులు

కాపర్ ఆక్సిక్లోరైడ్, ట్రైసైక్లోజోలో, మాటలాక్సిల్, వలిడామైసిన్, స్ట్రోబ్యులిన్స్ (ఆజాక్సిస్ట్రాబిన్, ట్రైప్లోక్సిస్ట్రోబిన్, పైరాక్లోస్ట్రోబిన్, క్రిసాక్సిమ్ మిధైల్).

సరైన అవగాహన లేకుండా అనేక పురుగు మందులను ఒకేసారి లేదా పురుగు/తెగుళ్ళ మందులను కలిపి కొట్టడం వల్ల మరిన్ని వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి అందుబాటులో ఉన్న యాజమాన్య పద్ధతులను పాటించి, చివరి అస్త్రంగా మాత్రమే సస్యరక్షణ మందులను వాడాలి.

ఆధారం: వ్యవసాయ పంచాంగం

2.99804305284
మీ సూచనను పోస్ట్ చేయండి

(ఈ పేజీ లో ఉన్న కంటెంట్ పై ఏమైన వ్యాఖ్యలు / సలహాలు ఉంటే, ఇక్కడ పోస్ట్ చేయండి)

Enter the word
నావిగేషన్
పైకి వెళ్ళుటకు